పుణుకులు
1.
ఒక ఆసుపత్రిలోని రిసిప్షన్ లో ఫోన్ వచ్చింది .
"హలో ! ఇది గామా హాస్పిటలేనా అండి?"
"అవునండి. మీకు ఎవరు కావాలి?"
" మరేనండి .103 నంబరు గదిలో ఉన్నా పేషెంటు శ్రీమతి పద్మగారి పరిస్టితి ఎలా ఉంది కాస్త చెప్పగలరా?"
" ఒ పద్మగారా! ఆవిడ బిపి నార్మల్ గా ఉంది. అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. వీలైతే రేపు ఆవిడని డిశ్చార్జి చేయవచ్చు. ఇంతకీ మీరేవరండి.ఆ పేషెంటు కు ఏమవుతారు ?"
" ఆ పేషెంటు ను నేనే. వారమైంది ఇక్కడికొచ్చి. నాకు ఎప్పుడు నయమవుతుందో ఎవ్వరూ చెప్పడంలేదు. అందుకే ఇలా కాల్ చేశా. థాంక్స్ అండి."
2.
ఒక రోజు తీవ్రంగా భార్యతో పోట్లాడిన భర్త ఇలా అన్నాడు.
"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా లాభం కలిగింది ".
"అవునా ! అదెలా?"
"నేను చేసిన పాపాలన్నింటికి ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తున్నాను కదా నిన్ను పెళ్లి చేస్కుని.ఇంకేం కావాలి ?"
3.
అందరికీ ఒకటి,రెండు, మూడు బాత్ రూములు ఉంటాయి . కాని నాకు మాత్రం వంద బాత్ రూములు ఉన్నాయి. అదేంటి??
చెప్పుకోండి చూద్దాం?
4 వ్యాఖ్యలు:
chala bavunnayandi me jokes
వందనాలు
వంద నా లూ
అబ్బబ్బా! నవ్వలేక దవడలు నొప్పెడుతున్నాయండీ బాబూ!
అవునూ! మరీ.. పొడుపు కథలని ఎక్కడ విప్పుతున్నారూ..
ఏంటో ఎంత ఆలోచించినా బుర్రకి తట్టటం లేదు. ఇన్నాళ్ళూ బ్లాగరిని అవక ఎంత అంత ఆనందం కోల్పోయానో అనిపిస్తోంది. ఇంక నుంచీ రోజూ చూస్తానుస్మండీ..
భానుమతి.
భానుమతిగారు,
నా బ్లాగుకు స్వాగతం. నా బ్లాగు చదివితే మీకు అర్ధమవుతుంది అసలు బ్లాగును ఎలా ఉపయోగించుకోవచ్చో. మీరు కూడా అలాగే రాసేయండి మరి.
Post a Comment