Wednesday, 30 April 2008

పుణుకులు

1.

ఒక రోజు ఒక తెలుగువాడు, జేమ్స్ బాండ్ కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరూ అమెరికావెళుతున్నారు.

తెలుగువాడు : "మీ పేరు ఏంటి?"

జేమ్స్ బాండ్: " బాండ్. జేమ్స్ బాండ్."

తెలుగువాడు: "ఒహో ! బాగుంది."

జేమ్స్ బాండ్: "మరి మీ పేరు ఏంటి?"

తెలుగువాడు: "నా పేరు సాయి. వెంకట సాయి ... శివ వెంకట సాయి... లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి...శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి.... రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి.... సీరారామాంజనేయుల రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి... బొమ్మరాజు సీతారామంజనేయుల రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి..."

జేమ్స్ బాండ్ ఎప్పుడో మూర్చపోయాడు.

2.

ఒక సెలవు రోజు లింగం మావా ఊరికే ఏదో ఒక సందేహం అడుగుతూ అందరిని విసిగిస్తున్నాడు. అప్పుడతడి భార్య పిలిచి గదిలో ఒక వృత్తం గీసి అతడిని అందులో నిలబెట్టి ఒక పని చేయమంది . పని ఎప్పటికి పూర్తి కాదు. ఏంటా పని?

వృత్తం యొక్క దిక్కులు లెక్కపెట్టమంది.

3.

ఒక వ్యక్తి హైదరాబాదులో లక్డీకాపూల్ లో బస్సెక్కాడు. కండక్టర్ వచ్చి ఎక్కడికెల్లాలి అంటే ఎపుడు అమ్మాయి రాని నగరం అని చెప్తాడు. అదేక్కడుంది. మన బ్లాగర్స్ కొందరు ఆ చుట్టుపక్కలే ఉంటారు. నగరం దగ్గరే ఇంకో నగరం ఎప్పుడు మగవాళ్ళకు చాలా మర్యాద చేస్తుందంట. ఎంటవి ???

3 వ్యాఖ్యలు:

ఓ బ్రమ్మీ

జ్యోతిగారు,

మీ చిక్కు ముడి నేనెందులకు విప్పాలి కానీ.. చదివే వారికోసం కొన్ని సులువుగా ఉంటుందని కొన్ని క్లూలు ఇస్తా.. ఏమంటారు.

మెదటిది: eppudu gal రాని నగరం
రెండవది: అవును సారు నగరం

ఎలా ఉందంటారు నా క్లూలు ..

చూద్దాం మన చదువరులు పట్టుకుంటారో లేదో.. అంతవరకూ .. వేచి చూడడమే

సిరిసిరిమువ్వ

వెంగళరావు నగర్
S.R నగర్

Unknown

ఇంగ్లిష్ అక్షరాలు ఉచ్చరించే విధం: ఎ,ఇ,ఎఫ్,ఎచ్,ఎల్,ఎం,ఎన్,ఎస్,ఎక్స్.
తెలుగు వారు ఇంగ్లిష్ అక్షరాలు ఉచ్చరించే విధం: యె,యి,యెఫ్,హెచ్,యెల్,యెం,యెన్,యెస్,యెక్స్.

"ఎస్స్ ఆర్" అనడానికి "యెస్ సర్" కి చాలా తేడా ఉంది జ్యోతి గారూ.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008