Tuesday, July 8, 2008

హాస్య పుణుకులు - రాజు, ఏడూ చేపలు..

అనగనగా ఒక రాజు. రాజుకు ఏడుగురు కొడుకులు. ఎండాకాలంలో పరీక్షలు ఐపోయి తాతిళ్లు ఇవ్వగానే ఇంటికొచ్చారు.


ఒకరోజు రాజేమో "పాండురంగడు" సినిమా చూస్తుండు. మస్తు ఖుషీగ ఉన్నడు.కొడుకులొచ్చి "నాయనా! మాకు బోర్ ఐతుందే! ఏం చేయాలే ?" అని అన్నారు.


అప్పుడా రాజు " బోర్ ఐతే సిన్మాలు చూడుండ్రి, దోస్తులతో షికార్లకు పోండి, నేనేం చేయాలే మరి?"


" అవన్నీ జేసీనా కూడా బోర్ ఐతుందే " . ఐతే అలా ఏటకు పోయిరండ్రి.నన్ను సతాయించొద్దు. సిన్మా చూడాలే. ఎల్లండి" అని తరిమేసిండు.అప్పుడు ఏడుగురు కొడుకులు రెండు కార్లేసుకుని ఏటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. ఎలాగు అమ్ముకునేది లేదు. ఒక్కక్కరికి ఒక్కోటి అని అంతే తెచ్చారు. అవి అట్లనే తింటే బాగుండవు కదా అందుకే కాస్త మసాలా పట్టించి ఎండలో పెట్టారు. ఐనా అవి ఎండలేదు.కొడుకులు మళ్ళీ రాజు దగ్గరకు పోయి "నాయనా! చాపలు ఎండుతలేవు? జర ఒచ్చి సూడే!" అన్నారు.రాజు వెళ్ళి "ఒసే! చేపలూ! ఏమైందే మీకు ఎందుకు ఎండలేదు?""మేంఏం జేసేది? చత్రీ అడ్డమొచ్చి ఎండ గొట్టలే. అందుకే ఎండలేదు""చత్రీ ! నువ్వెందుకు అడ్డమొచ్చావు . ఏంది కత?"" రాజా! నేనేం జేసేది! ఎండైనా, వానైనా చాలా మంది చత్రీలు పెట్టుకుంటలేరు. హెల్మెట్లంట .. ఏవో చిప్పలు బోర్లించి పెట్టుకుంటుండ్రు నెత్తిల మీద. అందుకే ఇక్కడికొచ్చా""ఏమే హెల్మెట్టు ! నువ్వెందుకు ఎప్పుడూ వాళ్ళ నెత్తిలమీద కూర్చుంటవ్? పనేమి లేదా?"
"నేనేం జేయను ! హెల్మెట్టు పెట్టుకోకుంటే పోలీసోల్లు ఊకుంటరా? పైసల్ అడుగుతరు? అందుకే బండి నడీపించెటోల్లు పెట్టుకుంటున్నరు?"ఓరేయ్ పోలీసోడా! నీకేం రోగమొచ్చిందిరా? నెత్తిమీద చిప్పలాంటి హెల్మెట్లు పెట్టుకోకుంటే పట్టుకుని పైసల్ గుంజుతున్నవంట ""మారాజా! నా తిప్పలు ఎవడింటడు. ఇంట్ల పెళ్ళాం ఊర్కె పైసల్ దే, పైసల్ దే అంటది. ఉట్టి చేతులతో ఇంటికి రానీయదు, తిండి పెట్టదు. నా జీతమేమో తాగుడుకు, అప్పులకే పాయే?" ఏవమ్మా! ఎండుకు ఊరికే నీ మొగుడిని సతాయిస్తున్నవంట! ఇది మంచిదేనా అసలు?""నేకేందయ్యా ! బంగ్లాల కూసోని మాటలు చెప్తవ్. మా పోరగాడు ఎప్పుడూ ఏడుస్తుంటడు. వాడికి ఏదో ఒకటి పెట్టి ఊకోబెట్టాలే కదా?""ఒరే పోరగా! ఎందుకురా ఏడుస్తావంట!'"చీమ పుట్టల ఏలు పెడితే అది కరుస్తుంది రోజూ. అందుకే ఏడుస్తా"'నీయమ్మ చీమా! గింతున్నవ్. నువ్వెందుకు సంటి పోరగాన్ని కరుస్తున్నవంట రోజు"" రాజా! అసలు జరిగింది తెలుసుకోకుండా అనొద్దు మల్ల. పోరగాడు రోజు నేను టివిల " హమ్మ! హమ్మ!" అనే మస్తు డాన్సు ప్రోగ్రాము సూస్తున్నప్పుడే నా పుట్టలో ఏలు పెడతాడు. కనెక్షన్ ఊడిపోతుంది. నాకు కోపం రాదా "
" ???????????????????????"
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>అందరికంటే చిన్న దేవుడు ఎవరు?? అందరి ఇళ్ళలో ఉంటాడు.

12 వ్యాఖ్యలు:

కత్తి మహేష్ కుమార్

హ హ హ హ బాగుంది. తెలంగాణా మాండలికంలో సీరియస్ హాస్యం చాలా బాగుంది.

కొత్త పాళీ

కథ బావుంది.
మీ గత సంగీత పుణుకి సమాధానం చూసి కడుపు చెరువై ఇంక మీ పుణుకులకి జవాబులు రాయకోడదని ఒట్టేసుకున్నా! :)

teresa

:)

Dr. Ram$

అవు మల్లా , తెలంగాణా యాస లో కథ మస్తు సెప్పిండ్రు. ఏం వమ్మా నువ్వు గిట్లనే, తెలంగాణ యాస లో హాస్య పుణుకులు సెప్తుండు, ఏదో ఒక దినాన మా కె.సి.ర్ అన్నా మీ బ్లాగు సూడకపోతుండా, అప్పుడు అన్న కి గుస్సా అవుతాది, ఇక సూడండ్రి మిమ్మలని, మీ అభిమాన సంఘాలని అన్న మస్తు గుంజుతుడు లే..గందులో గిప్పుడిప్పుడె గౌడన్న కూడా సేరిండు..ఏంవమ్మా సమజవుతుందా? ఇంకోమారు గిట్లాంటి హాస్య పుణుకులు రాసేప్పుడు జరంత సోచాయించి రాయిండ్రి.. జై తెలంగాణ

రాధిక

:)

బుసాని పృథ్వీరాజు వర్మ

నమస్తె అమ్మో.. లౌ బాగజెప్పిన్రు. మద్యలనయితే మస్తు నవ్వుకున్న, బాగా సతాయించింన్రుకూడా మొత్తం కతసదివిపించి ఎట్లయితెంది అట్లయిట్ల జేసి. మీరు ఎవర్రేమనుకొన్నా గిట్లనే మంచిగ రాస్తూ జరంత నవ్వించున్రి మంచిగనిపిస్తది మాకయితె.
అవునూ నాకు తెలువకడుగుతా, అసలు గిసుంటి ఐడియల్ ఎట్లొస్తయ్ మీకు.

మీకు మస్తు సప్పట్లు. :)
సరె వుంటమ్ తల్లి. నమస్తె.

వేణూ శ్రీకాంత్

Ha ha good one, kadha baavundi jyoti gaaru.

అబ్రకదబ్ర

కత జబర్దస్తుగుంది. ఒకటి మాత్రం అర్దంగాలే. పుట్టలో ఏలెడితే కనెక్సనూడిపోయేదేంది?

ఇంకోటి - నాకు ఇంతప్పట్నుండీ ఉన్న డౌటు. వేటకు పోతే ఎవరన్నా పులుల్నో సింహాల్నో కొట్టుకురావాలిగానీ మరీ చీపుగా చేపలు పట్టుకురావటమేంటి?

K

అందరికంటే చిన్న దేవుడు 'చిన్నిగాడు' (చిన్ని god)? చంటిగాడు? బుజ్జిగాడు? మేడిన్ చెన్నై?

సుజాత

మీకు తెలంగాణా మాండలికం మీద బలే పట్టు ఉందండి జ్యోతిగారూ! నవ్వాగలేదు.

@ డాక్టరు గారు,
మీరు తెలంగాణాలో ఎప్పుడు చేరారు పల్నాడు నుంచి వచ్చి?

జ్యోతి

కొత్తపాళీగారు,
అలా అంటే ఎలాగండి. మీరేమో కందము, ఆటవెలదులతో ఆటలాడుకుంటారు. మరి నాకు అంత టాలెంట్ లేదు కాబట్టి ఏదో బుల్లి బుల్లి పుణుకులు వేస్తుంటాను. ఇంతోటి దానికి మీరు ఒట్టు పెట్టేసుకోవడం ధర్మమా? న్యాయమా అని అడుగుతున్నాను అధ్యక్షా??
Dr. Ram$
నమస్తే డాక్టర్ సాబ్! ఏంది సోచాయించేది. నీకు తెల్వదా?నేను పక్కా తెలంగాణా పోరినని. కే.సి.ఆర్ వచ్చినా. అతని అత్త ఒచ్చినా భయపడేది లేదు మల్ల.

వర్మ గారు,
గదేందంటే.. మొన్న ఊర్కే ఈ కథ గుర్తొచ్చింది. సరే మన యాసలో రాసేస్తే పోలా అని రాశా అన్నమాట.

అబ్రకదబ్ర గారు.
ఆ చీమ పుట్టలో టివి కనెక్షన్ ఊడిపోతుందంట. అందరు వేటకు వెళ్ళి పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, వేటాడుతారు. మన రాజు గారి పిల్లలు కాస్త వెరయిటీగా చేపలు తెస్తారన్నమాట. అది వాళ్ల టాలెంట్.

K గారు,
మీరు చెప్పింది కరెక్ట్.
బుజ్జిగాడు, చిన్నిగాడు.

సుజాత గారు,
నాకు అలవాటే నండి ఈ యాస. మా ఇంట్లో, చుట్టాలతో ఇలాగే మాట్లాడతాము.

పుక్కళ్ళ రామకృష్ణ

హహహ...సూపర్ జ్యోతి గారు. పాత కథకు తెలంగాణా మాండలికంలో కొత్త భాష్యం. నాకు తెగ నచ్చేసింది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008