Saturday, July 19, 2008

టాటా.... వీడుకోలు.... గుడ్‍బై .. ఇంక సెలవు...

JellyMuffin.com - The place for profile layouts, flash generators, glitter graphics, backgrounds and codes


ఎందుకో మరి చాలా కాలంగా బ్లాగు రాసి , విసుగెత్తింది. బుద్దిమంతులైన సినిమా యాక్టర్‍లలా ఎవరూ తిట్టుకోకముందే తప్పుకోవడం మేలు కదా. అందుకే బ్లాగు సన్యాసం పుచ్చుకుంటున్నాను. తెలుగు బ్లాగ్లోకం దినదినప్రవర్ధమానమవుతుంది. చాలా సంతోషం. ఎన్నో కొత్త బ్లాగులు, కొత్త విషయాలు , చర్చలు.నిజంగా బ్లాగులన్నీ కళకళలాడుతున్నాయి అని చెప్పవచ్చు. ఇప్పటివరకు 1500 లకు కొద్దిగా తక్కువ పోస్టులు రాసాను. ఇక రాసే ఇంటరెస్ట్ లేదు. అందుకే నా బ్లాగు మూసేస్తున్నాను. కాని అమూల్యమైన నా బ్లాగు టపాలు (నాకు మాత్రం అమూల్యమైనవే మరి). అన్నీ pdf చేసి ఇక్కడ ఉంచుతున్నాను. నేను ,నా బ్లాగు గుర్తొచ్చినప్పుడు ఈ టపాలు చదువుకోగలరు..

కంగారు పడకండి. నేను ఎక్కడికీ వెళ్ళడంలేదు. ఈ మాటలన్నది మన ఆదిబ్లాగరు చావా కిరణ్. నాలుగేళ్ళ క్రింద తెలుగులో బ్లాగడం మొదలు పెట్టి ఎందరినో బ్లాగులు మొదలెట్టేలా చేసి, వికిపీడియాలో కూడా చురుగ్గా పాల్గొంటున్న కిరణ్ , ఎందుకో మరి విసుగు వచ్చిందంట. అందుకే తన బ్లాగును శాశ్వతంగా మూసేసాడు. కాని అందులోని టపాలన్నీ పుస్తకంలా చేసి పెట్టాడు. కావలసినవారు చదువుకోవచ్చు..

కిరణ్. నీ సన్యాసం తాత్కాలికం కావాలని కోరుకుంటూ ఇక్కడ నీకోసం అందరూ ఎదురుచూస్తుంటారు అని గుర్తుంచుకో..
 
ఒరెమూనా - బ్లాగు నుండి ఈబుక్కు  .. ఇక్కడ చదువుకోండి..

21 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

సదరు చావా కిరణ్కుమార్గారికి నేనూ చాలా సార్లు విన్నవించాను,బ్లాగటం ఆపొద్దని.మనకు పైకి చెప్తున్న కారణాలు కాక ఇంకేమన్నా ఉన్నయా అనికూడా అనుమానించా,కానీ :) యే సమాధానమయ్యింది :)

పూర్ణిమ

Enjoy the Break!! You'd certainly be back. :-)

netizen నెటిజన్

టా టా అనే తూట ని బాగానే పేల్చారుగా ఒరేమునా గారు, మీరు కలిసి!
చాల రోజులనుంచి,చాలా మంది బ్లాగర్ల టపాలను గమనించిన తరువాత, అప్పుడప్పుడు ఈ సందేహం వస్తునే ఉన్నది.

ఈ బ్లాగర్లకి "ఫెటిగ్" (fatigue) ఉండదా, రాదా అని?

పర్ణశాల ఇటీవల వచ్చిన బ్లాగులలో, విపరీతమైన ఎనర్జి తో, వెలువడుతున్న బ్లాగు. అవి ఆ బ్లాగరి ఎన్నుకున్న శీర్షికలు కానివ్వండీ, టపాలకు, వ్యాఖ్యలకు స్పందిచే పద్దతి కానివ్వండి! ఆ బ్లాగు చుట్టూ సందడి, సందడి గా ఉంటుంది.

బ్లాగరికి ఉన్న ఎనర్జి ఎంతకాలం నిలబడుతుంది అని ఒక ప్రశ్న వేసుకుంటే, అది ఆ బ్లాగు మూతపడినప్పుదు కాని తెలియదు.

బ్లాగు మూత పడిన తరువాత, దానిని ఎవరైనా గుర్తుంచుకుంటారా?
ఉదాహరణకి "తెలుగు దేశాభిమాని" "అమ్మతనం" మీద వెలువడిన టపా / బ్లాగు తెలుగు బ్లాగులోకంలో ఎంతో సంచలనాన్ని లేపింది! ఈ నాడు ఎంత మంది దానిని గుర్తు పెట్టుకున్నారు?

అలాగే, మొన్న రాజేంద్ర "దొంగిలించి" ఇచ్చిన సామెతలను, సేకరించిన బ్లాగరిని గురించి ఎంత మందికి తెలుసు?

ఆ మధ్య చక్కటి కధలు , ఉదా: కల్పన రెంటాల : "స్లీపింగ్ పిల్" ని గాని, ఫణీంద్ర కధ: "సరిహద్దు కిరువైపుల" గాని మళ్ళీ కధలు వెలువరించలేదెందుకని?

టపాలు వెలువరించినా వెలువరించకపోయినా, వ్యాఖ్యలలో నైనా "లలిత" గారు కనపడకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి?

రాధిక గారు కొత్త కవితలు వచ్చినవా?

కొత్త కృకీలు కూడా చాల రోజులైనవి చూసి?

బ్లాగులు మూతపడ డానికి కారణాలేమిటి అని తెలుసుకోవడానికి ఆసక్తితో, మీ అభిప్రాయలకోసం ఎదురుచూస్తూ....

రవి వైజాసత్య

ఎందుకు గుర్తు పెట్టుకోరు? భేషుగ్గా గుర్తుండిపోతాయి..ఉదాహరణకు ఇప్పటికీ పటిష్టమైన సొంత ఆలోచనలు కలిగిన బ్లాగుగా తెలుగుజాతీయవాది నాకు మదిలోమెదులుతూనే ఉంటుంది.
కొంతకాలమైన ఒక బ్లాగును రెగ్యులర్గా ఫాలో అయితే అది మూతపడిన తర్వాత కూడా గుర్తుండిపోతుంది.
ఇలా బ్లాగటం, ఆపటం కొందరి బ్లాగ్జీవితాల్లో సహజమైన పరిణామేననుకుంటా

జ్యోతి

నెటిజన్ గారు,
చావా కిరణ్ తన ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉండడమో, లేదా నాలుగేళ్ళుగా రాయడంతో బోర్ గా ఫీల్ అవ్వడమో జరిగి ఉండొచ్చు. fatigue అనేది ఎవరికైనా వస్తుంది. ముందు సరదాగా మొదలెట్టిన బ్లాగింగ్, తర్వాత అలవాటుగా మారినా కూడా. తమ వృత్తి ధర్మం ముఖ్యం కదా. అంబాదాస్ గారి బ్లాగులొ జరిగిన గొడవ చాలా మందికి గుర్తుండి ఉంటుంది. కాని ఆయన బ్లాగు మూసేయలేదు. మీరు అడిగిన వాటీలో కొన్నివాటికి నేను సమాధానం చెప్పగలను. కల్పన ఆరోగ్యరిత్యా కంప్యూటర్ ఎక్కువ వాడడంలేదు. రాధిక నిన్నే కొత్త పాట ఇచ్చినట్టున్నారు స్నేహమాలో. ఇక కృకీల విషయంలో గిరిచంద్ పరీక్షల హడావిడిలో , జాబ్ ట్రెయినింగ్ లో బిజీ. బ్లాగు వంక చూడడంలేదు. ఇక లలితగారు చాలా రోజుల నుండి కనపడడంలేదు. మెయిల్ చేసినా సమాధానం లేదు. ఎవరి దగ్గరైనా ఆవిడ నంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోవాలి ..

జింతాకు

హమ్మయ్య అనుకున్యా.... ;)

రిటైరౌతాంది కిరణ్ అన్న మాట

Lakshmi

internet browsing, blogging is almost equal if not worse than addiction to smoking, alcohol etc. you need tremendous willpower to abstain from these effect.
Iam sure and wish Mr. Kiran will be back...may be with a different name
we miss his blog

cbrao

రాయని భాస్కరులలో సుధాకర్ ' శోధన ' కూడా చేర్చాలి. ఆదిబ్లాగరుకు blog fatigue రావటం సహజం. కొన్నాళ్లు break తీసుకుంటే కొత్త ఉత్సాహంతో మరలా రాయవచ్చు. కిరణ్ తన రచనలన్నీ e-book గా విడుదల చేసి కొత్తదారి చూపినందుకు అభినందనలు. ఈ టపా రాసిన అక్కకు కూడా అభినందనలు.

కత్తి మహేష్ కుమార్

కిరణ్ గారు బ్లాగడం మానినా...బ్లాగులతో బాంధవ్యాన్ని మాత్రం వీడలేదు. కావల్సినప్పుడు సలహాలూ,సూచనలూ అందించడానికి ఇప్పుడూ,ఎప్పుడూ తయారుగానే ఉన్నారు.

Blog is an addiction for sure,but its better than watching TV.నేను నా TV చూడ్డం తగ్గించే ప్రయత్నంగా బ్లాగడం మొదలెట్టాను.ఇక ఉదృతం అంటారా అది మనసు లాగా ఊహాతీతం. ఎప్పుడు ఏలా మారుతుందో చెప్పలేం.

ఈ మార్పులవల్ల టపాల సైజు మారొచ్చు.రాసే శైలి మారొచ్చు. నమ్మిన నమ్మకాలు మారొచ్చు.విషయతీవ్రత తగ్గొచ్చు, పెరగొచ్చు.లేదూ,బ్లాగొక డైరీలాగా తన దినచర్య లేక ఆ రోజువచ్చిన ఆలోచనలు,బాధలూ చెప్పే పర్సనల్ పేజిగా తయారవ్వొచ్చు.

ఇక fatigue అంటారా...రాయడంలోని ఆనందాన్ని అనుభవించినవారు,రాసే మాధ్యమం లేక రాతల సైజు మార్చొచ్చేమోగానీ రాయడం మాత్రం మానలేరు. అది నా నమ్మకం.

ప్రవీణ్ గార్లపాటి

త్వరలోనే చావా మళ్ళీ బ్లాగు రాయటం మొదలెట్టాలని ఆశిస్తున్నా...
జ్యోతి గారు మీ టెంప్లేట్ లో వోటింగ్ విడ్జెట్ రెండు సార్లు వస్తుంది.

సత్యసాయి కొవ్వలి

కిరణ్ నిర్ణయం వినగానే ఏదో దిగులుగా, బెంగగా అనిపించింది. ఈటపాకి వచ్చినప్పుడల్లా అదే ఫీలింగు. How can he be so callous to all of us? మనోభావాలు దెబ్బతినడం అంటే ఇదేనేమో.

Anonymous

పనిలేని మంగలోడు ఏదో చేసాడట! కిరణ్ బ్లాగడం మానేస్తె ఈవిడ టా! టా చెప్పడం వల్ల ఈవిడ సాధించనదేమిటో అర్ధం కావడం లేదు. ఆమె పని ఆమెని చూసుకొమని చెప్పకుండా మిగతాళ్ళు వ్యఖ్యలు రాయడంలో అర్ధం ఏమిటొ?

Anonymous

పనిలేని మంగలోడు ఏదో చేసాడట! కిరణ్ బ్లాగడం మానేస్తె ఈవిడ టా! టా చెప్పడం వల్ల ఈవిడ సాధించనదేమిటో అర్ధం కావడం లేదు. ఆమె పని ఆమెని చూసుకొమని చెప్పకుండా మిగతాళ్ళు వ్యఖ్యలు రాయడంలో అర్ధం ఏమిటొ?

GEETANJALI

అనోనిమస్ గారు వ్రాసిన వ్యాఖ్య నాకు చాలా బాధవేసినది. ఒక బ్లాగరు తన బ్లాగు మూసివేసినందున రెగ్యులర్ గా చూసేవారికి ఇకనుండి ఆబ్లాగు లో ఆర్టికల్స్ రావనితెలిసినపుడు బాధపడుట వారికిగల మానవత్వ విలువలకు నిదర్శనం. ఏదో వ్రాయాలనికాకుండా కొంచెము ఆలోచించి వ్రాయమని నా సలహా. మీకు ఇష్టంలేతపోతే మిన్నకుండండి అంతేకాని ఏదుటివారి సంస్కారము గురించి విమర్శంచేముందు ముందు వారియొక్క అంతరంగములలోకి తొంగిచూసుకుని వ్యాఖ్య వ్రాస్తే బహుశా ఎదుటి వారిని బాధపెట్టకుండా ఉంటారని ఆశిస్తూ

oremuna

>> Anonymous

As I can not give a link to the pdf I created I requested Jyothi gaaru to put a post about my exit and about the pdf I created!

SIVAJI

జ్యోతి గారికి పనిలేదు సరే!! మరీ అనానిమస్ గారు తమరికి అంతకన్నా పనిలేకుండా మీరెందుకు వ్యాఖ్య రాసినట్టో!!! పనిలేనిది ఎవరికో అందరికి బాగానే అర్ధమవుతుంది. ఆమె బ్లాగు ఆమెకు ఇష్టమొచ్చింది రాసుకుంటారు. మీకు ఇష్టం లేకపోతే చూడటం మానెయ్యండి. ఎవరికి టాటా చెప్పుకుంటే మీకెందుకు? బిర్లా చెప్పుకుంటే మీకెందుకు?

రమణి

@anonymous: పనిలేని మంగలోడు ఏదో చేసాడంటూ .. మీరి పనిగట్టుకొని, తోచి తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్ళిందన్నట్లుగా జ్యోతిగారి బ్లాగుకొచ్చి, వ్యాఖ్య ఇవ్వడ మెందుకో? నచ్చకపోతే, మౌనం మంత మంచి మార్గం ఇంకోటి లేదు. అది పాటించండి. వ్యాఖ్యలు ఇంకొకరికి స్ఫూర్తినివ్వాలి, కోపాన్ని కాదు. మీ బ్లాగులోకి వచ్చి రాయలేదని గమనిస్తే చాలు. నెనర్లు

ప్రతాప్

చావా కిరణ్ గారు మళ్లీ బ్లాగింగు మొదలెట్టాలని కోరుకుంటున్నాను.
ఈ anonymous ఎవరో నిజంగానే పనిలేని మంగళి వారిలా ఉన్నారు. వారి గురించి వారి బ్లాగులో రాసుకుంటే మంచిది. పేరు చెప్పే ధైర్యం లేని వారికి ఇంతెందుకో.

lalitha

"ఈ మార్పులవల్ల టపాల సైజు మారొచ్చు.రాసే శైలి మారొచ్చు. నమ్మిన నమ్మకాలు మారొచ్చు.విషయతీవ్రత తగ్గొచ్చు, పెరగొచ్చు.లేదూ,బ్లాగొక డైరీలాగా తన దినచర్య లేక ఆ రోజువచ్చిన ఆలోచనలు,బాధలూ చెప్పే పర్సనల్ పేజిగా తయారవ్వొచ్చు."

బాగా చెప్పారు.

బ్లాగు పబ్లిక్కే అయినా అది బ్లాగరు స్వంత విషయం అని ఒక బ్లాగరు చెపారు. అది చదివే వారికీ రాసేవారికీ కూడా మార్గదర్శకం.

నన్ను గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు.
http://www.telugu4kids.com ను,
http://bookbox.com/index.php?pid=129 నీ, గుర్తుంచుకుని పిల్లల కోసం తెలుగునీ, తెలుగు కోసం పిల్లలనీ ప్రోత్సహిస్తే సంతోషిస్తాను.

netizen నెటిజన్

ఓహ్! ఉన్నారా!

వేణూ శ్రీకాంత్

కిరణ్ గారు మళ్ళీ సరికొత్త ఐడియాలతో త్వరలో బ్లాగ్ మొదలు పెట్టాలని కోరుకుంటున్నానండీ. టపాల PDF ఇచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008