Sunday 20 April 2008

క్లబ్ డాన్సుల పోటీలు




గత వారంగా అనుకుంటా జెమిని టీవీలో ప్రారంభమైన హమ్మా హమ్మా అనే డాన్స్ ప్రోగ్రాం చూస్తుంటే అసహ్యంగా ఉంటుంది . సినిమాల్లోని ఐటం సాంగ్స్ ని ఇక్కడ అమ్మాయిలతో , అర్ధనగ్న నృత్యాలు చేయించడంలో ఉద్దేశ్యమేంటి అనేది నాకు అర్ధం కాలేదు. అసలు జెమిని వాళ్లు ముందే ఆరవ సీరియల్లతో చంపేస్తున్నారు. అడపా దడపా తెలుగు సీరియల్లు వేసినా అందులో చేసేది మాత్రం అరవోల్లె. ఇప్పుడు ఈ చెత్త ప్రోగ్రాములు. దానికి గున్న ఏనుగు లాంటి రాశి, వృద్ధ సుందరి అలనాటి జ్యోతిలక్ష్మి , ఇంకా ఎవరో ఇద్దరు మగాళ్ళు. వీళ్ళు జడ్జీలు. సినిమాల్లో అంటే అమ్మాయిలు పొట్ట కూటి కోసం అర్ధ నగ్న డాన్సులు చేస్తున్నారు. మరి జెమిని వాళ్ళకేం పోయే రోగం. ఇలాంటివి తయారు చేస్తున్నారు. దాని బదులు ఆ సినిమాల్లో పాటలన్నీ తెచ్చి వేయొచ్చుగా ... దానికో వేదిక, స్పాన్సర్, కథా కాకరకాయ. ఆ అమ్మాయిలను చూస్తుంటే నాకైతే డోకొస్తుంది . అంత అసహ్యంగా నృత్యాలు, బట్టలు. .. చీ. చీ. దీనికి ఊర్లలో జరిగే రికార్డింగ్ డాన్సులకు పెద్ద తేడా ఏముంది.


ఎప్పుడో ఓసారి టివి చూదామంటే ఇలాంటి చెత్త ప్రోగ్రాములు. ఇంతకంటే చిన్నపిల్లల పాటలో పోటీలు చాలా బావుంటున్నాయి. జీ తెలుగులోని స్వరనీరాజనం లో పిల్లలు పాడే పాటలు వింటుంటే వాళ్ళకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది . అంత అందమైన , మధురమైన గాన మాధుర్యం. ఈ పెద్దలకేం రోగమో..

3 వ్యాఖ్యలు:

Valluri Sudhakar

ఈ జబ్బు జీ-తెలుగు 'ఆట' ప్రోగ్రాంతో మొదలైంది. సెలిబ్రెటిస్ అంటూ సోదిలోకూడా రాని టీవితారలను వేదికెక్కించి, అసహ్యకర హవభావాలు, అర్ధనగ్ననృత్యాలు (నృత్యాలు అన్నది చాలా పెద్దమాట, గెంతులు అంటే సరిపోతుందేమో), తలతిక్క న్యాయనిర్ణేతలతొ, ముద్దమాటల మొద్దబ్బాయి వాచలాత్వంతో వీరంగం వేయ్యంచటమే ఆ ప్రోగ్రాం పరమావధి. ఇలాంటి చెత్త కార్యక్రమాల గురించి ఎంత తక్కువ చెర్చిస్తే అంతమంచిదని నా అభిప్రాయం.

krishna rao jallipalli

నమస్తీ, హమ్మా, హమ్మా, మొదటి ఎపిసోడే చూసాను. ఏంకర్ వేసుకొన్న కురచ skirt observe చేసారా... t.v. కాబట్టి బ్రతికిపోయింది.. అదేకనా stage అయుంటీ అమ్మడు అయిపోయేదే (rajahmundry లో silk smitha కి జరిగినట్టు).

Ramani Rao

అవును! నేను చూస్తున్నాను ఈ పైత్యాన్ని. వల్లురిగారు చెప్పింది నిజమే! తెలియని వాళ్ళు(అంటే ఇప్పటివరకు చూడని వాళ్ళు) ఇదేంటో చూద్దామని, చూసే అవకశాలని అదునుగా తీసుకొని , జెమిని వాళ్ళు అదేదో, తమకి పబ్లిసిటీ రేటింగ్ పెరిగిపోయిందోచ్! అని అనేసుకొని, ప్రచరం కూడా చేసేసుకొ సమర్ధులు.కాబట్టి, చెడు వినవద్దు-చెడు కనవద్దు-చెడు మాట్లాడొద్దు అని అనుకోవడం బెటర్.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008