Saturday, 4 February 2023

మాలిక పత్రిక ఫిబ్రవరి 2023 సంచిక విడుదల



పువ్వులు నవ్వులు, ఊసులు, సంతోషాలు, అభినందనలు... ఇలా ఎన్నింటికో ప్రతిరూపంగా భావిస్తాము మనం. సంవత్సరం పొడవునా ఏదో ఒక పువ్వు విరబూస్తూనే ఉంటుంది. ఎండా, వాన, చలి అంటూ అలసట చెందక అందంగా విరబూసి, చూసినవారికి ఆనందాన్ని ఇస్తాయి. లేదా భగవంతునికి సమర్పింపబడతాయి. తాత్కాలికమైన జీవనం కలిగి ఉండే పువ్వులు వీలైనంత సంతోషాన్ని ఇస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

కొద్దికాలంగా ఎందరో ప్రముఖ వ్యక్తులను ముఖ్యంగా సినీరంగానికి చెందినవారిని కోల్పోతున్నాము. మనకు బంధువులు కాకున్నా వారి చిత్రాలద్వారా కొంత అనుబంధం ఏర్పడిపోయింది. వయసు మీరినా, ఎప్పుడో ఒకప్పుడు అందరూ పోవాల్సినవారే అనుకున్నా కూడా వారు ఇక శాశ్వతంగా మన కంటికి కనపడరు, మాట్లాడరు అన్న విషయం మనకు చాలా బాధను కలిగిస్తుంది. ఇక బంధువులలో అంటే ఆ వేదన తీరనిది. కాని సృష్టి కార్యం అలా సాగిపోతూనే ఉంటుంది.

ఎందరో ప్రముఖ రచయితల రచనలతో మిమ్మల్ని ప్రతీనెల అలరిస్తోంది మీ మాలిక... 2020  మార్చి సంచికలో ప్రారంభమైన ప్రముఖ రచయిత్రి మన్నెం శారదగారి నవల 'చంద్రోదయం" ఈ నెలతో ముగుస్తోంది. మన్నెం శారదగారికి మాలిక పత్రిక తరఫున మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.  మరొక ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళిగారి పుస్తకం లోపలి ఖాళి లోని కథలను ప్రతీ నెల ఒక్కొక్కటిగా మాలిక పత్రికలో ప్రచురించబడతాయి. ఈ మాసంలో మొదటి కథ మీరు చదవొచ్చు.

కవితలు, గజల్స్, వ్యాసాలు, కార్టూన్స్, కథలు, సీరియల్స్, సినిమా గురించిన విశేషాలతో కూడిన  ఫిబ్రవరి నెల మాలిక పత్రిక  మీకోసం ముస్తాబై వచ్చేసింది.



ఈ మాసపు విశేషాలు:

 

 1. చంద్రోదయం – 37

 2. సుందరము – సుమధురము – 2 – అందెల రవమిది

 3.ఆ కీర్తనల శృంగారం అతి గుంభనం – శోభారాజ్

 4. కోకో

 5. సాఫ్ట్‌వేర్ కధలు – పర్పస్

 6. లోపలి ఖాళీ – 1

 7. గోపమ్మ కథ – 6

 8.జీవనవేదం – 6

 9.పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం

10. అర్చన కనిపించుట లేదు – 2

11. అమ్మమ్మ – 43

12.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

13. పువ్వుల వనము

15. కాలమదియె ( గజల్ )

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008