Wednesday, May 22, 2013

మూడుపదులు నిండిన మా పెళ్లిపుస్తకం...


ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి మూడుముళ్లతో ఒక్కటైన అనురాగ బంధం
ఇద్దరూ కలిపి అల్లుకునే అందమైన జీవితం... బతుకంతా చదవాల్సిన మంచి పుస్తకం
జంటపఠనంలో బోధపడే అర్థం , స్నేహంతో మరింత పటిష్టం
సప్తపదిలో తొలి అడుగుకి మొదలైన అల్లిక... సంసార పడుగుపేకల్లో నేస్తున్న వస్త్రం
వన్నెల్లో ఇమిడిపోయే అనుభవాలు, అంచుల్లో అందమైన చిత్రాల అనుభూతులు
పోగులు కలబడి అక్కడక్కడా పడే ముడులు, ఓరిమితో విడదీసే చిక్కులు
ఉమ్మడి చరిత్రకి చుట్టిన పొరల్లో గతాన్ని తడిమితే తగిలే ఎన్నో గిల్లికజ్జాలు   
కలహాల విసవిసలు - మురిపాల మెరుపులు
విరహాల నిట్టూర్పులు - ప్రణయాల కవ్వింతలు
నీకు నేను నాకు నీవు అంటూ మొదలైన బంధం
చివరకు నీకు నేనే నాకు నీవే అంటూ కడ దాకా నడిచే తోడులో
విశదమయ్యే మంత్రం మూడు ముడుల్లో పడిన బీజం... అదే ఈ వివాహబంధం...
శ్రీరస్తూ శుభమస్తూ అంటూ గడుస్తున్నకొద్దీ మరింత పటిష్టంగా మారిన మా పెళ్లిపుస్తకానికి ఈనాడు 30 సంవత్సరాలు నిండాయి..

22 వ్యాఖ్యలు:

వనజ తాతినేని

వైవాహిక జీవితాన్ని చక్కగా వర్ణించారు జ్యోతి గారు. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు

వేణూశ్రీకాంత్

చాలా బాగా చెప్పారండీ..
హృదయపూర్వక శుభాకాంక్షలు మరియూ అభినందనలు :-)

ranivani

నిజంగా మీరు వ్రాసిన వన్నీ అందరి అనుభవాలే .చాలా చాలా బాగా చెప్పారు . శుభాకాంక్షలు .

గీతిక బి

పెళ్ళిరోజు శుభాకాంక్షలు జ్యోతిగారూ.

మీరిలాగే పడుగూ, పేకల్లా కలగలిసి.. మరిన్ని వివాహ మహోత్సవాల ఆనంద జ్యోతుల్ని వెలిగించాలని మనస్ఫూర్తిగ కోరుకుంటున్నాను.

Sharma


పైకి " మూడు ముళ్ళ బంధం " అంటుంటే ఒకటి కాదు మూడు ముళ్ళు అన్న సందేహం కలుగుతున్న , అది ముచ్చటైన బంధం అని తెలియచెప్పారు . ఈడు జోదుగ కుదిరినప్పుడు తోడు నీడగా కలకాలం నిల్చిపోవాల్సినదే .

krishna

happy anniversary Jyothi gaaru,
meeku meevaariki kudaa...

రవిశేఖర్ హృ(మ)ది లో

meeku happy wedding day

జ్యోతి

వనజ, వేణు, నాగరాణి, గీతిక, శర్మ, కృష్ణ, రవిశేఖర్ గార్లకు ధన్యవాదాలు.

Lasya Ramakrishna

Happy anniversary jyothi garu,

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

హృదయపూర్వక శుభాకాంక్షలు జ్యోతిగారూ!

మధురవాణి

Happy Wedding Anniversary!

Zilebi

శుభాకాంక్షలు జ్యోతి గారూ,

అదెట్లా అండీ డిసెంబర్ ౨౨ మీ ౨౨ కోఇన్సిడెన్స్ ?

జిలేబి

జ్యోతి

లాస్య, మధురవాణి, లక్ష్మీదేవిగారు ధన్యవాదాలు..


జిలేబీగారు, అదేంటో మరి అలా కుదిరిపోయింది. అందుకే ఈ 22 అంటే నాకు మరీ ఎక్కువ ఇష్టం...:)

శ్రీలలిత

పెళ్ళిరోజు శుభాకాంక్షలు...

durgeswara

అక్కగారూ !
శుభాకాంక్షలు . ఒక్కసారన్నా మాఊరు రాకపోతిరి .ఆడపిల్లకు చీరన్నాపెడదామంటే కుదరకపోయె.

సి.ఉమాదేవి

మీ పెళ్లిపుస్తకంలోని ప్రతి పుట మీకు నిత్యశోభితం కావాలి.

జలతారు వెన్నెల

Happy Aniversary!

Anonymous

Wish u both many happy returns of the day

బులుసు సుబ్రహ్మణ్యం

మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు.

చెప్పాలంటే......

హృదయపూర్వక శుభాకాంక్షలు మరియూ అభినందనలు :-)

మాలా కుమార్

పెళ్లి రోజు శుభాకాంక్షలు.

జ్యోతి

శ్రీలలిత, చెప్పాలంటే, మాలాకుమార్,ఉమాదేవి, జలతారువెన్నెల, సుబ్రహ్మణ్యం,కష్టేఫలి, దుర్గేశ్వర .. అందరికి ధన్యవాదాలు.

దుర్గేశ్వరగారు ఏమోమరి అన్నీ మనమనుకున్నట్టు ఆ అమ్మవారు, అయ్యవారు ఎప్పుడు నన్ను మీ ఊరికి రమ్మంటారో.. వాళ్ల చేతిలోనే ఉంది..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008