షడ్రుచులు - తెలంగాణా వంటలు (వెజ్)
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాగే కోటి విద్యలు కూటి కొరకే అని కూడా చెప్పారు. మనిషి సుఖశాంతులతో జీవించడానికి ఆరోగ్యం ఎంతో అవసరం. ఆరోగ్యానికి ప్రతిరోజూ పుష్టికరమైన ఆహారం తినడం ఎంతో అవసరం. పాకకళ కూడా అరువది నాలుగు సామాన్య కళలో ఒకటిగా పేరు పొందింది. ప్రజల ఆహారపు అలవాట్లు, భూగోళ పరిస్థితుల మీద, భూగర్భ పరిస్థితుల మీద వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. అంతే కాకుండా ఆయాప్రాంతాలలో నేల ఆధారంగా పండే పంటలమూలంగా వంటకాలు కూడా మారుతుంటాయి... మారుతున్న జీవనవిధానం, ఆధునిక పరిజ్ఞానం, అభివృద్ధి కారణంగా ఈ ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా హడావిడి, వేగం పెరిగింది. అలాగే వంటింట్లో గడిపే సమయం కూడా తగ్గింది. కష్టపడేది తిండి కోసమే ఐనా ఆ భోజనం మీద శ్రద్ధ పెట్టడానికి కూడా టైం లేదంటున్నారు.
ఎందుకో మరి మొదటినుండి నాకు వంటలమీద శ్రద్ధ ఎక్కువే. బ్లాగుల్లో కొచ్చాక అది పెరుగుతూనే వచ్చింది. షడ్రుచులు బ్లాగు ఆ తర్వాత వెబ్‌సైటు రాస్తూ రాస్తూ భూమిలో ఆదివారం "రుచి" కాలమ్ మరిన్ని విభిన్నమైన వంటలు నేర్చుకుని, చేసి రాయడానికి స్ఫూర్తినిచ్చింది. ఎంత కొత్త వంటకాలు రాసినా నేను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంటపు వంటకాల మీద మక్కువ వీడలేదు. మల్లాది వెంకట కృష్ణమూర్తిగారితో మాటలలో తెలంగాణా ప్రాంతపు వంటకాల మీదే ఎందుకు పుస్తకం రాయకూడదు అనే ఆలోచన మొదలైంది. అది ముదిరి, ముదిరి చివరికి పుస్తకంలా రూపు దాల్చింది. గత ఏడాదిగా నేను చిన్నప్పటినుండి తెలిసిన, తిన్న తెలంగాణా ప్రాంతపు వంటకాలు, మా పుట్టింటి, అత్తింటివారు, వేర్వేరు ప్రాంతాలలో ఉన్న మిత్రులు, బంధువులతో చర్చించి మరిన్ని సేకరించి, ప్రయత్నించి ఈ పుస్తకంలో చేర్చడమైనది. ఇంకా మిగిలిపోయి ఉండవచ్చు. వీలైతే వాటిని మరో పుస్తకంలో వేయించొచ్చు. చూద్దాం..
ఈ పుస్తకం రాయాలనే ఆలోచన నిచ్చిన ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారికి. నా పుస్తకానికి నాకు నచ్చినట్టుగా అందంగా డిజైన్ చేసిన సృష్టి అధినేత కృష్ణ అశోక్‌గారికి, పుస్తక ప్రచురణ విషయంలో ఎన్నో విధాల సహాయం చేసిన మురళిగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాను.
పుస్తకంలో పేజీలు: 300
ధర : రూ. 150
ఆఫర్: పది పుస్తకాలు కొంటే ఒకటి ఫ్రీ
పబ్లిషర్స్: J.V. Publishers
పుస్తకాలు లభించు చోటు:
నవోదయ బుక్ స్టోర్స్ కాచిగుడా. ఫోన్:24652387 , 9247471361/62
తెలుగు బుక్ హౌస్ . కాచిగుడ ఫోన్: 9247446497
కొద్ది రోజుల్లో ఈ పుస్తకం మరిన్ని చోట్ల అందుబాటులో ఉంచబడుతుంది.
కినిగె నుండి కూడా ప్రింట్ పుస్తకాలు, eపుస్తకాలు అందుబాటులొ ఉంచబడతాయి.
ఎక్కువ కాపీలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు...
1 వ్యాఖ్యలు:
Congrats Jyothy!
Post a Comment