Wednesday, April 23, 2008

నా ప్రతిరూపానికి పుట్టినరోజు శుభాకాంక్షలు ..


దీపు, నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనసారా దీవిస్తూ .. అమ్మ

ఈరోజు మా అమ్మాయి దీప్తి పుట్టినరోజు. ఈరోజు నాకు కూడా చాలా ప్రత్యేకమైనది అని చెప్పవచ్చును. ఎందుకంటే నేను అంతర్జాలానికి వచ్చిందే మా అమ్మాయి చదువుకోసం. ఇంజనీరింగు మూడవ సంవత్సరంలో ఉండగానే "మమ్మీ ! నేను CAT , XAT పరీక్షలకు చదువుతాను" అంది. ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో చదువుకుంటానంటే ఎలా వద్దనగలను.కాని నేను చెప్పింది ఒకటే.. నువ్వు సీరియస్సుగా చదువుతానంటే . ఓకె.. నువ్వు చదువుకో. మిగతా విషయాలు నేను సేకరిస్తాను అని నెట్‍లో కావలసిన సమాచారం సేకరించడం, నెట్ లో కలిసిన మిత్రులతో కాలేజీలు, ఉద్యోగం గురించి తెలుసుకోవడం నేను చేసేపని. కాని తను పట్టుదలతో చదువుకుని , ప్రతిష్టాకరమైన కాలేజీలో అదీ హైదరాబాదులో చేరింది. తోటి స్నేహితులు పార్టీలు, సినిమాలు, ఖరీదైన బట్టలు అని జల్సా చేస్తున్నా, తను మాత్రం చదువు, ఉద్యోగం మీదే దృష్టి పెట్టింది. అనుకున్నది సాధించింది. బుడిబుడి అడుగులతో ఆడుతూ పాడుతూ పెరిగిన నా చిన్నారి , అతి చిన్న వయసులొ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో భాధ్యాయుతమైన ప్రాజెక్ట్ ఇంజనీరుగా ఉంది అంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురి విషయంలో నేను సాధించిన విజయం ముందు బ్లాగ్లోకంలో నాకు వచ్చే విజయాలు , మెప్పులు చాలా చిన్నవి.


ఇక నా కోరిక ఒకటే. తన ఆశలు, ఆశయాలు, అభిరుచులు, ఉద్యోగ బాధ్యతలు అర్ధం చేసుకుని, ప్రేమించే జీవిత భాగస్వామి రావాలని . (ఇందులో ఏదైనా తేడా జరిగితే, మా అమ్మాయిని కష్టపెడితే నేను మాత్రం ఊరుకోను.అది మా అమ్మాయికి కూడా తెలుసు ).


మా అమ్మాయికి మీ అందరి ఆశీస్సులు కోరుతూ....

26 వ్యాఖ్యలు:

శ్రీనివాస

జ్యోతి గారూ, మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు

దైవానిక

మీ అమ్మాయికి నా తరుపున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపగలరు.
సక్సెస్ స్టోరి ఇన్స్పిరేషనల్ గా ఉంది.

కందర్ప కృష్ణ మోహన్ -

చాలా బావుంది.. నా తరపునుంచి కూడాఅమ్మాయిగోరికి పుట్టినరోజు శుభాకాంక్షలు... మంచికెప్పుడూ మంచే జరుగుతుంది - డౌట్లేదు. సరేనా.....

MAteeq

జ్యొతి అక్క్ కుతురు జన్మదిన హర్ధిక్ శుభాకాంక్షలు.....
హత్స్ ఒహ్ తొ ఉ జ్యొతి అక్క, మీరు చెసిన వొర్క్ ఒక బెన్చ్ మర్క్ గా మీగులతాది...
డీప్తి., నువ్వు చలా సక్సెస్ సదెన్చాలి ऽ ఇన్స్పిరేషనల్ గా ఉన్దదాలి అన్ధరిక్కి. For A Sweet Niece Wish U A Very Very Happy Birthday and be proud of ur mother and her acheivements....... Ur's Uncle

sujatha

జ్యోతి గారు,
మీ అమ్మాయి చాలా అందంగా ఉంది.బాధ్యత తెలిసిన అమ్మాయని తెలిసి ఆనందంగా ఉంది. దీప్తి కి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు

జాగృతి

మాకు అత్యంత ఆప్తురాలైన శ్రీమతి జ్యోతి గారి కుమార్తె దీప్తి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతొ కుమారి దీప్తి జీవితం నిత్యం ఆనందంగా, ఆరోగ్యం గా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనసారా కోరుకుంటూ . . . . . . .
చిలకపాటి శివరామ ప్రసాద్

sujata

జ్యోతి గారు.. first of all.. మీకు శుభాకాంక్షలు. మీరు ఎందరి చేతనో తెలుగు బ్లాగులు (మంచి క్వాలిటీ వున్న బ్లాగులు..) ఓపెన్ చేయించి, స్ఫూర్తిదాయకంగా రక రకాల కంటెంట్, నిష్పక్షపాతంగా రాసి, ఎందరో నా లాంటి అభిమానులని కూడగట్టుకున్నందుకు!

మీ అమ్మాయి కి కూడా జన్మదిన శుభాకాంక్షలు.. అసలు మీ లాంటి మంచి అమ్మ ఉన్నందుకు తను కూడా లక్కీ నే మరి.

కొత్త పాళీ

దీప్తికి జన్మదిన శూభాకాంక్షలు.

నల్లమోతు శ్రీధర్

దీప్తి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇదే పట్టుదలతో జీవితంలో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ, celebrate every moment in your life with joy and success.

kasyap

దీప్తి కి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు ..

రమణి

దీప్తి కి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు ..

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

చిరంజీవి దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Anonymous

దీప్తి మరిన్ని పుట్టిన రోజులు ఇలాగే ఆనందంగా జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

-- విహారి

శ్రీ

జ్యోతి గారు, మీ అమ్మాయి దీప్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేయండి. మీ పట్టుదల దీప్తికి కుడా వచ్చినట్లుంది.

ప్రవీణ్ గార్లపాటి

జ్యోతి గారు,

మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఇలానే ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అశిస్తున్నాను.

teresa

many happy returns of the day to deepti!

జ్యోతి

THANKS A LOT FOR ALL OF YOU. I WAS REALLY TOUCHED BY UR WISHES..

deepthi valaboju

venkat

jyothi garu nenu leppude chusanu belatedga na tarapuna mi ammayi deepti gariki happy birthday wishing her more success in her life

ramya

దీప్తికి జన్మదిన శూభాకాంక్షలు.
తప్పక ఆమె కోరుకున్నవరుడు వస్తాడు.

krishna rao jallipalli

దీప్తికి జన్మదిన శూభాకాంక్షలు.
తప్పక ఆమె కోరుకున్నవరుడు వస్తాడు
sambhandaalu choodamantaaraa..
happy birthday to ms.deepti

tara

antha bagundi kaani bottu pettukoledu ade baaleduuuuuuuu

Gujarat Postal Trekkers

జ్యోతక్కా!
మీ ప్రతిరూపానికి, మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చిన్న వయస్సులోనే ఆమె సక్సస్ అందుకోవటంలో మీ పాత్ర ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది.

నువ్వుశెట్టి బ్రదర్స్

deepateja

దీప్తి, దీపూ (రెండూ మా అమ్మాయి పేర్లే) అందుకే నాకు చాలా ఇష్టమైనవి. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో పుట్టినరోజులు ఎంతో, ఎంతెంతో సంతోషంగా జరుపుకోవాలనీ, జీవితాంతం నవ్వుతూనే వుండాలనీ ఆశీర్వదిస్తున్నాము.
psmlakshmi

మధుర వాణి

దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టిన రోజు మరిన్ని విజయాలనీ, సంతోషాలనీ తన జీవితంలోకి తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను.

Hemalatha

దీప్తి మరెన్నో పుట్టిన రోజులని ఇలాగే ఆనందంగా జరుపుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. శుభాకాంక్షలు తెలపండి నా తరపున.
- hemalatha putla

rama2111

god bless her have a bright future jyothi

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008