Friday, 21 March 2008

రంగుల పండగ రంగేలి ....

వసంతోత్సవ వేళ అందరికీ శుభాకాంక్షలు...



Send this eCard !

4 వ్యాఖ్యలు:

krishna rao jallipalli

అందాల నటుడు శ్రీ శోభన్ బాబు గారు చనిపోయారని తెలిసి t.v. లో చూసి ఎంతో బాధ కలిగింది. ఇక మీరు publish చేసిన music e.card ని ఎలా enjoy చేయమంటారు?
ఇంకొక బాధకరమయిన విషయం. ఇద్దరో ముగ్గురో తప్పించి .. ప్రాచుర్యం పొందిన ఒక్క bloger కూడా ఆయన గురుంచి రెండు ముక్కలు కూడా రాయకపోవడం - రెండు నిముషాలు కూడా వెచ్చించక పోవడం. మన తెలుగు bloggers అందరు అంత తీరిక లీకుండా ఉన్నారా?? సోది కబుర్లకు, సొల్లు కబుర్లకు, ఎవరు వినని కానని books & cinimas గురించి ఎక్కడ లేని చెత్త రాయడానికి సమయం దొరుకుంది కాని ....... నాకు స్వంత blog లేకపోవడం వలన .. ఏదో నాకు తోచిన రెండు ముక్కలు రాసి చాల మంది bloggers కి నిన్నటి నుండి e.mails పంపిన్స్తూనే ఉన్నాను. ఒక్కరు కూడా ప్రచురించ లేదు. వారందరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇంతకీ మించి ఏమి చేయ గలను ? ఏమి చేస్తే ఎవరూరుకొంటారు?

krishna rao jallipalli

ఏదో బాధ తో పోస్ట్ చేశాను. అన్యదా బావించ వొద్దు. ఇక నుండి బ్లాగ్స్ ని చూడడం, చదవడం, కామెంట్స్ పోస్ట్ చేయడం మని వేద్దామని అనుకుంటున్నాను.
శలవు.

జ్యోతి

కృష్ణారావుగారు,
మీ బాధ అర్ధం చేసుకోగలను. కాని అలా రాయనందున మేము రాసేది చెత్త అయిందా? మీకు ఒక సంగతి చెపుతున్నా. శోభన్ బాబుగారు మీకు నటుడిగానే తెలుసు. కాని ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళూ వచ్చేవారు కొన్నేళ్ళ క్రింద. టీవిలో ఆయన అంత్యక్రియలు చూసి అలాటీ మంచి మనిషి కాలిపోతున్నాడే అని కళ్ళలో నీళ్ళు ఆగలేదు. బ్లాగులో రాయనంత మాత్రాన అయన మీద మాకు గౌరవం లేదని మీరు ఎలా అనుకుంటారు. నా పాలసీ ఏంటంటే.. విషాదాన్ని మనలోనే దాచుకోవాలి, సంతోషాన్ని మాత్రం అందరితో పంచుకోవాలి. అందుకే ఏమి రాయలేదు. శోభన్ బాబు గారి గురించి తెలిసినవాళ్ళు మాత్రమే సంతాప తెలుపగలరు . అలాగని ఎవ్వరిని పండుగ ఎంజాయ్ చేయొద్దని చెప్పలేము కదా.

మీకు బాధ కలిగిందని బ్లాగులు చదవను, కామెంట్లు రాయను అని అనడం భావ్యం కాదు. అది మీ ఇష్టం. చదవడం చదవకపోవడం కాని చెప్పిన కారణం మాత్రం సరియైనది కాదు.

మల్లెపూల పోస్టులో రాజేంద్ర చెప్పిన విషయం సరియైనది కాదు అన్నారే. అది అతను కళ్ళారా చూసి బాధపడ్డది. ఎప్పటికి మరువలేనిది. అది చదివి మనకు కూడ బాధ కలుగుతుంది. కాని మీరు పండుగ శుభాకాంక్షలలో శోభన్ బాబుగారి గురించి రాయలేదని తెలుగు బ్లాగర్లు సోది కబుర్లు, సొల్లు కబుర్లు, చెత్త రాస్తున్నారనడం సమంజసమా???

krishna rao jallipalli

నమస్తే,
మిమ్ములందరిని నొప్పించి నందుకు క్షన్తవ్యుడను. కాని.. వెను వెంట టపాలో 'ఏదో బాధలో రాసాను అన్యధా భావించవద్దు' అని కూడా రాసానే. చూసే ఉంటారనుకొంటున్నాను.

'శోభన్ బాబు గారి గురించి తెలిసినవాళ్ళు మాత్రమే సంతాప తెలుపగలరు ' - అర్థం కాలేదు.
అందరు రాస్తున్నారు అని కాదు - నా భావన.

నేను blogs చదవడానికి comments రాయడానికి పనికిరానేమో అని నా భావన.
అందుకే... శలవు.
నమస్కారలతో...
కృష్ణ రావు గుంటూరు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008