రౌడీయే కాని మంచోడే...
ఇవాళ ఒక వ్యక్తికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకోవాలని ఉంది..
మా పరిచయమే పెద్ద గొడవతో మొదలైంది. ఆరేళ్ల క్రింద అనుకుంటా తెలుగు బ్లాగుల్లో నన్ను అంతమొందించాలని వచ్చాడతను..నా మీద చాలా ఆరోపణలు, కోపం పెట్టుకున్నాడు. కాని నేను ఇదీ సంగతి నాయనా... నువ్వునుకునేవి నిజం కావు అని చెప్తే అర్ధం చేసుకుని శత్రువుల లిస్టునుంఢి నన్ను తీసేసాడు. పరిచయం పెరిగి నమ్మకమైన స్నేహంగా మారింది.. టెక్నికల్ గా ఎటువంటి సందేహమున్నా తీర్చేవాడు.. అలా సాగిపోతుండగా ఒకనాడు నేనో పత్రిక మొదలెట్టాలనుకుంటున్నాను. కాస్త సాయంగా రావా అన్నాడు... సరే కాని నాకు ఈ టెక్నికల్ విషయాలు, పత్రికల సంగతి తెలీదు. ఆర్టికల్స్ కరెక్షన్స్, టైపింగ్ లాంటివి చేసిపెడతాను అన్నా.. నాకు నచ్చకుంటే మాత్రం ఉండను అని ఖచ్చితంగా చెప్పేసా.. సరే అని ఒప్పుకున్నాడు.. పని మొదలైంది.. త్రైమాసిక పత్రిక ... మెల్లిమెల్లిగా పత్రిక పనిలోని లోతుపాట్లు తెలుస్తున్నాయి. నేర్చుకుంటున్నాను. అతని సాయం మెల్లిగా మెల్లిగా తగ్గించుకుంటూ చివరికి అతని సాయం లేకుండానే మొత్తం పత్రికను నిర్వహించే స్థితికి వచ్చాను . అఫ్కోర్స్ అతని సాయం ఉందనుకోండి.. కాని ఇక్కడ అతని కుట్ర నాకు అర్ధం కాలేదు.. పాపం వర్క్ లో బిజీగా ఉంటాడు కదా పని తగ్గిద్దాం అని చేస్తుంటే మెల్లిగా మొత్తం పత్రిక నాకు అప్పగించి నువ్వే చూసుకో. నా సాయం కావాలన్నప్పుడు మెసెజ్ పెట్టు చాలు అన్నాడు.. సరేలే మంచిదే కదా అనుకున్నా.. ... అలా నన్నునమ్మి పత్రికను నా చేతిలో పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం కాదు. నన్ను నేను ఎన్నో రెట్లు మెరుగుపరుచుకుంటూ సాహితీరంగంలో ఎంతో ఉన్నతంగా ఎదిగేలా చేసాడు.. ఈ పత్రిక అదేనండి మాలిక లేకుంటే నేను మామూలు బ్లాగర్ గా , కథారచయిత్రిగా మిగిలిపోయేదాన్నేమో...
బ్లాగు అంటే నా స్వంతం కాబట్టి ఏధైనా పిచ్చి రాతలు, వాగుడు రాసుకోవచ్చు కాని పత్రిక అనేది ఒక బాధ్యత... పదిమందిలో జవాబు చెప్పుకోవాలి. అందుకే నా రాతల ప్రయాణం కూడా దిశ మార్చుకుంది. అప్పటికే నాకు పరిచయమున్నవారితో రాయమని అడుగుతూ, రాయాలనుకున్నవారిని రాయమని ప్రోత్సహిస్తూ వస్తున్నాం.. మాలిక పత్రిక ఏ ఒక్క వర్గానికి అంకితం చేయలేదు.. ఇది అందరికీ సమానంగా ఆహ్వానం పలుకుతుంది అని మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. మాలిక పత్రిక ద్వారా చేసిన అద్భుతమైన ప్రయోగం "అంతర్జాల అష్టావధానం " ఆలోచన నాదైనా టెక్నికల్ సాధ్యాసధ్యాల సంగతి చూసుకుంది మాత్రం మాలిక టెక్నికల్ హెడ్.. ఇక్కడ లైవ్ గా అష్టావధానం జరుగుతుంటే అమెరికాలో అప్పుడే తెలవారుతున్న వేళ, సెలవు రోజైనా లేచి అవధానాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసాడు తను.. రెండువైపులా మేమిద్దరం కలిసి పనిచేయడం వల్ల మొదటిసారే ఈ ప్రయోగం అద్భుతంగా విజయం సాధించింది.. ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.. అలాగే నేను పత్రికకు సంబంధించి ఎటువంటి కొత్త ఆలోచనైనా, ప్రయోగమైనా Go Ahead అంటూ వెన్ను తట్టి, ప్రమాదాలు ఉండే అంశాల గురించి హెచ్చరిస్తూ ఉంటాడు.. ఎందుకంటే ఆల్రెడీ మాకిద్దరికీ తెలుగుబ్లాగుల్లో జరిగిన ఎన్నో గొడవల అనుభవం ఉంది.. తను ఎంతో నమ్మకంగా అప్పచెప్పిన మాలిక పత్రిక ఈనాడు నాకు ఎంతోమంది ప్రముఖుల పరిచయాన్ని కలిగించింది. సాహితీరంగంలో ప్రయోగాలు చేయడానికి వేదికగా నిలిచింది.. ఎంతో పేరును కూడా సంపాదించి పెట్టింది. నాకు గుర్తింపుగా మారింది.....
పత్రిక సాయం అని చెప్పి మొత్తం నామీద పెట్టావు ఇలాగైతే నిన్ను అడ్మిన్ గా తీసేస్తా అంటే ఇంకా మంచిది ఆ పని చేయి. నేను ఇంకో పని చేసుకుంటా అంటాడు... తను చెప్పిన ఒక మాట ఎప్పటికీ మర్చిపోలేను. గుర్తు చేసుకుంటూనే ఉంటాను.. ఎవరేమీ అన్నా, అనుకున్నా డోంట్ కేర్. యూ కీప్ మూవింగ్ అండ్ రైటింగ్.. చివరికి నీదే గెలుపు అన్నాడు కొన్నేళ్ల క్రింద.. ఆ మాట ఈనాటికీ అన్వయించుకుంటూ ఉంటాను.. మార్చడానికి వీలు లేదు మరి..
ఇంకా అతనెవరో చెప్పలేదు కదా.. అతనే తెలుగు బ్లాగుల్లో మలక్ పేట్ రౌడీగా చాలా చాలా పేరు పొందిన Bhardwaj Velamakanni...
భరద్వాజ్
ప్రతీ సంవత్సరం నా పుట్టినరోజు సమయంలో నాకంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులే నువ్వు పంపే కేక్ కోసం ఎదురు చూస్తుంటారు.. అలవాటైపోయింది మరి.... నువ్వేమో Surprise చేద్దామని పుట్టినరోజునాడు అందేలా కేక్ ఆర్డర్ చేస్తే ఆ సైట్ సచ్చినోడికి తొందరెక్కువ. ఒకరోజు ముందే డెలివర్ చేస్తాడు.. smile emoticon
థాంక్ యూ బ్రదర్.. (ఫోటో చూసి భయపడకండి.. మంచోడే)


5 వ్యాఖ్యలు:
We know that Bhardwaj is good person right from day one.
Well done Malak.
Congratulations to you Madam for maintaining Malika well.
Who has taken the caption photos in so many poses, Malak himself! I am sure, he himself.
నాకు తెలియదండీ. మీరు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. చాలా బాగుంది మీ ఎదుగుదకు ఆయనప్రోత్సాహం. స్నేహం విలువను తెలియజేసే మరొక మంచి కథనం చదివించారు. అభినందనలు.
He's a good guy. He helped me in some technical aspects too
మా లక్కు, పేట రౌడీ అంటే , గళ్ళ లుంగీ తో మెడకో రుమాల్ తో చూస్తేనే గభీల్ మనిపించే లా ఉంటా రని అనుకున్నా !!
ఆ మధ్య ఒక వచ్చిన మలయాళం సినిమా లో మమ్ముట్టీ పేట రౌడీ గా ఉంటాడు ! అట్లా ఉన్నారు వేలాం కన్నీ !!
చీర్స్ అండ్ ఆల్ ది బెష్టు !
జిలేబి
జ్యోతి గారూ ,
పైకి కనపడేదంతా నిజం కాదన్నదే మన వేదాలు చెప్తున్నాయి .
కనుక రౌడీగా కనపడే భరద్వాజ గారు మంచోడే అని అనవలసిందే .
పైగా భరద్వాజ మహర్షి పేరులోనే ఆ మంచితనం కనపడ్తుంది కదా !
మలక్పేట రౌడీ కాదండి , మాలిక వెబ్ మ్యాగజైన్ రౌడీ కాదు డాడీ అనటం బాగుంటుంది .
Post a Comment