Facebook ఇలా ఉపయోగిస్తే సరి... నవతెలంగాణ
ఇలా ఉపయోగిస్తే సరి
Wed 16 Sep 05:19:59.184333 2015
ఫేస్బుక్
లేదా ముఖపుస్తకం అంటే తెలియని వారు చాలా తక్కువగా ఉంటారేమో. చిన్నా
-పెద్దా, ఆడా -మగా అన్న తేడా లేకుండా ఇంటి అడ్రస్ లా, ఫోన్ నెంబరులా
ఫేస్బుక్ ఐడి కూడా ఒక గుర్తింపుగా మారింది. మహిళలు కూడా ఇందులో చాలా
యాక్టివ్‌గా ఉన్నారు. అన్ని రంగాలలో ఉన్న ఆడవాళ్ళు సంగీతం, సాహిత్యం,
వంటలు, రచనలు, పాటలు..ఇలా తమకు నచ్చినట్టుగా గ్రూపులు తయారుచేసుకుని ఎంతో
లాభపడుతున్నారు. తమ ప్రతిభను పెంపొందించుకుంటూ మంచి గుర్తింపు కూడా
పొందుతున్నారనడంలో సందేహం లేదు. కాని అంతా మంచిగానే ఉంటుందని మాత్రమే
అనుకోవడం సరికాదు. ఇక్కడ కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని
గుర్తించి జాగ్రత్తగా ఉంటూ తమకు అనువైనరీతిలో ఉపయోగించుకుంటూ
దూసుకుపోతున్నారు. ఎన్నో సత్సంబంధాలను పెంపొందించుకుంటున్నారు. ఈ
ఫేస్‌బుక్‌ని విరివిగా ఉపయోగిస్తున్న వివిధ రంగాలలో ఉన్న మహిళలను తమ
అనుభవాన్ని పంచుకోమనగా ఇలా అంటున్నారు...
రహస్యాలు వద్దు
నేను ఓ సోషల్ వర్కర్‌గా ఫేస్బుక్లో మా సంస్థ ఆసరా పేరుతో ఓ గ్రూపు మొదలుపెట్టి ఎన్నో వేల మందికి రక్తదానం చేయించగలిగాను. నిరుద్యోగులు కొందరికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగాను. నా చుట్టూ జరుగుతున్న కొన్ని అన్యాయాలను ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని నా పరిధిలో వీలైనంత సాయం అందించగలుగుతున్నాను. ఫేస్బుక్ ఉపయోగించే మహిళల్లో కొందరు ఎదుర్కొంటున్న సమస్యలకి కారణం వారి స్వయంకృతాపరాధం అని మాత్రం చెప్పగలను. ఈ సోషల్ మీడియాలో నాలుగు రోజుల పరిచయంతో తమ వ్యక్తిగత సమస్యలని, వివరాలను పంచుకోవడం మహిళలు చేస్తున్న మొదటి తప్పు. స్నేహం బాగున్నంత కాలం అన్నీ బాగుంటాయి. కాని ఓ చిన్న అభిప్రాయ భేదం రాగానే అది చిలికి చిలికి గాలి వానై వారి సంసారాలు నాశనం అయ్యే వరకు ఆగదు. ఫేస్బుక్ అనేది ఓ సమాజం లాంటిది. అందులో అన్ని రకాల వ్యక్తులూ ఉంటారు. కనుక వెయ్యి కళ్ళతో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. చాట్‌బాక్స్ అనుకొని మీరు స్వేచ్ఛగా ఉంటే..మిమ్మల్ని నగంగా నిలబెట్టేస్తారు. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్తగా పరిచయమైన వారు ఎవరైనా మీ అందాన్ని పొగిడితే..అది నిజం అనుకొని వారితో స్నేహం చేయకండి..వయసుతో సంబంధం లేకుండా మీకు చెప్పిన మాటలే వేరే ఆడవారితో కూడా చెప్పటానికి అవకాశం ఉందని గ్రహించండి. చివరిగా ఒకే మాట.. మీ స్నేహాలు, చాటింగ్‌లు రహస్యంగా వుంచకండి. ముఖ్యంగా మీ భర్త దగ్గర ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఒక వేళ మీకు తెలియక అమాయకంగా మీ స్నేహితులకి మీ రహస్యాలని చెప్పేసి వుంటే ఏదైనా గొడవ జరిగితే వెంటనే మీ భర్త దగ్గర మీరు చేసిన పొరపాటుని నిజాయితీగా వొప్పేసుకోండి. ఇద్దరూ కలిసి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ఆయన వెంటనే మీ మీద కోపం తెచ్చు కోవచ్చు. గట్టిగా తిట్టవచ్చు. తప్పు చేసినందుకు ఇది శిక్ష అనుకోండి. తర్వాత అన్ని సర్దుకుపోతాయి..నమ్మండి.
మంచి కోసమైతే కల్పతరువే
ఈరోజుల్లో ఇద్దరు వ్యక్తులు కలవగానే క్షేమ సమాచారంతోపాటు అడిగే ప్రశ్న మీకు ఫేస్బుక్ ఎకౌంట్ ఉందా? అని. ఇంకా ఎకౌంట్ లేని వాళ్ళ సంగతేమోగాని ఉన వాళ్ళకైతే రోజు పొద్దున లేవంగానే వీలున్న వాళ్ళు సెల్ఫోన్లనో, కంప్యూటర్లోనే ఫేస్బుక్ తెరిచి పెట్టుకొని రోజువారి పనులు చేసుకుంటూనే ఓ లుక్ అటు వేసేంతగా అలవాటయి పోతుంది. దీన్ని కేవలం మంచి పనులకు ఉపయోగించు కోవాలనుకునే వారికి ఇది నిజంగా కల్పతరువే. నేను ఎన్నో ఏళ్ళ నుండి పుస్తకాల మీద పేరుతోనే తెలిసిన రచయిత్రులను ఫేస్బుక్లో పరిచయం చేసుకోగలిగాను. వ్యక్తిగతంగా కలుసుకోగలిగాను. ఇంట్లో కూర్చొని ఒకేసారి మనకు నచ్చిన చాలా మంది స్నేహితులతో మెసేజ్‌ల ద్వారా మాట్లాడడం ఇక్కడే సాధ్యం. మనం చెప్పాలనుకునే సందేశం ఒక్క క్షణంలో లక్షల మందికి చేరిపోతుంది. ప్రపంచంలో ఏ మూలనున్నా క్షణంలో కనెక్ట్ చేయగల సోషల్ మీడియా ఈ ఫేస్బుక్..అయితే అన్ని మీడియా సాధనాలకున్నట్లే దీనికి కూడా రెండో పార్శ్వం అదే నష్టాల పార్శ్వం కూడా ఉంది. అబద్ధపు పేర్లు, ఫోటోలు పెట్టి ఎకౌంట్లు తెరిచే వారివల్ల, ఆడవాళ్ళను మోసం చేద్దామనే దురుద్దేశం ఉన్న వాళ్ళ వల్ల కొంత ప్రమాదం లేక పోలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మారాయి. ఈ మాధ్యమాల ద్వారా జరిగే సైబర్ నేరాలకు కఠిన శిక్షలు అమలవుతున్నాయి. విషయాన్ని అంత దూరం రానీయకుండా మనమే జాగ్రత్త పడితే ఈ సాంఘిక మాధ్యమం ద్వారా కలిగే ఉపయోగాలన్నీ ఆనందంగా పొందొచ్చు. నేనైతే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ప్రతి వాళ్ళని ఆక్సెప్ట్ చేయను. బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే తప్ప నా వ్యక్తిగత విషయాలు చెప్పను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏవో అవకతవకలు జరిగి మనసును బాధించే సందర్భాలూ ఉంటాయి. అయినా నాకు ఫేస్బుక్ వల్ల వ్యక్తిగతంగా చాలా లాభమే కలిగింది.
చురకత్తిలాంటిదే
ఫేస్బుక్ కూడా ఒక చురకత్తిలాంటిదే. కూర తరుక్కోడానికా, గొంతు కోసుకోడానికా అన్నది మనకే తెలియాలి. నేను ఫేస్బుక్లో చేరాక నా బ్లాగు 'తెలుగు తూలిక' గురించి ఎక్కువ మంది పాఠకులకి తెలిసింది. ఫేస్బుక్లో మేలుబంతి పండితులు, చదువరులు పరిచయమయేవారు. వారివల్ల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. నాకు కావలసింది నా రచనలు నచ్చినవారితో స్నేహమే కాని వ్యక్తిగత స్నేహాలు కాదు. అలాగే నేను చూసే పేజీలు కూడా నాకు అర్థమయినంత వరకే. అందుకే జాగ్రత్తగా ఉంటాను. ఇక్కడ కూడా అవాంఛనీయ, విపరీత ధోరణులున్నాయి. వాటిని దాటుకోవలసింది మనమే. నా అకౌంట్ సెట్టింగ్‌లో టాగింగ్ పరిచయం చేసాను. నా ధోరణి నచ్చనివారికి నా పేజీకి రావద్దని చెప్పాను. మహిళలకి గానీ మరొకరికి గానీ నేను చెప్పగలిగింది ఇంతే. లైకులకోసం కాక మీ అభిరుచికి తగిన పేజీలు మాత్రమే చూసుకోండి. మీ రచనలను ఆస్వాదించేవారికి మాత్రమే మీ పేజీకి పిలవండి. మీకు మీరే మీకేం కావాలో తెలసుకుని నిర్ణయించుకుని ఆ విధంగా ఫేస్‌బుక్‌ని ఉపయోగించుకోండి.
ఉద్యమంలా చేరువయింది
నేను ప్రారంభించిన రైస్ బకెట్ చాలెంజ్ ఫేస్బుక్ ద్వారానే ప్రపంచంలోని మూలమూలకు వ్యాప్తి చెందిందంటే నమ్ముతారా...ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా లక్షల మందికి చేరింది. వాళ్లందరూ కూడా తమ వంతుగా రైస్ బకెట్ చాలెంజ్ స్వీకరించడం జరిగింది. ఈ ఉద్యమంలో సుమారు లక్ష కిలోల బియ్యం వితరణ చేయడం జరిగిందంటే అది ఓ అద్భుతమే. ప్రతిచోటా మంచీ చెడూ ఉన్నట్లే ఫేస్బుక్ విషయంలో కూడా మనమే నియంత్రణ పాటించాలి. సరియైన పద్ధతిలో జాగ్రత్తగా ఉపయోగంచుకుంటే లక్షల మందిని చేరడం అసాధ్యమేమీ కాదు. ఇక్కడ మనం రాసే పోస్టుల గురించి కూడా విచక్షణతో ఆలోచించి రాయాలి. ఇతరుల పోస్టులు కూడా అదేవిధంగా తీసుకోవాలి. అనవసరంగా ఉద్రేకపడి గొడవపడడం వల్ల నష్టమే తప్ప ఒరిగేదేమీ లేదు. కొందరు మగవాళ్ల తిక్క, అసభ్య సందేశాలకు స్పందించకుండా వాళ్లని వెంటనే బ్లాక్ చేయాలి. ఫేస్బుక్లో పరిచయమైన వారిని వెంటనే నమ్మి మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు. మనకు కావలసినదేంటో మనమే నిర్ణయించుకుని అందులో చేరాలి. ఇక్కడ తెలియనివారు, తెలిసినవారు, కుటుంబ సభ్యులు, కొలిగ్స్, పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా ఆప్రమత్తతో ఉంటూ మనకు ఎంత వరకు లాభిస్తుందో అంత వరకు ఉపయోగించుకోవాలి.

జ్యోతి వలబోజు
రాసింది జ్యోతి at 06:56
వర్గములు నవ తెలంగాణ
0 వ్యాఖ్యలు:
Post a Comment