Friday, May 2, 2008

మహిళా బ్లాగర్లకు ఆహ్వానం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మహిళా బ్లాగర్లకు ఇదే నా ఆహ్వానం.

అస్తమానం ఎవరిళ్లలో వాళ్లు కూర్చుని బ్లాగులు రాసుకుంటుంటే ఎలా? మనమంతా ఒకసారి కలుసుకుని ముచ్చట్లేసుకుందామా? ఎప్పుడు , ఎక్కడ , ఎలా అంటారా? అందరు కలవడానికి నేను ఒక అనువైన , అందమైన వేదిక ఏర్పాటు చేస్తున్నాను. అక్కడ కలుసుకుందాం. దీనికి మీరు ఎక్కడికీ వెళ్లక్కరలేదు. జాలంలోనే ఆ వేదిక ఉంటుంది. కాని ఇది మహిళలకు మాత్రమే ప్రవేశం. ఇక్కడ ఆవకాయ నుండి అణుబాంబు వరకు, ఒబామా నుండి ఓడియాల వరకు మాట్లాడుకోవచ్చు. పనికొచ్చేవి , పనికి రానివి. తెలిసినవి , తెలియనివి . ఇలా . కాని అన్నీ తెలుగులోనే. అది మీకు సులభమే కదా.

ఐతే ఎప్పుడు కలుద్దామో నిర్ణయించండి. ఈ నెలలోనే. ఒకవేళ ఇది సఫలమైతే కంటిన్యూ చేద్దాం. ఆ వేదికని మనమే శాశ్వతంగా ఉంచుకుందాం. ఇక్కడ కలవాలనుకునే మహిళా బ్లాగర్లు నాకు మెయిల్ చేస్తే వాళ్ళకు ప్రవేశ పత్రం ఇస్తాను. కాని ఇది మగవాళ్ళకు చెప్పకూడదు. తర్వాత దీని రిపోర్ట్ నా బ్లాగులో ఇస్తాను. ఏమంటారు??

నాకు తెలిసిన మహిళా బ్లాగర్లు..

వరూధిని
మాలతి
నిశిగంద
రాధిక
స్వాతికుమారి
రమ్య
రమణి
కొండవీటి సత్యవతి
సుజాత
స్వాతి చక్రవర్తి
శ్రావ్య
సౌమ్య
కల్పన రెంటాల
వసుంధర
జాహ్నవి


ఇంకా బ్లాగులు లేకున్నా తరచూ వ్యాఖ్యలు రాస్తున్న పద్మ, తెరెసా గారు కూడా ఆహ్వానితులే.

ఇంకా ఎవరైనా ఇందులో మిస్ అయ్యి ఉంటే నాకు మెయిల్ చేయండి. jyothivalaboju@gmail.com

16 వ్యాఖ్యలు:

రమణి

ఇంకా ఆలస్యమెందుకు జ్యోతిగారు, నేను రేడీ పంపించేయండి నాకో ప్రవేశ పత్రం. మాట్లాడెసుకొందాము, ఆవగింజనుండి, అణుబాంబ్ దాక.

నిషిగంధ

జ్యోతి గారూ, పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని వర్క్ కి కాకుండా చీరల షాపింగ్ కి వెళ్ళినంత ఆనందంగా ఉందండి మీ టపా చదువుతుంటే! నేను రెడీ కబుర్లాడుకోడానికి.. :))

రాధిక

నేను రేడీ .ఇరగదీసేద్దాం.

Satyavati

జ్యోతి గారూ
నేనూ సిద్ధం మీ గుంపులోకి రావడానికి.
నాకూ ఓ పాస్ పంపేయండి

సిరిసిరిమువ్వ

జ్యొతి గారూ,
నేను కూడా సిద్దం, కాకపోతే ఈ నెల 19 తరువాత నేను హై.లో ఉండను, అంతకు ముందయితే నాకు ఓకే.

sai sravya varali kovvali

చాలా మంచిది, జ్యోతి ఆంటి. నేనూ వద్దామనుకుంటున్న!!! ఏ రోజు కలుద్దాం??

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

ముందస్తు శుభాకాంక్షలు,అభినందనలు.అసలు అచ్చం మహిళాబ్లాగరులకు ఒక ప్రత్యేకసమావేశమందిరం ఉండాలన్న ఆలోచన చాలా బాగుంది.ఇంతకీ మీ సమావేశాలకు రానున్న కాలంలో కానున్న మహిళాబ్లాగర్లకు ప్రవేశం కల్పిస్తారా?ఉదాహరణకు నా శ్రీమతి లాంటి వారు.తెలియజేయగలరు.

జ్యోతి

శుభం...

వచ్చేవారమే పెట్టుకుందాం. వేదిక, తేది నేను మీ అందరికి మెయిల్ చేస్తాను. శనివారం సాయంత్రం ఐతే అమెరికావాళ్ళకి ఓకే అనుకుంటా. బ్లాగర్లే కాకుండా, బ్లాగులు చదివేవాళ్ళు (మహిళలు మాత్రమే) ఇందులో పాల్గొనవచ్చును.

రాజేంద్ర గారు,
మీఆవిడ కూడా రావొచ్చు. కాని మీరు ఆవిడ పక్కనుండను అంటేనే.. తన మెయిల్ ఐడి పంపండి

శ్రావ్య,
నీ మెయిల్ ఐడి పంపు. నేను వివరాలు పంపిస్తాను. ఇక్కడ వద్దు. సీక్రెట్ కదా..

ఇంకా నేను ప్రస్తావించని మహిళా బ్లాగర్లు నాకు మెయిల్ చేయండి..

te.thulika

శభమస్తు. విజయీభవ.
వచ్చేవారం అమ్మలదినం కదా. మంచి ముహార్తం. జ్యోతిగారూ.

స్వాతిచక్రవర్తి

జ్యోతిగారు,
నేను రేడీ.నాకు కూడా ఒక ప్రవేశ పత్రం పంపించండి.మీ జాబు కొసం kamalswathi@gmail.com నందు ఎదురు చూస్తూ ఉంటాను.

సిరిసిరిమువ్వ

మహిళా బ్లాగర్లు ఇంకొందరు

క్రాంతి గాయం (అప్పుడు ఏమి జరిగిందంటే)

సుజాత--గడ్డిపూలు http://sangharshana.blogspot.com

అనుపమ--(ఈమె ఎక్కువగా రాయరు) http://sannajaaajulu.blogspot.com

జ్ఞాన ప్రసూన-
http://everydaysuruchi.blogspot.com

sujata

జ్యోతి గారు,

మీ ఆహ్వానం చదివి.. నేను నిజంగా చా..లా.. పెద్ద హీరోయిన్ లా ఫీల్ అయిపోయాను. అసలు నేను బ్లాగింగ్ మొదలు పెట్టిందే మిమ్మల్ని చూసి. నేను రాసాక, టపాకి వచ్చే ఒకటీ రెండూ వ్యాఖ్యలే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. నేను తప్పకుండా ఈ సమావేశం లో పాల్గొంటాను. మీరు డేట్ అండ్ టైం ఎప్పుడు చెప్తారు ? దాన్ని బట్టి నేను రెడీ గా ఉంటాను. అసలు ఆ చర్చా వేదిక ఏమిటి ? ఎలా ఉంటుంది ? అది ఒక చాట్ రూమా ? నాకు ఎంత త్వరగా ఆ ఆదివారం వస్తుందా అని ఉంది. Thanks.

gnana prasuna

Hello Jyoti,

I have seen your comments. Currently I am visiting in US with my sons. When I get back to Hyderabad, I will get in touch with you. Your article on 'Nara mamsam vandatam' and liked it very much. Keep sending your comments. You can reach me at
gtatavarti@yahoo.com.
with regards,
Gnana Tatavarti

జ్యోతి

సంతోషం. శుక్రవారం సాయంత్రం నాకు మెయిల్ చేసినవారందరికి ఎంట్రీ పాస్ పంపిస్తాను.

సుజాత గారు,మీ మెయిల్ ఐడి ఇవ్వండి. లేదా నా ఐడికి రాయండి.

శ్రావ్య,

నువ్వు కూడా మెయిల్ పంపలేదు. త్వరగా ...

Dr. Ram$

ఈ యేర్పటు వాదము, నిరంకుశ వైఖరి నశించాలి.. హ్హ హ్హ..

జ్యోతి గారు మీ అవుడియా బాగుంది..కాని మీ వరకు యిలా ప్రత్యేకంగా యేర్పాటు చేయడమే ఏమి బాగా లేదు.. యిలా ఐతే ఇంకా మిగిలిన తెలుగు బ్లాగర్ల సమావేశాలు అన్ని కేవలము , పురుష బ్లాగర్ల సమావేశాలు గానే మిగిలి పోతాయేమో..కొన్నల్లు పోయాక, మొదతి ఆదివారము మహిళ బ్లాగర్లు, రెండొ ఆందివారము పురుష బ్లాగర్లు అని సమావేశాలు జరుపుకుంటారేమో..

sujata

http://everydaysuruchi.blogspot.com - రాస్తున జ్ఞాన ప్రసూన గారు,

http://telugu4kids.wordpress.com - లలిత గారు.. మీ లిస్టు లో లేరు.. ఆశ్చర్యం.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008