Thursday, 31 July 2008

పాపం పసివాడు !!!!!!!!!

అదేంటో గాని చిన్నప్పటినుండి అల్లరి చేసి ఎరుగను. ఇంట్లో ఒక్కదాన్నే ఆడపిల్లను, పెద్దదాన్ని. ఎవరితో పోట్లాడేది? అల్లరి చేసేది.? అడక్కుండానే అమ్మ అన్నీ కొనిపెట్టేది. ఐనా ఆడపిల్లకు చిన్నప్పుడు కావల్సినవి ఏవుంటాయి. కొత్త కొత్త డ్రెస్సులు ( అవి అమ్మ తనే కుట్టేది.,నాన్న కొనేవాడు, మా తామ్ముళ్ళు కుళ్ళుకునేవారు). వాటికి మ్యాచింగ్ రిబ్బన్లు, గాజులు , బొట్లు ( అప్పట్లో స్టిక్కర్లు లేవు). ఇక చదివింది మొత్తం L.K.G నుంది డిగ్రీ వరకు అచ్చంగా ఆడపిల్లల స్కూలు, కాలేజీలలోనే. ఇక ఎవరిని ఏడిపించే అవకాశం రాలేదు. ఇంటిదగ్గర కూడ ఫ్రెండ్స్ లేరు, అబ్బాయిలను కాని , అమ్మాయిలను కాని అస్సలు ఏడ్పించే పని పడలేదు. అసలు సంగతి అంటే నేను కాస్త నిదానంగా ఉండేదాన్ని. ఎవ్వరితో ఎక్కువ కలిసేదాన్ని కాదు. కాని గత సంవత్సరం ఒక అబ్బాయిని తెగ అల్లరి పెట్టాను.


ఇది మస్తీ గ్రూపులో జరిగిన సంఘటన. అది నేను చేరిన కొత్తలో జరిగింది. నా నిజమైన వివరాలు ఒక్క గ్రూపు ఓనర్‌కి, ఒక అమ్మాయికి మాత్రమే తెలుసు. గుంపులో నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఎదో ఒక ఆట, చర్చ మొదలు పెట్టేదాన్ని. అప్పుడప్పుడు వంటకాలు పంపించడం గట్రా. సమయంలో ఒక అబ్బాయి చేరాడు. సిక్కు అబ్బాయి. ఎప్పుడు కూడా అమ్మాయిలను తెగ సతాయించేవాడు. నేను పంపిన మెయిల్స్ మీద కూడా ఎదో ఒక కామెంట్ చేసి కోపం తెప్పించేవాడు.నాకు ఆ అబ్బాయికి తరచూ గొడవ జరిగేది. అతడు తనకు తానే చాలా గొప్ప అనుకునేవాడు. అలా ఒక రోజు బ్లాగ్ విషయం లా గుంపులో ఒక చర్చ మొదలు పెట్టాను. మీరు చేసిన అల్లరి చెప్పండి అని. ఒక్కొక్కరు చెప్తున్నారు . అప్పుడు నాకో ఐడియా వచ్చింది. వెంటనే ఒక మెయిల్ చెసా." ఇంతవరకు నేను గుంపులో చెప్పిన వివరాలు తప్పు. నేను అమ్మను కాదు అమ్మాయిని, నా వయసు తప్పు చెప్పాను. నేను M.B.A చదువుతున్నాను. కావాలని గుంపులో అల్లరి చేసాను. ఎవ్వరిని మోసం చేయాలని కాదు " అని కాస్త గ్యాస్ కొట్టాను. అలాగే గుంపు ఓనర్‌కి ,నా గురించి తెలిసిన ఒకరిద్దరికి చెప్పాను, నా గురించి నిజం అస్సలు చెప్పొద్దు . సిక్కు అబ్బాయి తప్పకుండా సమాధానం ఇస్తాడని తెలుసు.


అలా అబ్బాయిని రెండు రోజులు ముప్పు తిప్పలు పెట్టాను. ఇంత అల్లరి చేస్తున్నాను, చురుకుగా ఉన్నాను. నేను కాలేజీ అమ్మాయినే అనుకుంటున్నాడు. అందుకే ఎప్పుడూ సతాయించేవాడు. ఒకసారి అతనికి కాల్ చేయమని నంబర్ కూడా ఇచ్చాడు. కాని నేను మెసేజ్ చేసాను. వెంటనే అతను కాల్ చేసాడు. అప్పుడు కూడా అతడిని కొంచం సతాయించాను.. నిజం చెప్పీ చెప్పకుండా. అవతల అతని అవస్థ తలుచుకుంటేనే చచ్చే నవ్వొచ్చేది. లేకపొతే నన్ను సతాయిస్తాడా? కాని మూడో రోజు గ్రూపు ఓనర్ ఆగలేక నిజం చెప్పేసాడు. సరే అని నేను ఒప్పుకున్నా. ఐనా అబ్బాయి నమ్మలేదు. అప్పుడు నేను అతడికి నేను,మా అమ్మాయితో ఉన్న ఫోటో పంపించా.అప్పుడు కాని నమ్మలేదు .నేను పెద్దావిడను అని. ఇదంతా మా పిల్లలకు కూడా తెలుసు. మా అమ్మాయి కూడా నా ఐడి తో అతడితో మాట్లాది కొద్ది సేపు ఆటాడించింది. నాకంటే చిన్నవాడైనా అతడు ఇప్పుడు అతను నాకు మంచి మిత్రుడు అయ్యాడు. ఎప్పుడు మాట్లాడినా డార్లింగ్ అంటాడు.


కాని ఎంత మంచి ఫ్రెండ్ ఐనా కూడా మళ్ళీ నా చేతిలో బోల్తా పడ్డాడు. అతని పుట్టినరోజు కి కాస్త స్పెషల్ గా ఏదైనా చేద్దామని, ఒక ప్లాన్ వేసా. వారం ముందు ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టా. అసలే అబ్బాయి ఖతర్నాక్. తొందరగా ఏదీ నమ్మడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి అందుకే మస్తీ గ్రూపు కోసం మారు పేరుతో ఉన్న మరో మెయిల్ ఐడితో అతనికి కాస్త మస్కా కొట్టసాగాను. ఇంకో ముగ్గురు సభ్యులకు కూడా ప్లాన్ చెప్పి, కాస్త మసాలా కలపమని చెప్పాను. అంతే ఇంకేముంది. వాళ్ళు తమ వంతు మసాలా కలిపి వాతావరణాన్ని మరింత రసవత్తరంగా చేసారు. ఒకేసారి నా అసలు ఐడి, మారు పేరుతో ఉన్న ఐడి, రెండింటితో అతడిని తికమక పెట్టేసా. పాపం పసివాడు. ఏది అర్ధం కాలేదు. చివర్లో మారుపేరుతో ఉన్న అమ్మాయి ఐడిలో అబ్బాయిని ఇష్టపడుతున్నట్టు హింట్ ఇచ్చా. అంథే అబ్బాయి, కలుద్దాము అన్నాడు. నేనన్నా. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ .బయటకు రాలేను అన్నా. ఫోన్ చేస్తా అని అతని నంబర్ తీసుకున్నా. నిజమని నమ్మేసాడు. కాని నా మీద అస్సలు అనుమానం రాలేదు. ఇక అతడి పుట్టిన రోజు నాటికి ఒక అందమైన పవర్‌పాయింట్ తయారు చేసి ఇచ్చాను. అలాగే ఐడి నాదే అని చెప్పా. నిజంగా ఫ్లాట్ ఐపోయాడు. నిక్కచ్చిగా, చాలా దురుసుగా ఉండే అబ్బాయిని బకరా ని చేసే ధైర్యం . ఆలోచన నాకే ఉందని ఒప్పుకున్నాడు. ఎందుకు నన్ను సతాయిస్తావు పనేమి లేదా . అని మొత్తుకున్నాడు. ఇప్పటికీ సంఘటన గుర్తుకొస్తే మా గ్రూపు వాళ్ళు నవ్వుకుంటారు.


ఇంతకంటె ఎక్కువ ఎవ్వరినీ అల్లరి చేయలేదు. అబ్బాయి కూడా నన్ను అనవసరంగా సతాయించాడు. తనకు తానే గొప్ప అనుకున్నాడు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది.


అవునూ మన బ్లాగ్‌వీరులకు అల్లరి చేసే టాలెంట్ లేనట్టుంది. ఇంతవరకు ఒక్క అబ్బాయి కూడా విషయం మీద రాయలేదు. ఏంటబ్బా సంగతి???



Wednesday, 30 July 2008

మీ కోసం...

 
"మీ కోసం" !!!...   
ఇదేంటి! చంద్రబాబు ఎన్నికల స్టంట్ ఇక్కడికెందుకొచ్చింది అనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. బ్లాగర్ల కోసమే తయారు చేయబడిన కొన్ని సదుపాయాలు గురించి నేను చెప్పాలనుకుంటున్నారు. అవి  ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితంగా మనందరి కోసం తయారు చేయబడ్డాయి. అవి మీరు ఉపయోగించుకుంటారని  మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ముఖ్యంగా కొత్తగా బ్లాగుతున్నవారికి అవసరమవుతుంది. ముందుగా కొత్తగా వచ్చినవాళ్ళందరూ తెలుగు బ్లాగు గుంపులో చేరండి. ఇందులో మీకు ఎప్పుడు ఏ సహాయం, సందేహం వచ్చినా  తప్పకుండా సమాధానం లభిస్తుంది. అలాగే అప్పుడప్పుడు ముఖ్యమైన చర్చలు కూడా జరుగుతుంటాయి. ఆ తర్వాత కూడలికబుర్లు.  ఇక్కడ బ్లాగర్లు ముచ్చట్లాడుకునే వేదిక. అలాగే అప్పుడప్పుడు ముఖ్యమైన సమావేశాలు నిర్వహింపబడతాయి.  ఇక చివరగా సాంకేతిక సహాయం. ఇక్కడ మీకు వచ్చే సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. నాకు వీలైనపుడు నేను
ఇక్కడే ఉంటాను. తెలుగుకు సంబంధించి  నేను సహాయం చేయగలను. మెయిల్ అంటే అలస్యం అవుతుంది. సో బ్లాగులు, తెలుగుకు సంబంధించి ఎటువంటి సహాయం, సమస్య ఐనా ఇక్కడికి వచ్చేయండి. ఒకే నా... ఎనీ డౌట్స్.....

Monday, 28 July 2008

బ్లాగర్ల ఫ్రెషర్స్ డే ...

ముందు అనుకున్నట్టుగానే కూడలి కబుర్లలో ఫ్రెషర్స్ డే ఘనగా జరిగింది. దాదాపు అందరు కొత్త బ్లాగర్లు వచ్చారు. ర్యాగింగ్, పరిచయాలు. సందేహాలు, చర్చలు ఎంతో ఉల్లాసంగా ,ఉత్సాహంగా జరిగాయి. నిజంగా ఒక కాలేజిలో ఇలాగే జరుగుతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యారు అందరూ. ఇప్పటినుండి సీనియర్లు, జూనియర్లు అన్న బేధాలు లేకుండా అందరం బ్లాగర్లమే అన్నట్టుగా ఉండాలి అని డిసైడ్ అయ్యారు అందరూ. అనూహ్యంగా ఈ సమావేశం సాయంత్రం ఆరు గంటలకు మొదలై రాత్రి పన్నెండింటి వరకు జరిగింది. అల్ హ్యాపీస్. అందరూ ఇలా ప్రతి నాలుగో ఆదివారం కూడలి కబుర్లలో కలిసి కష్ట సుఖాలు చెప్పుకోవాలి . ఇన్ని గంటలు జరిగిన సమావేశ నివేదిక రాయాలని ప్రయత్నించాను. కాని నా చిన్ని బుర్ర అందుకు అంగీకరించలేదు. అందుకే అటువంటి దుస్సాహసం చేయకుండా మొత్తం ముచ్చట్లను (పనికిరానివి తుడిచేసి) ఇలా పుస్తక రూపంలో ఇస్తున్నాను. తీరిగ్గా చదువుకోండి.

ఇక నిన్న వచ్చిన బ్లాగర్లు. (వారి బ్లాగులు మాత్రం నేను వెతికి లంకెలు పెట్టలేను బాబోయ్, ఈ విషయంలో నన్ను వదిలేయండి. పుణ్యముంటుంది).

యడవల్లి శర్మ
గిరీష్
చదువరి
ప్రతాప్
ఒరెమునా
సాలభంజికలు
దిలీప్
బ్రాహ్మి
నాగమురళి
మురళీధర్
సరస్వతి కుమార్
మీనాక్షి
ఫ్రెషర్ (?)
మహేష్
శివ
జ్యోతి
పూర్ణిమ
వేణు శ్రీకాంత్
ఎస్.పి .జగదీశ్
వికటకవి
ప్రదీప్ మాకినేని
ప్రవీణ్
ప్రసాద్
సాయిచరణ్
నల్లమోతు శ్రీధర్
డా.రామ్స్
రాకేశ్
రానారె
వరోధిని
మోహన
రాజేంద్ర
సిబిరావు
శ్రీకాంత్
.....




Read this document on Scribd: freshers day1

Sunday, 27 July 2008

మహంకాళీ జాతర శుభాకాంక్షలు.



హైదరాబాదు బోనాల ఉత్సవాల సందర్భంగా కొన్ని పాటలు..







కోడి బాయె లచ్చమ్మదీ..







అమ్మా బయలెల్లినాది..







చుట్టు చుక్కల చూడు..





శాంతి ... శాంతి....


అమ్మల్లారా, అయ్యల్లారా.. శాంతించండి..

ఎందుకు , ఎక్కడ, ఎలా అంటారా???

గత కొద్దిరోజులుగా మతపరమైన బ్లాగులో జరుగుతున్న వ్యాఖ్యల యుద్ధం చూస్తూ ఉన్నాను. నాకే కాదు ఎందఱో బ్లాగర్లకు చాలా బాధగా ఉంది ఇలా జరగడం. ఆ బ్లాగరు రాసే దానికి వ్యతిరేకంగా మరో బ్లాగు మొదలెట్టి బ్లాగు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేస్తున్నారు. కాని మిగతా బ్లాగర్లందరికీ నా సవినయ విన్నపము. మీరు ఈ రాతలకు స్పందించకండి. నాకూ కోపం వచ్చింది మొదట్లో ఆ బ్లాగులో విషయాలు. కాని కొందరు బ్లాగర్లు , చదువరులు మర్యాదగా చెప్పినా ఆ బ్లాగరు మారలేదు. అలాంటప్పుడు మీరెందుకు ఉద్రేకపడుతున్నారు. మీరు అలా వ్యాఖ్య మీద వ్యాఖ్య చెప్పినందువల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ లేదు. సమస్య ఇంకా విషమంగా తయారవుతుంది . అందరూ బాధపడుతున్నారు. ఏది మాట్లాడితే ఏమవుతుందో అని. అలాంటప్పుడు అందరూ ఆ బ్లాగులో వ్యాఖ్యలు రాయకండి. అలా వ్యతిరేకంగా అయినా రాసి ఆ బ్లాగుకు మరింత ప్రాముఖ్యం ఇస్తున్నారన్న విషయం మరిచిపోవద్దు. అది అతనికే లాభం. అనవసరంగా మనకు సమయం వృధా. మీకు నచ్చకుంటే ఆ బ్లాగుకు వెళ్ళకండి. చదవకండి. స్పందించకండి. దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఈ మత పరమైన రాతలు హద్దులు దాటితే దానిని కూడలి నుండి తీసేయించొచ్చు. కాని ఇప్పటికిప్పుడు కులప్రాతిపాదిక పై నిరోధించలేము. సో అందరూ కాస్త సంయమనం పాటించండి. దాని బదులు సరదా విషయాలు, సినిమాలు, వంద నోటు, క్వార్టర్ సీసాలు ఇచ్చివోట్లు కొనుక్కుని తమని తాము కోట్లకు అమ్ముకుంటున్న రాజకీయ నాయకుల గురించి చర్చించండి...

ఓం .. శాంతి ... శాంతి..............

Saturday, 26 July 2008

తెలుగు బ్లాగర్ల ఫ్రెషర్స్ డే...

రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కూడలి కబుర్లలో బ్లాగర్ల ఫ్రెషర్స్ ఢే ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి జూనియర్, సీనియర్ బ్లాగర్లందరికీ ఇదే ఆహ్వానం. ఇక్కడ జూనియర్లు అంటే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టి ఆరు నెలలు దాటనివారు, ఆ తర్వాత మీరు సీనియర్లు. ఒకే. ఇప్పటిదాకా బ్లాగింగులో రాగింగ్ జరిగింది అంటున్నారు కదా. ఇక ఫ్రెషర్స్ ఢే జరుపుకుందామా??.

ముందుగా నా మాట..

ఇక్కడ బ్లాగర్లను కొత్త పాత అని గాని, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని గాని, ఒకరిని మెచ్చుకుని ఇంకొకరిని తిట్టడం అని గాని, లేదా కొత్త వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు. అని కాని ఎవ్వరూ అనుకోవద్దు. అలాంటి భావనలు ఎవ్వరికీ లేవు. బ్లాగులో రాసే విషయాన్ని బట్టి చదువరులు ఆ బ్లాగుకు వస్తారు, వ్యాఖ్యలు రాస్తారు. కొత్త వాళ్లకు కొంచం అలవాటు కావాలి అంటే. ఇంకా నయం. రెండేళ్ళ క్రింద నేను బ్లాగింగు మొదలెట్టినప్పుడు ఇన్ని వసతులు, సులువైన పద్ధతులు, చదువరులు లేరు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పటి వాళ్లకు అంతా వడ్డించిన విస్తరే. పత్రికలలో వచ్చే వ్యాసాలూ, కూడలి, కబుర్లు, సాంకేతిక సహాయం ఇలా ఎన్నో సదుపాయాలు. ఇక కొత్త వాళ్లకు ఎటువంటి సందేహమైనా, సమస్య అయినా నిస్సంకోచంగా తెలుగుబ్లాగు గుంపులో అడగవచ్చు. మీకు సమాధానం తప్పక దొరుకుతుంది. ఇక బ్లాగు ఎలా ఉండాలి. ఎలా రాయాలి అనే విషయం మీద సూర్యప్రకాశం గారు చాల విలువైన సమాచారం ఇచ్చారు.


జూనియర్లకు విజ్ఞప్తి .

కొత్తగా బ్లాగింగు మొదలెట్టిన వారందరికీ ఇదే సాదర ఆహ్వానం. కూడలి కబుర్లకి రండి. మాట్లాడుకుందాం. మీకు ఎటువంటి సందేహమైనా, లేదా సీనియర్ బ్లాగుల మీద ఎటువంటి అనుమానం ఉన్నా అడగొచ్చు. మేము అంత చెడ్డవాల్లము కాము అని మీరే తెలుసుకుంటారు. ఇక్కడా అందరూ ఒక కుటుంబం లా ఉంటున్నారు. కొత్తవాల్లైన, పాతవాల్లైనా అందరిని కలిపి ఉంచేది తెలుగు మీది అభిమానం మాత్రమే. వేరే ఎటువంటి బేధాలు లేవు..

సీనియర్లకు విజ్ఞప్తి.

రేపు సాయంత్రం మీరందరూ కూడలి కబుర్లకి వచ్చేయండి. కాస్సేపు ముచ్చట్లాడుకుందాము. కుల ప్రాతిపాదిక మీద వస్తున్నా బ్లాగులు, కాపీ బ్లాగులు, కూడలిలో కనపడాలని పదే పదే టపాలను పబ్లిష్ చేస్తున్న బ్లాగులు వీటన్నింటి గురించి చర్చింకోవచ్చు..

వేదిక : కూడలి కబుర్లు
సమయం: ఆదివారం. సాయంత్రం. ఆరు గంటలు. IST

Friday, 25 July 2008

నాకిదే టైం పాస్ ....

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక నవ్య విభాగంలో వచ్చిన నా వ్యాసం... ఈ లింకు మంటనక్కలో కంటే ఎక్స్ ప్లోరర్^లో చూడండి.





"మీనాంటీ ! ఉన్నారా? కప్పుడు పంచదార ఉంటే ఇస్తారా?"


.



" ఏవమ్మో! ఆంటీ ఏంటీ ? తెలుగులో ఎంచక్కా అత్తా అనో, అక్కా అనో అన్లేవా? అమెరికా ప్లేన్ దిగి వచ్చిన దొరసానిలా ఆంటీ ఏంటి? నీ ఇంగిలిపీసు మండిపోను. ఐనా మా అమ్మా, అయ్య మధురమీనాచ్చిలా అందంగా పుట్టానని మీనాక్షి పని పేరు పెడితే అందరూ మరీ బద్ధకించి పేరుని కత్తిరించి మీనా అని పలికేస్తున్నారు. మరీ నాజూకు ఐపోతున్నారు జనాలు. ఇదిగో పంచదార. మళ్ళీ నువ్వు కొనగానే తిరిగిచ్చేయాలి సుమా. ఇచ్చి మర్చిపోవడం అంటే నాకు మా చెడ్డ చిరాకు. పనిమనిషి ఎప్పుడొచ్చి చస్తుందో. మహారాణిలా వస్తుంది. మొగుళ్ళకోసం ఆత్రంగా ఎదురుచూసే రోజులు పోయి పనిమనుషులకోసం ఎక్కువ ఆత్రంగా ఎదురుచూడాల్సిన కాలం వచ్చింది. ఏం కలి కాలమో ఏమో?


.



ఓరేయ్ పిల్లలు! లెగండి. రోజూ ఇదో తంతు ఐపోయింది. ఇంత పెద్దాళ్లయ్యారు. ఇంకా రోజూ నిద్ర లేపాలి. ఎలా బాగు పడతారో ఏమో. ఒరేయ్ కిట్టు. లే.. రాత్రంతా పనికిరాని క్రికెట్ మ్యాచులు చూడడం. పొద్దున ఆలస్యంగా లేవడం. మ్యాచులవల్ల వాళ్ళకు లక్షలు,కోట్లు వస్తాయి. మరి నీకు వచ్చేది సున్నాలే. లే.. శిల్పా .. ఆడపిల్లవన్నట్టే కాని ఒక్క పని నేర్చుకోదు. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ మాట్లాడటం. తిండి లేకున్న ఉంటారేమోగాని సెల్ ఫోన్ లేకుండా రోజులు గడిచేటట్టు లేవు. గంటలు గంటలు ఏం ముచ్చట్లు పెడతారో ఏమో. బిల్లు అవుతుందా అంటే ఫ్రీ ఆఫర్లు అంటారు. పిల్లలు సెల్ కంపెనీ వాళ్ళను ముంచేస్తారు. అసలు సెల్ ఫోన్ కనిపెట్టినవాడిని తన్నాలి. ఏవండి. లేచారా లేదా? ఆలస్యంగా లేవడం మళ్ళీ ఆఫీసుకు లేట్ అయిందని లారెన్స్ లా డాన్స్లలాడటం. అసలు వీళ్ళందరి చదువులు , ఉద్యోగాలు నేను చేస్తే సరి. అనవసరంగా రోజు అరిచేకన్నా.

.


ఒసే సరూప. ఇదేనా రావడం? నువ్వు పని చేసేందుకు నేను నీకు డబ్బులిస్తున్నానా? నువ్వు నాకిస్తున్నావా? నీ ఇష్టమొచ్చినప్పుడు వస్తావు. నాకంటే నీ పనే నయంగా ఉంది. సినిమాలు, పండగలు, జ్వరాలు అన్నీ వస్తాయి. మాకు ఎగనామం పెడతావు. జీతం కోయొద్దంటావ్. నువ్వు వచ్చినా, రాకున్నా ఇంటికి గొడ్డూ చాకిరి చేస్తున్నా ఎవ్వరూ అయ్యో అనరు. జీతం లేదు, సెలవు లేదు. చీ! ఎదవ జన్మ..

.


అమ్మయ్యా! ఇప్పుడు కాస్త తీరిక దొరికింది . పేపర్ చదివి, కొద్ది సేపు టివి చూస్తే సరి. ఏం పేపర్లో, ఏం టివినో. ఇక్కడ చదువుదామంటె ఒకరి మీద ఒకరు తిట్టుకొవడం, పనికిమాలిన విషయాలు మధ్యలో రాజకీయనాయకుల గోల. ఎలక్షన్లముందు అమ్మా! అయ్యా ! అక్కా ! తమ్మి! అని మర్యాదరామన్నకి మేనత్త కొడుకుల్లా మన చుట్టూ తిరుగుతారు. గెలిచాక నాలుగేళ్ళు కనపడరు. ఎన్నికల ముందు ఊళ్ళు తిరిగి, జనాలకు అడ్డమైన కబుర్లు చెప్పి, కరెంట్ ఫ్రీ అని గెలిచి ఇప్పుడు మా వల్ల కాదు. కరెంట్ కట్ తప్పనిసరి ,మీరే వరుణదేవుడిని ప్రార్ధించుకోండి అంటారు అసలు మధ్యతరగతి వాళ్ళ రాత మారేనా? పప్పులు, బియ్యం , గ్యాసు, కూరగాయలు ఏది కొనాలన్నా మండిపోతుంది. సరే అని టీవీ చూద్దామంటే అర్ధం కాని సీరియళ్ళు, అడ్డమైన పోటీలు. అస్సలు అవి డాన్సు ప్రోగ్రాములా, క్లబ్ డాన్సులా? పిల్లలు, పెద్దలు కలిసి చూసేలా ఉన్నాయా? ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. అసలు పిల్లల తల్లితండ్రులకు ఏం మాయరోగం వచ్చిందో. పిల్లలను సగం సగం బట్టలతో డాన్సులేయిస్తారు. పైగా అది లక్షలాది మంది చూస్తున్నారన్న ఇంగితజ్ఞానం ఉండదు. ముందు వీళ్ళను ఉతకాలి. ఇక అత్తాకోడళ్ళ సీరియళ్ళు చూస్తే జీవితం మీద విరక్తి కలుగుతుంది. సీరియళ్ళలోని ప్లానింగులు బిన్ లాడెన్, బుష్ లకు కూడా రావేమో!.. కనీసం హిందీ సీరియళ్ళు చూద్దామా? అంటే అదో అయోమయ లోకం. మనవళ్ళకు పెళ్ళీడు పిల్లలున్నా, బామ్మలు, తాతలకు ఒక్క తెల్ల వెంట్రుక రాదు. మొహాన ఒక్క ముడత ఉండదు. లేదంటే కొన్ని కథలు ఒక జన్మ సరిపోదన్నట్టు మరో జన్మకు సాగదీస్తారు. పాటల చానెళ్ళు చూద్దామా. దురదగుంటాకు రాస్టే ఎగిరినట్టు పిచ్చి గంతులు. పిచ్చాళ్ళలా అర్ధంపర్ధం లేని పాటలు. చూసేవాళ్ళు ఎదవలైతే ఇలాంటి సినిమాలూ , సీరియళ్ళూ వస్తాయి.

.


అమ్మో! చూస్తుండగానే సాయంత్రమైంది. పిల్లలొచ్చే టైమ్ అయింది. రాత్రి వంట చేయాలి. పాటు తప్పినా సాపాటు తప్పదు కదా . గానుగెద్దులా అయింది బ్రతుకు. రోజు వంట చేయడం, ఇల్లు సర్దడం, పిల్లలను తయారుచేయడం, చదివించడం, మొగుడికి కావలసినవి అందించడం.ఒక గుర్తింపు లేదు పాడులేదు. నచ్చకుంటే బాగాలేదని అనడం తెలుసు కాని, బాగున్నప్పుడు నోరు తెరచి బాగుంది . బాగా చేసావు అని మాత్రం అనరు మొగుడైనా, పిల్లలైనా. అయ్యో అని అందరికి అనుకూలంగా అందిస్తుంటే ఏమీ తెలీడంలేదు. ఒకసారి తిక్కరేగిందా.స్ట్రైక్ చేసానంటే రోగం కుదురుతుంది. ఐనా ఇది జరిగేనా . చచ్చేనా. నాలో నేను సణుగుతూ పని చేసుకోక తప్పదు.. ప్చ్. ..

.

పక్కింట్లో జంటను చూసే ముచ్చటేస్తుంది. కాని బాధ కలుగుతుంది కూడా. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. మంచి ఉద్యోగాలు. వేలల్లో ఉద్యోగాలు . ఏం లాభం. కూలీలలాగా పని చేస్తారు. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. పని చేయడం, వచ్చి పడుకోవడం. కడుపునిండా తింటారో లేదో అర్ధం కాదు. కలిసి కాఫీ తాగడానికి శనాదివారాలు తప్ప కుదరదు. . పాపం.

.


ఒరే పిల్లలు , మీ చదువులు ఐపోతే , ఇక వచ్చి తినేసి పడుకోండి. ఇంకా అయ్యగారు ఇంటికి ఎప్పుడొస్తారో. పేకాట రామాయణం ఇంకా పూర్తికానట్టుంది. ఏమంటే. టైమ్ పాస్ అంటారు. మరి నాకు టైమ్ పాస్... ఈ సణుగుడేనా?

.



జ్యోతి వలబోజు.


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008