Tuesday 2 October 2012

ఇది క్రూరత్వం కాక మరేమిటి...??



 ఇది క్రూరత్వం కాక మరేమిటి...??

సెక్షన్ 498ఎ దుర్వినియోగం
============
రెండు వేర్వేరు కుటుంబాలు, సంప్రదాయాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను దాంపత్యబంధంతో ఒకటిగా చేసినా, కొందరి విషయంలో కడ దాకా అది నిలుస్తుందని చెప్పలేం. వివాహ బంధంలో నీవు, నేను- అనే అహంభావాన్ని వదిలి మనం, మన కుటుంబం- అని భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వివాహం విజయవంతం అవుతుంది. ఈ విజయంలో అబ్బాయి కుటుంబం, అమ్మాయి కుటుంబంలోని సభ్యులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తారు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మొదలయ్యే చిన్న చిన్న గొడవలు తీవ్రం కాకుండా చేయడం పెద్దల బాధ్యత. అది అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. భర్త, అత్తింటివారు అమ్మాయిని బాధ పెడుతున్నారు, కట్నం చాలదంటూ హింసిస్తున్నారని తరచూ వింటుంటాం. గృహహింస, వరకట్న బాధితులైన స్ర్తిల కోసం భారత రాజ్యాంగంలో వరకట్న నిషేధ చట్టంలో సెక్షన్ 498ఎ ఏర్పాటు చేశారు. కట్నం కోసం వేధించే భర్త, అత్తింటివారి మీద బాధిత మహిళ ఈ సెక్షన్ ప్రకారం కేసు వేసి న్యాయ పోరాటం చేయవచ్చు.



కాగా, వివాహిత మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ చట్టం మరెంతో మంది అమాయక మహిళల, కుటుంబ సభ్యుల వేధింపులకు కూడా కారణమవుతోందన్న వాదనలు లేకపోలేదు. అందరు అత్తలూ మంచివారు కానట్టే అందరు కోడళ్లూ మంచివాళ్లు కారు. తమకు అనుకూలంగా లేనప్పుడు- భర్త, అత్తింటివారు, చివరికి ఎక్కడో దూరంగా ఉన్న ఆడపడుచులు కూడా తమను వేధిస్తున్నారంటూ కొం దరు కోడళ్లు ఈ చట్టం అండతో కేసుల్లో ఇరికిస్తున్న ఉదంతాలున్నాయ. ఒక్క ఉత్తరం ముక్కతో పోలీసులు కూడా న్యాయ విచారణ లాంటివేమీ లేకుండా తక్షణమే ఆ కంప్లెయింట్లో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. దానివల్ల ఏ పాపమూ తెలియని ఆ కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకోకుండా అవమానాల పాలవుతున్నారు. ఇక ఆ కేసు తేలేసరికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ఖర్చు కూడా తక్కువేమీ కాదు. చివరికి కంప్లెయింట్ ఇచ్చిన మహిళ కోరినట్టుగా ఆస్తిపాస్తులు రాసి ఇచ్చి, రాజీ పడక తప్పడం లేదు. ఇలా అమాయకులైన వారిని తప్పుడు కేసులలో ఇరికించి బాధపెట్టడం అనేది ఈ మధ్య ఎక్కువగా వినపడుతోంది. పోలీసులు, న్యాయస్థానాలు కూడా కంప్లెయింట్ ఇచ్చిన మహిళ మాటలనే నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.



ఇటువంటి తప్పుడు కేసుల వల్ల తమ పరువు పోతోందని బాధితులు వాపోతున్నారు. వరకట్న నిషేధ చట్టం ఐపిసి 498ఎ కింద నమోదు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు ఎనభై శాతం తప్పుడు కేసులే అంటున్నారు పరిశోధకులు. భర్తను, అత్తింటివారిని డబ్బుల కోసం అన్యాయంగా వేధించడం తప్ప ఇతరత్రా కారణాలేమీ ఉండడం లేదు. సుప్రీంకోర్టు కూడా దీనిని ‘చట్టపరమైన ఉగ్రవాదం’- అని పేర్కొంది. డబ్బుకోసమో, వేరు కాపురం పెట్టడానికో, చిన్న చిన్న విషయాల్లో భర్తలతో గొడవకు దిగి సమన్వయలోపంతో విచక్షణ కోల్పోయి ముసలివారు, పేదవారు అని కూడా చూడకుండా అమాయకులైన అత్తామామల మీద, భర్తమీద ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇరికిస్తున్న కోడళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిని వదిలించుకుందామన్నా వీలుకాని పరిస్థితి. అరెస్ట్ అయన తర్వాత విడుదలై వచ్చినా కేసు తేలేవరకు కోడలి బెదిరింపులు తప్పవు. కోడలు ఎప్పుడేం చేస్తుందో? అని అత్తింటివారు అనుక్షణం భయపడుతూ ఉండాలి. కాగా, ఇటీవల ఒక కేసు విషయమై ముంబై హైకోర్టు- ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వం కిందవస్తుందని తీర్పునిచ్చింది.


ముంబైకి చెందిన సంతోష్, రేఖ (పేర్లు మార్చాం) దంపతులు. వీరి మధ్య గొడవలు, మనస్పర్థలు పెరగడంతో రేఖ తన భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టి అతడిని, అతడి కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్టు చేయంచింది. సంతోష్ చెప్పిన వివరాల ప్రకారం- అతని భార్య చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నమ్ముతూ కింది కోర్టు కేసు కొట్టేసింది. ఆ తర్వాత సంతోష్ తన భార్య నుండి విడాకులు కోరుతూ పూణేలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అతడి వాదనను తోసిపుచ్చింది. చివరకు సంతోష్ ముంబై హైకోర్టులో అప్పీల్ చేయగా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, ఇతర ఆధారాలను పరిశీలించిన జస్టిస్ వి.ఎం.కనాడే, పి.డి.కొడేలతోకూడిన ధర్మాసనం, తప్పుడు కేసులు పెట్టి వేధించడం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ) ప్రకారం క్రూరత్వం కింద పరిగణించాల్సి వస్తుందని పూణే కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి అతనికి విడాకులు మంజూరు చేసింది. ఇక భర్త, అత్తగారి వైపు బంధువులను వేధింపు కేసులతో సతాయించే కోడళ్ళకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుందేమో! తప్పుడు కేసులు పెట్టడం- తప్పే కాదు, అది క్రూరత్వం అని న్యాయస్థానమే తీర్పునిచ్చింది.

16 వ్యాఖ్యలు:

Anonymous

"చట్టం ఐపిసి 498ఎ కింద నమోదు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు ఎనభై శాతం తప్పుడు కేసులే అంటున్నారు "

చాలా చక్కటి వ్యాసం రాశారు. ఫెమినిస్ట్ లు చెప్పినంత అమాయకులు కారు ఆడవారు. సాధారణంగా మనం రాజకీయ నాయకులని విమర్శిస్తుంటాం, అవినితి పరులని అదని ఇదని. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. మధ్యతరగతిలో పుట్టి, చదువుకొని, మంచి కుటుంబాలనుంచి వచ్చిన చాలామంది ఆడవారు 80% తప్పుడు కేసులు పెట్టారంటే, వీళ్లకి చట్టం మీద గౌరవం లేదు. వీళ్లు మన రాజకీయనాయకుల కన్నా చెత్త సరకు అని తెలుస్తున్నది. ఇతరులను అనవసరం గా ఇబ్బంది పెడుతున్నామన కనీస ఇంగితజ్ణానం, సెన్సిటివిటి లేదు. అందులో అబ్బాయీల తల్లిదండృలు చాల మంది వృద్దులు ఉంటారు. వారికి ఆ వయసులో ఉన్న రోగాలకు తోడు, జైలు, కోర్ట్టు, కేసులు పెద్ద సమస్య. అసలికి 80%మంది తప్పుడు కేసులు పెట్టారంటే వారిలో నైతిక ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో తెలుస్తూనే ఉన్నాది. ఫెమినిస్ట్ లు కూరలు,బుట్టలు చేతిపని చేసుకొనే ఆడవాళ్ల కష్టాలు చూసి కథలు రాసుకోకుండా, చట్టలను మారిస్తే జరిగే పర్యవసానం ఇదే. పేదవాళ్లకి కోర్ట్టు కుపోవటానికి డబ్బులు కూడా ఉండవు. ఇక మధ్య తరగతి ఆడవారు ఈ చట్టాల్ అండ చూసుకొని నైతికంగా పతనం చెందుతున్నారు.

And even after getting divorce he need to pay huge amount form his salary. Even if she is wrong and he is right.

Anonymous

మంచి ఆర్టికల్ జ్యోతిగారూ. ఒకానొక పెద్ద మనిషి 498A దుర్వినియోగాన్ని " ఏడుపు " అంటూ నోరు పారేసుకున్నాడు. అతని కోసం రాసిన ఆర్టికల్ ఇది...

498A చట్టం దుర్వినియోగాన్ని సీరియస్ గా తీసుకోవడం ఎందుకు?

మీకిష్టమైతే కామెంట్ ను యాక్సెప్ట్ చేయండి.

జ్యోతి

నాయనగారు,,

నేను ఎప్పుడు కూడా ఒకవైపు మాత్రమే చూడను. సమాజంలో మంచి చెడూ రెండూ ఉన్నాయి. అలాగే ఆడవాళ్లు. ఆడవాళ్లను సమర్ధిస్తూ, వాళ్ల కష్టాల గురించి రాసినంత మాత్రాన ఫెమినిస్టుని కాను.అన్నిరకాల ఆడవాళ్లు ఉన్నారు. ఈ గృహహింస చట్టం క్రింద మా పుట్టింట్లో కూడా చాలా గొడవ జరిగింది. పదేళ్లు కూడా లేని నా కూతురుకోసం నగలు అడిగానని కంప్లెయింట్లో నన్ను కూడా చేర్చారు. వేరుకాపురం పెట్టాలన్న కోరికతో ఇదంతా చేసారు.అప్పుడు పోలీసులు కూడా కావాలని తప్పుడుకేసు పెట్టారని బాధపడ్డారు కాని ఏమీ చేయలేకపోయారు. చట్టం అలా ఉంది. ఇది జరిగి పదిహేను ఏళ్లు దాటినా ఇంకా ఒక్కోరోజు మేము పడ్డ బాధ, టెన్షన్ ఇప్పటికి కళ్లముందు తిరుగుతాయి. ఒక్కసారి ఈ కేస్ పెట్టారంటే ఇక అవతలి వారి మాట ఒక్కటి కూడా వినరు. ముంధు ఈ చట్టంలో మార్పు రావాలి

www.apuroopam.blogspot.com

పరిశోధకులు 80 శాతం కేసులు చట్టాన్ని దుర్వినియోగ పరుస్తున్నవేనని అన్నారంటేనూ,సుప్రీంకోర్టు ఇది చట్టపరమైన ఉగ్ర వాదంగాఅభివర్ణించిందంటేనూ ఇది ఉపేక్షించదగ్గ విషయం కాదు.అలా అని గృహ హింస లేదని కాదు.దానికి Woman biased గా ఉన్న ఈ చట్టం పరిష్కారం కాదని గుర్తించి వెంటనే remedial measures చేపట్టాలి.అత్తలూ, ఆడబడుచులూ కూడా స్త్రీలే కనుకనూ, ఈ విషయంలో స్త్రీల స్పందనకే ప్రాముఖ్యం ఉంటుంది కనుకనూ మహిళా సంఘాలే ఈ విషయంలో చొరవ తీసుకుని అమాయకులను శిక్షలకో మానసిక క్షోభలకో గురికాకుండా ఉండేలా చూడాలి.

Anonymous

మంచి విషయం రాశారు.
ఈ 498ఆ దుర్వినీయోగం గురించి చాలాకాలంగా వింటున్నాను, నెట్లో. అక్రమ సంభధాన్ని పట్టుకుని ప్రశ్నించిన ముసలి అత్తమామల్ని, భర్తని బెదిరించిన సంఘటన మన ఆంధ్రాలోనే ఒకటి విన్నాను. ఇలాంటి చట్టాలో నిష్పాక్షికత, న్యాయం తక్కువ. గుడ్డిగా, బుర్రబుద్ధి లేకుండా చేయబడిన చట్టాల్లో ఇది ఒకటి. పోలీసులు, లాయర్లు. మహిళాసంఘాలు కూడా ఈ చట్టాలను మంచి ఆదాయంగా మార్చుకున్నారట. బెంగళూరులో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని విన్నాను.

Rao S Lakkaraju

ఇటువంటివి ఆస్తులూ, సంపదా ఉన్న వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు చదువుతున్నాను. మొన్నీ మధ్య ఒకళ్ళు యాభై లక్షలు ఇచ్చి విడిపోటానికి అమ్మాయి తో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. డబ్బుకోసం ఏమయినా చేస్తున్నారు!

Anonymous

ఈ గృహహింస చట్టం క్రింద మా పుట్టింట్లో కూడా చాలా గొడవ జరిగింది.

జ్యోతిగారు,

మిగతా కులాలతో పోలిస్తే బ్రహ్మణుల దగ్గర డబ్బులు పెద్దగా ఉండవు. అటువంటిది మీ ఇళ్లలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే. డబ్బులు ఎక్కువగా ఉండే కమ్మ, రెడ్ల కులాల వారిలో పరిస్థితి ఊహించండి. పాపం, ఆ వర్గాల వారు పెళ్లి కాదు గాని, మింగలేక కక్కలేక, ఎమీ చేయాలో దిక్కుతోచక,భారీ ఎత్తున్న అమ్మాయిలకు డబ్బులిచ్చి చేతుల్లెత్తు తున్నారు.

anrd

జ్యోతి గారు నిజమేనండి. ఈ రోజుల్లో ఇలాంటి వెన్నో జరుగుతున్నాయి.

వనజ తాతినేని/VanajaTatineni

నాణానికి రెండో వైపు చూపే పోస్ట్ ఇది. ఇలాటివి ఎక్కువవుతున్నాయనేది నిజం.

Anonymous

ఓరి నాయనోయ్,
ఎంత చెట్టుకు అంతగాలి. 'ఫ్రీగా వస్తే ఫినాయిలైన తాగి బ్రతకాలి' అన్నది, కులమతాలకతీతమైన ఈ చట్టాన్ని వాడుకునే లీగల్ టెర్రరిస్ట్‌ల స్పూర్తి, వుద్దేశ్యం.

ఈ చట్టాన్ని తేవడానికి కేంద్రమత్రిణి రేణుకా లాంటి వారు చాలా కృషి చేశారంట.

madhu

ఇటీవల చిరంజీవి చిన్న కూతురు భర్తను అత్తమామల్ని ఇదే చట్టం కింద జైలుకి పంపింది.

venkat

ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్టాడితే 498A చట్టం కింద కేసు బుక్ చేసి బొక్కలో తోయించేగలను ... నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి - ఇది భార్య భర్త తో జోక్ గా చేసిన బెదిరింపు ... కానీ నీ ఆర్టికల్ సీరియస్ గా ఆలోచింప చేసేదిగా కూడా ఉంది జ్యోతక్కా ... ఈ చట్టం ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది ... ఈ రోజుల్లోనూ వరకట్న వేధింపులు ప్రతీ రోజూ చదూతునే ఉన్నాము ... అయితే ఇది దుర్వినియోగం కాకూడదు అన్న సంగతి కూడా చక్కగా వివరించావు ...

Anonymous

"ఈ చట్టాన్ని తేవడానికి కేంద్రమత్రిణి రేణుకా "

ఇంగ్లీష్ టి వి షోలలో పాల్గొనే చర్చలలో రేణుకా చౌదరిని చూస్తే, ఆమేకి ఉన్న జ్ణానం అర్థమౌతుంది. ఎవ్వరు ఈవిడగారిలాగా మూతి తిప్పటం,హు అనటం చెయ్యరు. కేంద్రమంత్రిగా ఆవిడపని చేసినపుడు,ఆమేతో కలసి పని చేసిన ఐ ఏ యస్ అధికారి ఒకసారి చర్చలో ఆమే గాలి తీసేశాడు. నీ కింద పని చేసినపుడు చూశాను, నీ తెలివితేటలు, నాయకత్వ ప్రతిభ, నీ దగ్గర నుంచి నేర్చూకోవలసిన అవసరం ఎమీ లేదని అన్నాడు. ఈ చట్టం వచ్చిన కొత్తలో టి వి షో లలో ఎంతో మొండిగా వాదించిన మహామనిషి RC. ఈవిడ కన్నా తెలుగు చానల్స్ లో నన్నపనేని రాజకుమారి ఎంతొ బాలన్స్డ్ డ్ గా ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకొని చట్టంలో లోపాలు, ఆడవారి ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి మాట్లాడింది.

Anonymous

నాకు తెలిసి నేను చూసినంతలో ఈ చట్టం అవసరం ఉంది. ఇదే ప్రస్తుతం చాలామందికి శ్రీరామరక్షగా ఉంది. మావాళ్లు కొందరు సవ్యంగా సంసారాలు చేసుకుంటున్నారంటే ఈ చట్టం చాలా పనికి వస్తోంది.

Rao S Lakkaraju

చట్టం ఉండటం మూలాన సంసారం చేస్తున్నా రంటే వినటానికి కొంచెం బాధగా ఉంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008