Tuesday, May 20, 2008

ప్రమదావనం - 2

అదేంటో గాని ఆదివారం కూడా ఆడవాళ్ళకు తీరిక దొరికేటట్టు లేదు. ఈసారి ప్రమదావనానికి వచ్చే మహిళలు చాలా మందికి ఏదొ ఒక ముఖ్యమైన పని తగిలింది. కాని అందరు మధ్యలో అలా వచ్చి పలకరించి వెళ్ళారు. సారి నాకు మళ్ళీ గంట పవర్ కట్. సంగతేంటో అర్ధం కావట్లేదు. రొజూ పోని కరెంట్ సరిగ్గా సమావేశ సమయానికి పోతుంది, అదీ సరిగ్గా గంట.మొదటిసారి కోపం వచ్చి తిట్టుకున్నా. ఈసారి మాత్రం "అంతా భ్రాంతియేనా!! జీవితానా వెలుగింతేనా" అని అనుకున్నా. అంతకంటే చేసేదేముంది కనుక.


ఈ రోజు సమావేశంలో పాల్గొన్న మహిళలు..


జ్ఞానప్రసూన

సత్యవతి
మాలతి
జ్యోతి
నిశిగంద
రాధిక
వరూధిని
తెరెసా

సుజాత

రేణు

సుజాత శ్రీనివాస్

ముఖ్య అతిథి : భూపతి విహారిఈసారి కొత్తగా ముగ్గురు మహిళలు చేరారు. జ్ఞానప్రసూన,సత్యవతి, రేణు.


టి.జ్ఞానప్రసూన : అడప దడపా కవితలు రాస్తుంటారు.తన సోదరితో కలిసి "మాటల పందిరి" అనే వ్యాస సంపుటిని, దైవం పత్రికలో అనువాదాలు, సురుచి బ్లాగులో తన భావాలు ఆరబోస్తుంటారు. సాహిత్యం అంటే ఇష్టం. కొత్త రచయిత్రులు, వారి భావాలు వినాలని సరదా పడుతుంటారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.


కొండవీటి సత్యవతి : భూమిక పత్రిక సంపాదకురాలు. 15 ఏళ్ళుగా భూమికను నిర్వహిస్తుననరు. 2006 లో సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్ లైన్ మొదలుపెట్టారు.స్త్రీవాద రచయిత్రి."ఆమెకల" పేరుతో ఒక కథా సంకలం వచ్చింది. హైదరాబాదులో ఉంటున్నారు. ఆవిడ బ్లాగు నా గోదావరి.


రేణు : వరంగల్ లో ఉంటారు. గృహిణి. ఆంధ్రజ్యోతిలో వ్యాసం చదివి మన బ్లాగ్లోకానికి వచ్చారు. ఇప్పుడు బ్లాగులు చదువుతున్నారు.


సమావేశానికి ఠంచనుగా ఐదింటికి జ్ఞానప్రసూనగారు వచ్చేసారు. తర్వాత నిషిగంధ,మాలతి, సత్యవతి. వరుసగా వచ్చేసారు. ఇంకా అందరికి తెలుగులో రాయడం కుదరడంలేదు. ఎందుకో కొందరి కంప్యూటర్లు తెలుగు అనగానే గుండె(హార్డ్ డిస్క్) గుభిళ్ళుమని కూర్చుండిపోతున్నాయి(హంగ్). మాలతి గారు, తర్వాత వరూధినిగారు, నేను అందరిని కాస్త తెలుగులో మాట్లాడండి అని పదే పదే చెప్పాల్సి వస్తుంది.తప్పదు కదా. అలా పిచ్చాపాటి మాట్లాడుకుండగానే తెరెసా వచ్చారు. బ్లాగరు కాకపోయినా చాలా చురుగ్గా పాల్గొన్నారు సమావేశంలో. అంతలొ సుజాత (గడ్డిపూలు) వచ్చారు. ఒకరికొకరు పరిచయాలు, పలకరింపులు అయ్యాక, అందరు కలిసి మొక్కలు, పూల గురించి ముచ్చట్లాడుకున్నారు. ప్రసూనగారు, సత్యవతిగారు, మాలతిగారు మళ్ళీ వచ్చేవారం కలుస్తామని సెలవు తీసుకున్నారు. తెరెసా ఒక్కతే మిగిలారు.నాకు అంతలో నిషిగంధ, రాధిక వచ్చి కలిసారు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే ముఖ్య అతిథి విహారి వచ్చాడు (ఏకవచనం తో పిలుస్తున్నందుకు ఏవరూ ఏమనుకోవద్దు. తమ్ముడు కదా మర్యాద ఇవ్వలేను గారు అని. బాగోదు.). రేణు, వరూధిని గారు కూడా చేరి విహారిని కుశలప్రశ్నలు వేస్తుండగానే నేను వాళ్ళని కలిసాను. ఇక అతిథిని కుర్చీ ( HOT SEAT ) ఎక్కించి ప్రశ్నల బాణాలు మొదలుపెట్టాము.


కొన్ని మీకోసం..రాధిక : విహారిగారు, మీ గురించి చెప్పండి.మీ కుటుంబ వివరాలు.

విహారి : మేము కోయ దొరలం. మంచు దొరలం. భార్య. ఇద్దరు పిల్లలు. నా వయసు 20. చైల్డ్ మ్యారేజ్ :)

వరూధిని : మీ వయస్సు ఎప్పటికి 20 ఏమో.

విహారి : అవును వయసు 40 కి దగ్గర, మనసు 20 కి దగ్గర

రాధిక :విహారి గారు, మీకు అందరికంతే ముందే ఆలోచనలు ఎలా వస్తాయి.

విహారి : చిన్నప్పుడు నేను దొంగతనాలు చేసేవాడిని.ఇప్పుడు చేయిస్తున్నా.

వరూధిని: విహారి ఇప్పుడు అందరి ఆలోచనలు కొట్టేస్తున్నారన్నమాట.

విహారి : నేను రాద్దామనుకుండగానే ఎవరో రాసేస్తున్నారు.

రాధిక : విహారి, ఒక పని చేయండి. అందరూ మిమ్మల్ని నమ్మాలంటే ఆలోచన రాగానే కాపీరైటు తీసుకోండి. నేను దీని గురించి ఆలోచిస్తున్నానని చిన్న పోస్టు చెయ్యండి.అప్పుడు అందరికీ తెలుస్తుంది మీకే ఫస్టు ఆలోచన వచ్చిందని.

వరూధిని: విహారి, మీ తరువాతి టపా బ్లైన్‌, బ్లిస్కీ, బ్లోడ్కా, బ్లీరు తాగేసి బ్లాగడమెలా ఎప్పుడు?

విహారి :వరూధిని, నా అవుడీయా కీపీ కొట్టకుండా అలా పేరు పెట్టేశా. ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు.

జ్యోతి : ఓకె విహారి , ఇక మేము అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పు

విహారి : ఎంటో నా సిస్టం పని చెయ్యడం మానేసింది :-)డబ్బిస్తారా? ఎంతిస్తారు?

రాధిక: విహారి, గిర్ల్ ఫ్రెండ్స్ ?

విహారి : ఫ్రెండ్స్ లో గర్ల్సు లేరు.

తెరెసా : ఊరు, ఏం చదువు?

విహారి : లడ్డో కొండలో, ఇంజినీరింగ్

మధ్యలో చాలా ప్రశ్నలు సంధించబడ్డాయి. అవి సీక్రెట్...

జ్యోతి : ఇంత స్లోనా

విహారి: దేనికి సమాధానాలు ఇవ్వాలో తెలీక.

తెరెసా: మరి హాట్ సీట్ ఎక్కడమంటే మాటలా.

జ్యోతి : నువ్వు చేసిన వంట మీ ఆవిడ తిన్నదా. ఏమంది?

విహారి : ముందు నాకు పెట్టి ,నేను బాగున్నాక తను తిన్నది.

రాధిక: విహారి మీకు కామెడీ చెయ్యడం ఎప్పై నుండి అలవాటయింది?పెళ్ళయ్యాకా నవ్వడం/నవ్వించడం నేర్చుకున్నారా?

విహారి : పెళ్ళి చూపుల నుండి.

జ్యోతి : ఇపుడు ఎవరైన బాగా డబ్బున్న అమ్మాయి వచ్చి లవ్ యూ , నీతో ఉంటా అంటే. మీ ఆవిడ కూడా ఒప్పకుంటే నువ్వేమంటావ్ ?

విహారి : డబ్బులు మా అవిడకిచ్చేసి నేను వెళ్ళిపోతే.

జ్యోతి : ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటే.ఎల మేనేజ్ చేస్తావ్.

విహారి : ఒకరిని కూడలికి పంపేస్తా. ఒకరికి ఈటివి చూపిస్తా.

మధ్యలో సుజాత స్రీనివాస్ వచ్చి కలిసి పలకరించి వెళ్ళిపోయారు. వాళ్ళాయన అమ్మకు ( అత్తగారు ) మేము నమస్కారాలు చెప్పాము.నిషిగంధ, రాధిక, తెరెసా మూడు దిక్కులనుంDi ప్రశ్నల బాణాలు వేసారు.

మమ్మల్ని కూడా ప్రశ్నలు వేయమని అడిగితే ఆలోచించి మూడో నాలుగో అడిగాడు.

విహారి : వారం వారం ఇక్కడికొచ్చి ఏం చేస్తారు మీరు?

జ్యోతి : ముచ్చట్లు. ముఖ్యంగా మొగుళ్ల మీద.

రాధిక : విహారి , సొల్లు కబుర్లేసుకుంటాం.

విహారి : ఇలా ఆడాళ్ళ బదులు మొగుళ్ళొస్తే పరిస్తిథి ఏంటి?

సుజాత స్రీనివాస్: మొగుళ్ళు ఎప్పుడు పెళ్ళాల గురించి మాట్లాడుకోరు.

రాధిక : అంటే మీ ఆవిడ పేరు చెప్పి మీరు వారం వారం వద్దామనే.

విహారి : అవును. ఎంత మంది వస్తే మీకు బాగా ధైర్యం వస్తుంది.

నిషిగంధ : అంతే జనాన్ని బట్టి ధైర్యం పెరుగుతుందనా. ఒక్కరున్నా మేము ఆదిషక్తులమే. మీకిష్తమైన బ్లాగు.

విహారి : నాదే.

రాధిక:విహారి, మధ్య చాలా మంది హాస్యం రాస్తున్నారు గా.మీరెప్పుడన్నా కుళ్ళుకున్నారా?

అవును చాలా కుళ్ళుకుంటున్నాను. వాడ నన్ను కాపీ కొడుతున్నాడని.

విహారి : అందరు బాగా రాస్తున్నారు.అసలు నేను హాస్యం రాస్తున్నానని అనుకోలేదు. మధ్య వస్తున్న హాస్య బ్లాగులలో క్రాంతి, సంతోష్ బాగా రాస్తున్నారు. కొన్ని మరీ ఎగతాళిగా ఉంటున్నాయి.సరే... నా బ్లాగులో కామెడీ ఎలా వుంటుంది

నిషిగంధ : నాకైతే సూపర్‌గా నచ్చుతుంది.

రాధిక :

రాధిక : విహారి, నిజం చెప్పొద్దూ కొన్నాళ్ళు మీ పోస్టులు కొద్దిగా వీక్ అయ్యాయి.మరి ఏమి చేసారో మధ్య మళ్ళా నవ్విస్తుంది మీ బ్లాగు.

జ్యోతి : బావుంటుంది అప్పుడప్పుడు బోర్,ఒక్కోసారి సిద్ధ బుద్ధ రాజకీయాల మీద ముచ్చట్లు బోర్ గా ఉంటాయి.కాస్త డిఫరెంట్‌గా రాయి.

నిషిగంధ : అవును, భార్యభర్తల మీద. కాలేజీకబుర్లు, ఆఫీసు లో జరిగిన సంఘటనలు. .

వీహరి : ఇప్పుడు చాలా మంది హాస్యం రాస్తున్నారుగా. నేను కామెడీ తగ్గించి సీరియస్ రాద్దామనుకుంటున్నా.


వెంటనే అందరూ వద్దు అని అరిచేసారు.. తర్వాత పత్రికలలో వచ్చే వ్యాసాల వల్ల కూడలికి, బ్లాగులకు హిట్స్ ఎలా వస్తున్నాయి, టపా రాసినప్పుడు ఎన్ని హిట్స్, రాయనప్పుడు ఎన్ని హిట్స్ వస్తున్నాయి అనే విషయం మీద చర్చ జరిగింది. విహారి ఎక్కువగ సీరియస్ చర్చలలో ఎందుకు పాల్గొనడు అన్న ప్రశ్నకు "నాకు తిరిగి స్పందించే సమయం వుండదని భయం. ఒక్కో సారి అది కేవల్ డిస్కషన్‌ కె తప్ప సాధించేదేమీ వుండదని స్పందించను సీరియస్ గా రాయను.".


అప్పటికే ఎనిమిదిన్నర అయ్యింది. సమావే్శం ముగించేసాము.అసలు ఈ సమావేశంలో ఒక ముఖ్యమైన స్త్రీల సమస్య చర్చించాలనుకున్నాము కాని చాలా మందికి అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి. అందుకే అది నా బ్లాగులో కాని, వచ్చే సమావేశంలో కాని చర్చించవచ్చు. ఈ సమావేశాలను ఊరికే సొల్లు కబుర్లకే కాకుండా మంచి చర్చలు జరపాలని అందరి అభిలాష. కాని బాలారిష్టాలు తప్పటంలేదు. కొందరు బ్లాగర్ల భార్యలను పిలిచాను కాని ఒక్కరూ అంగీకరించలేదు. అప్పుడర్ధమైంది ఏంటంటే మన బ్లాగింగు వల్ల మన భాగస్వాములు ఎంత విసిగిపోయారో. అందుకే ఇటువైపు తొంగి చూడడానికి ఇష్టపడడం లేదు. పోనీలెండి ఏం చేస్తాం? కాని ఇది మహిళా బ్లాగర్లకు మాత్రమే సంబంధించినది కాదుగా.ఒక సందేహం : విక్షనరీ కోసం పాటుపడుతున్న సుజాత, ఇపుడు బ్లాగులలో ఉన్న ఇద్దరు సుజాతలలో ఒకరా??? అయితె ఎవరు?


ప్రమదావనం సభ్యురాళ్ళకు ఒక వినతి : తెలుగు వికిపీడియా స్థానికీకరణలో మనమందరం కలిసి ఒక అంశం తీసుకుని కలసికట్టుగా పూర్తిచేద్దామా? ఒక్కొక్కరు ఒక్కొకటి అంటే అందరికి తీరకపోవచ్చు. అదే అందరం కలిసి ఒకే అంశం తీసుకుని ఎవరికి వీలైనట్టుగా వారు పూర్తి చేయవచ్చు. ఎవరికీ అంత శ్రమ అనిపించకపోవచ్చు. ఏమంటారు ?ఈ ప్రమదావనానికి రాని మహిళా బ్లాగర్లందరు వెంటనే నాకు మెయిల్ చేయండి.. మళ్ళీ నన్ను నిష్టూరమాడొద్దు మరి.. పిలవలేదని..


అందరికి ఒక విజ్ఞాపన : మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. ఈ సమావేశాలను ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా చేసుకోవచ్చో చెప్పండి.

3 వ్యాఖ్యలు:

దీపు

@జ్యోతి గారు

రెండో భాగం కోసం ఇప్పటి దాకా ఎదురుచూసాను... ఆ సీక్రెట్లు కూడా చెప్పేస్తే ఓ పనైపోయేది.. :-) తెలుగు వికీ మీద పని చేద్దామని నిర్ణయించుకున్నారన్నమాట.. జయప్రదం కావాలని కోరుకుంటున్నాను :-)

krishna rao jallipalli

అబ్బ... కరెంట్ తో ఏమి కష్ట పడతారు గాని... శుబ్రంగా ఒక GENERATOR కొనుక్కోండి.

koduri

జ్యొతి గారు,

తెలుగు ఆడపడుచులు తెలుగు ను ముందుకు తీసుకెల్తున్నారు.చాలా స్పూర్తిదాయకం.

మీ సమావేసాలకి కేవలం గ్రుహిణి లు మాత్రమె హాజరు అవ్వలా? నాలాంటి "గ్రుహిడు" "house husbend"కుడా హాజరు కావచ్హా? :-)

--బుజ్జి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008