Thursday 1 May 2008

ఎవరు వీరు?




ఈ మధ్య టివిలో వస్తున్న కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి నాకు కొన్ని సందేహాలు.

ఎప్పుడూ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని కాకుండా అప్పుడప్పుడు జీవితం, భక్తి, దెవుడు లాంటివి ఆలోచించాలి.మంచిదే. ఇలాంటివాటికి పుస్తకాలు చదవాలి. ఎదైనా గురువు చెప్పిన బోధలు వినాలి. ఒకె. కాని ఈ భక్తి బోధనలు చేసే గురువులు ఎలా ఉండాలి?

అమ్మాభగవాన్ అనబడే వారు ఇద్దరూ పాతికవేలకు తక్కువ కాని బట్టలు , అమ్మ ఏమో లక్షకు తక్కువ కాని నగలు, లిప్ స్టిక్కు, అన్నీ ఇంపోర్టెడ్ చేసిన పూలతో అలంకరించిన వేదికపై కూర్చుని మందహాసాలు చేస్తుంటారు.ఇవన్నీ అవసరమా. వీటి ఖర్చంతా ఎవరు పెడుతున్నారు. భక్తులే కదా. నేను ఈ ప్రోగ్రాములు చూసింది రెండు సార్లే. ఒక అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది.మేనేజిమెంట్ గురు అనిపించింది. భక్తులందరూ మంత్రముగ్ధులై వింటున్నారు. అసలు వీరందరు ఒకలాంటి తన్మయత్వంలో లేదా హిప్నొటైస్ అయినట్టు అనిపించింది. మరీ అంత పిచ్చా. పైగా 200 కోట్లు పెట్టి అన్ని దిక్కులా ఒకే విధంగా కనిపించేలా గుడికట్టారు. ఆ డబ్బంతా భక్తులదే కదా.

ఒకసారి బ్రహ్మకుమారీల ప్రోగ్రామ్ చూసా. ఒక బిజినెస్ ఎక్జిక్యూటివ్ చెప్పినట్టుగా పక్కనే లాప్‌టాప్ ఉంది. అది ఎందుకు. మధ్య మధ్య పాయింట్స్ చూసుకోవడానికా. అసలు ఎవరు వీరు.ఇలా మనకు బోధలు చేయడం వల్ల వీళ్ళకు వచ్చే లాభమేంటి.. డబ్బులే కదా.

కర్నూలు బాల సాయిబాబా మీద ఎన్నో ఆరోపణలు. ఒకప్పటి గుమస్తా ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన బాబా.

మనదగ్గర డబ్బులు పీక్కుని వాళ్ళు జల్సా చేస్తు మనకు ధర్మబోధలు చేయడమేంటి.ఇందువల్ల నష్టం మనకే కదా. అసలు ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళి అంత భక్తిగా , తన్మయత్వంతో వింటుంటారు, ఎంతో ఖర్చు పెడుతుంటారు ఆ జనాలు తమ చుట్టు పక్కల ఎవరికైనా సాయం చేస్తారా? ఈ బాబాలకు , స్వామీజీలకు ఇచ్చే బదులు ఒక పేద విద్యార్థిని చదివించొచ్చుగా? లేదా గుండె జబ్బులతో ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు చేయూత ఇవ్వొచ్చుగా ?.

మానవ సేవే మాధవ సేవ అని తెలీదా ఎవ్వరికీ?

23 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli

చాలా బాగా విపులంగా రాసారు జ్యోతిగారు.మీరు అడిగినవన్నీ ఎంతో మందిని కలవరపెడుతున్న ప్రశ్నలే.మీరు చెప్పిన రెండు వందలకోట్ల రూపాయల ఆశ్రమంలో మొన్న పత్రికల వార్తల ప్రకారం అయిదుగురు,ఇంకొకాయన అనుమానించిన దాని ప్రకారం ముప్ఫయ్ మంది చనిపోతే ఆ కేసు అతీగతీ ఏమయ్యిందో ఎవరికీ తెలియదు.ప్రపంచములో ప్రతి విషయానికీ స్పందించే మన బ్లాగరులకు కూడా పనికిరానిదయ్యింది. మీకు నాఅభినందనలు

Raghuram Murthy

asalu oka manishiki enni chitra vichitramain badhalu, tensions vuntaayo meeku telusaaa? oka common man ki entha knowledge vuntundo meeku telusaaa? alaage oka common man yokka pshychology meeku telusaaa? vaariki emi kaavaalo meeku telusaaa? amma bhagavan la nu darshinchukune vaaru entha anandam pondutunnaaro meeku telusaaa? aa anandam vaariki inkekkadainaaa dorukutundani meeku guaranteee ivvagalaraaa? baaga chaduvukunna meeru, time pass kosam haayigaa internet lo viharinche mee laanti vaallaku poor people gurinchi chadavatam, choodatam, 5 mins badha padatam maatrame telusu. Kaani aa beedarikam lo maggevaaru elaa santosha padaali? atuvanti vaari kosame ivanni. teenage/youth people cinemaalu choosukuntu aa hero llo tamani choosukuntu oka laanti bhranthi lo vundi anandam gaa vuntaaru. Konchem age ayina vaallu ituvanti vishayaallo tama anandaanni vetukkuntu vuntaaru. Okkati maatram nijam. The world is like this becuase it cannot be better than this, given the situations and psycology/knowledge of the people.

Valluri Sudhakar

ఈ బాబాలు, అమ్మలు, స్వాములు, గురువులందరు అమాయక ప్రజనికాన్ని మాస్ హిస్టిరియకి గురిచేసి తమపబ్బం గడుపుకోనేవారే.

Rajendra Devarapalli

రఘురామమూర్తి గారూ,జ్యోతి గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ మీరు సమాధానాలు చెప్పలేదు.అలాగే మీరు మరికొన్ని ప్రశ్నలు లేవనెత్తి ఊరుకున్నారు.ముందు ఆ సందేహనివృత్తి చెయ్యండి,మిగిలినవి తీరిగ్గా,తాపీగా మాట్లాదుకుందాం ఇక్కడే.

chandramouli

ఇది మరీ దారుణం.... ఏంటీ..బాబాలు చేసేది అనుకుంటున్నారా??
కాదు... పిచ్చి భక్తులుది....
ఈ కాలంలో మోసపోయాడు అంటే..తప్పు మోసం చేసినోడిది ఎంత మాత్రము కాదు ..మోసపోయినోడిదే..(భలే దొంగలు సినిమా సౌజన్యంతో మాత్రంకాదులేండి).... ఎందుకంటారా?? ఇది సమాచార విప్లవం శంఖారావం చేస్తున్నా యుగం..... దొంగ బాబాలు కోక్కొల్లలు... అని గత ఆరు ఏడు ఏళ్ళనుంచి... జనాలు టివిలు పత్రికలు వాపోతుంటే..ఆ మాత్రం ..అర్దం చేసుకోలేని పిచ్చి జనం గురించి మనం భాదపడటం సుద్ద దండగ...ఇకపోతే...అక్కడకొచ్చేది...చదువుకోని వారలుకాదు... తమ తమ విజ్ఞానంతో దిగ దిగ్గతాలు తిరిగి వచ్చినవారే..... ఏదో... విధంగా...... కదలని మెదలని దేవుళ్ళకంటే..కొద్దిగ వీభుదితొ బాటు కటింగ్ ఇచ్చే కలియుగ దేవుళ్ళు బెటర్ అని తమ సూపర్ కంప్యూటర్ మెదడుతో ఆలోచించి..చేస్తున్న..మానసిక సన్నాసులు...పెంచి పోషిస్తున్నారు..అయినా...పోయి డబ్బులు ఇచ్చి వస్తున్నారు వారు...వీళ్ళు పుచ్చుకుంటున్నారు...వారు గురించి మనం భాదపడటం సుద్ద దండగ....

ఇంకా ఒక అడుగు ముందు వేసి... భ్లాగ్ బాబాగా అవతారం ఎత్తటానికి నేను రెడి...ఎదో నాకు తెలిసిన పురాణకధలు .... కంప్యూటర్ విజ్ఞానం తో మేనేజ్ చేసేసి...మీరు అన్నట్టూ...ఆ సహాయాలు చేస్తాను....

ఇంకా గట్టీగా మాట్లాడితో... పురాణాల భాగ్ నుంచి..పురాణ టపాలు చదువుకుని, నల్లమోతు సాంకేతికాలు సహాయం, మీలాంటి వారి తర్కం,చేయూత ఇస్తే...పెద్ద సమాచార సాంకేతిక బాబాగా...ఎదిగిపోతాదాం... మన బ్లాగ్ ప్రంపంచఖ్యాతిని...అజరామరం చేస్తాను ...ఏమంటారు..... ?? ( ఈ వ్యాఖ్య చదివినవారలు తిట్టుకోకండి... సరదాగానే తీసుకోండి...)

chandramouli

మూర్తిగారు....
మీరు పెద్దవారయినప్పటికి..సాహసం చేసి ఇలారాస్తునాను..
ఈ మద్య పేదవాళ్ళు...టయోటా,సూమోలాంటీ కార్లు వేసుకుని మరీ వస్తున్నారా ఏంటి...మీరు చెప్పినట్లు...అంతో కొంత మంచి జరుగుతుంది... పుట్టపర్తిగారి వల్ల అని చెప్పొచ్చు.. అనంతపురంవారికి నీళ్ళుదగ్గరనుంచి..దేశం మొత్తానికి (అవసరమయినవారికి) ... గుండే జబ్బు ఆపరేషన్లని ...ఎదొ తనకు వచ్చిన దాంట్లో...ఎలాగొలా కానిస్తున్నారు...

మిగిలన బాబాలు ఎంతమందికి కుచ్చు టోపి వాళ్ళఖర్చుతోనే కొనివ్వటంలేదు...సో మీరు చెప్పిన ప్రకారం అక్కడ ...ఆనందం చీటింగ్ రూపంలో అమ్ముతున్నారన్నామాట...బాగు బాగు... నేను చెప్పేది అదే..కానీ(నేనుచూసిన) జనాలు అలోచనలు అలాలేవు...సదరు కలియుగ కల్కులు దేవుని దూతలని... వారు తమకోసంమే ఈ భూమికి వచ్చారని..వారుఇచ్చే..వీభుది..ఇకనుంచి..అపొలో కూడా వాడచ్చు అన్న రేంజిలో ఉంటుంది...నేను చూడంగ.. సదరు..భక్తుల మాతా/పిత దగ్గరకు వెళ్ళేవారెవ్వరూ..పేదవాళ్ళు కనిపించలేదు.... పేదవాళ్ళకు ఒక లైన్ ఉంటుంది...ఆదారిలో.సదరు బాబా(లేడి/జంట్) నడచి పోతుంటే...కాళ్ళమీద పట్టకుని..నెత్తిమీద కాస్త నాలుకమీదకాస్తా చల్లుకుని...మమ అనుకుంటారు... డబ్బు ఇచ్చేవాళ్ళకు స్పెషల్ పూజలు, స్పెషల్ దర్శనాలు వగయిరా వగయిరా...అంతకు మించి ఎక్కడన్నా చేస్తుంటే...చెబుతాను..నేణు కూడా వచ్చి చూస్తాను....(ఇప్పటివరకు నేను పుట్టపర్తి మెదలు అందరూ ఫేమస్,కలియుగ దైవపురుష/పురుషిణి లను కలిసి వచ్చను....)

ఇక పోతే..యువత గురించి...... మీరు ఇంతవరకు సినిమాలచూసి చొంగ కార్చుకునే...యువతను మాత్రమే చూసారు కనుక మీరు అలా అనుకోవటం తప్పులేదు..మీకాలం లో ఉండే యువతకు ఇప్పటీవారకు చాలా తేడా ఉంది అనిమాత్రమ్ చెప్పగలను...

G K S Raja

Jyothi garitho nenu ekibhavistunnaanu. Raghuram murty garu! meeru adigina prasnalanni meeku meere vesukondi. maarutunna samajam gurinchi telusukoni maaraalsina daani gurinchi aalochinchaali.

జ్యోతి

ఈ టపా రాయకముందు తాడేపల్లిగారిని నా సందేహం గురించి అడిగితే ఆయనిచ్చిన సమాధానం...
జ్యోతిగారూ

కల్కి అనే పేరులోనే తెలియడంలే ? అది పచ్చి మోసమని ! ఎప్పుడో కలియుగాంతంలో కల్కి వస్తాడని చెప్పారు గానీ ఇలా వస్తాడని చెప్పలే. కల్కి అవతారం రామావతారంలాంటిది. దుష్టశిక్షణ కోసం వస్తాడు. కల్కి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆయన తండ్రి పేరు విష్ణుయశుడు అని చెప్పబడింది. ఆయన హిమాలయాల దగ్గర శంబల అనే గ్రామంలో జన్మిస్తాడు. కర్ణాటకలో కాదు. ఆయన అవతారకార్యం ఇలా ఊరికే జనాన్ని కూర్చోబెట్టి నాలుగు చొల్లు కబుర్లు చెప్పి డబ్బు కొట్టెయ్యడం కాదు. ప్చ్ ! ఏంటో పాపం ! పిచ్చిజనం !

బ్రహ్మకుమారీలంటారా ? అది హిందూమతంలో నవీన ఇస్లామ్ లాంటిది. వాళ్ళొక రకం మూర్ఖులు. పిల్లలు పుట్టాక భార్యాభర్తలు అన్నాచెల్లెళ్ళలా ఉండాలట. అందుకని భార్యచేత భర్తలకు రాఖీ కట్టిస్తారు. ఈ కలియుగంలో ఇలాంటి ఆదర్శాల్ని నమ్ముకుంటే సంసారాలు భళ్ళున కూలిపోతాయని వేఱే చెప్పనక్కరలేదు. (నా బొంద, ఒకసారి సంసారం చేశాక చెల్లెల్లా భావించమంటే ఎవరికి సాధ్యం ? చెప్పండి. అసలు చెల్లెలనే పదానికే అర్థం మారిపోతుందేమోనని భయంగా ఉంది) ఇలాంటివాళ్ళంతా బయల్దేరి నాస్తికుల ద్రుష్టిలో ఆస్తికుల్ని జోకర్లుగా మార్చేశారు.
తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

జ్యోతి

మూర్తిగారు,

ఎంత చెట్టుకు అంత గాలి. ధనికులైనా, పేదవారైనా అందరికీ కష్టాలుంటాయి. నేను చెప్పాలనుకున్నది అది కాదు. జనం ఆ బాబాలకు ఎందుకు లక్షల సొమ్ము అర్పిస్తున్నారు? అది ఎవరికి ఉపయోగపడుతుంది? పేదవారికి కావలసింది డబ్బు. ఈ స్వామిజీలకు ఇచ్చే బదులు అందులో సగమైన పేదవారికి ఇస్తే మంచిది అని. చదువుకోసమైనా,ఆరోగ్యం కోసమైనా డబ్బులు అవసరమైన వాళ్ళు లక్షలమంది ఉన్నారు. ఐనా ఈ బాబాల దగ్గరకు వెళ్ళేది అందరూ పేదవాళ్ళేనా. అక్కడ పేదవాళ్ళకు, ధనికులకు ఒకేవిధమైన రెస్పాన్స్ ఉంటుందా. లేదే. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ముందు సీటు. ఇది అన్ని గుళ్ళలోను జరుగుతుంది. అలా అని నేను నాస్తికురాలిని కాను. అన్ని దేవుళ్ళను నమ్ముతాను, పూజలు , పండుగలు చేస్తాను. కాని ఇలాంటి అవినీతి, అన్యాయం నచ్చదు. ఈ ప్రోగ్రాములో విద్యార్థుల కోసం( పరీక్షల టైం కదా) బాగా చదూకోవడానికి, ఏకాగ్రత పెరగడానికి ఏదో దీక్ష, దానికో సిడి కొనుక్కోవాలి. దాని ధర ఇరవై రూపాయలు. అక్కడికొచ్చిన వేలాది మంది తల్లి తండ్రులు ఆ మాటల మత్తులో పడి కొనుక్కుంటే మొత్తం వచ్చిన సొమ్ము ఎంత? లక్షలు !! ఇందులో లాభం ఎవరికి ఆలోచించార? మన పిల్లలను మనమే దగ్గరుండి ఒక క్రమశిక్షణతో చదివించాలి (ట్యూషన్ టీచర్ల మీద వదిలేయకుండా). ఎదో దీక్ష పట్టించి సిడి చూపిస్తే చాలా. పాసైపోతారా.

నేను టైమ్ పాస్ కోసం ఇంటర్‌నెట్ కొచ్చానని ఎలా అనగలరు? నేను ఇల్లాలిగా, తల్లిగా నా బాధ్యతలు తీర్చుకున్నాకే తీరిక సమయాలలో టీవీ, సొల్లు కబుర్లు పెట్టుకోకుండా ఇలా సద్వినియోగపరుచుకుంటున్నా. అలా అని నేను కోటీశ్వరురాలిని కాదు. నాకూ ఉన్నాయి కష్టాలు. అలా అని అవి మర్చిపోవడానికి బాబాల దగ్గరకు వెళ్ళనే. అవి ఎలా తీరతాయని ఆలొచించి ఆ మార్గంలో ప్రయత్నిస్తాను.

ఒక నిజమైన దేవత గురించి చెప్తాను. ఒక నెల క్రితం అనుకుంటా టివి న్యూస్ లో చూసా. ఒక ఊరిలొ ఒక చిన్న గుడి ఉంది . ఆ గుడికి చుట్టుపక్కలనుండి చాల మంది చాల అనమ్మకంతో వస్తారు. కాని వారికి అక్కడ భోజన సదుపాయాలు లేవు. పిల్లలతో వచ్చేవాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చూసిన ఒక వృద్దురాలు(సుమరు 65 ఏళ్ళు ఉంటుంది) బాధపడి ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తుకుని బియ్యం వగైరా తెచ్చి వండి ఆ భక్తులకు పెట్టేది. ఆమెకు తోడుగా ఇంకో మహిళ చేరి ఆ ముసలావిడ తెచ్చిన సరుకులతో వంట చేసి వడ్డించేది. ఆ ముసలావిడకు ఏమవసరం బిచ్చమెత్తుకుని మరీ ఇతరులకు అన్నం పెట్టడం ?

Raghuram Murthy
This comment has been removed by the author.
Raghuram Murthy

నేను మీ మీద కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసినందుకు నా క్షమాపణలు. ఏదో నిద్ర మత్తులో కొట్టేసాను. కాని నా వుద్దేశ్యం వేరు. ఈ బాబా ల దగ్గరికి వెళ్ళే జనాలకి అక్కడ ఎమీ దొరకక పోతే వారు అక్కడికి ఎందుకు వెళతారని నా వుద్దేశ్యం. ఆ బాబాలు ఎలాంటి వారైనా కానీ, వారికి ఎదో ఒక మనశ్శాంతి దొరకటం వల్ల మాత్రమే వెళ్తున్నారని నా నమ్మకం. ఇంక TATA Sumo ల్లో వచ్చే వారంటారా, వారికి ఎవో కొన్ని సెంటిమెంట్స్ వుండొచ్చు. వారి కుటుంబాలు ఆర్థికంగా మెరుగు పడి వుండొచ్చు, లేదా కుటుంబ కలహాలు తొలగి పోయి వుండొచ్చు. ఇవన్నీ నేను ఆ బాబా ల వల్ల కలిగాయని నెను చెప్పటం లేదు. It could be just co-incidence. Or they might have got more energy and more confidencce in themselves after a blind belief on those so-called babas. ఆ నమ్మకం తో రావొచ్చు. మీకు మీ దేవుడు ఎలాగో, వారికి ఆ బాబా అలా కావొచ్చు కదా? మీ దేవుడి నామస్మరణ చేస్తే మీలో ఎంత మానసిక ఉత్తేజం కలుగుతుందో, ఆ బాబా లని కొలిచే వారికి కూడా అంతే. మీ దేవుడు వున్నాడని ప్రూఫ్ లేదు. అలాగే ఆ బాబా దేవుడని ప్రూ లేదు. ఇంకొక ఉదాహరణ చెబుతాను. కొంత మంది సినిమా పిచ్చోలు వుంటారు. వారికి వారి హీరో నే దేవుడు. ఆ హీరో సినిమా చూసినా, ఆ హీరో పాట విన్నా, చివరికి ఆ హీరో వాల్ పోస్టర్ చూసినా వాల్లలో ఎక్కడ లేని ఆనందం/శక్తి వస్తుంది. అంత మాత్రాన ఆ హీరో నిజ జీవితంలో హీరో కాక పోవచ్చు. సినిమా లో చేసే అంశాలన్నీ నిజ జీవితం లో చేయక పోవచ్చు. (100 మందిని ఒక్క చేత్తో కొట్టటం). కానీ అతను తనని పిచ్చి గా అభిమానించే జనాలకి ఎంతో శక్తి ని ఇస్తున్నాడన్నది మాత్రం నిజం.

నా బాధ మీకు అర్థమైందనుకుంటాను.
Once again sorry for my earlier comments on you

గీతాచార్య

Jyothi akka,your article about Baba's is wonderful and thoughtprovoking. Everybody has to think in that line.

Shall I say one thing, "If we are good enough to use our brain to daily needs, we can do anything"

Thank you.

Sathyameva Jayate.

krishna rao jallipalli

మొన్ననే NTV లో ఒ PROGRAMME చూసాను కల్కి భగవాన్ ఆశ్రమం లో తోక్కిడి వలన చనిపోయిన నేఫద్యం లో. ఆ PROGRAMME చూడని వారి కోసం కొన్ని వింతలు విశేషాలు:
-వీడి అసలు పేరు విజయ కుమార్. CHITTOOR DISTRICT కి సంబందిన వాడు. LIC ఏజెంట్. అనేక దుర్వ్యసనాలు కల వ్యక్తీ. వాడి పెళ్ళం పేరు పద్మావతి. ఇద్దరు 20 YEARS BACK చెన్నై చేక్కేసారు. తరువాత్తరువాత ... కల్కి అవతారం ఎత్తాడు. వేడిని INDIANS PERSONAL గా కలువాలంటే RS.10,000 & FOREIGNERS కలువాలంటీ RS.25,000 FEE. FOREIGNERS కోసం FIVESTAR FACILITIES వీడి ఆశ్రమం లో ఉన్నాయి. ఈ సన్నాసి వెధవ తానె దేవుడని చెప్పుకొంటాడు. అలాగా ఐతే తన ఆశ్రమం లో చనిపోయిన వారిని ఎందుకని బతికించ లేక పోయాడు అనేది NTV వారి QUESTION.
IKA KURNOOL BABA.. JYOTHI గారు చెప్పినట్లుగా గుమస్తా కాదు. సినిమా హల్ల్స్ దగ్గిర BLOCK TICKETS అమ్ముకునే వాడు.
ఇక పెనుగొండ బాబా మీద కూడా చాల చాల ఆరోపణలు ఉన్నాయి. వీడు ఈమధ్యనే పెళ్లి కూడా చేసుకున్నాడు.
ఇక సత్య సాయి బాబా - ముసిలాడు అయిపోయాడు. త్వరలోనే చనిపోవడం ఖాయం. కామెంట్స్ దండుగ.

సుజాత వేల్పూరి

క్రిష్ణారావు గారు,
గుంటూరు ఘాటు చూపించారు పొండి! కల్కి భగవాన్ గురించి మీరు రాసిన విషయాలు నేనూ చదివాను. కానీ వీళ్ళు ఏ మత్తుతో ఇంత మందిని పడేయగలుగుతున్నారంటారు? ఆ అమ్మ భగవాన్ పట్టు చీర కనీసం 50 వేలన్నా ఉంటుంది. ఆధ్యాత్మిక బోధనలు చేసే దేవతా స్వరూపానికి అంత అలంకరణ అవసరమంటారా? ఒంటిమీద నగలు లేనిదే నోటి వెంట బోధనలు పలకవా? ఇవాళ ఆ పెనుకొండ కాళేశ్వర బాబాకి డాక్టరేట్!

అసలు కల్కి అంటే ఎవరో ఆయన అవతారమేమిటొ, కర్తవ్యమేమిటొ తెలీయకుండానే వీడు కల్కి అవతారమెత్తాడు. తొక్కిసలాటలో మనుషులు చచ్చిపోతే వీడి మహిమలు ఏం చేస్తున్నట్టు? దీనంతటికీ కారణం మనుషుల్లో పెరుగుతున్న పాపభీతే కారణమా?

ఇక బ్రహ్మ కుమారీల సిద్ధాంతాలే మతి స్థిమితం లేకుండా ఉన్నాయి. శివరాత్రి రోజు మహాశివుని దివ్యదర్శనం అని భజనలు పెడతారు. సమదర్శిని అనే ఆమె అనర్గళంగా వీటి గురించి మాట్లాడుతుంది. ఏమిటీ పిచ్చి!

చూడబోతే దుష్ట శిక్షణ కోసం కల్కి రావలసిన సమయం వచ్చేసిందేమో!

డబ్బిస్తేనే దర్శనం ఇచ్చే వాడు దేవుడని జనం ఎలా నమ్ముతున్నారు?

Dr. Ram$

after 2 more years U people r going to see one more baba.. thats me one n only " RAM$ BABA".. yes..
It seems this business z so good..

అందుకే ఈ రంగం లో ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు.. రోజు రోజు కి కొత్త కొత్త బాబా లు, స్వాములు వస్తున్నారు.. ఓ డబ్బులే డబ్బులు.. ఓ భక్తి కి భక్తి , రక్తి కి రక్తి, ముక్తి కి ముక్తి అంటే యిదేరా ఓ పిచ్హి మానవా..!! నాలుగు పిచ్హి మాటలు మాట్లాడి.. ప్రత్యేకమైన గెట అప్ తో వస్తె సరి.. ఏదో నా సాటి తెలుగు బ్లాగర్ల మిత్రులు గా మీకో డిస్కౌంట్ ఇస్తున్నాను.. ముందు గానే మీ పేర్లు ఈ "Ram$ baba" దగ్గర రిజిస్టర్ చేసుకుంటే నా వ్యాపారం లో మీకు కొంత % ఇస్తాను.. అందుకే త్వర పడండి.. ఆలసించిన ఆశభంగము.. యిది కార్ఫొరేట్ కల్చర్ కాబట్టి అప్పుడే నేను కొంత మంది MBA వాళ్ళ ని మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్స్ గా పెట్టుకున్నాను.. సో మన "బాబాల వ్యాపారానికి" వచ్హిన డోకా ఏమి లేదు.. అందుకే పెట్టుబడులుకు ఆహ్వానిస్తున్నాను జ్యోతి గారి బ్లాగ్ సాక్షి గా..

ఈ రిలిజియస్ పిచ్హి కి యెవరూ అతీతులు కాదండి.. ఏంతో అడ్వాన్స్ గా వుంటారు అనుకున్న అమెరికన్ ల నే చూడండి..మన కిలారు ఆనంద్ గారి స్వచ్హ్ వాక్కు కి మంత్ర ముగ్దులు అవుతూ వుంటారు..

ప్రతి మనిషికి కొన్ని బలహీన క్షణాలు వుంటాయి.. వాటిని ఈ వెధవలు ఇలా సొమ్ము చేసుకుంటూ వుంటారు..అలాగె తప్పు చేయడము మానవ సహజము..ఆ తప్పు ని దిద్దుకునే మార్గం లో మనిషి ఒక రకమైన ఒత్తిడి కి గురవుతాడు.. ఆ ఒత్తిడిని ఈ బాబాలు, స్వాములు చాలా చాకచక్యము గా కాష్ చేసుకుంటారు.. అందూవలన ఈ బాబా ల బిజినెస్స్ కి ఇంకో రెండు, మూడు వందల,వేల యేళ్ళూ పోయిన కాని ఏ డొకా వుండదు..యిది ఈ రాంస్ బాబా వాక్కు..నన్ను నేను మార్కెటింగ్ చేసుకునేందుకు ఇంతటి సదవకాశాన్ని కలిగించినందుకు జ్యోతి గారికి ఎంతో రుణ పడి వుంటాను.. శెలవు.. జై శ్రీ శ్రీ అలదండి గలదండి అచ్హి బుచ్హి రాంస్ బాబా..$$$

pruthviraj

జ్యోతి గారు మీకు వీలుచూసుకొని ఇంకా వ్రాస్తే బాగుంటుంది. ఆలోచనరేకెత్తే విధముగా, తప్పోప్పులను తెలుసుకునేవిధంగా కామెంట్స్,మంచి తెలుసుకొనేట్టు బ్లాగుల్లో ఉపయోగకరంగా వుంది, వుంటుందని నా అభిప్రాయం.(ఇంజ్ఞ్నితజ్ఞానం మనిషికి చాలా అవసరం).

t. ramachandrarao

జ్యొతి గారు

ఎప్పుడూ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని కాకుండా అప్పుడప్పుడు జీవితం, భక్తి, దెవుడు లాంటివి ఆలోచించాలి.మంచిదే. ఇలాంటివాటికి పుస్తకాలు చదవాలి. ఎదైనా గురువు చెప్పిన బోధలు వినాలి. ఒకె. కాని ఈ భక్తి బోధనలు చేసే గురువులు ఎలా ఉండాలి?
మీరు చెప్పనట్టుగా అంతా బావుంది.

మరి మీరు సరిఅయిన గురువు మరియు గురుబొధలు ఎవి?

శ్రీ శ్రీ శ్రీ విద్యానంద ప్రకాశగిరి స్వామి గురించి ఆలొచించండి అని నా మనవి.

రామచంద్ర రావు టి కంప్యుటర్ ఎరా మిత్రుడు

AumPrakash

రఘురాం మూర్తి గారు మీ వయసెంతో నాకు తెలియదు కాని నేను చిన్నవాడినే మీరు రాసిన వ్యాఖ్య చదివిన నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. "అక్కడ ఎమీ దొరకక పోతే వారు అక్కడికి ఎందుకు వెళతారని నా వుద్దేశ్యం" అని అన్నారు మీరన్నది నిజమే ఏదో ఒకటి దొరుకుతుంది అక్కడ , కాని కావలసింది దొరకడం లేదు అని మాత్రం చెప్పగలను ఎందుకంటే భక్తులు అడిగేవి అల్లాగే ఇచ్చేసారనుకుందాం మల్లి మల్లి బాబాల దగ్గరికి ఎవరొస్తారు చెప్పండి. వారికి కావలసింది అక్కడ వారికి దొరకకపోగా ఇంకాస్త పిచ్చిని , మూడత్వాన్ని తలకెత్తుకుని వస్తున్నారు. దైవ స్వరూపులుగా చెప్పుకునే కొంతమంది తెలివైన కేటుగాళ్ళు , మాటగాళ్ళు , బాగానే రాళ్ళు వెనకేసుకుంటున్నారు. మీరు పుట్టపర్తి సాయి బాబా ని తీసుకుందాం ఆయన అనంతపురం జిల్లాకి చాల చేసాడు , కాని ఆయన అనుకుంటే ఇంకా ఏమైనా చేయలేడా? భగవంతుని అవతారపురుషుడు కదా తనకి అన్నితెలుసు అనే చెప్పుకుంటున్నాడు కదా అంతటి పురుషోత్తముడు అవతరించిన ఆ పుణ్యభూమి లో ఇప్పటికి దరిద్రనారయణుడు అలుపులేకుండా నాట్యం చేస్తున్నాడు ఎందుకు? ఆయన రక్షణ కోసం అంత భద్రత ఎందుకు , కరెంటు పెట్టిన గదులు ఎందుకు , అసలు తనకు ప్రాణ భయమెందుకు? ఇక్కడ ఇద్దరూ ఇద్దరే టైపు గా కనిపిస్తున్నారు.... అదేనండి బాబాలు మరియు భక్తులు , మేమే దైవ స్వరూపులము మాకు అంత శక్తివుంది , ఇన్ని విద్యలు వున్నాయి అని తమను తామూ నమ్మించుకుని ప్రజలను కూడా నమ్మిస్తే ఒక పనైపోతుందని ఒకడు (బాబా) , భక్తి అంటే ఇదే మేమే భక్తులము బాబా చెప్పేదే భక్తి తత్వము మంచో చెడో నమ్ముకున్నాం పాల ముంచినా ,నీట ఉంచినా బాబాదే భారం పద ఆశ్రమానికి పోదాం ఒకపని అయిపోతుంది అని ఒకడు (భక్తుడు) కాని వీళ్ళిద్దరి మద్యా ఒక తేడ , ఒక సారూప్యం కొట్టొచ్చినట్టు మాత్రం నాకు కనపడుతుంది . బాబా , భక్తుడూ ఇద్దరూ కూడా మానవులే అవునా ఇది సారూప్యం ఐతే , ఒకడేమో తన తెలివి మీద ఆధారపడి స్వంతంగా బతుకుతున్నాడు , ఒకడేమో (మూఢ) భక్తి మీద ఆధారపడి పరాన్న జీవి లా బతుకుతున్నాడు. ఏమండీ బాధలు ఎక్కువైనప్పుడు బాబాలు , ఎండలు ఎక్కువైనప్పుడు ఎ.సి లాంటి వారు . కొంచెం చల్ల పడ్డాక ఎ.సి ఎలా గుర్తు రాదో , అంతా సంతోషంగా వున్నపుడు బాబా లేదు, భక్తి రెండూ గుర్తు రావు. ఇది నిజం. ఏమండీ మనగురించి మనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసో చెప్పండి . మనల్ని మనం నమ్మలేనప్పుడు , ఇంకేవ్వర్ని నమ్మి ఏమి లాభం చెప్పండి. నన్నడిగితే మనకి బాధలోచ్చినప్పుడు బాబా దగ్గరకెల్లడం కంటే మనగురించి అన్నీ తెలిసిన శ్రేయోభిలాషి దగ్గరకెల్లడం వుత్తమం. ఏమంటారు ఆలోచించి చెప్పండి. తప్పేమైనా వుంటే మన్నించగలరు.

krishna rao jallipalli

ప్రకాష్ గారు... చాల చక్కగా practical గా ఆలోచిస్తున్నారు. అబినందనలు.

AumPrakash

thanks krishnarao gaaru

swethapriya

Dear all,

vinandi naku telisina storyabout these frauds.i was studying in chennai in 2006.nenu ma friends came to know about these frauds.memu ok okasari velli chusi vaddamu ani vellamu.adi nijam ga manishi kadandoi.deyyalu.poor people ni enta maya chestunnarandi. nijam ga ne frauds ani ardhamindi. akkadiki vellagane veella tokalu ante veedi daggara dabbulaki pani chese vallu andarni edict cheyataniki prayatnistaru. diksha tiskunte kotlu vastayani prati okkrni balavantam chesi mari 10000 tisukoni diksha istunnaru.daniki harthi icvhetappudu andaru kallu muskovalata.so adi saree set chesukundi.memu chustane vunnamandi.enta mosamandi papam pichi janalu.vadi padalu takataniki 15000 ata.oka musalavida oka bagaleni pillodini tiskoni vachindi ento asaga.daniki valla samdhanam gata janma papamata.anubhavinchalata.tanemi cheyyaledata.bhagvantuni aagna ata.veellani kukkalni kottinattu kottali.cheppu tisuku tannali.nijamga ne akkadiki vellinavallanta problemslo vunnavalle. vaalu nijam gane veediki edict ayipotunnaru.ivanni adigite vadi anucharulu mammalni vellagottesaru.veediki rajamundry nunchi followers ekkuva.i mean dabbulaki pani chese vallu.ladiese ekkuvandi.munchestaru baboi

acharyavishwabrahma

నమస్కారం జ్యితి గారు మీ వయస్సు అయితే నాకు తెలియదు, కాని మీరు వ్రాసిన "ఎవరు వీరు" అనే వ్యాసంలో ఆధ్యాత్మికత గురించి వ్రాసిన చిన్న వ్యాసం చాలాబాగుంది, నిజంగా మీలాంటి ఆలోచన ప్రజలందరకు రావాలి ! లేకపోతే ఈ దొంగ బాబాలు నకిలీ సాధులు బాగా పెరిగి పోయారు అయినా మనుషులందరూ ఇటువంటి మూర్ఖత్వం విడిచి పెట్టకపోతే రాను రాను దేశం ఇంకా నాశనం అయిపోయే స్థితి కి చేరుకుంటుంది , మీలాంటి ఆలోచన గల జ్ఞానులు ఈనాడు ఎంతైనా అవసరం.
ఆచార్య విశ్వబ్రహ్మ/ విజయనగరం

Manavu

హిందూ తాత్విక ద్రుక్పదంలో అవతార సిద్దాంతం విశిషీఅమైనది. అవతార పురుషులు ఉద్భవించెది కేవలం మనవ సమాజాలోని చెడును రూపు మాపటానికే అqన్నఫ్ది నిర్వివాదాంశం. ఈ రూపు మాపే విదానం కూడ ఆ యా సామజిక పరిస్తులని బట్టి ఉంటుంది. ఉదాహరణకు రాజుల కాలంలో యుద్దవిదానం కాబట్టి చెడును రూపుమాపటానికి అవతార పురుషులు కూడ యుద్దం చెయ్యాల్సి వచ్చేది. కాని నేటి ప్రజాస్వామ్య యుగంలో అది సాద్యం కాదు కాబట్టి ప్రజలను చైతన్యవంతులను చెయ్యట్టం ద్వారానే అవతారాలు తమ నిర్దేసిత కార్యక్రమం నెరవేర్చాలి.
నాకు తెల్సినంతవరకు ఈ సో కాల్డ్ బాబాలెవ్వరు పాలకుల దమన నీతిని,ప్రజల అజ్గ్ణాన్నని ఎత్తి చూపటం లేదు. అలా జరిగిన మరునాడే ప్రబుత్వాలకు వీరికి యుద్దం (అది యే రూపమఈనా కావచ్చు) మొదలవుద్ది. ఆందుకే వీరు కేవలం వేషగాళ్ళు మాత్రమే(భారతం లో పౌండ్రకుడి లాగ), ఇక ప్రజలు వీరి వద్దకెళ్ళడం భగవంతుని మీద అచంచల నమ్మకంతో,అంతే కాని వీరు కల్ల బాబాలు అని తెలిసి కాదు.ఒక విదంగా చెప్పాలంటే కేజ్రివాల్ లాంటి వారు అతూవంతి గుణాలు కొంత శాతమైనా కల్గిఉన్నారేమో కాని ఈ కల్ల గురువులు ఏ నాటికి కల్కిలు కాలేరు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008