Happy Birthday to Me , Myself...Jyothi
కొన్నేళ్ల క్రితం నేనేంటో , నాకేం వచ్చో, నేనేం చేయగలనో తెలీదు. అసలు నేనేమైనా చేయగలను, సాధించగలను అని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం డిగ్రీ పూర్తి చేయలేదు. మరీ జీనియస్ కాదు. పెద్దవాళ్లెవరూ తెలీదు.స్నేహితులు లేరు.. సరే.. వంట చేసుకోవడం, ఇల్లు సర్దుకోవడం. భర్త, పిల్లలను సరిగా చూసుకోవడం. వారికి కావలసినవి అమర్చడం.. బంధువులను ఆదరించడం.. ఇవి చేస్తే చాలులే అంటూ గడిపేసిన జీవితం నేడు పూర్తిగా తిరగబడింది. ఆత్మీయ మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఒక రచయిత్రి, ఎడిటర్, పబ్లిషర్ గా మంచి పేరు లభించింది. ఈ పుట్టినరోజుకు నాకు నేను ఇచ్చుకున్న గొప్ప బహుమతి హైదరాబాదు బుక్ ఫెయిర్ లో మరికొందరు ప్రముఖ మహిళా రచయిత్రులతో కలిసి స్టాల్ పెట్టడం. అది కూడా గొప్ప విజయం సాధిస్తోంది. ప్రశంసలు వస్తున్నాయి.. ఇప్పుడు సంతృప్తిగా ఉంది. నేను కూడా ఏదో చేయగలను, చేసాను అని..
నా గురించి పూర్తిగా కాకున్నా చాలా తెలుసుకున్న ఒక ఆత్మీయ సొదరి చేసిన ఈ కార్డ్ కంటే అందమైనది నేను చేయలేను.. అందుకే అదే మీకోసం.