Wednesday, 17 December 2014

ప్రమదాక్షరి / J.V.Publishers బుక్ స్టాల్




డిసెంబర్ అనగానే హైదరాబాదీలకు గుర్తొచ్చేది పుస్తకాల పండగ. 1985లో ప్రారంభమైన ఈ పుస్తకప్రదర్శన ఈసారి ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోంది.

ఈ ప్రదర్శన డిసెంబర్ 17 నుండి 26 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 2 గంటలనుండి రాత్రి 8.30 వరకు. వారాంతం, సెలవుల్లో ఉదయం 11 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.

ఈ 28వ పుస్తకప్రదర్శనలో జె.వి.పబ్లిషర్స్, తెలుగు మహిళా రచయిత్రులు కలిసి ఒక ప్రత్యేకమైన స్టాల్ "ప్రమదాక్షరి/ J.V.Publishers" ఏర్పాటు చేస్తున్నారు.. ఈ స్టాల్ కి చాలా ప్రత్యేకతలున్నాయి.. పాతికమంది రచయిత్రులు తమ పుస్తకాలను ప్రదర్శిస్తున్నారు. నావి రెండు తెలంగాణ ఇంటివంటల పుస్తకాలు, వారణాసి నాగలక్ష్మి రాసిన ఊర్వశి, 24మంది రచయిత్రులు కలిసి రాసిన "ప్రమదాక్షరి కథామాలిక - తండ్రి తనయ" పుస్తకావిష్కరణ ఉంటుంది.
అంతే కాదు పుస్తకాల బిల్లును బట్టి చిన్న చిన్న బహుమతులు కూడా ఉన్నాయండోయ్..

మేము ఈ స్టాల్ ని పుస్తకాల అమ్మకాలకంటే పాఠకులతో ముఖాముఖి, పరిచయాలు, ఇతర రచయిత్రులతో పరిచయాలు, పలకరింపులు. వెరసి ఫుల్ పిక్నిక్ చేసుకోబోతున్నాం.. ఇంకా చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి..

ఇవాళ సాయంత్రం అంటే 17 డిసెంబర్  సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణ రాష్ట్రపు విద్యాశాఖ మంత్రి జగదీశ్వరరెడ్డిగారు  28వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ని ప్రారంభిస్తున్నారు.

మా స్టాల్ కి ఇదిే మా ఆహ్వానం..
మా స్టాల్ నంబర్: 261.262

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008