Thursday, 27 June 2013

మాలిక పదచంద్రిక - 9 ... సమాధానాలు



మే 2013 మాలిక పద చంద్రిక – 9 సమాధానాలు
మే నెల పదచంద్రిక పూరణ ఈక్రింద ఇస్తున్నాము. కేవలం ఇద్దరే పూరించి పంపారు. వారు శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మిగారు, శ్రీ ఫణికుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగు కర్త).  ఇద్దరి తప్పులూ ఒకటే అవడం విశేషం.ఈసారి విజేతలెవ్వరూ లేరు..

  1. అడ్డం 1.పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు   --  పాలకొల్లు అని రాసారు. పాల్కురికి సరైన సమాధానం.
  2. అడ్డం 15    ఈయనది కృష్ణపక్షమే.. లేకపోతే ఆ కృతికి సింహావలోకం రాస్తాడా పొడి అక్షరాలలో  -- తకొ. తశి సరైన పదం. తల్లావఝ్ఝుల శివశంకర శాస్త్రి కి పొట్టి పేరు.
  3. నిలువు 16. 5 నిలువుతో చేరితే .. చివరికి మిగిలేది ఇంటిపేరే.  చివరికి మిగిలేది రాసిన బుచ్చిబాబు గారి ఇంటిపేరు శివరాజు.
సూర్యలక్ష్మిగారు అదనంగా చేసిన తేడా  14 నిలువు ద్విరుక్త అని రాయడం. ద్వితీయ (విభక్తి) అని ఉండాలి.

ఏదైనా ప్రత్యేకంగా చేద్దామని జ్యోతిగారు సూచించినమీదట పదచంద్రిక -9 ని సాహిత్య పదచంద్రికగా తయారు చేసాము. మరి కొందరు కూడా పూరించి ఉంటే పత్రికకూ, నాకూ కూడా ఉత్సాహంగా ఉండేది.

సత్యసాయి కొవ్వలి

3 వ్యాఖ్యలు:

భమిడిపాటి సూర్యలక్ష్మి

సత్యసాయి కొవ్వలి, జ్యోతి గార్లకు
పదచంద్రిక-9. చాలాబాగుంది. సాహిత్యానికి సంబంధించిన పదచంద్రికలు చాలా ప్రోత్సాహకరంగా వుంటాయి.ఎవరూ రాయటంలేదని మానకండి.తప్పకుండా మరి కొంతమంది వ్రాస్తారని ఆశిస్తున్నాను.
అడ్డము: 1. నిజంగా తెలీదు. నిలువు 16. తెలుసునండి. రాసేందుకు తట్టలేదు. అది రాసి వుంటే 15 అడ్డం వచ్చేది. ఇంక నిలువు 14 అంటారా? నిజంగా చెప్పాలంటే కళ్ళు నెత్తిమీదకెక్కాయి.

Manasa Chamarthi

జ్యోతి గారి సూచన మేరకు దీనిని సాహిత్య పద చంద్రికగా అందించినందుకు సత్య సాయి గారికి కృతజ్ఞతలు. :)
నా లాగే మరి కొందరు ( బహుసా అనేకులు) తప్పకుండా ప్రయత్నించి ఉంటారు..కొన్నింటికి సమాధానాలు తెలియని కారణం చేత పూర్తి చేయకుండా పంపడమెందుకని ఆగిపోయాము.

ఇప్పటి వరకూ చూసిన వాటిలో ఆలోచనలకు బాగా పదును పెట్టిన చక్కని పదచంద్రిక ఇది.

అన్వేషి

పదచంద్రిక నిజంగా చాలా బావుంది, చాలా ప్రయత్నించినా పూర్తిచేయలేక ఫోయాను! ఇలాగే చాలామంది ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఈశీర్షిక ఆపకండి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008