అంతర్జాలంలో అమ్మ చేతివంట - ఈనాడు "తెలుగు వెలుగు"
అంతర్జాలంలో తెలుగు రాయడం సులువు అని తెలియగానే తెలుగుమీద అభిమానమున్నవారందరికీ సంతోషమే కదా. నిత్యం ఉపయోగించే కంప్యూటర్లో తెలుగు రాయడం, చదవడం వచ్చేసింది. మనకు నచ్చిన కవితలు, కహానీలు చెప్పేసుకుంటున్నాం కాని అందరికీ ఇష్టమైనది, కావలసినది, చాలా ముఖ్యమైనది ఎలా మరి.. అదేనండి. భోజనం, తిండి, ఖానా, ఫుడ్, సాపాటు... ఇవి కూడా నెట్ లో ఉండాలి కదా. ఇలా మనదైన తెలుగులో తెలుగు వంటకాలతో పాటు ఇతరత్రా వంటకాలను సులువుగా అర్ధమయ్యేలా అందమైన ఫోటోలు, వీడియోలతో ఎన్నో బ్లాగులు, వెబ్ సైట్లు ఉన్నాయి. మరి అందరికీ వీటిగురించి తెలుసో లేదో. అందుకే ఈనాడు తెలుగువెలుగు పత్రికవారు ఈ నెల అంటే మే నెల సంచికలో అంతర్జాలంలో అమ్మచేతివంటను పరిచయం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, తెలుగు చదవడం వచ్చినవారందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందీ వ్యాసం. పదండి మరి వాటి గురించి తెలుసుకుందాం. ఆయా నిర్వాహకులకు ధాంక్సులు చెప్పుకుందాం..
కౌటిల్య, లత, భాస్కర రామరాజు, తృష్ణ మొదలైన తెలుగు బ్లాగర్ మిత్రులకు మరోసారి అభినందనలు..
కౌటిల్య, లత, భాస్కర రామరాజు, తృష్ణ మొదలైన తెలుగు బ్లాగర్ మిత్రులకు మరోసారి అభినందనలు..
1 వ్యాఖ్యలు:
వ్యాసకర్త మధురవాణి కి పత్రికలో చోటు దక్కించుకున్న ఇతర మిత్రులందరకీ అభినందనలండీ :-)
Post a Comment