Tuesday, June 10, 2008

ప్రమదావనం 5

ఈ ఆదివారం 8-6-08 సాయంత్రం హైదరాబాదులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండింది. చల్లని గాలి, పిల్ల తెమ్మెరలు. మహిళామణులు పనులన్నీ కానిచ్చుకుని, నిద్రపోయి లేచి, టి చేసుకుని ప్రమదావనానికి సిద్ధమవుతున్నారు. ఈ సారి కొత్త సభ్యురాలు సునీత (హైదరాబాదు TCS కంపేనీలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్) వచ్చారు సరిగ్గా ఐదింటికి. తనకు మంటనక్కకు తెలుగు ఎలా నేర్పించాలో చూపించి, నేరుగా తెలుగు ఎలా రాయాలో చెప్తుండగానే జ్ఞాన ప్రసూనగారు వచ్చేసారు అరగంట ఆలస్యంగా. ఎప్పుడు ఠంచనుగా టైమ్‍కి వచ్చేవారు. ఎందుకో ఆవిడ అంకోపరి అలిగిందంట. ఎవరొచ్చినా రాకున్నా , ముందుగా అనుకున్నట్టు హాట్ సీట్ పై జ్ఞానప్రసూనగారిని కూర్చోబెడదాము అని నేను స్వాతి, అనుకుంటుండగానే హాయ్ అంటూ రమణిగారు వచ్చేసారు. ఇక ప్రసూనగారిని సింహాసనం మీద కూర్చోబెట్టాం.జ్యోతి :మీ పుట్టు పూర్వోత్తరాలు. అంటే పుట్టింది, పెరిగింది. పెళ్ళి, అత్తారిల్లు….


పుట్టింది -నూజివీడులో అమ్మమ్మగారింట్లో, 12 సంవత్సరాల వరకు పెరిగింది బందరులో. 2 వ క్లాసులో డబల్ ప్రమోషన్ ఇచ్చి 4వ క్లాసులో వేసారు. ఆ తర్వాత మళ్ళీ డబల్ ప్రమోషన్ ఎందుకు చాల్లే అని ఇంట్లో కూర్చోబెట్టారు నాన్న , తాతయ్య. మా పెద్దబ్బాయి ఏడవ తరగతి చదువుతున్నప్పుడు నేను మెట్రిక్ పాస్ అయ్యా. ఆ తర్వాత హిందీ ప్రవీణ ప్రచారక్ పాస్ అయ్యా. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ తెలుగు B.A పూర్తి చేసా. 18 ఏళ్ళకే పెళ్ళి అయింది. ఇంటి పని , వంట పని రాక , ఇల్లు సర్దడం లాంటివి చేసేదాన్ని. తర్వాత మెల్లి మెల్లిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళు జ్యోతి బాలమందిర్‍లో ,మరి కొన్నాళ్ళు మాడపాటి హనుమంతరావు హైస్కూల్లో ఉద్యోగం చేసాను.


అంతలో వరూధినిగారు వచ్చారు. అందరిని తెలుగు , తెలుగు అని హెచ్చరించారు.నేను వెంటనే మారిపోయా కాని రమణిగారికి ఒక్క వారం టైమిచ్చాము తెలుగులోనే రాయడానికి. అప్పుడే తెరెసా వచ్చారు. ఇంకా నిద్రమబ్బు వీడలేదు. అందరు కలిసి ప్రశ్నలు సంధించడానికి తయారయ్యాము. ప్రసూనగారు నన్ను తన కవచంగా ఉండమన్నారు. మధ్యలో చికాగోలో వాతావరణం ఎలా ఉంది తెరెసా అడగగా, ఆవిడ అడవిపిల్లి ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో అని అన్నారు. అంటే ఆ ఊరిని అదే అర్ధంతో షిక్‍వాకో అనేవారట. బ్రిటీషువాళ్ళు దానిని చికాగోగా మార్చారు. అదీ చికాగో అసలు కథ.


వరూధిని : బ్లాగు రాయడానికి మీకు ప్రేరణ ఎవరు ??


నాకు ప్రేరణ మా చిన్నబ్బాయి వాడి ఫ్రెండ్.


రమణి : ప్రసూనగారు నేను ఓ ప్రశ్న అడగనా?


అడగండి. వణుకు మొదలైంది. దుప్పటి పక్కనే పెట్టుకున్నా.


రమణి : పెళ్ళయిన కొత్తలోగాని, ఆ తర్వాత గాని , మీ ఇంటికి మీవారివైపు చుట్టాలు వస్తే మీవారి రియాక్షన్ ఎలా ఉండేది. మీకు అంతగా వంట రాదన్నారుగా. మరి ఆ ప్రవాహాన్ని ఎలా తట్టుకున్నారు.


పెళ్లయిన కొత్తలో పని సరిగ్గా రాదు. కాని మా ఇంట్లో ఒక దంపతులు ఉండేవారు . వారు అన్ని చూసుకునేవారు. తర్వాత నేను నేర్చుకున్నాను. ఒకసారి కొలతలతో అన్నం ఎలా వండాలో తెలీక కాస్త తికమక జరిగింది. తర్వాత నా స్నేహితురాలు అచ్యుత మనుష్యులకు తగ్గట్టుగా కొలతలతో ఎలా వండాలో చూపించింది. ఈ మగవాళ్లెప్పుడు ఇంతే అర్ధం చేసుకోరూ !!!..


జ్యోతి : ప్రసూనగారు సుఖసంసారానికి ఒక విజయ రహస్యం చెప్పండి.


సంసారం బాగా వుండాలంటే అర్ధం చేసుకోవడం, చేసిన పనికి వారిని వీరు, వీరిని వారు ఆనందం ప్రకటించడం సర్దుకుపోవడం,సహకరించడం ముఖ్యంసర్దుకుపోవడం అనేది రెండువైపులా ఉండడానికి మగవారిలో ఇంకా మార్పు రావాలి. భార్య శక్తిసామర్ధ్యాలు అంచనా వేసినా ఆనందించలేకపోతున్నారు. సాయం చేస్తే లోకువ అనుకుంటున్నారు.


నిషిగంధ : మీకు కావలసినవి మీరే కొనుక్కునేవారా, లేక వారిని అడిగి , అనుమతి తీసుకుని కొనేవారా??


అదేమీ లేదు. కొనుక్కునేదాన్ని. కాని పిల్లలకు ఎక్కువ కొనేదాన్ని.


జ్యోతి : మీవారినుండి వచ్చిన మరిచిపోలేని కాంప్లిమెంట్?


వంగి , నన్ను వంచావే అన్నారు . (అర్ధమైందా??) కూరలో ఉప్పెక్కువైతే అరిచేవారు, బాగుంటే మాత్రం నోరు విప్పరు బాగుందని చెప్పరు. ఐన ఈ మగాళ్ళ కామెంట్ల కోసం ఎదురుచూస్తే మనకు రోజులు గడవవు.


అలా మా ముచ్చట్లు చలోక్తులతో నడుస్తుండగానే ముఖ్య అతిథి వచ్చేసారు.ఎవరా అనుకుంటున్నారా?? కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకులు శ్రీ నల్లమోతు శ్రీధర్. మా ప్రమదావనానికి ముఖ్య అతిథిగా రమ్మనగానే ఓ యెస్ అని ధైర్యంగా నాకేంటి భయం.నన్నెవరు బక్రా చేయగలరు అనే ధీమాతో వచ్చాడు. ఇక ప్రశ్నలు ,సమాధానాలు టక టక మని పరుగులెత్తాయి. అతనికి సాంకేతిక సహాయంలో ఇలా సమాధానాలు అలవాటే కదా !!. ఇక ఆడవాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళావిడతో భేటీలు అలవాటేమో అస్సలు తడబడలేదు..


కాని ఈరోజు శ్రీధర్ లోని మరో కోణాన్ని చూడడం జరిగింది అని చెప్పొచ్చు...


పలకరింపులు, స్వాగతవచనాలు, పరిచయాలు అయ్యాక అసలు కథ మొదలైంది……….


జ్యోతి: నల్లమోతు శ్రీధర్, మీ జన్మ కుండలి చెప్పండి . అందరూ షాక్ అయ్యారు. అదే పుట్టింది. పెరిగింది.మెట్టింది. ఇప్పుడున్నది


పుట్టింది బాపట్ల . చదివింది తెనాలి, విజయవాడ, ICWAI చదువు, కంప్యూటర్లలో సెటిల్

వైఫ్ భారతీదేవి, పిల్లలు ఇంకా లేరు ఉండేది కూకట్‍పల్లి .హైదరాబాదు.


వరూధిని : మాది , శ్రీధర్ గారిది ఒకే ఊరు..


సత్యవతి : ప్రమదావనంలో అడుగుపెట్టగానే ఎలా అనిపించింది


నాకు అలవాటే టెక్నికల్ చాట్‍లో. ఎంతోమందికి సమాధానం చెప్పడం


జ్యోతి : మీ ఆవిడ సూర్యకాంతమా ,సావిత్రా?


ఎప్పుడెలా ఉండాలో అలా.


జ్యోతి :ఇంట్లో పెత్తనం ఎవరిది ?


కొన్ని విషయాల్లో తనది, కొన్ని విషయాల్లో నాది.


సత్యవతి : మీకు వంట వచ్చా లేదా ? అది చెప్పండి.


అన్నం మాత్రం వండగలను. ఆమ్లెట్ వేసుకోగలను.


సత్యవతి : కంప్యూటర్ ప్రవీణులు వంట రాదా?


ట్రై చేసా కాని. మా ఆవిడే నువ్వు వస్తే డబుల్ పని అవుతోంది అని రానివ్వలా వంట గదిలోకి

ఏదో కింద పడవేస్తాను తను తిడుతుంది


జ్యోతి :కంఫ్యూటర్ , మీ ఆవిడ ఇద్దరు భార్యలలో ఎవరు పెద్ద నీ జీవితంలో


ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది కంప్యూటర్ తో, ఎక్కువ మైండ్ స్పెండ్ చేసేది మా భార్యతో


సత్యవతి : ఇంటిపని, వంట పని పట్ల మీ అభిప్రాయం?

నిజంగా ఆడవాళ్ల శ్రమకు విలువ కట్టలేమండీ చాలా గొప్పవాళ్లు ( ఎంత చతురుడో !.. ఈ మాటతో అందరిని ఫ్లాట్ చేసేసాడు)..


నిషిగంధ : Full offence ఆడేస్తున్నారుగా పొగడ్తలతో..


నిజమే చెబుతున్నానండీ నా ఒపీనియన్


సత్యవతి : పొగడ్తలు కాదు వాస్తవాలు కావాలి.


వాస్తవాలేనండీ అవి


సత్యవతి :నాకు కనీసం ఈ జనరేషన్ మగాళ్ళైనా నాకు వంట వచ్చు, ఇంటిపని చేస్తాను అని అంటారని ఆశ..


ఈ ముప్పేట దాడి చూసి వరూధినిగారు జాలిపడి. శ్రీధర్ కి సపోర్ట్ ఇస్తా అన్నారు. (ఎంతైనా ఒకే ఊరు కదా). ప్రాంతీయాభిమానం..ఏం చేస్తాం.


జ్యోతి : ఎటువంటి ప్రతిఫలం లేకుండా అందరికి సహాయం చేయడంలో నీ ఆలోచన ఉద్దేశ్యం?


మన లైఫ్ కంటూ మీనింగ్ ఉండాలి అన్నది. ముఖ్యంగా నేను చాలా దారుణమైన స్టేజ్ నుండి నార్మల్ మనిషిగా మారాను... సో.. పరివర్తన ఫలితం ఇది


వరూధిని : మీ జీవితాన్ని తిరిగి రాయడంలో మీ ఆవిడ పాత్ర గురించి చెప్పండి.


తనకు నా ప్రొఫెషన్ మాత్రం అసలు నచ్చదు. కానీ తను సపోర్ట్ చేస్తుంది చాలా బాగా.కంప్యూటర్లు, లాజిక్ థింగ్స్ అంటే తనకు నచ్చదు. తనది క్రియేటివ్ థింకింగ్


జ్యోతి : ఎక్కువగా దానికే అంకితమైపోతున్నావనా.లేక ఆదాయం లేదనా?


ఆదాయం గురించి తనకు, నాకు ఎప్పుడూ పెద్ద ఆలోచన ఉండదు


నిశిగంద : మీరు పుస్తకాలు ఎక్కువగా చదువుతారా?


చదువుతాను యండమూరివి, చలం బుక్స్ ఎక్కువ. చాలా ఫ్రాంక్ గా ఉంటుంది తన రచనాశైలి .

వరూధిని నల్లమోతు శ్రీధర్, మీరు మారాక పెళ్ళి అయిందా, పెళ్ళి అయ్యకా మారారా??


అలవాట్ల విషయంలో పెళ్లి అయ్యాక మారాను, లైఫ్ లో మారేజ్ కి ముందే ఛేంజ్ వచ్చింది


జ్ఞానప్రసూన : అలవాట్లు ఎవరో చేస్తారు కాని, ఎవరూ మార్చలేరు. వారికే ధృడ నిశ్చయం రావాలి.


నిషిగంధ: మనం అలవాటుని కంట్రోల్ చేయగలిగేటంతవరకు అది చెడుగా మారదు. ఎప్పుడైతే అది మనల్ని కంట్రోల్ చేస్తుందో . అదే ఉంటుంది.


జ్యోతి : నీ జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తి ఎవరు??


మా అమ్మ, తాతయ్య, అమ్మమ్మ


వరూధిని: మీరు అలవాట్లకి బానిస అవటానికి కారణం.


చిన్నతనంలో తెలియనితనం, పేరెంట్స్ లేకపోవడం


జ్యోతి : పాత అలవాట్లు మళ్ళి మొదలెట్టవని నమ్మకముందా . ఏదైనా బలహీన క్షణం వచ్చినా , బాధ కలిగినా


అంత సీన్ లేను నా లైఫ్ నా చేతిలో ఉంటుంది ఎప్పుడూ


వరూధిని: మీ అనుభవంతో ఇప్పటి యువతకి మీరు counselling ఏమైనా మొదలుపెట్టే ఆలోచన ఉందా..


ఇప్పటి యువతకు కౌన్సెలింగ్ ఇవ్వవలసిన అవసరం లేదన్పిస్తోంది. దాదాపు మిడిలి క్లాస్ యువత రెస్పాన్సిబుల్ గానే ఉంటున్నారు


వరూధిని : లేదండి, అప్పుడైనా ఇప్పుడైనా కొంతమంది ఉంటుంటారు..


మెయిన్ వీలైనంత టీమ్ నిర్మించి డిఫరెంట్ ఏక్టివిటీస్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. దాదాపు ఇప్పుడు వందమందికి పైగా మంచి టీమ్ రెడీ అయింది. కొద్దిగా ప్రొడక్టివ్ గా అందరం వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏమైనా చేయవచ్చు సోషల్ కాజ్ కి


వరూధిని: మీ ముఖ్య కార్యక్రమాలు ఏమిటొ కొంచం వివరిస్తారా..


ప్రస్తుతం టెక్నికల్ నాలెడ్జ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలా చేయడం. తర్వాత వాలంటీర్ గా సర్వీస్ ఓరియంటెడ్ ఏక్టివిటీస్ ఏమైనా.. కాలం గడిచేకొద్దీ మరింత మంచి చేరేకొద్దీ


వరూధిని మీ target group ఎవరు..


ఏదైనా మంచి పనిచేయడమే పర్టిక్యులర్ గా వీరికోసం వర్క్ చేయాలని ఏమీ కాదు


జ్ఞానప్రసూన : మంచిపని చేయాలనే మంచి ఉద్దేశ్యంతో మీరు మంచిగా ముందుకు సాగి అందరిని మంచిబాటలో నడిపించాలి.


జ్యోతి : సాంకేతికంగా నువ్వు ఎలాంటి మార్పులు, అద్భుతాలు చేయవచ్చు అనుకుంటున్నావు


సాంకేతికంగా అద్భుతాలు చేయడం వల్ల కాదు కానీ, సాంకేతిక జ్ఞానాన్ని మరింత విస్తృతం చెయ్యడానికి వర్క్ చేస్తున్నాను


వరూధిని: మీకు జీవితంలో అత్యంత ఇష్టమైన పని ఏది..computer పని కాకుండా


అసలు నా ఇష్టాఇష్టాలు నాకే ఇంతవరకూ తెలియవు. నిజం నాకేది ఇష్టమో ఎప్పుడూ నేను గమనించలేదు


జ్యోతి: రోజు అంతర్జాలం వల్ల మనుష్యుల మధ్య దూరం పెరిగిందా , తరిగిందా..


దూరం తరిగిందనే చెప్పాలి, కారణం ఇలా మనం కలవగలుగుతున్నాం అంతే టెక్నాలజీ వల్లనే కదా . ఫాస్ట్ రోజుల్లో నేరుగా కలవాలంటే వీలుపడదు కదా


వరూధిని : మీ శ్రీమతి గారి గురించి చెప్పండి.. ఊరు, ఏం చదివారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు,


తను పొన్నూరు వద్ద దొప్పలపూడి విలేజ్, BSc వరకూ చదివింది, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమో మధ్యలో ఆపేసింది . ఇప్పుడు శారీ పెయింటింగ్, గ్లాస్, ఫ్యాబ్రిక్ వంటివి అన్నీ వచ్చు..సరైన మార్కెటింగ్ సదుపాయం ఉంటే తనతో షాప్ పెట్టించాలని ఎప్పటినుండో ప్లాన్


జ్యోతి : బ్లాగులోకంలోకి వచ్చాక మీకు మంచి స్నేహితులు , శ్రేయోభిలాషులు దొరికారా ?


నాకు మంచి స్నేహితులు చాలామంది దొరికారు


జ్యోతి : నల్లమోతు శ్రీధర్, ఎవరైనా అమ్మాయి నీ మీద మనసు పడితే


మా భారతికి అప్పజెబుతా


నిషిగంధ : మనసు ఎలాగూ ఖాళీ లేదు.కనీసం స్నేహం అన్నా చేస్తారా??


స్నేహం స్నేహంలానే ఉంటే చేస్తా


జ్యోతి : ఈ సమావేశం పై నీ అభిప్రాయం..


ముందుగా ఇలా ఛాట్ మీటింగ్ నిర్వహించడం గ్రేట్ థింగ్. నిజంగా మీరంతా ఒకచోట కలవడం.ఇలా డిఫరెంట్ టాపిక్స్ పై చర్చించుకోవడం. పలుచబారిపోతున్న మానవ సంబంధాలకు ఇలాంటి చర్యలు చాలా ఉపకరిస్తాయి మరింత రిలేషన్స్ strengthen అవడానికి.. అవును, ఇంతమంది ఇలా స్పెండ్ చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ టెక్నాలజీని ఇలా మంచికీ వాడుకోవచ్చు అన్నది ఇలానే ప్రూవ్ అవుతోంది


వరూధిని: మళ్ళీ వస్తారా మీరు??


మీకు బోర్ కొట్టకపోతే మళ్లీ రమ్మంటే వస్తా . ఎన్నిసార్లయినా


నిషిగంధ : ఈ మాట మీ స్నేహితులు కొత్తపాళిగారికి చెప్పండి.


వరూధిని: ఏ కొత్తపాళిగారు రానంటున్నారా?


నిషిగంధ: రానంటం వేరు. ఫోజు కొట్టడం వేరు.


వరూధిని : భయమేమో !...


ఇలా అందరు కలిసి ముచ్చట్లాడుకునేందుకు మహత్తర అవకాశము ఇచ్చిన వీవెన్ కి అందరు మనస్పూర్తిగా జై కొట్టి అతని ప్రార్ధన ఒకసారి గుర్తు చేసుకున్నారు. తర్వాత అందరు ఒక్కొక్కరుగా సెలవు తీసుకున్నారు.


మా ఇంట్లో ఆరోజు సాయంత్రం వరకు ఉండనా ఊడనా అంటూ పాండురంగడు సినిమాలో టాబూలా డాన్సులాడిన కరెంట్ అప్పుడే ఢామ్మనిపోయింది.ఈ రోజు మిస్సైన మిస్సులు.. శ్రీవిద్య ( నేను ఎంట్రీ పాస్ పంపింది యాహూమెయిల్ కి ఐతే ,తనేమో జిమెయిల్ చూసుకుంటుంది. లైటు వెలిగి వచ్చేసారికి అందరూ వెళ్ళిపోయారు). పద్మ (పాపం.. ఈ సమావేశం ఉదయం ఐదు గంటలకు అనుకుని సెలవు రోజైనా పొద్దున్నే లేచి తయారైతే , ఆఫీసు దుర్మార్గులు వచ్చి పని చేయమన్నారంట). ఇక ఉష ఈ సమావేశం కృష్ణకాంత్ పార్కులో అనుకుని అక్కడికెళ్లారు. ఆవిడ వచ్చింది E.C.I.L నుండి. ఇంకా నయం. మన హైదరాబాదు బ్లాగర్ల సమావేశం జరుగుతుంది కాబట్టి మనవాళ్లు కలిసారు అక్కడే.. సారీ ఉష.. వచ్చే వారం గోల చేద్దాం.) ఈ రోజు అందరికి చింత కలిగించిందేమంటే. తెరెసాగారికి ప్రమదావనంలో చాలా ఇబ్బందులు కలిగాయి. ఏంటో మరి..


శుభం..

3 వ్యాఖ్యలు:

karthik

జ్యొతక్క,

చాలా బాగుంది ప్రమదావనం. మీరు ఇలాగే ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.

-కార్తీక్

kusuma

plETO racana" jE gaMTalu"lo anusariMcina Saili.praSna, javaabula paddhati.
mI mitra kUTamitO nirvahistuunna mI blogu baagunnadi.

kusuma

hello!prasuuna,ramani ityaadi mitra bRMdaMtO nirvahiMcina paddhati baagunnadi.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008