తెలంగాణ ఇంటివంటలు వెజ్, నాన్ వెజ్
ఎలాగైతేనేమి అనుకున్నది సాధించా...
ఏదైనా పని చేస్తే నాకు లాభంకంటే పదిమందికి ఎక్కువ ఉపయోగపడేదిగా ఉండాలని కోరుకుంటాను. అందుకే రాతల్లో కాస్త నిగ్గుదేరాక కథలు, కవితలు, వ్యాసాలు కాకుండా నాకు వచ్చిన వంటలనే అందునా నేను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంతపు సంప్రదాయ ఇంటి వంటకాలను సేకరించి, అక్షరీకరించి నా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి తరానికి, రాబోయే తరానికి ఈ ప్రాంతపు రుచులను పరిచయం చేయాలని శ్రమపడి తెలంగాణ ఇంటివంటలను పుస్తకాలుగా అందిస్తున్నాను. జె.వి.పబ్లిషర్స్ మొదలెట్టిన తర్వాత జనవరిలో మొదటి పుస్తకంగా తెలంగాణ వంటలు వెజ్ పుస్తకం, ఇప్పుడు 20వ పుస్తకంగా నాన్ వెజ్ తయారవుతోంది. అంతే కాకుండా వెజ్ పుస్తకం రెంఢో ప్రింట్, మరిన్ని అందాలతో వస్తుంది.. ఈ రెండు పుస్తకాలు. డిసెంబర్ 17 నుండి ప్రారంభమయ్యే హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మా ప్రమదాక్షరి/ జె.వి.పబ్లిషర్స్ స్టాల్ లో ఆవిష్కరింపబడతాయి..
వెజ్ పుస్తకం పేజీలు : 296
ధర: రూ., 150
కవర్ డిజైన్: కృష్ణ అశోక్
ప్రింటర్స్ : ఆకృతి, చిక్కడపల్లి
నాన్ వెజ్ పుస్తకం: పేజీలు: 264
ధర: రూ. 150
కవర్ డిజైన్: కృష్ణ అశోక్
ప్రింటర్స్: ఆకృతి , చిక్కడపల్లి
3 వ్యాఖ్యలు:
All the best Jyothi.
Where can I purchase?
These books are available at Stall no 261., 262 at Hyderabad Book Fair , ntr stadium. hyd from dec 17th to 26. and other major book shops like navodaya, telugu book house, prajashakti
Post a Comment