Friday, 14 September 2018

బ్లాగ్ 12వ వార్షికోత్సవ వేళ...




Happy 12th  Blog Anniversary.




ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే మరి..

అర్ధం కాలేదా...

పన్నెండేళ్ల క్రితం ఏమీ తెలీకుండా వచ్చి బ్లాగు మొదలెట్టి ఎడాపెడా రాసేసి, ఒకటా రెండా పది బ్లాగులను రోజూ కాకున్నా రోజువిడిచి రోజు అప్డేట్ చేస్తూ వీరవిహారం చేసిన నేను.. అదే జ్యోతి వలబోజును..
ఈనాడు నెలకోసారి మాలిక పత్రిక విడుదల, ఏడాదికోసారి వార్షికోత్సవం అని టముకు వేసుకోవడానికి తప్ప బ్లాగు మొహం చూడట్లేదు. ఇది తప్పు కాదా..
తప్పే... వాట్ టు డూ.. బ్లాగు నుండి మొదలైన అక్షర ప్రయాణం నన్ను ఈనాడు ఇంత బిజీ చేస్తుందనుకున్నానా. నాకు ఇష్టమైనవి చేసే అవకాశం వచ్చినప్పుడు ఎలా వదులుకుంటాను. అలాగని బ్లాగు ఏనాడూ మర్చిపోలేదు. బ్లాగుల్లోని పరిచయాలు, సంఘటనలు, దుర్ఘటనలు.. అన్నీ గుర్తున్నాయి. అఫ్పుడప్పుడు మిత్రులతో గుర్తుచేస్తుంటాను కూడా.
నేను చెప్పే మాట ఒక్కటే.. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సాధించినా.... నా ప్రగతికి, విజయాలకు తోడుండి, ప్రోత్సహించిన నా బ్లాగును, బ్లాగు మిత్రులను మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. ఎప్పుడైనా, ఏ సమయమైనా  నాకు అవసరమైనంతనే మేమున్నామంటారు కదా..

అందుకే
హ్యాపీ బర్త్ డే జ్యోతి..

Wednesday, 5 September 2018

మాలిక పత్రిక సెప్టెంబర్ 2018 సంచిక విడుదల




Jyothivalaboju

Chief Editor and Content Head



ప్రియ మిత్రులు, సహ రచయితలు, పాఠకులందరికీ  పండగ శుభాకాంక్షలు. ఏ పండగ అంటారా.. మొదలయ్యాయి కదా. రాబోయేదంతా పండగల శుభదినాలే. ఈ పండుగలు మీ అందరికీ శుభాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మాసంలో మాలిక పత్రికలో రెండు సీరియళ్లు ముగింపుకు వచ్చాయి. ప్రముఖ రచయితలు భువనచంద్రగారు, మంథా భానుమతిగారు తమ అమూల్యమైన రచనలను మాలికకు అందించారు. ఈ సీరియళ్లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మిమ్మల్ని అలరించే, మీకు నచ్చే కవితలు, కథలు, సీరియళ్లు, వ్యాసాలతో మరోమారు మీ ముందుకు వచ్చింది మీ పత్రిక మాలిక.

మీ రచనలను పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com


 1. కలియుగ వామనుడు
 2. మాయానగరం
 3. ఉప్పులో బద్ధ
 4. బ్రహ్మలిఖితము
 5. తపస్సు
 6. రెండో జీవితం
 7. కంభంపాటి కథలు
 8. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
 9. కథలరాజు
10. తేనెలొలుకు తెలుగు
11. బాధ్యతలను మరచిపోలేక
12. విశ్వపుత్రిక
13. ఫారిన్ రిటర్న్డ్
14. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
15. కార్తీక మాసపు వెన్నెల
16. కంచె చేను మేసింది
17.చేతిలో చావు తప్పేదెలా?
18. కార్టూన్స్ . టి.ఆర్.బాబు
19. కార్టూన్స్. జె.ఎన్.ఎమ్
20 నరుడు నరుడౌట

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008