మాలిక పదచంద్రిక జనవరి 2014 - సమాధానాలు
నా పదచంద్రిక గళ్ళకిస్తున్న ఆదరాభిమానాలకు ముందుగా మీకూ, మాలిక పత్రికకీ కృతజ్ఞతలు.
నూతన సంవవత్సరం మొదలై ఒక మాసం గడిచింది. పదచంద్రికకిచ్చిన కొత్త రూపువల్లనేమో 4 పూరణలొచ్చాయి. పూరణలు పంపినవారు సర్వశ్రీ/శ్రీమతి శుభావల్లభ, కాత్యాయని, భీమవరపు రమాదేవి, భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హెచ్. రావు గార్లు. ఇచ్చిన ఆధారాలలో 5 నిలువు కి 7 అడ్డానికి కాలులేకపోతే అని ఉండాలి. 7 అడ్డం సాకు కాబట్టి 5 నిలువు కి పూరణ కుంటి అని ఉండాలి. కానీ ఇచ్చిన ఆధారాలలో పొరపాటున 7 నిలువు కి కాలులేకపోతే అని రాసా. క్షంతవ్యుడిని. అందువల్ల కుంటి, అని రాసినా, అంప అని రాసినా సరియైన సమాధానం గా పరిగణించమని నిర్వాహకులని కోరుతున్నా.
శుభావల్లభ గారు 24 అడ్డానికి తుష్టి అని పూరించారు. అది తుత్తి అని ఉండాలి. అది స్వర్గీయ ఏవీయస్ గారి ట్రేడ్మార్కు పదం.. మిష్టర్ పెళ్ళాం లో. అందుకని కాత్యాయని, భీమవరపు రమాదేవి, భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హెచ్. రావు గార్లని మాత్రమే విజేతలుగా భావించగలరు.
గతమాసంలోలాగానే ఈసారి కూడా పదచంద్రిక సులభ తరం చేసిపెట్టాం. ఇందులో 4 చిన్న మినీ గడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. అతి పెద్దపదంలో కేవలం 5 అక్షరాలే.
ఇట్లు భవదీయుడు సత్యసాయి కొవ్వలి
విజేతలందరికీ అభినందనలు.. బహుమతి సొమ్ము సమానంగా పంచబడుతుంది..
1 వ్యాఖ్యలు:
Thank you
Post a Comment