Friday 9 May 2008

రండి .. రండి … దయచేయండి….



ప్రపంచ మహిళా బ్లాగర్ల సమావేశం:


అనుకున్నట్టుగానే ఆదివారం మే 11 వ తేదీన ప్రపంచ మహిళా బ్లాగర్ల సమావేశం నిర్వహించబడుతుంది. దానికి ప్రాంగణము కూడా తయారైంది. అదే " ప్రమదావనం" . కాని ఇందులో మహిళలకు మాత్రమే ప్రవేశము. ప్రతివారము ఈ సమావేశములు నిర్వహించాలని అనుకుంటున్నాను. ఈ ప్రాంగణానికి ప్రవేశపత్రాన్ని నేను వ్యక్తిగతంగా పంపిస్తున్నాను. నిన్ననే నాకు తెలిసింది ఏంటంటే మన బ్లాగర్లలో ఇద్దరు సుజాతలు ఉన్నారని. దయచేసి సుజాతలిద్దరికి మనవి. మీరు నాకు మెయిల్ చేస్తే నేను ఎంట్రీ పాస్ పంపిస్తాను. ఇంకా ఎవరైనా నేను పిలవకున్నా సరే నాకు మెయిల్ చెస్తే చాలు. అలా అని ఎవరైనా మగవాళ్ళు నన్ను మాయ చేసి , అబద్ధం చెప్పి ఎంట్రీ పాస్ తీసుకుని గాజులు వేసుకుని, బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చోడానికి అభ్యంతరం లేకున్నా. నేను ఊర్కోను. అనుమానం వచ్చిందంటే వాళ్ళను గెంటేయడానికి వెనుకాడను.



ఇంతవరకు ఈ సమావేశానికి రావడానికి ఉత్సుకత చూపినవారు….


వరూధిని

సత్యవతి

జ్ఞానప్రసూన

లలిత

రమణి

శ్రావ్య

రాధిక

నిషిగంధ

సుజాత

క్రాంతి

స్వాతి చక్రవర్తి

జ్ఞానప్రసూన

రేణు కొమ్మోజు

జాహ్నవి

వాణి

స్వాతికుమారి

సుజాత (మనసులో మాట )

సుజాతా (గడ్డిపూలు ).


మరికొందరు బ్లాగర్ల భార్యలను కూడా ఆహ్వానించడమైనది.


ప్రత్యేక ఆహ్వానితులు:


వసంతలక్ష్మి - ఆంధ్రజ్యోతి నవ్యసంపాదకురాలు

Dr.సావిత్రి -


ఈ సమావేశం ఆదివారం సాయంత్రం 5 గంటలకు (భారతీయ కాలమానం) , అంటే అమెరికాలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు మొదలవుతుంది. ఇక ఈనాటి ముఖ్య అతిథి.. మన నిడుదవోలు మాలతిగారు (te.thulika) యాధృచ్చికంగా ఆ రోజు మాతృ దినోత్సవం. మా అందరికి అమ్మ లాంటి మాలతిగారు మా మొదటి అతిథి. తర్వాత మాలో ఒకరు. మాలతిగారు మీరు ఆరోజు కాస్త తీరిక చేసుకుని రావాలి అంతే..


ఇంకో గమనిక:


ఆదివారం రోజు మన సమావేశం సమయంలో ఇంట్లో భర్తలను, పిల్లలను టీవీ దగ్గరకు పంపేయండి. తినడానికి ఏదో ఇచ్చేసి.త్వరగా పనులు చేసుకుని తీరిగ్గా కూర్చోండి. నేనైతే మావారికి చెప్పేసా. ఆదివారం సాయంత్రం మీటింగ్ ఉంది. మూడు గంటలు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సిస్టమ్ దగ్గరకు ఎవ్వరూ రావొద్దు అని. నవ్వేసారు.


ఈ సమావేశ నివేదిక తర్వాత నా బ్లాగులో ఇవ్వబడుతుంది.




హైదరాబాదు తెలుగు బ్లాగర్ల సమావేశం :


ఈ ఆదివారం 11 వ తేదీ సాయంత్రం యూసుఫ్‍గుడా , కృష్ణకాంత్ పార్కులో హైదరాబాదు బ్లాగర్ల సమావేశం నిర్వహించబడుతుంది. హైదరాబాదులో ఉన్న బ్లాగర్లందరికి ఇదే ఆహ్వానం.. ఏదైనా సందేహాలున్నచో ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

తేదీ మరియు సమయం: ఆదివారం, మే 11, 2008 - మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

98664 95967 - వీవెన్

9441418139 - చక్రవర్తి

ఊకదంపుడు గారు( అసలు పేరు తెలీదు ) హైదరాబాదులోనే ఉంటారు. గత నెల వారు ఈ సమావేశానికి వస్తానన్నారు. కాని వారికి నచ్చిన తినుబండారాలు తీసుకొస్తేనే. మీరు చెప్పినట్టు ఇస్తాము కాని మీరు రావాలి మరి. ఇంకా ఎవరెవరు ఉన్నారు హైలో?? బ్లాగులు లేకున్నా తెలుగు భాషాభిమానులు ఈ సమావేశానికి రావొచ్చు.



బెంగుళూరు తెలుగు బ్లాగర్ల సమావేశాలు :


ఎలాగూ బెంగుళూరు బ్లాగర్లు ఈ ఆదివారమే కలవాలనుకుంటున్నారు కాబట్టి. కానీండి. మీరు ఆ రోజే సమావేశం ఏర్పాటు చేసుకోండి. ఇద్దరైనా సరే, పది మంది ఐనా సరే.



అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం:


ఇక అమెరికా అబ్బాయిలు మీరేం చేస్తున్నారు ?. అప్పుడెప్పుడో ఫోన్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. మళ్ళీ చడి చప్పుడు లేదు. మీరే కాదు మేము కూడ ఇక్కడ బిజీనే.. అయినా కలవటంలేదా? మనసుంటే మార్గముండదా? Skype కి జై అనండి లేదా మన కూడలి కబుర్లు ఉందిగా? భారతదేశంలోని తెలుగు బ్లాగర్లందరి తరఫున భూపతి విహారిని ఈ సమావేశం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. (కోరడం ఏమిటి చేయాల్సిందే) లేకుంటే అందరికి పని చెప్పి సమరసింహారెడ్డి సినిమా చూస్తాడా? అతని ఫోన్ నంబరు తెలిసినవాళ్ళు కాస్త కాల్ చేసి చెప్పండి ఈ విషయం. మీరు కూడా ఈ ఆదివారం పెట్టుకోండి. అందరిది కలిపి హ్యాట్రిక్ అవుతుంది. ఏమంటారు?



హమ్మయ్యా!! .. పిలుపులు అయిపోయాయి..

8 వ్యాఖ్యలు:

సిరిసిరిమువ్వ

"ప్రమదావనం",మాలతీచందూర్ గారిని గుర్తుకు తెచ్చారు.

vasantam

ఇంట్లో భర్తలని ??? జ్యోతిగారు మీరుకూడా ఇలా దోషాలతో వ్రాయటమా హవ్వ్వ !!!
తమాషకే కోపగించుకొకండే :-)

జ్యోతి

వాసుగారు,
ఇందులో దోషమేముంది.. అందరికి చెప్పాను నేను.మీరే చెప్పండి ఏమనాలో. ఐనా మా ఆడాళ్ళం ఏదో అనుకుంటాము. ఇక్కడ కూడా వ్యాకరణం చూడమంటారా??

ఓ బ్రమ్మీ

ఆదివారం కాకుండా మరే రోజైనా పెట్టుకుంటే బాగుండేదేమో. ఆరోజే eతెలుగు సమావేశం ఉన్నందున, అక్కడకి వచ్చే వనితలు చక్కగా ఇంటికే పరిమితమై పోతారు.

ఈ విధంగా భార్య భర్తలు బ్లాగర్లైతే వారిని విడదీయడమేమీ బాగాలేదు. ఏది ఏమైనా, మహిళా లోకం వర్దిల్లితే అంతకన్నా మంచి విశేషమేమి ఉంటుంది.

Anyhow, i wish them all the best.

Anonymous

మొదటగా ఈ బ్లాగ్మహిళామణుల్లో లలిత గారి పేరు కనిపించుట లేదు. అల్రెడీ కాంటాక్ట్ అయుంటే వాకే.

మొదటగా కు అనుంబంధం (1): మీ అందరికీ ఏవన్నా కొత్త అయిడియాలు వస్తే ముందుగా నాకు మెయిల్ పంపు, ట్యాంకరు. మీ అందరికి గుడ్డు లక్కు.

రెండోది: ఈ మహిళా బ్లాగర్ల సమావేశం నా అయిడియా కాబట్టి దీని కొచ్చే పేరు ప్రఖ్యాతులన్నీ నాకే రావాలి.రాక పోతే అల్రెడీ జ్యోతి వలబోజు అనే హైదరా బాద్ అటార్నీ ద్వారా సమన్లు ఇప్పిస్తా.

మూడోది: నన్నొగ్గెయ్ అక్కో..నన్నొగ్గెయ్. ఈ సమావేశాలు పెట్టు కోమని అడక్కు. అసలే ఓ టపా రాసి బుర్ర మీద వచ్చిన బుడిపెలు లెక్కెట్టుకుంటున్నా. మా దేశం అసలే నాలుగు గంటల పొడవు. ఒకరు అప్పడాలు నోట్లో గ్రైండ్ చేస్తూ మాట్లాడితే ఇంకొకరు జ్యో అచ్యుతానందా.. అంటూ పాటలు వేసుకుంటుంటారు. నేను నా రెండు చేతులు శ్రీహరి కోట నుండి మొన్న పంపిన రాకెట్లో ఎప్పుడో పెట్టేశా. ఎంతెత్తుకెళ్ళాయో హసన్‌ లోని ఎం.సి.ఎఫ్. కు ఫోను చేసి కనుక్కో..

నాలుగోది: పైనున్న మూడూ మళ్ళీ చదువుకో.

-- విహారి

మాలతి

తొలుత సకలమాతలకూశుభఅమ్మదినం.
పోతే, జ్యోతిగారూ, ఈ టపా ఇప్పుడే చూశాను. సమావేశం ప్రమదావనం, అతిధి మాలతి అంటే ఇబ్బందికరం అండీ. అది అలా వుంచి, మీరు ఫైర్ ఫాక్స్ దింపుకోవాలీ, లేఖిని దానికి మప్పాలి అంటే అలాటివి నాకు టైము పడుతుంది. అంచేతే మీరిచ్చిన ఫారం నింపలేదు. ఆఅలంకారాలన్నీ లేకుండా ఉన్నదాన్ని వున్నట్టు, కట్టుబట్లలతో రావచ్చా.
వైదేహీ శశిధర్ కూడా చేరతానన్నారు. ఈవారం అతిథిసేవలో వున్నారు. వచ్చేవారం చేరొచ్చు.
మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, మరియు, సమావేశం దిగ్విజయం కావాలని కాంక్షిస్తూ...

జ్యోతి

మాలతిగారు,
పర్లేదండి. వచ్చేయండి.. అంతా మనవాళ్ళే కదా

మాలతి

ఏమండి. నేను నీలితెరదగ్గరకొచ్చేను. తరవాత దారి తెలియుటలేదు. ఎటు రావాలి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008