“కవితామాలికా – మాలిక పత్రిక నుంచి ఓ వినూత్న ప్రయోగం"
ఎప్పటికప్పుడు
కొత్తదనంతో పాఠకులను అలరించాలనుకునే మాలిక
పత్రిక మాట నిలబెట్టుకుంటూ జులై సంచికనుండి
ఓ కొత్త శీర్షికతో వస్తోంది జూలైనుంచే కాకుండా తరచుగా (ఇప్పుడు మాలిక
మాసపత్రిక కాబోతోందన్నది మీకు తెలిసినవార్తే కదా ) కొత్త శీర్షికలతో, కొత్త
ప్రయోగాల ఫీచర్స్ తో రాబోతోంది. ఇక సాహితీ పండగే పాఠకమహాశయులందరికీ... మీరు కూడా
ఏమైనా కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేస్తే
బావుంటుందనుకుంటున్నారా. మీ ఆలోచననను మాకు పంపండి.. తప్పకుండా చేద్దాం.. editor@maalika.org
ఇక ప్రస్తుత వినూత్న ప్రయోగం
విషయానికొస్తే. మీరు స్కూలులో ఉన్నప్పుడు వ్యాసరచన/essay writing చేసారు గుర్తుందా? టీచర్ ఒక
టాపిక్ ఇస్తే ఎవరి ఆలోచన వారు రాసేవారు. ఇది అలాటిదే అనుకోండి. ఒక అంశం మీద
వేర్వేరు వ్యక్తులు వేర్వేరు విధాలుగా ఆలోచిస్తారు. స్పందిస్తారు. ఇది వారి వారి అనుభవాలమీద
కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ...
ఈ జూలై సంచికలొ ఒకే
థీమ్ పై ఐదుగురు కవయిత్రుల కవితలని విశ్లేషణాత్మకంగా అందించబోతున్నాం.
ఒకే థీమ్ ని
కొంతమంది కవిమిత్రులకి ఇచ్చి ఆ థీమ్ ఆధారంగా టైటిల్ ఎంచుకుని కవితలందించమన్నాం. మా
విన్నపాన్ని మన్నించి ఆ ఐదుగురు కవయిత్రులు మేం అడిగిన తేదీకల్లా కవితలనందించి
సాహితీస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సాంప్రదాయేతర పోటీతత్వానికి తమవంతు సహాయాన్ని
అందించారు.
ఈనెల థీమ్
"కవిత్వంలో ఏకాంతం"
కవితా శీర్షిక కవయిత్రి
నిర్ణయానికే వదిలేసాం.
ఆ ఐదుగురు
కవయిత్రులూ : సాయిపద్మ, కవితాచక్ర,
వనజ తాతినేని, జయశ్రీ నాయుడు, పూర్ణిమా సిరి.
కవితలు
రాసిచ్చారు బానే ఉంది. ఆ తర్వాత ఏంటి?? వారి
కవితలనీ, వాటిపై విశ్లేషణతో కూడిన సమీక్షనీ
మనకందిస్తున్నారు శ్రీనివాస్ వాసుదేవ్. ఇక మరో వారంలొ మాలికపత్రిక మీముందుంటుంది. మా
రెగ్యులర్ కథలూ, సీరియల్స్ తో
పాటూ ఈ శీర్షిక కోసం కూడా ఎదురుచూస్తుండొచ్చు మీరు.
2 వ్యాఖ్యలు:
మీ ప్రయోగం చదివే యోగం కోసం ఎదురు చూస్తున్నాం!
జ్యోతి గారు .. విన్నూత్న ప్రయోగం. ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. చిత్రం చాలా బాగుంది అర్ధవంతంగా ఉంది.
గతంలో ఆకాశవాణిలో సాహిత్యంలో ముత్యాలు. సాహిత్యంలో వెన్నెల ఇత్యాది అంశాలతో కార్యక్రమాలని మరోమారు గుర్తుచేశారు ఈ ప్రయోగంతో ..
Post a Comment