Wednesday, May 21, 2008

శ్రీరస్తు శుభమస్తు ....
ఈ రోజు 22 nd may నాకు చాలా ఆనందకరమైన రోజు. అందమైన నా పెళ్లి పుస్తకానికి ఈరోజు పాతికేళ్ళు నిండాయి. నేనుగా ఒక ప్రత్యేకతను. తల్లిగా, భార్యగా విజయం సాధించి మనస్పూర్తిగా, గర్వంగా ఈ పండగ జరుపుకుంటున్నాను. అందుకే నా ఈ సంతోషాన్ని బ్లాగ్మిత్రులతో పంచుకుంటున్నాను.


31 వ్యాఖ్యలు:

Gireesh K.

పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. కానీ, పెళ్ళి తరువాత జీవితాన్ని స్వర్గం చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.

మీ వివాహ రజతోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు!!!

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

మనస్సు నిండా నిండిపొర్లిన అభిమానాన్ని..ఒకరిపై ఒకరికున్న ప్రేమను పూర్తిగా పంచుకోండి...
పెళ్ళిరోజు శుభాకాంక్షలు...ఇద్దరికీ..

అన్నట్టు మరిచా..వంట ఏమిటో చెపితే..కాస్త లొట్టలేస్తాం..

Anonymous

జ్యోతక్కా,

మీ ఇద్దరికి రజతోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరు ఇలాగే ఇంకో రజతోత్సవం జరుపుకోవాలి.

-- విహారి

దైవానిక

జ్యోతక్క,
నా తరపున మీ ఇద్దరికి హౄదయపూర్వక రజతోత్సవ శుభాకాంక్షలు.

సుజాత

జ్యోతి గారు,
మీ పెళ్ళి పుస్తకంలో మరో పాతిక పేజీలు చేర్చుకుని, బంగారు పండగ కూడా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. శుభాకాంక్షలు!

arunakiranalu

jyothy garu


many many return of the day.. meeru ilage happy ga kalakalam kalasi santhosham ga vundalani korukotu


aruna

koduri

హయ్... మా జొతక్క పెల్లికూతురాయనె.

నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.

--బుజ్జి.

nuvvusetty

Hi akka

Many many happy return of the day :)

sujata

Happy Anniversary. మరి మాకు ట్రీట్ ఏది ? :D

bolloju ahmad ali baba

ఈ పాతిక వసంతాల తావి
మరో నాలుగు పుష్కరాలు పాటు పరిమళించాలని,
ఈ పాతిక వసంతాల మధుర సంగీతం
మరో నాలుగుపుష్కరాలపాటు వినిపించాలని,
ఈ పాతిక వసంతాల రంగుల మెరుపులు
మరో నాలుగుపుష్కరాల పాటు కాంతులీనాలని,
ఈ పాతిక వసంతాల ఆత్మ పరిపుష్టత
మరో నాలుగు పుష్కరాలపాటు నిలిచిపోవాలని,
ఈ పాతిక వసంతాల దైవానుగ్రహం
మరో నాలుగు పుష్కరాలపాటు ప్రసరించాలని,

కోరుకుంటూ ,

అభినందనలతో మీ తమ్ముడు
బొల్లోజు బాబా

శ్రీనివాస

అక్కా మీ ఇద్దరికీ పెళ్ళిరోజు శుభాకాంక్షలు !!!

venkat

wish u a happy marriage day mam

క్రాంతి

Happy Anniversary andi.

కృష్ణుడు

Happy Anniversary Jyothi gaaru,

వికటకవి

జ్యోతి గారు, మీ దంపతులిరువురికీ శుభాకాంక్షలు.

teresa

Many happy returns!!

నిషిగంధ

జ్యోతి గారూ, మీ దంపతులిద్దరికీ హృదయపూర్వక వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు..

దీపు

@జ్యోతి గారు
మీకు వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు... మీ జీవితాన నిండైన ఆ సంతృప్తి నిండా ఉండాలని కోరుకుంటున్నాను...

కొత్త పాళీ

వెండిని బంగారు చేయించండి! :-)
మీకూ మీ కుటుంబానికీ అభినందనలు

ramya

మీ వివాహ రజతోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు

రవి

మా అక్క కూ, మా బావకూ రజతోత్సవ వివాహ దిన శుభాకాంక్శలు.

జ్యోతి

అందరికి ధన్యవాదాలు.ఒక జోక్ గుర్తొచ్చింది..

కొత్తగా పెళ్ళయిన వారానికి రామకృష్ణ ఆఫీసుకు వెళ్ళాడు. అతని స్నేహితుడు చూసి "ఏంట్రా!! అప్పుడే వచ్చేసావు. హనీమూన్ వెళ్ళలేదా??

రామకృష్ణ అన్నాడు " లేదురా పెళ్ళి ఖర్చులు పోనూ మిగిలిన డబ్బులతో ఒకటె హనీమూన్ టికెట్ కొనగలిగా . అందుకే మా ఆవిడను పంపి నేను ఇలా ఆఫీసుకు వచ్చాను"

ఇప్పుడిది ఎందుకు చెప్తున్నాననా??

రజతోత్సవ వివాహ వార్షికోత్సవాన్ని నేను మాత్రం ఘనంగా బ్లాగులో, నా మస్తీ గ్రూపులో జరుపుకున్నాను. కాని ఇంట్లో మాత్రం నిల్. ఎవ్వరొ విష్ చేయలేదు (పిల్లలు తప్ప),ఎవ్వరికీ తెలీదు కూడా. కనీసం పెళ్ళి చేసిన మా అమ్మా నాన్నలకు, తమ్ముళ్ళకు ఆ అలోచన కూడా రాలేదు. నేను చెప్పలేదు. ఇక మావారి సంగతి తెలిసిందే. మూడు పూటలు ఒకటే అన్నం, పప్పు (నో కర్రీ)..:)

కాని నా సంతోషాన్ని పంచుకునే ఇంతమంది బ్లాగ్‌కుటుంబ సభ్యుల అభినందనలు అందుకోవడం నిజంగా గర్వంగా ఉంది. నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరేమో?? ఇది అతిశయం అనుకున్నా ఓకే పర్లేదు.

రమణి

జ్యోతిగారికి: కొంచం ఆలస్యమయ్యింది మీకు శుభాకాంక్షలు చెప్పడం, మరోలా అనుకోవద్దు, పాతికేళ్ళు నిండిన మీ పెళ్ళి పుస్తక శ్రీకారానికి, హృదయపూర్వక శుభాకాంక్షలు.

కందర్ప కృష్ణ మోహన్ -

ఆలస్యంగా అభినందనలు - మీ విజయాలన్నిటివెనక మీ వైవాహిక జీవిత సాఫల్య ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి - వజ్రోత్సవాలు కూడా ఇంతే సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ.....

Malakpet Rowdy

Happy Anniversary (2009)!

Dhanaraj Manmadha

Wedding day wishes 2009.

Celebrate. :-)

భావన

ఫాతికేళ్ళు నిండిన మీ పెళ్ళి పుస్తకం సదా కొత్త పుస్తకమల్లే మెరవాలని ఆశిస్తు మీకు గోవర్ధన్ గారికి నా హృదయ పూర్వక రజతోత్సవ శుభాకాంక్షలు

పరిమళం

జ్యోతి గారు,వివాహ రజతోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.

చిలమకూరు విజయమోహన్

జ్యోతి గారికి, శుభాకాంక్షలు
దాదాపు మా వివాహం కూడా అదే సమయంలో జరిగింది ౩౦ జూన్ 1983 మా వివాహం ప్రూడెన్షియల్ కప్ గెలిచిన ఆనందోత్సాహాల మధ్య జరిగింది . ప్రమద ప్రమిదై అలనాటి అమ్మలకు నేటి అమ్మగా వెలుగులు పంచినందుకు కూడా అభినందనలు

ఉష

అనుకోకుండా మా మావయ్య 50వ వివాహ మహోత్సవం ఇక్కడ అమెరికాలో మ ఇంట జరిగాయి. అది నా అదృష్టం నేను ఆ పండుగ జరపటం. ఎప్పుడూ మౌనంగా వుండే అత్తయ్య, సర్జన్ కనుక అవే మాటలు చెప్పే మావయ్య ఇద్దరూ తమ పెళ్ళినాటి విషయాలు కలబోసుకుని, మా అందరి ఎదుటా ఎన్నో విశేషాలు గుర్తుచేసుకుని, పాటలు కూడా పాడారు. మీరు కూడా స్వర్ణం త్వరలో చేరాలి, మరెన్నో "జీవితమే సఫలమూ, రాగ సుధాభరితమూ" అనే సంగతులు పంచుకుంటారని ఆశిస్తూ.. వివాహ రజతోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

జ్యోతి

భరద్వాజ్, ధనరాజ్, భావన, పరిమళం గారు,, ధన్యవాదాలు.
విజయమోహన్ గారు, మీకుకూడా రజతోత్సవ సంవత్సర వివాహమహోత్సవ శుభాకాంక్షలు.. అప్పుడు వరల్డ్ కప్ గెలుపు, ఇప్పుడు ఐపిఎల్ గెలుపుతో జరుపుకోండి..
ఉష
ధన్యవాదాలు.మీరన్నట్టుగానే నిన్న పిల్లలు మా వివాహ రజతోత్సవ పండగ జరిపారు. అదీ surprise గా. మరచిపోలేని, మరపురాని అనుభూతిని బహుమతిగా ఇచ్చారు..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008