కొత్త ఆలోచన - కొత్త ప్రయాణం
కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఒక కొత్త ఆలోచనకు నాంది పలుకుదామని నిర్ణయించుకున్నాను. బ్లాగు రాతలనుండి పత్రికా రచనలు.. ఆ తర్వాత పుస్తకాల ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో నాదైన ఒక పబ్లిషర్స్ ని ప్రారంభిస్తున్నాను. అదే JV Publishers. ఈ పబ్లిషర్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం నా "తెలంగాణా వంటల పుస్తకం". పబ్లిషర్స్ అనగానే పుస్తకాలు అచ్చువేయడమే కాదు. రచయితలకు తమ పుస్తకాల ప్రచురణకు సంబంధించిన సేవలు అందించడమే ముఖ్య ఉద్ధేశ్యం. రచయిత దగ్గర కంటెంట్, సొమ్ము ఉంటే చాలు. వారి రచనలు పుస్తక రూపంలో అచ్చు వేసి ఆ తర్వాత చేయవలసిన పనుల గురించిన సేవలు అందించడం మా వంతు. ఆ పుస్తక సేవలు ఏమేమిటి అంటే..
1. డిటిపి
2. ప్రూఫ్ రీడింగ్
3. కవర్ డిజైన్
4. ప్రింటింగ్
5. పుస్తకాల షాపులకు పంపడం
6. సమీక్ష కోసం వివిధ పత్రికలకు కాపీలు పంపడం
7. సెంట్రల్ లైబ్రరీకి అప్లై చేయడం
8. చివరిగా eబుక్ చేయడం
ఇందులో పుస్తకానికి సంబంధించిన కాపీరైట్లు రచయిత దగ్గరే ఉంటాయి. ప్రచురణ విషయంలోనే మా సేవలు అందుబాటులో ఉంటాయి. వాటికి తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక తమ పుస్తకాన్ని రచయితలు తమ అభిరుచికి తగినట్టుగా, తమకు పూర్తిగా నచ్చినట్టుగా చేసుకునేలా గైడ్ చేయడం జరుగుతుంది. రచయితకు పూర్తిగా నచ్చిన తర్వాతే పుస్తకం ప్రింటింగ్ కి వెళుతుంది. ఈ పనులన్నీ వీలైనంత తక్కువ ధరలో, నాణ్యంగా, అందుబాటులో ఉండే విధంగా చేయడం జరుగుతుంది. తమ పుస్తకానికి ప్రచారం, ఆవిష్కరణ , అమ్మకాల విషయం రచయిత మాత్రమే చూసుకోవాలి. అది మా బాధ్యత కాదు.
ఇంతవరకు ఈ పనులు ఏవైనా చేసారా అంటే. అమెరికాలో ఉంటున్న నా స్నేహితురాలు కోసం చేసాను. నా పుస్తకం కోసం కూడా మొదటి నుండి చివరి వరకు నేనే తిరిగి నా ఇష్టప్రకారం చేయించుకోవడం జరిగింది. అది కూడా నాకు అందుబాటైన ధరలో..
4 వ్యాఖ్యలు:
మాంచి కాఫీ లాంటి ఐడియా, అండీ!
మీరు పట్టిందల్లా... సారీ.... పబ్లిష్ చేసిందల్లా బంగారు కావాలిక!
అన్నట్టు, నేను మార్గదర్శిలోనైతే చేరాను గానీ, మీ పబ్లిషింగ్ హౌసులో ఏదైనా అచ్చేయించగలనో లేదో చూడాలి. ఆల్ ది బెస్ట్ మీకు! :-)
2014 మీ అంకిత భావానికి ప్రతీకగా నిలవాలని,మీరు మీ ప్రయత్నాలలో విజయాలకు చిరునామా కావాలని ఆశిస్తూ శుభాభినందనలు.
చాలా మంచి ఆలోచన!
చక్కని ఆలోచనతో మొదలు పెట్టిన ఈ ప్రయోగం ప్రశంసనీయం. All the best!
Post a Comment