Monday 12 May 2008

ప్రమదావనం - మొదటి సమావేశం.

ఈ వినూత్న ప్రయోగ నివేదిక రాసేముందు ప్రార్ధన చేసుకుందామా?


వీవెన్,,


మాకు రాసుకోవడానికి లేఖిని ఇచ్చావు


బ్లాగులన్నీ ఒకదగ్గర చూసుకోవడానికి కూడలి ఇచ్చావు


బ్లాగరులు తమ బాగోగులు మాట్లాడుకోడానికి బ్లాగు గుంపును ఇచ్చావు.


ఆంగ్ల పదాలను అచ్చమైన తెలుగులో మార్చుకోవడానికి తెలుగుపదం ఇచ్చావు.


బ్లాగర్లు ముచ్చట్లేసుకోవడానికి కూడలి కబుర్లు ఇచ్చావు.


ఇప్పుడు మహిళా బ్లాగర్లకోసం ప్రత్యేకమైన వేదిక ప్రమదావనం ఇచ్చావు.


మా అందరికోసం చాలా ఇచ్చావు.


నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోము. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోము.


అందుకో మా శతకోటి నమస్సులు.. దీర్ఘాయుష్మాన్ భవ .


నిన్న ఆదివారం (11.5.08) రోజు అంతర్జాలంలో జరిగిన మొదటి తెలుగు మహిళాబ్లాగర్ల సమావేశం అంగరంగ వైభోగంగా జరిగింది. సభ్యులందరు వారం రోజులనుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు సరిగ్గా ఐదు గంటలకు రావడం మొదలు పెట్టారు. ఈ రోజు బ్లాగరు కాని మహిళ శ్రీమతి తెరెసా నా స్నేహితురాలు డా.సావిత్రి. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థాంక్స్ సావిత్రి. నేను ఐదింటికి ఐదు నిమిషాల ముందే వచ్చి సమావేశమందిరంలో కూర్చున్నాను. ఒక్కొక్కరుగా రావడం మొదలైంది. ఈ సమావేశానికి హాజరైన మహిళామణులు


జ్యోతి

సుజాత (మనసులో మాట)

వరూధిని

నిషిగంధ

రాధిక

స్వాతిచక్రవర్తి

సుజాత (గడ్డిపూలు)

వాణి

తెరెసా

మాలతి

క్రాంతి

జాహ్నవి

సత్యవతి (చాలా లేట్‍గా వచ్చారు)


ముందుగా ఇద్దరు సుజాతలపై కొద్దిగా చర్చ జరిగింది. ఎలా గుర్తుపట్టాలి. అని అప్పుడు ఇద్దరు తమ పేర్ల తర్వాత తమ బ్లాగు పేరు పెట్టుకున్నారు. నేను ముందుగానే అందరికి చెప్పాను ఇక్కడ నో గార్లు , బూర్లు అని. ముందుగా సుజాత, నిషిగంధ తెలుగులో ఎలా రాయాలి అని అడిగారు . నేను చెప్పిన బరహ విధానంలో నిషిగంధ తెలుగు నేర్చుకుంది కాని సుజాత గారికి రాలేదు. సరే తర్వాత చూద్దాం అని ఊరుకున్నాం. అందరు ఇంగ్లీషులోనే తెలుగు మాట్లాడుకున్నారు. (ఉఫ్.. ఇక వాళ్ళకు తెలుగులో డైరెక్ట్ నేర్పాల్సిన పని నాదే. వచ్చే సమావేశంలోగా అందరిని తెలుగులోనే మాట్లాడుకునేలా (రాసేలా) చేయాలి. తప్పదు మరి ).. మధ్యలో మా ఇంట్లో ఎప్పుడు పోని కరెంట్ నేను పోతా అని పోయింది. అది కూడా గంట సేపు. నాకు వచ్చిన తిట్లన్ని తిట్టుకుంటూ పడుకున్నా. వరూధినిగారికి ఫోన్ చేసి చూసుకోండి అని చెప్పా. ఇక పరిచయాలు


నిషిగంధ : వివాహం అయింది, పిల్లలు లేరు.. పుట్టి పెరిగింది విజయవాడలో.. ప్రస్తుతం ఉంటున్నది మయామి యుఎస్ లో.. ఇష్టమైన విషయాలు - పుస్తకాలు, పాటలు, మొక్కలు, స్నేహితులు, తను :-)


వరూధిని : సిరిసిరిమువ్వ పేరుతో బ్లాగు రాస్తుంటారు. జన్మస్థలం గుంటూరు జిల్లాలో పల్లెటూరు. చదివింది M.Sc. ప్రస్తుత నివాసం హైదరారాబాద్. ఒక పాప, ఒక బాబు. కనపడ్డ ప్రతిది చదవటం వ్యసనం.


సుజాత (మనసులో మాట ) : ఉండేది బెంగుళూరులో. వచ్చేనెలలో హైదరాబాదు వస్తున్నారు. కొన్నేళ్ళ క్రితంవరకు ఒక డైలిలో సబ్ ఎడిటర్‍గా పని చేసారు. పాప కోసం కెరీర్ వదులుకున్నారు. చదవటం , ఊర్లు తిరగటం, మొక్కలు, సమాజ సేవ హాబీలు.


స్వాతి చక్రవర్తి : ఈ మధ్యే భర్తతో కలిసి బ్లాగులు మొదలెట్టారు. పెళ్ళయి సంవత్సరమైంది. ఊరు విజయవాడ. ఉండేది హైదరాబాదు.


రాధిక : భర్త బ్రహ్మి( పేరు కాదు ఉద్యోగం ) బాబు సాహిత్‍తో గ్రీన్ బే అమెరికాలో నివాసం. ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు.


సుజాత (గడ్డిపూలు) : హైదరాబాదులో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని. ఇప్పుడు భర్త ఉద్యోగార్ధం యు.కె లోని బెడ్‍ఫోర్డ్ లో ఉంటున్నారు.


తెరెసా : బ్లాగరు కాకపోయినా తరచూ మన బ్లాగులు చదివి కామెంట్స్ రాస్తుంటారు. ఆవిడ డాక్టరు. అమెరికా మిచిగన్ లో ఉంటారు. ఇద్దరు పిల్లలు. తెలుగును అభిమానించే రచయిత భర్త. తెలుగు మీది అభిమానంతో ఏ తెలుగు పత్రికైనా చదువుతుంటారు.


జ్యోతి : మావారు సివిల్ ఇంజనీరు, పిల్లలు దీప్తి, కృష్ణచైతన్య .ఇద్దరు వర్కింగ్. మేము ఉండేది .హైదరాబాదు. నేను ఇంట్లోనే ఉంటాను. కుట్లు , అల్లికలు, పెయింటింగ్, సాఫ్ట్ టాయ్స్ ఇలా ఏదైనా నేర్చుకోవడం హాబీ. ఇప్పుడు బ్లాగింగ్ అప్పుడప్పుడు సరదా రచనలు చేయడం.


మాలతి : పుట్టింది, కొంత పెరిగింది విశాఖపట్టణం. 33 ఏళ్ళుగా అమెరికాలో స్థిరపడిపోయారు. ఒక కూతురు సరయూ. సినీ నటి. సో మాలతిగారు హాలివుడ్ అమ్మ.


వాణి : విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. కొత్తగా ఆయుష్మాన్ భావ అనే బ్లాగును మొదలు పెట్టారు.


జాహ్నవి : విద్యార్థిని. కవితలు,కథలు బ్లాగు మొదలెట్టారు ఈ మధ్యే.





ఎవరిది ఊరు అని చర్చకు వచ్చినప్పుడు ఇక్కడ నిషిగంధ, సుజాత, స్వాతి, వాణి, తెరెసా వీళ్లందరు విజయవాడ వాస్తవ్యులే. విజయవాడకు చాలా దూరంలో ఉన్న నిషిగంధ " విజయవాడ చెందిన బ్లాగర్లందరిని హగ్గులిచ్చుకోమన్నారు. ఆ ఊరి పేరేత్తితే పూనకమోస్తుంది " అని కాస్త బాధపడ్డారు. కాని సుజాత (మనసులోమాట) " నీది హైదరాబాదు, నాది హైదరాబాదు అని ఎవరూ మురిసిపోరు. ఎందుకంటె హైదరాబాదు అందరిది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్నారు" అని చెప్పారు.



ఇక ముందుగా చర్చ జరిగింది నేను ఇచ్చిన ఈ విషయం మీద.


మీరు మీ పేరుతో మాత్రమే గుర్తింపు పొందాలనుకుంటారా? లేక మీ భర్తపేరు కూడా మీ పేరుతో కలిపి చెప్పుకుంటారా?


దీనికి అందరు తమ పేర్లతోనే పిలవబడాలి అని అనుకున్నారు. ఒక్క స్వాతి తప్ప. తను వాళ్ళాయన పేరుతో కలిపి చెప్పుకోవడమే ఇష్టమని చెప్పింది. మిగతావాళ్ళు అవసరార్ధం (వీసా లాంటి వాటికోసం) భర్త పేరు కలిపి రాయాల్సొస్తుంది.కాని మా పేరుతో పిలవబడడమే మా కిష్టం అన్నారు. నేను కూడా పోస్టల్ అడ్రస్ లో తప్ప మావారి పేరు కలిపి నా పేరు రాయను. ఎందుకంటే ఒక వేళ మిగతా అడ్రస్సులో ఏదైనా తప్పు ఉంటే మావారి పేరు చూసే (అయనకు ఎక్కువ మెయిల్స్ వస్తాయిగా్) పోస్ట్ మాన్ గుర్తుపడతాడని కొండగుర్తు అన్నమాట. లేకుంటే నా పేరు జ్యోతి అని చెప్తాను. బ్లాగుల్లో మాత్రమే జ్యోతి వలబోజు అని రాయడం ఇష్టపడతాను.



ఇక తర్వాత ఎవరికి హీరో ఇష్టం అన్న విషయం వస్తే.. రాధిక మహేష్ బాబుకి వీరాభిమాని అని తెలిసింది. తన గదిలో మహేష్ బాబు పోస్టర్ కూడా అంటించుకుందంట. వాళ్ళాయనకి మాత్రం మహేష్ బాబు పేరెత్తితే కోపం దడ. అందుకే మాలతిగారు MB అని పెట్టుకుంటే megabytes అనుకుంటాడు . ఎలాగూ సాఫ్ట్ వేర్ ఇంజనీరు కదా.నువ్వు మహేష్ బాబు అనుకో అని మంచి అవిడియా ఇచ్చారు. స్వాతి " ప్రభాస్ లాంటి పొడుగైన భర్త రావాలని కలలు కన్నా కాని చంద్రమోహన్ లాటి భర్త దొరికాడు . పేరు బావుంది (చక్రవర్తి) అని సరిపెట్టుకున్నా. కాని మావారు చాలా బాగుంటారు" అంది. సుజాత (మనసులో మాట) "స్వాతి నీ భర్త నంబరు ఇవ్వు పని ఉంది" అనగానే "ఇలా అన్నానని ఆయనతో చెప్పొద్దు" అంది స్వాతి. ఇక నిషిగంధ కి వాళ్ళాయన అభిమానించే డేమీ మూర్‍ని ఏమి అననంతవరకు తను ఎవరిని అభిమానించినా ఓకే అంట. ఇక నాకు ఐతే సీనియర్ ఎన్.టి.ఆర్ కంటే అందగాడు ఇంతవరకు కనపడలేదు అని చెప్పా. తెరెసా కూడా నాతో ఏకీభవించారు. మావారికి కూడా ఎన్.టి.ఆర్ అందంగా ఉంటారు. సొ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నిజంగా మొగుళ్లని ఆడిపోసుకుంటాము గాని మంచి వాళ్ళే.


మధ్య మధ్యలో గార్లు వడ్డించబడ్డాయి. కొత్త కదా.. రాధిక "కోపముంటే నన్ను కొట్టండి కాని గార్లు పెట్టి తిట్టకండి. కావాలంటే మా ఇంటికొస్తే మంచినేతిలో చేసిన గారెలు వడ్డిస్తా" అంది. వరూధినిగారు ప్రశ్నలు వేస్తూ అందరినీ మాట్లాడేలా ప్రోత్సహించారు. ఒక నిమిషం మాటలాపినా శిక్ష పడుతుంది [టైం అవుట్]. అందుకు మనసులోమాట సుజాత గారు తెగ మాట్లాడుతూ వున్నారు. అలాగే రాధిక వాళ్ళ అబ్బాయి సాహిత్ ఫోటోలు చూసేసాం అందరం. సుజాత (మనసులో మాట) నామినిగారితో తన పరిచయాన్ని, అభి్మానాన్ని గురించి చెప్పారు.



అప్పటికే మూడు గంటలైంది సమావేశం మొదలుపెట్టి. టీ సమయంలో మొదలుపెట్టి భోజనాల టైమ్ వరకు సమయం ఎలా గడిచిపోయిందో తెలీలేదు. మా అందరి సామ్రాజ్యాలను చేరే సమయం దగ్గరపడింది. అంటే ఇక్కడివాళ్ళకు రాత్రి వంట, అక్కడివాళ్ళకు లంచ్ వంట. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా? మొదటిసారి కాబట్టి అందరు పరిచయాలు చేసుకుని ఒకరినొకరు తెలుసుకుని కాస్త దగ్గరయ్యారు. రోజు మాట్లాడుకునే కన్నా వారానికొకసారి కలిస్తే చాలా కబుర్లు ఉంటాయి అని ఒప్పుకున్నారు అందరూ. వచ్చేసారి ఏ విషయం మీద చర్చిద్దాం అనేది ముందే నిర్ణయించుకుంటే అందరు దాని మీద ఆలోచించుకోవచ్చు అని మాలతిగారు సలహా ఇచ్చారు. మనమందరం కలిసి మాట్లాడుకోవడంతోపాటు అప్పుడప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిని అతిథిగా పిలిచి మనకు వచ్చిన సందేహాలు అడిగి తెలుసుకుని (అప్పుడప్పుడు ఉడికించి , వేయిస్తే ) చర్చిస్తే బాగుంటుంది కదా అన్న నా ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. సుజాత గారు ముందు బ్లాగ్ విదూషకుడు విహారిని పిలిస్తే బాగుంటుంది అన్నారు. ఇక అందరు వెళ్ళిపోతుండగా జాహ్నవి వచ్చింది. సత్యవతిగారు చాలా లేట్‍గా వచ్చారు. అప్పటికి ఎవరూ లేరు.



ఈ మహిళా సమావేశానికి రావడానికి సాహసించే ధీర, వీర విక్రమ శూరుడు ఎవరైనా ఉన్నారా? పద్మవ్యూహంలో అభిమన్యుడిలా మేము అడిగే ఏ అంశంలో నైనా సమాధానం చెప్పగలవారు ఎవరున్నారు? ??? కాని ఈ అతిథి ఎవరు అనేది సమావేశం పూర్తయ్యాక తెలుస్తుంది.



కాని కరెంట్ సమస్య జాహ్నవిని చివర్లో వచ్చేలా చేసింది. క్రాంతి ఒక్క నిమిషం మాత్రమే వచ్చి వెళ్ళిపోయింది. నాకు కూడా గంట సేపు పవర్ కట్. ఉఫ్.. ఎవరి దిష్టి తగిలిందో???



నివేదిక చాలా పెద్దగా ఉంది కదా. మరి ఆడాళ్ళ ముచ్చట్లంటే ఇలాగే ఉంటాయి. హైదరాబాదులో ఉండే అమెరికా, జపాన్, అంతరిక్షం, నవగ్రహాలు అన్నీ చుట్టి వస్తాయి.

36 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

మీ సమావేశం వ్జిజయవంతంగా జరిగినందుకు అభినందనలు. మీ నివేదికలో .. ఫలాని విషయం ఫలాని వారు అన్నారు అంటూ రాసిన వాక్యాలు గజిబిజిగా ఉన్నాయి .. ఎవరేమి అన్నారో అర్ధం కాలేదు.

krishna

How to participate in this ?
Can you pls let me know?

Unknown

వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న అందరు మహిళ్లా బ్లాగర్లు ఒక చోట కలసి సరదాగా గడపడం గొప్ప విషయం.ఏ ఈనాడు వసుంధర వారికో, నవ్య వారికో ఉప్పందిస్తే వారికి మీరందరూ చేసిన ఈ వినూత్న ప్రయత్నం చక్కని ఇన్ పుట్ అవుతుంది. మీటింగ్ చాలా బాగా జరిగినట్లు ఉంది. అనామకులు రాకుండా సెక్యూరిటీ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలూ బాగున్నాయి. ఇలాగే మున్ముందూ కలుస్తూండండి.
- నల్లమోతు శ్రీధర్

Ramani Rao

ప్రమదావనిలో, పవర్ కట్ , పడతుల పవరేంటో, పరిచయంలేక పరిమితి పాటించలేదేమొ, పలుసార్లు పని కట్టుకొని మరీ పోయినట్లుంది. బాధపడకండి జ్యోతిగారు మొదటి సమావేశ విజయాభినందనలు. మొత్తానికి మొదటి సమావేశం కావడం వల్లనేమో పరిచయాలు మాత్రమే కనిపిస్తున్నాయి సమీక్షలో. ద్వితీయ విజ్ఞం లేకుండా రెండో సారి కలిసినప్పుడు మహిళాలోకం లో మగువ పవర్ ఎంటో చూపించాలండీ! పవర్ కట్ ఉన్నా ప్రమిదలతో కొనసాగించేద్దాము. అడిగిచూడండి ప్రత్యామ్నాయం, ప్రతిభ కల సాంకేతికా పరిజ్ఞానులని. మొత్తానికి మీ ఆలోచన అధ్భుతం.

నిషిగంధ

జ్యోతి గారూ, ప్రమదావనం విశేషాలు అన్నీ చక్కగా చెప్పారు.. మీ ప్రార్ధన సూపర్ :-) నిజంగా వీవెన్ గారికి ఎంతో ఋణపడిఉన్నాం!
మూడుగంటల సమయం అస్సలెలా గడిచిపోయిందో తెలీలేదు.. మొదటిసారైనా పెద్దగా మొహమాటం లేకుండా అందరం చాలా సరదా సరదా గా మాట్లాడుకున్నాము :)

నిషిగంధ

జ్యోతి గారూ, ప్రమదావనం సమావేశం విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకులైన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

vasantam

జ్యోతి గారూ,
మొత్తానికి దిగ్విజయంగా సమావేశం జరుపుకున్నారన్నమాట.
ప్రార్ధన బావుంది.
అభినందనలు.

రాధిక

ప్రార్ధన అదిరింది.అన్ని విశేషాలూ కూర్చారు.కానీ మీరు లేనప్పుడు విశేషాలను ఎవరు సేవ్ చేసారు.నేను పంపినవి ఇంత వివరంగా లేవు కదా.
చిన్న సవరణ.మావారి పేరు బ్రహ్మి కాదండి.మావారి ఉద్యోగం "బ్రహ్మి"[పోకిరిలో బ్రహ్మానందం చేసేది-సాఫ్టువేర్ ఇంజనీర్]
మంచి స్నేహితులని కలుసుకునేలా చేసిన జ్యోతిగారికి ధన్యవాదాలు.వీవీన్ కి కూడా.

సుజాత వేల్పూరి

జ్యో తి గారు,
మీరు మళ్ళీ confuse అయ్యారు. నేను మనసులో మాట సుజాతని. మాది నరసరావుపేట (గుంటూరు జిల్లా). మా వారిది భీమ వరం. గడ్డి పూలు సుజాత గారిది వైజాగ్. వారి భర్త గారిది భువనేశ్వర్.

పోతే, ప్రార్థన అదిరిపోయింది.

జ్యోతి

కొత్తపాళిగారు, అసలు ముచ్చట్లు నేను రాసినదానికంటే మూడింతలు ఉన్నాయి. మొత్తం ఎడిట్ చేసేసరికి ఇలా జరిగింది. నిజంగా అందరు చాలా సరదాగా మాట్లాడుకున్నారు. కొత్త అనేది లేకుండా.

కృష్ణుడుగారు, ఇది మహిళలకు మాత్రమేనండి. సారీ.

శ్రీధర్, ప్రయత్నిద్దాం. ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారిని మాలో చేర్చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రమణి, పవర్ కట్ మా ఇళ్ళల్లో అండి. ప్రమదావనంలో కాదు.అక్కడ మిగతావారు కబుర్లాడుతూనే ఉన్నారు.

MORE FUN TO COME...

Kathi Mahesh Kumar

ప్రార్థన, అందరూ చెప్పినట్టు "అదిరింది".
తెలుగు బ్లాగు సృష్టి, స్థితి,లయ కారకుడైన వివెన్ గారికి ఆమాత్రం గౌరవం ఇవ్వల్సిందే. ఈ ప్రార్థనని మా తరఫు నుంచి కూడా "డిటో" అనేశాం!

teresa

That's a concise summary of the long chat! Thanks for the invitation jyothi, I had a good time interacting with a friendly group. keep it going.
Ditto for the prayer too :)

krishna

జ్యోతి గారు,

నేను ప్రమదనేనండి.నా పేరు కృష్ణ...మా పెద్దవాళ్ళు,మా తెలుగు టీచరు ననను అలా పిలిచేవారు.అందుకే అలా పెట్టుకున్నాను.

maa godavari

జ్యోతి గారూ
మీ నివేదిక బావుంది.అనుకోకుండా బయటకు వెళ్ళడం వల్ల మీతో కబుర్లు మిస్ అయ్యాను.ప్రమదావనం ఆలోచన అద్భుతమండి.తెలుగు రచయిత్రుల్ని కూడ ఇందు లో కలపడానికి నేను ప్రయత్నాలు మొదలెట్టా.మీ ప్రార్ధన బావుంది.వచ్చే వారం కలవడానికి ప్రయత్నిస్తా.

Rajendra Devarapalli

అడ్డెడ్డె ఈలెక్కన మా ఆవిడ చాలా మిస్సయ్యిందన్న మాట.కానీ ఇంకొన్ని ప్రమదావనాల తర్వాత కానీ తను మీతో కలవలేదు.అప్పటికీ ఆ మూడు నాలుగు గంటలూ పరుగు,కంత్రి,జల్సా వీటిల్లో ఏదో ఒక సిన్మాకు వెళ్ళొస్తా అని కూడా చెప్పా,అలాగైతే అసలొద్దు,క్షేమంగా ఇంటిపట్టునుండు అని ఆపేసింది.
మొత్తం మీద మహిళాబ్లాగర్లలో అధికులు బెజవాడ వాస్తవ్యులన్న మాట.కానీ ఈ ఐడియా వచ్చిన జ్యోతి,సాంకేతిక సహకారం అందించిన వీవెన్ కు అలాగే మిగిలిన వారికందరకూ నా హృదయపూర్వక అభినందనలు,ఇలాంటి విన్నూత్న ఆవిష్కరణలు మన బ్లాగర్లు ఇంకా ఎన్నెన్నో ముందుకుతీసుకు రావాలని నా ఆకాంక్ష.

Anonymous

మొదటి సమావేశం జరిగినందుకు అభినందనలు. ఈ స్పిరిట్ ను ఇలాగే కంటిన్యూ చేసి వచ్చే సంవత్సరానికి సంఖ్యను రెండింతలు చెయ్యండి.

-- విహారి

దైవానిక

ముచ్చట్లు బాగున్నాయి. ఆ విద్యుల్లత మాత్రం బాగా కరుణించలేదన్నమాట.. పోనీలెండి వచ్చె వారం ఆడ్డులేకుండా సాగిపోవాలని ప్రార్థిద్దాం.

cbrao

అక్కా! ప్రార్థన బాగుంది.నువ్వు నాకు నచ్చావ్.సమావేశం సాంకేతికంగా, ప్రపంచాన్నే ఒక డ్రాయింగ్ రూం గా మార్చి,విజయవంతంగా నిర్వహించినందులకు, అభినందనలు.మీ అమ్మాయి దీప్తా. మా అమ్మాయి కూడా దీప్తే.దీప్తి చిత్రం నా టపాలలో చూసే వుంటావు. ఆకాష్ దీప్తి కొడుకు. మేఘన టపాలో ఇద్దరినీ చూడొచ్చు.

జ్యోతి

విహారి,
థాంక్స్. వచ్చే సంవత్సరం కాదు రెండు మూడు నెలల్లోనే ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నా. మీ ఆవిడని పంపించకూడదు.. అలాగే మాకు అతిథిగా వస్తావా ఒకరోజు. భయపడకు మీ ఆవిడ నీ పక్కనుంటుందిగా. సరదాగా చర్చించుకోవచ్చు.

రావుగారు,
ధన్యవాదాలు. సాంకేతికంగా మనకు దొరికిన అవకాశాన్ని ఇలా సద్వినియోగపరుచుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారితో సమావేశం జరుపుకోవడం ఉద్యోగం చేసే మృదులాంత నిపుణులే కాక మనమందరం కూడా చేయొచ్చు అనే ఆలోచనతో ఈ సమావేశాలు మొదలెట్టాను. మీకు తెలిసిన ప్రముఖ మహిళలు (మీ ఆవిడతో బాటు) ఈ సమావేశానికి ఆహ్వానించండి.


నిజంగా ఈ సమావేశంలో నేను మాత్రం చాలా ఎంజాయ్ చేసాను. తర్వాత నన్ను నేనే అభినందించుకున్నా. ఇంత మంచి ఐడియా రావడానికి ఏం తిన్నానబ్బా అని ఆలోచిస్తే నేను చేసిన వంటలు బాగోలేవని విసుక్కుంటూ మావారు చేసిన టమాట పప్పు తిన్నానని గుర్తుకొచ్చింది. అందుకే ఇంత సూపర్ ఐడియా వచ్చిందని అర్ధమైంది.

Sujata M

జ్యోతి గారు.. ఇపుడు కుడా సుజాత ల విషయం లో తికమక ఉందన్నమాట. టైం ఔట్ అయిపోతుందేమో అని.. తెగ మాట్లాడింది... నేను. అయినా.. మా వ్యక్తిగత పరిచయాలు మీరు ఇక్కడ అందరి ముందూ పెట్టేస్తారనుకోలేదు. 'ప్రమదావనం' మనదీ.. మగవాళ్ళకు ఎంట్రన్స్ లేదు అన్నారని.... ఇపుడు ఇలా.. మీరు ఆ విశేషాలన్నీ (హీరోలూ, పరిచయాలూ..మన జోకులూ అన్నీ) .... తూ.. చ.. తప్పకుండా చెప్పేస్తారనుకోలేదు. వచ్చే వారం.. నా పేరు మార్చుకుని లాగిన్ అవుతాను. మీ సహాయంతో తెలుగు కూడా నేర్చుకుని.... నా బ్లాగు కి కుడా ఒక 'మాకే over' ఇస్తాను. మీకు, వీవెన్ గారికీ పెద్ద పెద్ద వీరతాళ్ళు!

Sujata M

Sorry.. naa blag ku oka 'Make OVer' istanu.

జాహ్నవి

నమస్కారం
నేను ఈసారి విద్యుత్తు సమస్యతో రాలేకపోయాను. ఇక ముందు ఉద్యోగవెతుకులాట లో రాలేను. మళ్ళీ నేను వచ్చేది విద్యార్దిని గా కాదు. ఉద్యోగినిగానే అంతవరకు రాలేను మరి. అంత వరకు నా బ్లాగుకు కూడా శెలవు. ఈరోజే నా బ్లాగులో నేను ఆఖరి పోస్ట్ చేయబోతున్నా విద్యార్దినిగా. మళ్ళీ ఉద్యోగినిగా చేస్తాను పోస్ట్.

అంత వరకు శెలవు మరి.

Souju

బగున్ది జ్య్యొతిగారు మొత్త మొదతి మహిల్లామన్దాలి సమావెసము, ఈసారికి మిస్సాయ్యాను కాని మరూసారి ఈలాగ జారగదు.


సౌజన్య

జాహ్నవి

ee power samasyato nenu emi miss ayyano meeru chepparu. ayyo participate cheyalekapoyane ani bhadhagaa anipinchinaa pramadaavanam lo modatisaare moggato paatu navvula puvvulu kooda vikasinchinanduku aanandam gaa vundi. ee samaavesaalu ilaane eppatiki jaragaalani korukuntunna. saanketikamgaa sahaayam chesina veeven gaariki dhanyavaadamulu.

మాలతి

సుజాత (మనసులోమాట) అన్న సందేహమే నాకూను. మహిళలోకోసం ప్రత్యేకం, మనలోమనం స్వేచ్ఛగా మటాడుకోడానకి అంటూ ఓసమావేశం పెట్టుకుని, జరిగినసంభాషణలన్నీ ఇలా పబ్లిక్ చెయ్యడం సబబు కాదనుకుంటా. సుజాతా, పేరు మార్చుకున్నా మనసులో మాట మనసులోనే దాచుకోండి ఎందుకేనా మంచిది. :)

జ్యోతి

మాలతిగారు, మనం మాట్లాడుకున్నవి అన్నీ ఈ నివేదికలో రాయలేదు. కొన్ని మాత్రమే. లేకుంటే అందరు అనరా? ఇంత హంగామా చేసి మీరు ఏం మాట్లాడుకున్నారు? అని. అలాగే మన సమావేశాలకు రాని మహిళలకు కూడా ఇక్కడ జరిగే చర్చలు, అల్లరి తెలియాలి కదా. అప్పుడు వాళ్ళకు కూడా ఆసక్తి కలుగుతుంది. మనలో చేరాలని ..

సుజాత వేల్పూరి

మాలతి గారు,నేను మనసులో మాట సుజాతని.
మళ్ళీ confusion ! ఆ అభిప్రాయం వెలిబుచ్చింది గడ్డిపూలు సుజాత గారు!

ఏకాంతపు దిలీప్

@జ్యోతిగారు

మామూలుగానే పది మంది అమ్మాయిలు ఒక చోట చేరితే అదిరిపోతుంది.. అలాంటిది పది మంది తెలివైన రచయితలు ఒక చోట చేరారంటే ఎంత హుషారుగా గడిపారో అర్ధం చేసుకోవచ్చు... మీ గుంపు మరింత మంది మహిళల్ని భావ ప్రకటనా దిశగా ఉత్తేజితం చేస్తుందని ఆశిస్తున్నాను...

మాలతి

సారీ సుజాతా. నాపొరపాటే.

Bolloju Baba

బ్లాగులోకంలోకి కొత్తగా అడుగుపెట్టి చాలా షాకులు తింటున్నాను. ఇదొకటి. ఒక వెబ్ పత్రిక వాళ్లవద్దకు వెళ్ళి మీ బ్లాగు బాగుందన్నాను. నవ్వి పోయారు. మా ఫ్రెండ్ కి నేను క్రియేట్ చేసింది బ్లాగన్న విషయం తెలియక ఒక వెబ్ సైట్ క్రియేటు చేసుకున్నాను అని చెపితే వాడు నవ్వి చచ్చాడు.

ఇప్పుడీ అంతర్జాల, అంతర్జాతీయ మహిళా బ్లాగర్ల సమావేసమా? కాంసెప్టు అర్ధమై చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా బాగుంది. ప్రయత్నం.

తెలుసుకొన్న మరొక విషయం ఏమిటంటే బ్లాగులోకానికి సృష్టి, స్థితి, లయకారకుడైన వివేన్ గారిగురించి.
మంచి విషయాలు తెలిసినయ్. థాంక్స్

బొల్లోజు బాబా

జ్యోతి

బాబా గారు, ఎలాగైతేనేమి నా బ్లాగుకు వచ్చినందుకు సంతోషం.
అవన్నీ పట్టించుకోకండి.నవ్విపోదురుగాక నాకేంటి? అని మీ పని మీరు చేసుకొండీ.

మాలతిగారు, ఈ సుజాతల విషయంలో ఏదో ఒకటి తేల్చాలి. లేకపోతే సమస్యలు వచ్చెస్తాయి. అమ్మో! కన్ఫ్యూషన్..

Srividya

జ్యోతి గారు బావున్నాయండి ప్రమదావనం విశేషాలు.నేను చాలా మిస్ అయిపోయాను అనిపిస్తుంది.ఈ సారి నన్ను కూడా పిలవండి.

Naga Pochiraju

ఈ సమావేశాలు ఎక్కడ,ఎప్పుడు జరుగుతాయో తెలుపగలరు

Anonymous

అరే, ఇన్నిరోజులూ నేనిది చూడనేలేదే? ఏమండీ జ్యోతిగారూ! మహిళాబ్లాగరుల మీటింగన్నారు. ఇప్పుడు మగవాళ్లను కూడా పిలుస్తున్నారు కానీ మీ అంత స్పీడుగా కాకపోయినా సంవత్సరం నుంచి బ్లాగుతున్నా కదా? ఇతరుల బ్లాగుల్లో కూడా అడపాదడపా యథాశక్తి వ్యాఖ్యలు కూడా రాసి ప్రోత్సహిస్తున్నా కదా? మరి నాకు చెప్పకుండానే, నన్ను పిలవకుండానే జరిపేస్తున్నారేమిటండీ? ఈసారైనా నన్ను పిలుస్తారు కదూ? నా మెయిలైడీ తెలియకపోతే sugaatri (at) gmail (dot) com.

జ్యోతి

లలిత గారు, సుగాత్రి గారు,
మీకు నేను సారీ చెప్పను.నాకు మెయిల్ చెయ్యమని ఎప్పుడో అడిగాను.అలా చేసినవారందరికి ఎంట్రీ పాస్ ఇచ్చాను. మళ్ళి మళ్ళి అడిగాను కూడా. మీ బ్లాగులలొ మెయిల్ ఐడి దొరకదు. ఏమ్ చెయ్యను.ఐన ప్రతి వారం ఉంటుందిగా.
లలిత గారు మీరు నాకు మెయిల్ చెయ్యండి..
jyothivalaboju@gmail.com

ఇంకా ఎవరైనా మిస్ అయ్యుంటే నాకు వెంటనే మెయిల్ చెయ్యండి.

cbrao

క్రిష్ణుడు, సుగాత్రి ఆడవారేనా? సుగాత్రి అనే పేరు, ఇన్నాళ్లు, త్రివిక్రం కలం పేరనుకుంటున్నా. నేనే పొరబాటు బడ్డానా? ఈ ఇద్దరూ,ఏ ఊళ్లో వుంటారు? జ్యోతక్కా, వీళ్లను పరిచయం చెయ్యాలి, పాఠకులకు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008