Tuesday, 17 June 2008

ప్రమదావనం లో కిరణాల వెల్లువ…

ఆదివారం 15.6.08 జరిగిన ప్రమదావనంలో మూడు వైపులా కిరణాలే. రోజు హాట్ సీట్ మీద కూర్చున్న నిషిగంధ అసలు పేరు కిరణ్మయి.కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు .. కాంతి కిరణ్ - కౌముది పత్రిక co-editor. మరొకరు హైదరాబాదుకు చెందిన కిరణ్ లక్ష్మి. Medical Transcription చేస్తారు. మాలతిగారు, జ్ఞానప్రసూనగారు కూడా సమయానికే వచ్చేసారు. తర్వాత మనసులో మాట సుజాత గారు చేరారు. నేనే అరగంట లేట్.


నిషిగంధ ఒక చిన్న సైజు రచయిత్రి. కవితలు , కథలు రాస్తుంటుంది.అసలు సిసలు బెజవాడ అమ్మాయి. ఇప్పుడు నివాసం అమెరికాలో.


సుజాత : మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎక్కడ పని చేస్తున్నారు ?


పెళ్ళి కాకముందు అమ్మా, నాన్నా, నేను, తమ్ముడు. పెళ్ళయ్యకా భర్త . యునివర్సిటీ ఆఫ్ మయామీలో సిస్టం అనాలిస్ట్. ఫ్లోరిడాలో నివాసం.


కాంతి : రచనలు ఎప్పుడు మొదలు పెట్టారు?మీకు అసలు రచన చేయాలని ఎందుకు అనిపించింది? మొదటి రచన ఎప్పుడు?


రాయడం ఎప్పటినుంచో కాని నెట్‌లో పబ్లిష్ అవడం 2005 నుండే. మొదటి రచన 8th లో అండీ.. అమ్మా వాళ్ళు ఊరు వెళ్తే ఇంట్లో నేను తమ్ముడే ఉన్నాం.. అప్పుడు ఒంటరితనం మీద రాసాను. మొదలు పెట్టాను కాని వాటిల్లో అంత పరిణితి లేదు. స్కూల్లో ఎప్పుడూ కవితల పోటీలో నేనే ఫస్ట్.


జ్యోతి : వర్కింగ్ వుమెన్ , టీనేజి కుర్రాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నావు?


ఉద్యోగం చేసే మహిళలు,, దేనిని కోల్పోవద్దు. మీకోసం కూడా జీవించండి. ఇక టీనేజి వాళ్ళకైతే స్నేహాన్ని ఆస్వాదించండి,జీవితాన్ని తెలుసుకోండి.


జ్యోతి : నీకు లభించిన విజయాల్ని ముందుగా ఎవరితో షేర్ చేసుకుంటావ్?


ముందుగా మావారితో,తర్వాత తమ్ముడితో, తర్వాత అమ్మతో.


జ్యోతి : జీవితంలో నువ్వు ఏమైనా సాధించగలిగాను అనుకుంటున్నావా. ఏంటది. నీకు నచ్చిన ప్రదేశం, దేశం ?


నిజంగా ఐతే నాకింకా ఫీలింగ్ కలగలేదు.ఇంకా ఏమీ సాధించలేదు అనుకుంటున్నా. నాకు నచ్చిన దేశం మన దేశమే. ఎంత అందమైన ప్రదేశం చూసిన మన దేశం మీద దిగినప్పుడు ఇచ్చిన అనుభూతి ఇవ్వదు.


జ్యోతి : మీ ఆయన కాక ఇంకా ఎవరైనా అబ్బాయి ILU అన్నాడా? లవ్ అంటే భయమెందుకు? లవ్ అనగానే శారీరక ఆకర్షణ తప్ప వేరే అర్ధం , ఉండదా?


అన్నారు కొంతమంది. ఒకప్పుడు బానే ఉండేది.కాని ఇప్పుడు ఎంజాయ్ అనిపించటంలేదు.


జ్ఞానప్రసూన : ప్రేమించడం తేలిక, ప్రేమించబడడం కష్టం.


జ్యోతి : జీవితమంటె నీ ఉద్దేశ్యం. వచ్చే జన్మ గురించి ఆలోచిస్తావా? నీ జీవితంలో నువ్వు idol గా ఎవ్వరినైనా అనుకుంటావా?


జీవితమంటే ఆనందంగా ఉండడం,ఎవ్వరినీ నొప్పించకుండా ఉండడం, మన పరిధిలో సహాయం చేయడం.వచ్చే జన్మ మీద అంత నమ్మకం లేదు. నా జీవితంలో idol అంటె నా తమ్ముడు. ఇప్పుడు నేనున్న enjoy this moment కి ఇన్స్పిరేషన్ అతనే. జీవితంలో చూడాల్సింది మనకంటే అదృష్టవంతుల్ని కాదు, మనకంటే దురదృష్టవంతుల్ని అని చెప్పింది తనే.


జ్యోతి : మీ ఆయన ఒకరోజు వచ్చి ,నేను ఇంకో అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. కలిసి ఉంటాము.నిన్ను కూడా ప్రేమగా చూసుకుంటాను అంటే ఏమంటావు? అడ్జస్ట్ ఐపోతావా? పోట్లాడుతావా , తంతావా? కోపం రాదా అలా చేసినందుకు. నిజమైన ప్రేమ అని త్యాగం చేస్తావా? అతడిని వదిలేస్తే తర్వాత నీ సంగతి??


మీ ఇద్దరు ఉండండి .నా దారి నాకుంది అంటాను. నాకు కోపం రాదు. మన వెనుక తెలీకుండా చేస్తే కోపమొస్తుంది. సగం ఇష్టపడుతూ నాతో ఉండడం కంటే పూర్తి ఇష్టంతో ఇంకో ఆమెతో ఉండడమే మేలు కదా.


జ్యోతి : నిషి నువు చాలా భయపడ్డ సంఘటన!!


మా నాన్నగారి మరణం. మూడు రోజులు హై ఫీవర్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయారు. ఆరోజే చనిపోయారు.H2B జాండీస్ అన్నారు.


సుజాత కూడ హైదరాబాదు వచ్చేసారు. ఇంకో సుజాత వచ్చే వారం వస్తున్నారు. జ్ఞానప్రసూన గారు కూడా హైదరాబాదే. సుజాత అప్పుడన్నారు "అందరూ హైదరాబాదు వాసులైపోతున్నారు. ఒకసారి హగ్గులిచ్చేసుకోండి. ఒకసారి మనమంతా కృష్ణకాంత్ పార్క్ బదులు I Maxలో కలుద్దామా వెరైటీగా. " నేనన్నా" కాస్ట్లీ అవుతుందేమో. మరి ఎవరిని బక్రా చేద్దాము?" సుజాత " ఎందుకు మా శ్రీని కార్డు పట్టుకొస్తా గీకడానికి" అందిపాపం శ్రీనివాస్.


జ్యోతి : నిషి ఒకరోజు నీకు నెట్ లేదు. బ్లాగులు రాయలేవు. ఏం చేస్తావు?నువ్వు ప్రపంచానికి ఏమైనా ఇవ్వగలను అనుకుంటున్నావా?ఇంకో పదేళ్ళ తర్వాత నువ్వు ఎలా ఉంటావు. చెప్పగలవా?


ముందు అయ్యో అనుకుంటా. తర్వాత మొక్కల్లో గడిపేస్తా. లేదా ఏదో సినిమా చూస్తా.నేను నిజంగా ప్రపంచానికి ఏదైనా ఇవ్వగలను అంటే నా సమయం.అది కూడా అవసరమైనవాళ్ళకే.పదేళ్ళ తర్వాత కూడా ఇప్పటిలాగే ఉంటాను. ఎందుకంటే పదేళ్ళ క్రింద ఎలా ఆలోచించానో ఇప్పుడు అలానే ఉన్నాను కాబట్టి.



తర్వాత కిరణ్ లక్ష్మి ని బుల్లి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆవిడ భర్త రవిశంకర్ గారు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి బృందంలో వేణువు వాయిస్తారు.బహుశా చాలా మంది చూసి ఉంటారు బాలు గారి ప్రోగ్రాముల్లో. కొద్ది సేపు అంతాక్షరి ఆడుకుని , నిషి చేపల వేటకు వెళుతుందని తెలిసి మా ముచ్చట్లు వంటల మీదకు మళ్ళాయి.అప్పుడు నేను కొన్ని త్వరగా అయ్యే వంటకాలు చెప్పాను. కంచి పులిహోర, టొమాటో పచ్చడి.. అల్లం వెల్లుల్లి కారం. కూరగాయలైనా ఫ్రై చేసి వేయడానికి ఒక మసాలా పొడి చెప్పాను. అలాగే వంటలు అదిరిపోవడానికి కొన్ని చిట్కాలు. అప్పుడే రాధిక, వరూధిని వచ్చారు.నేను బత్తీబంద్ కోసం వెళ్ళడానికి రెడీ అయ్యా.


తర్వాత మాలతి గారు వచ్చారు. రాధిక,మాలతి,ప్రసూన గారు ముచ్చట్లేసుకుని ఎలా కలవాలని అనుకున్నారు.

ఇంతే సంగతులు


ఇక వచ్చే వారం ప్రమదావనం షడ్రుచుల ఘుమఘుమలతో అదిరిపోవాలి. అన్నీ వంటలు, చిట్కాలు మాత్రమే మాట్లాడుకుందామా??

32 వ్యాఖ్యలు:

Srividya

అయ్యో..ఈ సారి కూడా నేను మిస్. ఆదివారం నాక్కూడా రెస్ట్ కావాలని,మా నెట్ హ్యాండిచ్చింది

SD

కొన్ని సందేహాలు:

1. మీరు బ్లాగర్లని ముఖాముఖీ చూడకుండా, 'నువ్వు' అని ఎలా అనగలుగుతున్నారు? 'నువ్వు' అనేది తెలుగులో చాలా సాన్నిహిత్యం ఉన్నవాళ్ళతోటే కదా వాడేదీ? మీ వయస్సు ఎక్కువని ఇలాగ అంటున్నారా లేకపొతే ఇది హైదరాబాదు మర్యాదా? నాకు తెల్సినంతలో హైదరబాదీలు ఇలాగే మాట్లాడతారు ('నువ్వు చెప్పలేదు సార్' అని టీచర్ తో అనడం కూడా మామూలే). వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ మీరు అని ఎందుకు అనకూడదూ?

2. మీ ప్రమదావనంలోకి మగాళ్ళు రాకూడదు అన్నారు బానే ఉంది. అలాంటప్పుడు మీరు మాట్లాడుకున్నదంతా ఇక్కడ పోస్ట్ చెయ్యడం దేనికీ? ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడ ఎక్కువ మంది లేరే.

3. ఇంకో విషయం. పెళ్ళైన ఆడవాళ్ళతో మాట్లాడుతూ మీ ఆయన రెండో దాన్ని తీసుకొస్తే ఏం చేస్తావ్ అనడం (జోకే అనుకోండీ) ఏమి మర్యాదా? జోకులకైనా కొంచెం హద్దులుండాలి కదా?

4.అన్నింటికన్నా ఇంపార్టంట్ (మీరు గుర్తుంచుకోవలసింది): ఇంటర్నెట్ మీద చాలా మటుకు సొంత పేర్లు చెప్పుకోవడం అంత మంచిది కాదు - ఎక్కడ విషయమో మనకెందుకు కానీ అమెరికాలో మాత్రం ఇది నిజం. పేరు తెలిస్తే ఇంకా అనేకానేక విషయాలు తెల్సుకునే మార్గాలున్నాయి. అందుకే చాలా మటుకు కలం పేరో, ఇంకేదో వాడతారు కదా? కానీ మీరు వాళ్ళ పేర్లు చెప్పేస్తున్నారు ఈ ప్రమదావనం చాట్ లో.

పోనీండి. కందకి లేని దురద కత్తిపీటకేల?

మీ అమ్మాయితో ఎవడో ఆఫీసులో చెత్తగా బిహేవ్ చేస్తే 'చదువుకున్న పశువులూ' అని పోస్ట్ చేసిన మీరే ఇలాగా? ....

రవి

మీరెవరో నాకు తెలీదు. ఆ మాట కొస్తే శ్రీమతి జ్యోతి గారు కూడా తోటి బ్లాగరు గానే నాకు తెలిసినది. చొరవ చేసి, ఇందులో కల్పించుకుంటున్నందుకు జ్యోతక్క గారు క్షమించాలి.

1. ఇదివరకు ఇదే టాపిక్ మీద ఓ చర్చ వచ్చిన విషయం (మిత్రుడు ప్రవీణ్ గారి టపా) జ్యోతి గార్కి తెలిసిందే. ఇక్కడ బ్లాగ్లోకం లో జ్యోతి గారు జ్యోతక్క గా ఎంతో మందికి తెలుసు. ఆమెకు పెద్దరికంతో (వయసు పరంగానే కాకుండా బ్లాగ్లోకంలో సీనియారిటీ పరంగా కూడా అనుకోండి) బ్లాగర్లను ప్రోత్సహించడం కోసం ఏకవచనంలో సంబోధిస్తున్నారనుకోవచ్చుగా. ఇందులో పెద్దగా అసంబద్ధం ఏమీ లేదే?

2. తన బ్లాగులో పక్కన వారిని నొప్పించనంత వరకు ఏది పోస్ట్ చేసుకుంటే మాత్రం ఎవరికి అభ్యంతరం ??

మిగిలిన విషయాలు గురించి చర్చించే అనుభవం, ఆసక్తి నాకు లేవు. ఇది కేవలం తెలుగు పై అభిమానంతో, బ్లాగ్లోకం లో తెలుగు కోసం పాటుపడే (అదీ ఓ గృహిణిగా ఉన్న ఓ మహిళగ) ఓ తోటి బ్లాగరు కు నా సపోర్టు.

Kathi Mahesh Kumar

నా మద్దతు జ్యోతిగారికి అర్జంటుగా ప్రకటిస్తున్నాను.

‘నువ్వు’ అని పిలవడానికి చనువుకు(అది వర్చువల్ అయినా సరే)మించిన కారణం అవసరం లేదు.ఇక జ్యోతిగారి హాస్యానికన్నా, సరదాగా మాట్లాడిన వాటిల్లోకూడా ‘విలువలు’ వెదకి మరీ జడ్జిమెంటు సజెస్ట్ చెయ్యడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.

సొంత పేర్లూ వ్యక్తిత్వాలూ దాచుకుని బ్లాగింగ్ చెయ్యల్సిన అవసరం నిజంగా ఉందని నాకైతే అనిపించడం లేదు. మరి అమెరికాలో...అని ఏదో అన్నారు. ఆ విషయం మనకు బొత్తిగా తెలీదు.

Unknown

pramadAvanAniki vacce magavArandaru, gAjulu toDukkOmani annAru. athidhulugA vaccEvAllu gAjulu toDukkoni pUlu peTTukoni vastunnAra

ఏకాంతపు దిలీప్

@జ్యోతి గారు

కలం పేరు మన తెలుగు పాఠకులకి కొత్తేమీ కాదు. చాలా మంది రచయితలకి తమ పేరుతో బయటపడటం ఇష్టముండదు.రకరకాల కారణాలు ఉండొచ్చు.

ఎవరికి వాళ్ళ పేరు చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోకూడదు అనేది ఆయా రచయితల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అలా కలం పేర్లతో ఉన్నప్పుడు మనం వాళ్ళ పేర్లని పరిచయం చెయ్యాలి అనుకుంటే వాళ్ళ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

మీరు తీసుకునే ఉండి ఉంటారు అనుకుంటున్నాను.

ఇదంతా చెప్పానని నేను అనామకులని ప్రోత్సహిస్తాను అనుకోవద్దు. ఏదో ఒక పేరుతో స్పందిస్తే మనకి వెసులుబాటుగా ఉంటుంది, మన రికార్డు కి పనికొస్తుంది. అది వారి స్పందనల కున్న నిబద్ధతని సూచిస్తుంది.

జ్యోతి

yup me గారు,

అసలు నాకు మారుపేరుతో కాని పేరులేకుండా కాని కామెంట్లు చేస్తే నచ్చవు. కాని మీరు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. నేను కొందరు బ్లాగర్లను "నువ్వు" అనేది నేను వయసులో పెద్దదాన్ని అని కాదు. సీనియర్ బ్లాగర్ని అని కాదు. వాళ్ళతో నాకున్న అనుబంధం, స్నేహం, చనువు కొద్ది. వాళ్ళే నన్ను అలా పిలవమంటారు. అది నా మీద వాళ్ళకున్న గౌరవం. ఇది హైదరాబాదు, అమెరికా కు సంబంధించినది కాదు, మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం,ఆప్యాయతకు సంబంధించినది. మిగతా బ్లాగ్లోకాల సంగతి నాకు తెలీదు కాని మన తెలుగు బ్లాగ్లోకంలో చాలా మంది ఇది virtual relationship అనుకోరు. కుటుంభ సభ్యుల్లా ఉంటారు. ఆ కుటుంబంలో నేనూ ఒకదాన్ని అని గర్వంగా ఫీల్ అవుతాను. ఐతే మీరు చెప్పారని నేను వయస్సుతో సంబంధం లేకుండా "మీరు "అని ఎందుకనాలి. నా కంటె చిన్నవాళ్ళని అలా పిలవడం నాకు నచ్చదు, పిలిపించుకోవడం వాళ్ళకు నచ్చదు.

అవును ప్రమదావనంలో మగాళ్ళు రాకూడదు అన్నాను.కాని రిపోర్ట్ ఇస్తున్నాను. అసలు మేము మాట్లాడుకునేది మూడు గంటలు. ఇక్కడ నేను ఇచ్చేది అందులో అవసరమైనది , అభ్యంతరకరం కానిది. మిగతావి పర్సనల్ విషయాలు. అవి రాయను ఇక్కడ. ఐనా అది మా సభ్యుల ఇష్ట ప్రకారం చేస్తున్నాము. నా బ్లాగులో నాకిష్టమైనది రాసుకునే అధికారం నాకుంది అనుకుంటా.

నేను హాట్ సీట్ అనే ప్రక్రియను మొదలుపెట్టింది సరదాకో, ర్యాగింగ్‌కో కాదు. అది ఒక rapid fire round వేగంగా ప్రశ్నలు అడుగుతుంటే అంతే వేగంగా, ఆలోచించి సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నల వల్ల ఆ వ్యక్తి వివిధ సందర్భాల్లో ఎలా ఆలోచిస్తాడు అన్నది బయటపడుతుంది. అంత మాత్రాన అది కుళ్ళు జోకెలా ఐంది మీకు? ఇక్కడ నేను ఇచ్చిన ప్రశ్నలు సమాధానాలు, నిషి కి, నాకు అభ్యంతరం కానివి మిగతావారికెందుకు ? ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న విషయం తనకు తెలుసు అడిగిన నాకు తెలుసు..ఇందులో చెత్తగా బిహేవ్ చేయడమేంటో మీకే అర్ధం కావాలి.

ఇక నిషిగంధ అసలు పేరు కిరణ్మయి అని మాలో చాలా మందికి ఎప్పుడో తెలుసు. అది తను దాచిపెట్టాలని అనుకోలేదు. అందుకే ఇచ్చాను. నేను ఇంటర్నెట్‌లో ప్రవేశించి రెండేళ్ళయింది. ఇక్కడ పేరు చెప్పగానే పూర్తి జన్మ కుండలి తెలుస్తుందని ఇప్పటివరకు నాకు తెలీదు, ఎవరూ పండితులు చెప్పలేదు మరి.. అమెరికావాళ్ళు కూడా నాతో ఎప్పుడూ ఈ మాట అనలేదు మరి. మీకు చెప్పినవాళ్ళు ఎవరో. అయినా నెట్‌లో అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి. తాము ఏం చేస్తున్నామో, ఎవరితో ముచ్చట్లేస్తున్నామో , వారు ఎలాంటివారో, అమ్మాయిలే జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. అబ్బాయిలను అనడం ఎందుకు.

ఇక చివరగా ఒక్క విషయం.. నేను నా బ్లాగులో ఏది రాసినా ఆలోచించి రాస్తాను. రాసినదానికి నాదే బాధ్యత . అది ఇక్కడి వారికి తెలుసు. మీకు తెలీదేమో. కాని ఇలా మారు పేరుతో, అడ్రస్ లేకుండా మళ్ళీ కామెంట్ చేయకండి. నాకు చిరాకు. అందరు తమ పేరుతో గుర్తింపు పొందాలి , గర్వ పడాలి. సిగ్గు పడ్డం ఎందుకు??

జ్యోతి

రవిగారు, మహేష్ గారు థాంక్స్ అర్ధం చేసుకున్నాందుకు. మనసులో కుళ్ళు పెట్టుకుని మొహం మీద చిరునవ్వుతో మనల్ని గౌరవంచి మాట్లాడేవాళ్ళంటే నాకు అసహ్యం.

ఏకాంతపు దిలీప్‌గారు,
నేను ఇలా చెప్పడం నిషిగంధకు అభ్యంతరం లేదండీ. వాళ్ళ అనుమతి లేనిదే చెప్పకూడదని నాకు తెలుసు. తన అసలు పేరు చెప్పినా మేమందరం నిషిగంధ అనే పిలుస్తాం. అసలు పేరు నేను చెప్పడం వల్ల తను ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మరి మిగతావాళ్ళ కెందుకు ఆ బాధ..

జాన్ గారు,
నేను ఆ మాట అన్నది. ఆడ పేరుతో నా దగ్గర అనుమతి పత్రం తీసుకుని వస్తే ఊరుకోను అని.కాని అతిథులుగా వచ్చేవాల్లు మా సభ్యులందరి అంగీకారం మీదనే వస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని పిలవకపోము.. ఇక ముఖ్య అతిథి వచ్చేది మా ముచ్చట్లు అయిపోయాక చివరి గంటలో, కావాలంటే విహారి, శ్రీధర్ ని అడగండీ. నేను ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకంటే నెట్‌లో జరిగే మోసాలు తెలుసు కాబట్టి. ఎవరిని బడితే వాళ్ళను మాలో చేర్చుకోము.

teresa

yup me ఎవరో నాకు తెలీదు కానీ అతను వ్యక్తపరచినవి సందేహాలే, జడ్జిమెంటు కాదు.-నాకయితే సబబుగానే ఉన్నాయి కూడా! చివరిలో ఆయనే చెప్పుకున్నరు గదా, కందకి లేని దురద నాకెంద్ుకులే అని కూడా.
కలంపేరుతో రాయటం వ్యక్తిత్వాన్ని దాచుకోడమని ఇప్పటివరకూ అనుకోలేద్ు నేను!!

Kathi Mahesh Kumar

@తెరెసా,
‘కలంపేరు’ కి, ‘మారుపేరు’ కీ ఇంకా ‘పెట్టుడు పేరు’కీ తేడా ఉందికదండీ? yup me అనేది కలంపేరు అని అనుకుందామంటారా!ఐతే కనీసం profile ఉండాలిగా?

వారెవరో తెలీకుండా చెప్పడానికి ఇదేమన్నా గుప్త దానాలా? అభిప్రాయాలే కదా! అదీ గౌరవ ప్రదంగానే చెప్పారుగా..ఇంకా చాటెందుకూ?

నిషిగంధ

మంచి నివేదిక అందించినందుకు ముందుగా జ్యోతి గారికి నెనరులు..

yup me గారు, ఎవరిని ఎలా సంబోధించాలో వేరేవారికి చెప్పే హక్కు మనది కాదనుకుంటాను.. మా మధ్య ఏ మాత్రం చనువుందో మీరు ఎలా అంచనా వేయగలిగారు!? ప్రమదావనంలో అందరూ అందరితో ఎంత క్లోజ్ గా ఉంటారో మీకు తెలీదు కదా! పెళ్ళైన వాళ్ళని అడగాల్సిన ప్రశ్నా అది అంటే, నిజమే!కొంతమంది సెన్సిటివ్ గా ఫీల్ అవ్వొచ్చు.. దానికి సమాధానం చెప్పే తీరాలని రూలేం లేదు.. అలా సెన్సిటివ్ గా ఫీలయిన ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్పనని అన్నాను కూడా!! నా క్లోజ్ ఫ్రెండ్ (Indian, 16 yrs older than me) వాళ్ళ హజ్బెండ్ 23 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ఒక రోజు పొద్దున్నే వచ్చి 'నాకు విడాకులు కావాలి ' అన్నారు.. కారణాలు ఏమైనా ఆమెని చూసిన తర్వాత నాకు జ్యోతి గారి ప్రశ్న అసంబద్ధంగా అనిపించలేదు.. సో, లేని దురదని ఊహించుకోవద్దు..

ఇక పేరు విషయానికొస్తే, అమెరికాలో కాదు విజయవాడలో మా ఇంట్లో కూర్చుని రాసినా నేను కలం పేరే వాడతాను.. అయినా కలం పేరు ఎందుకు వాడతారో రచయిత(త్రు)లైన అందరికీ తెలిసే ఉంటుంది! I usually prefer not to bring up my real name even in the regular conversations also because I don't want to confuse people with 2 characters మళ్ళీ నాకేదో MPD ఉందనుకునేరు :-) అయినా ఇక్కడ జ్యోతి గారు వాడింది టైటిల్ కి అనుగుణంగా కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు..

teresa, missed you last week :(

Bolloju Baba

nice discussion
bollojubaba

శ్రీధర్

Yupp me ని నేను పూర్తిగా సమర్దిస్థాను.

మేధ

జ్యోతి గారు, ఇంతకీ ఈ ప్రమదావనం టైమింగ్ ఎప్పుడు... నేను ప్రతివారం అనుకుంటాను, దీంట్లో పాల్గొనాలని.. టైమ్ చెప్పండి, ఈసారి నేను కూడా పాల్గొంటాను...

జ్యోతి

medha ,

mail me at

jyothivalaboju.blogspot.com

meeting every sunday ..

evening 5 to 8 p.m IST..

SD

ఇవిగో మీకు సమాధానాలు

1. నేను నా గూగుల్ అక్కౌంట్ లో లాగ్ అయ్యి మీ బ్లాగులో పోస్ట్ చేసాను. నా పేరు అవసరమా అనేది అటుంచితే, సపోజ్ నేను విన్నకోట వీర వెంకట సీతా రామ్మూర్తి అని పేరు పెట్టాననుకోండి, అది నా పేరు అయిపోతుందని మీరు అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే కదా? అలాంటప్పుడు నే పేరుకీ ఈ విన్నకోట పేరు కి ఏమిటి తేడా? మీరు కనక నిజంగా వాక్ స్వాతంత్రానికి గౌరవం ఇచ్చి ఉంటే అనానిమస్ వాఖ్యలు మీ బ్లాగులో ఎందుకు ఓకే చేయ్యకూడదు? దీనివల్ల తేలిందేమిటంటే నేను చేసింది అనానిమస్ కామెంట్ కాదు. నేను నా పేరు చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదు అంతే. పేరు ఎందుకు చెప్పనో కావాలంటే కిందన చదవండి. గూగుల్ కి కావాల్సింది బ్లేంక్ లు లేకుండా ఏదో పేరు సప్లై చేయడం. నా ఎక్కౌంట్ కి సీతా రామ్మూర్తి పేరుందా, లేకపోతే ఇంకోటుందా దానికనవసరం. విహారి, చదువరి అనే వాళ్ళ నిజనామాలు అవే అని మీరనుకుంటే మాకు పోయేదేమి లేదు. ఆలాగని వీళ్ళని కించపరచడం నే ఉద్దేశ్యం కాదిక్కడ.

2. మీరు ఎవరి పేరైనా ఇంటర్నెట్ మీద చెప్పే ముందు గుర్తుంచుకోండి బాగా. ఈ రోజుల్లో ఐ.డి దొంగతనం అనేది సర్వ సామాన్యం. ఒక సారి మీరు పేరు, ఊరు చెప్తే, సరిగ్గా పది నిముషాలు కానీ అంతకన్నా తక్కువలో కానీ వాళ్ళ ఇంటి ఫోన్, ఏడ్రస్సూ, ఆఫీస్ ఫోన్, ఐ.పి ఎడ్రస్సూ, వాళ్ళు వాడే ఆపరేటింగ్ సిస్టం అన్నీ చెప్పగలిగే ప్రబుద్దులు ఎంతమందో మీకు తెలుసా? తెలీకపోతే వినండి. మీ నెత్తి మీద ఉన్న వెంట్రుకల సంఖ్య ఈ ప్రబుద్ధుల సంఖ్యని చూసి వెలవెలబోతుంది. ఈ ప్రబుద్ధులు మన తెలుగు వారిలో ఉంటారా అనేది ఇక్కడ నేను చర్చించబోవడంలేదు. వీళ్ళు ఐ ఐ టి లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివి, ఓ చలి రాష్ట్రంలో రోబోటిక్స్ లో ఎం. ఎస్ చేసి ఉత్తరోత్తరా జావా ప్రోగ్రామర్స్ గా పనిచేస్తున్నారా అనేది కూడా మనకి అనవసరం. మనకి ఇప్పుడు తెలియవలిసిందల్లా ఇలాంటి ప్రబుద్దులు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అనే ఊహ ఉండడం. నిజానికి ఈ ప్రబుద్దత్వం (అనే పదం రైటా?) సాధించడానికి ఏ డిగ్రీలు అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం వాడే విండోస్, ఐ పేడ్, ఐ ఫోన్ ను కనిపెట్టిన వాళ్ళెవరూ కాలేజీ డిగ్రీలు పొందిన దాఖలాలు లేవు కదా! ఎనీవే, ఐడి దొంగతనం ఒకసారి జరిగితే ఆ దరిద్రం వదిలించుకోడానికి వేల డాలర్ల ఖర్చూ, నా ఫోన్ నంబర్ టెలిమార్కెటర్ల చేతిలో పడితే ఆ ఫోన్ నంబర్ని వదిలించుకోడానికి పడే తిప్పలూ మీకు తెలుసా? తెలీకపొతే వినండి. మొన్నటికిమొన్న నా ఇంటి ఫోన్ కి ఒకడు - బాబీ పాల్ కావాలంటూ దాదాపు ముఫ్ఫై సార్లు ఫోన్ చేసేడు. నేను నిజమే చెప్తున్నాను. ఆఖరికి వాడికి మళ్ళీ ఫోన్ చేసి కోర్టుకి ఈడుస్తాను అనే వార్నింగ్ ఇచ్చేదాకా వాడు అలా చేస్తూనే ఉన్నాడు. మీకు ఇంకా నమ్మకం కలగక పోతే ఈ నెంబరు గురించి గూగుల్ చేసి చూడండి. 765 283 3176

3. ఇప్పుడు మీరు చెప్పే విషయానికి వద్దాం. మొదటి పేరాలోనే మీరు పరస్పర విరుద్ధ భావాలు ప్రకటించేరు. నువ్వు అనేది వయస్సులో పెద్దదాన్నని కాదు అంటూనే చిన్నవాళ్ళని మీరు అనడం నాకు నచ్చదు. ఓ సారి మళ్ళీ చదువుకోండి కావలిస్తే. మీరేదో లోకంలో ఉన్నట్టున్నారు. ఇంటర్నెట్లో ఈ బంధాలు బాంధవ్యాలు తాటాకు మంటలు కింద లెక్క. నేను మిమ్మల్ని సరదాకో, ఇంకెందుకో జ్యోతక్కా అనగానే మీరు నాకు అక్కా కాదు నేను మీకు చెల్లెల్ల్నీ కాదు కదా. ఇంకొంచెం వెనక్కు వెళ్తే, ఐదారేళ్ళ క్రితం ఈ తెలుగు బ్లాగులమాటటుంచి, అసలు మామూలు బ్లాగులు వాడే వాళ్ళే చాలా తక్కువ. ఈ బ్లాగులెంతకాలం ఉంటాయో, మీరు ఎంతకాలం జ్యోతక్కగా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు చెప్పింది మీరు అపార్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు, మీ ఇంటర్నెట్ ఫ్రెండ్స్ కీ మధ్య అగాధం సౄష్టించడం నా అభిమతం కాదు. ఉన్న మాట చెప్తున్నానంతే. అసలీ విషయంలో మనం అందరూ అంతే (నాతో సహా). ఎవరైనా ఇంకో ఇండియన్ కాస్త ఫ్రెండ్లీ గా మాట్లాడితే వాడ్ని అంకులో, అత్తో, అక్కో అనడం మొదలెడతాము. ఏ దేశమేగినా మనం ఇంతే కదా?

4. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నల విషయం. మీ అమ్మాయికి పెళ్ళైంయింది. నో పిల్లలు ఇంకా. ఇటువంటి పరిస్థితుల్లో, ఆవిడ కొలీగ్ - జోకే అనుకోండీ, అడిగింది - నీ మొగుడు నిన్నొదిలేస్తే ఏం జేస్తావ్? మీ అమ్మాయ్ మీతో చెప్పింది ఇలా అడిగినట్టు. మీ రెస్పాన్స్ ఏమిటి? నేను చెప్తాను వినండి - దాని కెన్ని దమ్ములు అలా అడగడానికి? ఇంతలేసి మాటలు నిన్నడుగుతుందా? ఇంక దీనితో స్నేహం చెయ్యకు అంటారు. అవునా? ఇక్కడ పాయింట్ నిషిగంధ గారు కానీ విహారి కానీ మీ ప్రశ్నకి సమాధానం చెప్పేరా లేదా అన్నది కాదు. వాళ్ళు సమాధానం చెప్తారూ, చెప్పకపోతారూ అనేది వాళ్ళ మనస్తత్త్వం మీద ఆధార పడి ఉంటుంది. నన్నందరూ జ్యోతక్క అని పిలుస్తారు బ్లాగులోకంలో అని గర్వంగా చెప్పుకునే మీరు, ఉద్యోగం చేసుకునే అమ్మాయి ఉన్న మీరు అలాంటి ప్రశ్నలడిగి మీ గౌరవం నిలబెట్టుకుంటున్నారా అనేదే నేను చెప్పబోయే పాయింటు.

5. పైన చెప్పినదానికి మీ సమాధానం చూద్దాం ఇప్పుడు. హాట్ సీట్ లో ఎంత వేగంగా వీళ్ళు సమాధానం చెప్పగలరూ అని మీరడుగుతున్నారని మీరే చెప్పుకున్నారు కదా? ఆఫ్ట్రాల్ మీ ప్రమదావనం అనేది ఓ శనివారం సరదాగా అందరూ కూర్చుని చెప్పుకునే కబుర్లు. అంతే కానీ మీరు ఐ ఎ ఎస్ ఇంటర్వ్యూ చెయ్యట్లేదు, వాళ్ళు మీ కేండిడేట్సూ కాదు. అందువల్ల ఇలాంటి ప్రశ్నలడగవచ్చా అనేది మీకు మీరై తీసుకోవల్సిన నిర్ణయం. నువ్వెవడివి మధ్యలో అంటే నేనో దారే పోయే దానయ్యని అంతే. దానయ్య పేరు ఉన్నా లేకపోయినా, మీకు తెలియని విషయాలు చెప్పడం మంచిదని నేనకున్నాను. ఇష్టం ఉంటే తీసుకోంది లేకపోతే హూ అనుకుని సాగిపోండి.

6. నేను మర్చిపోయేలోపుల ఇంకో విషయం. నిషిగంధ పేరు మాలో చాలా మందికి ఎప్పుడో తెలుసు అన్నారు. మీరు బ్లాగ్ రాసి ఇంటర్నెట్ మీద పెట్టగానే అది పబ్లిక్ ప్రాపర్టీ కింద లెఖ్ఖ. ఇప్పుడు ఆవిడ పేరు తెలీని వాళ్ళందరికీ, బ్లాగు చదివే వాళ్ళందరికీ తెలుస్తోంది. పోతే ఇక్కడొక ప్రశ్న, మీ అందరికీ ఆవిడ పేరు తెలిసినప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్పడం ఎందుకో కాస్త శెలవిస్తారా?

7. మీరు బ్లాగులో బాగా ఆలోచించి రాస్తాను అని చెప్పుకున్నారు కదా? ఏ విధంగా ఇవన్నీ ఆలోచించారు? నా మటుకు నాకు అలా అనిపించట్లేదు. అది వేరే విషయం అనుకోండి.

8. నా ఇష్టం వచ్చింది నా బ్లాగులో రాసుకుంటాను అన్నారు. అది మాత్రం పూర్తిగా నిజం. అసలు అలా మీ ఇష్టాఇష్టాలు (అనానిమస్ లు నాకు అసహ్యం, నాతో మళ్ళీ మాట్లాడకండి అనేవి మచ్చుకు కొన్ని) రాసుకోడానికే బ్లాగులేర్పడ్డాయ్. అయితే మీరు రాసేదాంట్లో ఇంకో పేరు ఉందనుకోండి, మిమ్మల్ని కోర్టుకి లాగడానికీ, శ్రీ కౄష్ణ జన్మ స్థానంలో కూర్చోబెట్టడానికీ అవతవాళ్ళకి హక్కులుంటాయని గుర్తుంచుకుంటే మీకే మంచిది.

9. ఏతా, వాతా చెప్పొచ్చేదేమిటంటే మీరు ఇంటర్నెట్లో పిల్లకాకి. అలాగని నేనో మేధావినని చెప్పడం నా అభిమతం కాదు. ఏదైనా మీరు ఉండేలు దెబ్బ తిని తర్వాత నేర్చుకుంటారా లేకపొఏఏ ముందే జాగ్రత్త పడతారా అనేది మీ చేతుల్లోనే ఉంది. నాకు తెల్సినంతలో మీ ఆరోగ్యం కోసం ఇది నేనిచ్చే సలహా. ఈ పోస్టు మీరు మీ బ్లాగులో ఉంచుతారా, తీసేసి నువ్వెవరివోయ్, బోడి అనుకుని మిమ్మల్ని తౄప్తిపర్చుకుంటారా అనేది మీరే తేల్చుకోవాల్సింది. మీరు అన్నట్టు మీ బ్లాగులో మీరు ఈ పొస్ట్ ఉంచండీ, తీసేయండి నాకనవసరం. కానీ తీసేయడానికి డిసైడ్ చేసుకుంటే ఓ కాపీ ప్రింట్ చేసి పెట్టుకోండి. ఉత్తరోత్తరా ఉపయోగించొచ్చు. ఇదే నేను చెప్పేది.

ఫ్రెంచ్ లో Au Revoir అనే దానికి మీకర్ధం తెలీకపోతే గూగుల్ చూడండి. దాంతో బాటూ నెక్స్ట్ ప్రమదావనంలో నాగురించీ నేను చెప్పిన విషయాలు తీరిగ్గా చర్చించుకుని నన్ను మనసారా తిట్టుకోండి నాకేమీ అభ్యంతరం లేదు. :-)

జ్యోతి

yup me గారు,

చాలా థాంక్స్ , మంచి విషయాలు చెప్పారు. గుర్తుంచుకుంటాను. నిజంగా చెప్తున్నాను. మిమ్మల్ని అవమానించడం,బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. నా అభిప్రాయం చెప్పాను.

Anonymous

yupme గారు చెప్పినవాటిలో చాల వాటితో ఏకిభవించాలి!

Anonymous

"ఇంటర్నెట్లో పిల్లకాకి",
అవును
కొన్ని టపాలు చదివినప్పుడు, కొంత మంది అభిప్రాయాలు, అనుభవాలను చదువుతున్నప్పుడు, అయ్యో, వీరు దెబ్బతింటారేమో అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నవి.
"ఈ బ్లాగులెంతకాలం ఉంటాయో, మీరు ఎంతకాలం జ్యోతక్కగా ఉంటారో ఎవరూ చెప్పలేరు. "
నిజమే!
ఏది, ఏమైనా yup me గారు ఆ వెలితిని కొంచెం తగ్గించారు. కొంత ఘాటుగా ఉన్నా, బాధ పడినా, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంకన్నా, ముందే జాగ్రత్త పడడం మంచిది!

yupme గారు, కొంత సమయం వెచ్చించి, జాగ్గృతం చేసినందుకు మీకివే తాంకులు! బహుశ వీరి మాటల్లో మీకు ఒక "వీరతాడు" వెయ్యాలేమో !

Bolloju Baba

i learnt many new things from this discussion
thankyou everybody
bollojubaba

Kathi Mahesh Kumar

@బాబాగారూ,
నిజంగానే నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఇటర్ నెట్ ఫ్రాడ్ అవకాశాలతో పాటూ,మన తెలుగు అమ్మాయిల్లోని ఇన్ సెక్యూరిటీ వరకూ అన్నీ నేర్చుకోవలసినవే ఉన్నాయిక్కడ.

yup me...Netizen ఇద్దరూ అమ్మాయిలన్న విషయం చెప్పకనే చెప్పారు.They have every right to be insecure and conscious about their identities in this BAD..BAD..MAD world of internet.

teresa

Yup me & Netizen అమ్మాయిలన్న విషయం నాకుకనబడలేదు, నేనంతగా తరచిచూడలేదేమో! If that is true I'd say they are 'sensible' Not insecure.
I agree and support all of
Yup me's response. BTW,ఆ వ్యక్తెవరో నాకు తెలీదు, రేపెప్పుడో నా వీపు గోకుతుందని ఆశ పడ్డానికి :)

krishna rao jallipalli

YUP ME గారు చాలా చాలా చక్కగా సొగసైన బాషలో వారి ఆలోచనలను భావాలను వ్యక్తీకరించిన పద్దతి బహు సొగసుగా ఉంది. తెలియని ఎన్నో విషయాలను తెలియ చెప్పారు. అభినందనీయం. YUP ME గారూ... మీకు స్వంత BLOG ఉందా?? లేకపోతె వెంటనే .. ప్రారంభించ కూడదూ??
జ్యోతి గారి స్పందన కూడా చక్కగా ఉంది. నిజం.. సంయమనం పాటించడం లో జ్యోతి గారు ఎప్పడు ముందే ఉంటారు.

నేనుసైతం

నమస్కారం!! నేను చాల కాలంగా బ్లాగ్స్ చద్వుతున్నాను, ఎప్పుడూ రాయాలనిపించలేదు. కాని yup me గారు రాసింది చదివాకా రాయలనిపించింది. yup me గారు, ఇంటర్నెట్ సెక్యూరిటీ గురించి రాసింది సబబే నేను ఏకీభవిస్తాను. ఇకపోతె
1."నువ్వు" అనే పదం సంభోదన మీకు అభ్యంతరం అయితే మీరు చెప్పొచ్చు అందులో తప్పేం లేదు. నా విషయంలో ఏం జరిగిందో చూడండి. జ్యోతి గారు చాలా కాలం నుంచి తెలిసినా ఏ రోజు ఆవిడ నన్ను నువ్వు అని పిలవలేదు, చాలా కాలం "మీరు" అనే పిలిచారు, నేను అడిగిన తరువాతనే , నా అనుమతి తీసుకొని మరీ నన్ను "నువ్వు" అని పిలవడం మొదలుపెట్టారు. మీ భాషలో ఏతావాతా చెప్పోచ్చేదేంటంటే జ్యోతి గారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొంటారు అని ప్రాక్టికల్ గా చెప్పడం

2,3 కామెంట్స్ గురించి,ఒకరికి జోక్ అనిపించింది ఇంకొకరికి అనిపించకపోవచ్చు, ఆ వ్యక్తి మీద వున్న చనువు ప్రకారం అది వర్తిస్తుంది. ఇలాంటి ప్రశ్నకే నల్లమోతుశ్రీధర్ గారు ఎంత చమత్కారంగా జవాబిచ్చారో చూడండి.
4 కామెంట్ విషయానికొస్తే సొంతపేరు గురించి,మీరు చెప్పించి నూటికి నూరుపాళ్ళు నిజం, ఇంటర్నెట్ లో పేరు కి సెక్యూరిటీ లేదు. అయితే ఒక విషయం అది అసలు పేరయినా, మారు పేరయినా , మీరు మారు పేరు ఇచ్చినా దాని బట్టి మీ అసలు పేరు , అడ్రస్ కనుక్కోవచ్చు. అంతెందుకు మీ yup me , id ద్వారా మీ అసలు పేరు,మీరు వుంటున్న ప్రాంతం,మీ నెంబర్ కూడా తెలుసుకొనే సౌలభ్యం మీకు తెలిసిందే అనుకుంటా..

ఇక ఎనిమిదో కామెంట్ గురించి, "మీరు రాసేదాంట్లో ఇంకో పేరు ఉందనుకోండి, మిమ్మల్ని కోర్టుకి లాగడానికీ, శ్రీ కౄష్ణ జన్మ స్థానంలో కూర్చోబెట్టడానికీ అవతవాళ్ళకి హక్కులుంటాయని గుర్తుంచుకుంటే మీకే మంచిది" కోర్ట్ కు ఈడ్చి , శ్రీ కృష్ణ జన్మ స్థానంలో కుర్చో బెట్టడానికి అంత తప్పు ఆవిడ ఏంచేసారు?. బ్లాగ్ అనేది రిజిస్టర్ పోస్ట్ లాంటిది మనం సంతకం పెట్టిన తరువాత మాత్రమే మన దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు ఆవిడా రాసిన రాతల్లో ఎక్కడా అసభ్యత అశ్లీలం లేవే?? ఏదో వ్యక్తిగత జీవితం మీద ఒకప్రశ్న,వారి అసలు పేరు చెప్పగానే తప్పయిపోతుందా??ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాధారణంగా అసలు పేరు చెపుతారు. ఈ మధ్యే చదివాను "షాడో మధుబాబు" ఇంటర్వ్యూ ఆయన కలం పేరని నాకు తెలియనే తెలియదు. అసలు కలంపేరు గురించి ఒక సారి చదివా, అది పెట్టేది ఎందుకంటే, కధ లోనూ , కధనం లోనూ పాఠకుడికి రచయితా లేదా రచయిత్రా ఎలా ఆలోచిస్తారు ఇంత చక్కాగా రాయడానికి అనే అవకాశం ఇవ్వకుండా చేసే గమ్మత్తైన పేరు అని, ఏదేమైనా అది రాసేవారి వ్యక్తిగత విషయం.

ఇక చివరి కామొంట్ "మీరు ఇంటర్నెట్లో పిల్లకాకి. అలాగని నేనో మేధావినని చెప్పడం నా అభిమతం కాదు" . నాకు అనిపించిన విషయం కేవలం ఒక బ్లాగ్ చదివిన పరిచయంతో ఒక వ్యక్తి ని పిల్లకాకి అనడం మీ వివేకానికే వదిలేస్తున్నా. ఇక్కడ మనం ఎవరూ మహాత్ములం కాదు , మీకు తెలిసిన విషయాలు పెద్ద విషయాలు నాకు తెలియక పోవచ్చు, నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీకు తెలియక పోవచ్చు. మీతో పరిచయం లేదు కాబట్టి మీరు మేధావో కాదో నాకు తెలియదు. నాకు తెలిసిన చిన్న విషయం మీకు చెపుతా. అందరూ గూగుల్ సెర్చ్ తరచుగా వాడుతుంటారు, మీరు ఓ కొత్తపదం టైప్ చేసిన ప్రతిసారీ ఆ టైప్ చేసిన పదం , ఆ సిస్టమ్ ఐపి అడ్రస్ అక్కడ రికార్డ్ అవుతుంది. సెర్చ్ లోనే అంతవుంటే ఇక ఈ బ్లాగ్ లో ఇంతసేపు రాస్తున్న నాకు చదువుతున్న మీకు కూడా సెక్యూరిటీ లేదు. మీ గురించి నేను నా గురించి మీరు సులభంగా తెలుసుకోవచ్చు.

చివరిగా, మీకు నచ్చినది,నచ్చనిది కూడా రాయడానికే బ్లాగులు వున్నవి, ఎవరిష్టం వారిది. అయితే జ్యోతి గారు రాస్తున్న బ్లాగుల్లో మంచి కధలు, అంశాలు చాలా వున్నాయి. ఆ వయసులో వున్న గృహిణులందరూ విశ్రాంతి తీసుకుంటున్నా ఈ సమయంలో ఆవిడ రాస్తున్న బ్లాగులు ఇవి. మీరు ఆమె సీనియారిటీకి విలువ ఇస్తారో ఇవ్వరో అది మీ వ్యక్తిగత అభిప్రాయం కాని, ఇన్ని విలువైన రచనలు/బ్లాగులు రాయటానికి, తెనుగీరించటానికి వారు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక మంచి పనిని ప్రోత్సహించకపోయినా పరవాలేదు, "పిల్లకాకి" లాంటి పదాలు నిరుత్సాహం మాత్రం కలిగిస్తాయి. మహాత్ముని సత్యాగ్రహం లోనే తప్పులు జరిగాయి,ఇక మీరు నేను ఎంత? ఎవరూ ఆ తప్పుల గురించి మాట్లాడుకోరు కాని అందరూ దాని ఫలితాన్నే చూసారు. ఇంక మన బ్లాగులోకం ఎంత?

విమర్శ కూడా హుందాగా వుండాలేమో ఆలోచించండి. Au Revoir కి అర్ధం మీరు చెప్పినట్టు గూగుల్లో చూస్తే దొరికింది అంటే మీకు ముందు తెలిసిన విషయం నాకు ఈరోజే తెలిసింది. ఇదే ప్రపంచం అంటే మీకు ఈరోజు తెలిసిన విషయం మొన్న వెరొకరి సొంతం అన్నమాట "గీత" లో పరమాత్ముడన్నట్లు "ఈ రోజు నీది అనుకున్నది నిన్న వేరొకరిది , రేపు ఇంకొకరిది, ఈ లోకంలో నీకంటూ మిగిలేది ఏమీ లేదు" నిజమే అనిపిస్తుంది కదూ!! చివరికి మిగిలేదు మంచితనం , మంచి మాటే సుమా!!

మనకు తెలియని విషయాలు చాలా వుంటాయి వాటినితెలుసుకొనే ప్రయత్నం చేద్దాం ఎవరేంటో వదిలేద్దాం, మనం ఏంటో తెలుసుకుందాం......

ఏదైమనా చాలారోజులుగా బ్లాగుల్లో కనీసం కామెంట్ అయినా రాయాలి అనుకుంటున్న నాకు ప్రేరణ ఇచ్చిన yup me గారికి కృతజ్ఞతలతో

Kathi Mahesh Kumar

ఇప్పుడే ఒక బ్లాగులో (http://tethulika.wordpress.com/2008/06/23/) ఈ విషయం మీద సమాధానమిచ్చి ఇక్కడ చూసే సరికీ, కథ మరో అంకంలో ప్రవేశించినట్టనిపిస్తోంది. అక్కడ నేను రాసిన కామెంట్ ని ఇక్కడ కాస్త పంచుకుంటాను.
----నా కామెంట్
బ్లాగ్ అనేది ఒక personal expression. “I’d rather make mistakes, than do nothing. I’d rather mess up, than miss out completely” అన్నది నా లాంటి బ్లాగరలకి స్ఫూర్తి. అంత perfect గా రాయాలనుకునేవాళ్ళు ఆల్రెడీ print and electronic media లో తమ పాండిత్యాన్ని వెలగబెడుతున్నారు. ఇక్కడ బ్లాగులోకంలో ఉండే చాలా మంది సాధారణ మనుషులు…రచయితలూ…రచయిత్రులూ కాదు.

లోపాలను ఎత్తిచూపడం వేరు, మీ విలువలని బ్లాగర్లపై రుద్దడం వేరు. మీరన్న Yup me అక్కడ చేసింది అదే. అది బూతులు తిట్టడం కన్నా దారుణమని నా అభిప్రాయం. ఇక వారు ఎత్తిచూపిన ‘అమూల్యమైన’ విషయాలలో ‘అతి”శయోక్తులెక్కువా అసలు నిజాలు తక్కువ. బ్లాగులో ఇచ్చిన ID ని మాత్రమే చూసి ఎవరూ వెంటపడక్కరలేదు… అది సంపాదించడానికి సవాలక్ష ఈజీ మార్గాలున్నాయి…చెప్పమంటారా???…చాలా మందికి తెలిసినవే కాబట్టి అర్థం చేసుకోగలరు.

తమ insecurity కి sensibility అనే ముసుగుతొడుక్కుని వారు చేస్తున్న moral policing కి నేను బద్ధవిరోధిని. ఎవరూ ఎవర్నీ స్వాగతించి “మా బ్లాగులు చూడండి” అని మొరాయించట్లేదు. “మేము మా ఆలొచనల్నీ, అనుభవాల్నీ,అభిప్రాయాల్నీ రాస్తున్నాం వీలైతే చూడండి” అని తప్ప.

జ్యోతి

Yup me గారికి ,,

అసలు నేను మీ అభియోగాలకు సమాధానం ఇవ్వడం అనవసరం. కాని మీరు చెప్పిన విషయాలు అందరు బాగున్నాయని అంటున్నారని, నేను తప్పు చేసానని సిగ్గు పడుతున్నానని మీరు మురిసిపోతారేమో అని ఈ సమాధానం ఇస్తున్నాను.

మీరు అంతర్జాలంలోకి వచ్చి ఎన్నేళ్ళయిందో కాని మీరు చెప్పిన విషయాలు పనికి వచ్చేవి. ఒప్పుకుంటాను. కాని. అంతర్జాలం ఒక మహా సముద్రం. అందులో నేను తెలుసుకున్నది కనీసం గ్లాసుడు కూడా కాదు . అసలు నన్ను నేను చీమ , దోమ అని కూడా అనుకోలేదు. మీరు ఏకంగా నన్ను పిల్లకాకిని చేసి నా హోదా పెంచేసారు. ఐనా నేను ఎప్పుడు కాని జంతువులతో పోల్చుకోను. నన్ను నేను మనిషిని అనుకుని , నాలా ఆలోచించే మనుష్యులతోనే పరిచయం పెంచుకుంటాను. జీవితంలోకాని, నెట్ లో కాని. యాభై ఏళ్ళ నా నిజ జీవితంలో తిన్న దెబ్బలకంటే మీరు చెప్పే ఉండేలు దెబ్బలేమి పెద్దవి కావు అనుకుంటా. ఐనా మీరు వెలిబుచ్చిన భయాలు, అభిప్రాయాలు మీ చుట్టు ఉన్న వాతావరణాన్ని బట్టి అలాగే ఉందేమో. కాని నా చుట్టూ ఉన్న మనుష్యులు ఒక మంచి కుటుంబంలా ఆప్యాయతలతో ఉంటారు. ఇందులో సందేహం లేదు. అబద్ధం చెప్పాలిసిన అవసరం లేదు. ఇక మీరు చెప్పిన మోసాలు . అవి అందరికి ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి. అవి పెద్ద నేరంలా నాకు సలహాలు ఇవ్వొద్దు. ఎందుకంటే అలాంటి ఫోన్ కాల్స్‌ని అరికట్టాను నాదైన రీతిలో.. ఐనా ఆ నంబర్ ఇవ్వడంలో మీ ఉద్దేశ్యమేమిటో అర్ధం కాలేదు. ఆ సమస్య గురించి మాలో ఎవ్వరికి తెలీదు అనా.

నేను ఎప్పుడూ ఎవరిని నన్ను అక్క అని పిలవమనలేదు. ఏదో పేరు సంపాదిద్దామని నెట్ కి రాలేదు. తోటి బ్లాగర్లు వాళ్ళంతట వాళ్ళే అలా పిలుస్తున్నారు. దానికి ముందుగా శ్రీకారం చుట్టింది మీరు చెప్పిన విహారి. ఐనా విహారి, చదువరి ఎవరో మీకు తెలుసా. ఈ బ్లాగ్ ప్రపంచంలో కలం పేర్లతో ఉన్నవారు నాకు సన్నిహితంగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారి అసలు పేర్లు తెలుసు .. కాని ఆ బాధ మీకెందుకో అర్ధం కాలేదు ..

అసలు ఈ బ్లాగ్లోకంలో ఉన్న అనుబంధాలు శాశ్వతం అని నేను అనుకోలేదు. ఐనా నేనే రేపు ఉంటానో లేదో తెలీదు. ఎంతకాలం జ్యోతక్కగా ఉంటానని అనుకోవాలి. కాని ఒక్కమాట. ఇప్పుడు నాకున్న అనుబంధం తో చెప్పగలను. ఈ రోజు నేను చనిపోతే ఏడ్చి, చాలా రోజుల పాటు బాధపడే స్నేహితులు , శ్రేయోభిలాషులు ఎంతో మంది ఉన్నారు ఈ అంతర్జాలంలో. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి మనిషికి. మనము ఉన్నా లేకున్నా , మన గురించి ఒక మంచి మాట చెప్పుకునేలా ఉంటే అదే పదివేలు. అది ఎన్ని కోట్లు పెడితే వస్తుంది.

నేను నిషిగంధను అడిగినట్టే విహారిని, శ్రీధర్ ని అడిగాను. ఈ ముగ్గురు నా ప్రశ్నలను ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలుసు. మగవాళ్ళని అడిగితే తప్పు లేనిది ఆడవాళ్ళను అడిగితే తప్పైందా? అసలు ఈ ప్రశ్న నేను నిషిని ఎందుకడిగానో తెలుసా. మా చుట్టాలలోనే ఇలా జరిగింది. పెళ్ళైన ఇరవై ఏళ్ళకి భర్త ఇంకో ఆవిడతో సంబంధం పెట్టుకున్నాడు. పెద్ద పిల్లలు, పేరున్న కుటుంబం. ఆ భార్య ఎంత బాధ పడిందో నేను చూసా. వేరే వాళ్ళ దాకా ఎందుకు నన్ను నేనే ఈ ప్రశ్న వేసుకున్నా. నాకే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయగలను నేను. నా కూతురికి కూడా ఇదే ప్రశ్న నేను అడగగలను .. నేను పాటించేదే ఇతరులకు చెప్తాను. ఐనా ఇందులో అంత కాని మాట ఏముంది. నేను అడగగానే నిజంగా అలా జరిగిపోతుందా. మన చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగటం లేదు. ఎందుకు ఆడవాళ్ళని మట్లాడనీకుండా , ఆలోచించనీకుండా అణిచివేయాలని చూస్తారు.

చివరిగా ఇంకో సంగతి.
నాకు నీతి భోదలు చేసేముందు. నేను ఈ నెట్ లో ఏం చేస్తానో తెలుసుకోండి. నేను పిల్లకాకినో, ఏనుగుపిల్లనో అనవసరం. నిప్పుతో పని చేసేటప్పుడు అది కాలకుండా జాగ్రత్త తీసుకోవడం నాకు తెలుసు. నెట్ లో జరిగే మోసాలు, ఎలా జాగ్రత్తగా ఉండాలో మావారు నేర్పించారు. ఐనా నా బ్లాగులతో పాటు టెక్నికల్ బ్లాగు రాస్తు, టెక్నికల్ ఫోరం, చాత్ రూం లో చురుకుగా ఉన్న నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోకుండా జాగ్రత్తపడకుండా ఉంటానని ఎలా అనుకున్నారు. ఐనా తప్పుడు పని చేస్తే కదా నేను భయపడాలి.

ఇలాంటి విషయాలపై మీ టైం వేస్ట్ చేసుకోకుండా , నా మాటల మీద విశ్లేషణ చేయడంలో వెచ్చించిన సమయం వేరే ఉపయోగపడే దాంట్లో పెట్టండి. నమస్కారం..

ఇప్పటినుండి నా బ్లాగులన్నింటిలో కామెంట్స్ కూడా మాడరేషన్లో పెడుతున్నా. నాకు నచ్చని కామెంట్లు ఒప్పుకోను.

జ్యోతి

నెటిజన్ గారు,

మీరు నను ఏడాదికి పైగా ఎరుగుదురు. నన్ను నేను గొప్పదాన్ని అని ఎవరినైనా చులకన చేసానా? అవును జ్యోతక్క అన్న గౌరవం లభించింది అని గర్వపడుతున్నాను అది తప్పా.ఐనా మీరు వీరతాడు వేసింది yup me చెప్పిన internet fraud గురించా,నాకు చెప్పిన నీతుల గురించా????

Anonymous

@జ్యోతి:
"..వరినైనా చులకన చేసానా?"
లేదు.
"జ్యోతక్క అన్న గౌరవం లభించింది అని గర్వపడుతున్నాను అది తప్పా."
కాదు.
"వీరతాడు వేసింది yup me చెప్పిన internet fraudకి"
అపార్ధాలకి అవకాశం ఇచ్చినందుకు క్షమాపణలు!
:(

Malakpet Rowdy

Happened to stumble upon this blog by accident - Just a curious question

నిషిగంధ అన్న పేరు పెట్టుకున్నవాళ్ళందరూ గొప్ప రచయిత్రులవుతారా లేక రచనలు చేసేవాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారా?

I'm tempted to ask this question cuz I know one Nishiganda on Telugupeople.com site and shez a very good writer/poetess too.

Anonymous

dont do small things become problems

be friends all
stop e-goes

చైతన్య

ప్రమదావనం అంటే ఏంటండి?
నేను కూడా ఒక మహిళా బ్లాగర్ని.

జ్యోతి

చైతన్యగారు,

తెలుగు మహిళాబ్లాగర్లు కలిసి ఏర్పాటు చేసుకున్న గూగుల్ గ్రూప్.. మీ బ్లాగు వివరాలు, మీ వివరాలతో నాకు మెయిల్ చేయండి..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008