మాలిక పత్రిక మార్చ్ 2023 సంచిక విడుదల
స్వాగతం సుస్వాగతం..
మరి కొద్దిరోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం పలుకుదాం.
చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
- బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
- ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
- వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
- చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
- పచ్చి మామిడి ముక్కలు- వగరు - కొత్త సవాళ్లు
- కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
ఈ మధ్య కాలంలో ఎందరో ప్రముఖులను కోల్పోయాము. బాధగా ఉన్నా కాలం ఎవరికోసమో ఆగదు కదా.. నిరాశా, నిస్పృహలమధ్య కొత్త సంవత్సరంలో అంతా బాగుండాలనే ఆశ అందరికీ కలుగుతుంది. ఈ కొత్తసంవత్సరం మీ అందరికీ శుభం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
ఈ మాసపు మాలిక పత్రికలో ఎన్నో కథలు ఉన్నాయి.. అంతేకాదు వ్యాసాలు, కార్టూన్లు, కవితలు, సమీక్షలు కూడా మీ కోసం వచ్చాయి...
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
మార్చి నెల విశేషాలు ఇవే:
3. పరివర్తన
5. కాన్ఫిడెన్స్
7. జీవనవేదం - 7
10. అమ్మమ్మ – 44
13. ఉనికి
14. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్
16. సుందరము – సుమధురము – వ్రేపల్లియ ఎద జల్లున
17. బాలమాలిక కథ – అడవిలో ఉగాది
18. సృజనాత్మక చిత్ర కవిత్వమే నేరెళ్ల సృజనోదయం
19. విరించినై విరచించితిని – మంజుల ఘట్టమనేని
22. శిశిరం
23. దైవేచ్చ
24. ఆత్మీయత
25. ఆల్లెం గుండు
0 వ్యాఖ్యలు:
Post a Comment