అనగనగా ఓ అమ్మాయి... హ్యాపీ బర్త్ డే
అనగనగా ఓ అమ్మాయి....
మొన్న... ఒక కూతురు, ఒక భార్య, ఒక అమ్మ,.....
నిన్న ... ప్రముఖ తెలుగు బ్లాగర్... రచయిత్రి, కాలమ్నిస్ట్
నేడు.. వెబ్ పత్రిక సంపాదకురాలు...ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
రేపు... సస్పెన్స్...
నా ఈ పయనంలో ఎన్నో ఆటుపోట్లు, సంతోషం -దుఃఖం, పొరాటం, గెలుపు - ఓటమి, విజయం - ఓటమి, ఇలా సాగిపోతూ యాభై సంవత్సరాలు నిండాయి.. కొన్నేళ్ల క్రితం వరకు నేనెవరు అనే ఆలోచన లేకుండా కాలం గడిపేసాను.. కాని ఒకానొక సమయంలో నేనెవరు అన్న ఆలోచన మొదలై నా గురించి నన్ను పరిశోధించుకుని, నాగురించి తెలుసుకుని, నన్ను నేను మెరుగుపరుచుకునేలా చేసింది. ఈ ప్రస్థానంలో నాకు తోడు నిలిచిన వారందరికి మనఃఫూర్వ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏమివ్వగలను?? ఈనాడు నాకంటూ ఒక గుర్తింపు, ఆదరణ, అభిమానం, గౌరవం, ప్రేమను తలుచుకుంటే గర్వంగా, సంతృప్తిగా ఉంటుంది. నా జన్మ సార్ధకమైందనిపిస్తుంది. కాని ఇంకా ఏదో చేయాలనే తపన మాత్రం తగ్గడం లేదు. అందుకే రేపు అనేది సస్పెన్స్ గానే ఉంచుతున్నాను. .. ఒకోసారి అనిపిస్తుంది. నేను అందరిలా పెద్ద చదువులు చదివి, పెద్ద ఉధ్యోగం చేసి బోలెడు డబ్బులు సంపాదించి ఉంటే .... అవన్నీ చేయకుండా ఈ మధ్యే మొదలెట్టిన నా అసలైన ప్రయాణం సఫలమైందని నమ్ముతూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ
HAPPY BIRTHDAY TO ME, MYSELF.... JYOTHI...
వారం రోజుల క్రింద హైదరాబాదులో జరిగిన బ్నింగారి చీర పజ్యాల పుస్తకావిష్కరణ ఫోటోలు క్రింద చూడండి..
11 వ్యాఖ్యలు:
స్వర్ణోత్సవ జయంతి శుభాకాంక్షలు జ్యోతి వలబోజు గారూ! ముచ్చటగా మూడు యాభైలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లండి.
'జన్మదిన శుభాకాంక్షలు' జ్యోతి గారు.
మేడం ! తెలుగులో బ్లాగులు ఉన్నంతకాలం మీరు వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ ...జన్మదిన శుభాకాంక్షలు.
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జ్యోతి గారు :)
ఫోటోలు బాగున్నాయండి .ఈ పుస్తకం బయట బుక్ షాప్స్ లో దొరుకుతుందా?
Happy birthday!
You just have completed half of you happy journey.
Wish you happier seecond half of the same.
Jo !
Happy Birthday ! fifty on and going on Joy !
cheers
zilebi
* * * * * ఐదు పదుల వయసంటే నా ముందు చిన్నపాపాయేనన్నమాట.మరి చిన్నారి జ్యోతి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ,మరిన్నిరచనలకు ఈ రోజు ఉద్దీపన కావాలని ఆశిస్తూ శుభాభినందనలు అందుకోండి మరి!
అనుకున్నది సాధించాలంటే మీ తర్వాతే జ్యోతి గారూ! మీకు 50 ఏళ్ళొచ్చాయంటే నమ్మలేక పోతున్నా! పాతికేళ్ల వాళ్ళు కూడా మీ స్ఫూర్తి తో పోటీ పడలేరు. మిమ్మల్ని గెలవలేరు.
మీరిలాగే అప్రతిహతంగా సాగి పోతూ, అనన్య సామాన్యమైన విజయాలను సొంతం చేసుకుంటూ.. ఎప్పటికప్పుడు రేపు ఏమిటనేది సస్పెన్స్ గానే ఉంచాలని, ఎదుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను
మెనీ మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!
పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతి గారు... ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ఉంటారు మిమ్మల్ని... Thats a big inspiration to every one around you..
Many Many Happy Returns of the day :)
సుధామ, కార్తీక రాజు, శ్రీనివాస్, రాధిక, శ్యామలీయం, జిలేబీ, ఉమాదేవి, సుజాత, మేధ,,
మీ అందరి అభిమానానికి మనఃపూర్వక ధన్యవాదాలు..
Post a Comment