Friday, September 14, 2018

బ్లాగ్ 12వ వార్షికోత్సవ వేళ...
Happy 12th  Blog Anniversary.
ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే మరి..

అర్ధం కాలేదా...

పన్నెండేళ్ల క్రితం ఏమీ తెలీకుండా వచ్చి బ్లాగు మొదలెట్టి ఎడాపెడా రాసేసి, ఒకటా రెండా పది బ్లాగులను రోజూ కాకున్నా రోజువిడిచి రోజు అప్డేట్ చేస్తూ వీరవిహారం చేసిన నేను.. అదే జ్యోతి వలబోజును..
ఈనాడు నెలకోసారి మాలిక పత్రిక విడుదల, ఏడాదికోసారి వార్షికోత్సవం అని టముకు వేసుకోవడానికి తప్ప బ్లాగు మొహం చూడట్లేదు. ఇది తప్పు కాదా..
తప్పే... వాట్ టు డూ.. బ్లాగు నుండి మొదలైన అక్షర ప్రయాణం నన్ను ఈనాడు ఇంత బిజీ చేస్తుందనుకున్నానా. నాకు ఇష్టమైనవి చేసే అవకాశం వచ్చినప్పుడు ఎలా వదులుకుంటాను. అలాగని బ్లాగు ఏనాడూ మర్చిపోలేదు. బ్లాగుల్లోని పరిచయాలు, సంఘటనలు, దుర్ఘటనలు.. అన్నీ గుర్తున్నాయి. అఫ్పుడప్పుడు మిత్రులతో గుర్తుచేస్తుంటాను కూడా.
నేను చెప్పే మాట ఒక్కటే.. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సాధించినా.... నా ప్రగతికి, విజయాలకు తోడుండి, ప్రోత్సహించిన నా బ్లాగును, బ్లాగు మిత్రులను మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. ఎప్పుడైనా, ఏ సమయమైనా  నాకు అవసరమైనంతనే మేమున్నామంటారు కదా..

అందుకే
హ్యాపీ బర్త్ డే జ్యోతి..

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008