Sunday 23 March 2008

వ్యక్తిత్వం

నాకు కలిగే ఎన్నో సందేహాలను తీర్చుకోవడానికి ఇలా ఒక్కోటి అడుగుతున్నాను.


ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, స్వభావం, అతని పుట్టుకతో వస్తాయా, పెంపకం వల్లా, పెరుగుతున్నపుడు అతని చుట్టు ఉన్న పరిస్థితుల వల్లా???. అంటే సహాయ గుణం, అల్లరి, ఆత్మీయత మొదలైనవి. ఇవి నేర్చుకుంటే రావుగా ??

6 వ్యాఖ్యలు:

రవి

జ్యోతక్కా, టచ్ చేసారండీ. నాకు సమాధానం ఆలోచించే శక్తి లేదు కానీ, ఇతరుల సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాను.

Rajendra Devarapalli

నాకు తెలిసినంతవరకూ మానవుడి మూర్తి మత్వం(personality)రెండు అంశాలమీద ఆధారపడి ఉంటుంది.ఒకటి వంశపారంపర్యంగా,రెండోది పరిసరాల ప్రభావం.ఆధునిక పరీక్షలు,ప్రయోగాలు,పరిసరాల ప్రభావం మన ప్రవర్తన,వ్యక్తిత్వాల మీద అధిక ప్రభావం చూపుతుందని చెప్తున్నాయి.మీ సందేహానికి ఇది పూర్తి సమాధానం కాదు కానీ కేవలం ప్రారంభం మాత్రమే.
ఈ లింకు ద్వారా మీకు మరి కొంత సమాచారం దొరకొచ్చు--http://anthro.palomar.edu/social/soc_3.htm

Naveen Garla

సంస్కారం అనేది జన్మజన్మలకు సంబంధించినది...ఇప్పటి వైద్యులకు పరిశోధనలకు అంతు చిక్కనిది.

Purnima

పుట్టకతో వచ్చినవన్నీ పుడకలదాక తీసుకెళ్ళలేము మనం. ప్రతి రోజూ మనలో ఉన్న కొన్ని అలవాట్లను, ఆదర్శాలను కొంచెం కొంచెంగా చంపేసుకుంటూ, జీవన ప్రయాణంలోని అనుభవాలను, అనుభూతులు కొత్తగా మనలో నింపుకుంటాము. "పుట్టుకా?? జీవితమా??" అని ఒక్కటే చెప్పటం కష్టమే గాని, మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేసించడంలో జీవితం పాత్ర ఎక్కువని నా అభిప్రాయం.

anjanisri

manavudi Manasathvam Anedi Tanu
Parege vathavaranam, Paristithla midha adrapadi untundhi iika puttuka tho vachheve mana yokka rangu ropam mathrame

pruthviraj

మీరన్నాట్టు పుట్టుకతోనూ కొన్ని, పెంపకం లో కొన్నీ పరిస్తితుల్లో నేర్చిన పాఠాల వల్ల కొన్ని గుణగణాలు, స్వభావం వస్తాయి.sure. నేర్చుకుంటే కూడా వస్తాయి. for example. మనము ఎన్ని నేర్చుకుంటాలేము చెప్పండి మన మిత్రుల వద్ద, మనను impression చేసిన వారినుండి.మార్పు మానవ సహజం.మానవత్వానికి మంచిగుణాలు ఎన్నో. అందులో మీరన్నసహాయ గుణం, అల్లరి, ఆత్మీయత మొదలైనవి కూడా నేర్చుకుంటే పెరుగుతాయి. అవి అందరిలో ఉంటాయి. విషయమేమిటంటే percentage diffferent అందరిలో. అంతే. i think my answer is not much clear, but i have answer. దర్మసందేహాలకు నేను ముగ్దుడను.ఇంకా వుంటే అడగండి తెలియజెప్పప్రయత్నిస్తాను.

www.pruthviart.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008