Monday, 21 July 2008

ప్రమదావనంలో ముఖ్యమైన చర్చలు...

నిన్నటి ప్రమదావనంలో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చ జరిగింది. సమావేశానికి వచ్చిన  వారు..
జ్యోతి,
మేధ,
జ్ఞానప్రసూన,
శ్రీవిద్య ,
పూర్ణిమ,
రమణి,
సుజాత(గడ్డిపూలు),
తెరెస.
నిషిగంధ.

ఒకరిద్దరిని నెట్ సమస్య చిరాకు పెట్టినా చర్చ చాలా ఉత్సాహంగా జరిగింది. ఈసారి వచ్చిన కొత్త సభ్యులు మేధ, శ్రీవిద్య.

మేధ : " నాలోనేను" బ్లాగుకర్త. అసలు ఊరు విజయవాడ. ఉద్యోగం చేసేది బెంగళూరు. కాని ఇప్పుడున్నది కొరియాలో. వృత్తి. శతకోటి S/W ఇంజనీర్లలో ఒక బోడిS/W ఇంజనీరన్నమాట. భానుమతి గారి ఆత్మకథ చదివి ఆ ప్రేరణతొ తన బ్లాగుకు నాలోనేను అనే పేరు పెట్టారు. అలాగే ఈనాడులో వచ్చిన వ్యాసం చదివి తనకు నచ్చిన భావాలు , ఆలొచనలు , నచ్చినది,నచ్చినప్పుడు రాసుకోవచ్చు కదా అని బ్లాగుకు కొబ్బరికాయ కొట్టేసి ఏడాది కావస్తుంది.

ఇంకా రాని సభ్యుల కోసం ఎదురుచూస్తు జ్ఞానప్రసూనగారు ఒక చలోక్తి విసిరారు. " మా చిన్నప్పుడు బందరు నుండి బెజవాడ వరకు బస్సు నడిపేవారు. బస్సు నిండేదాకా కదిలేవారు కాదు. రండి రండని పిలిచేవారు. అలా ప్రమదావనం లో పిలుస్తున్నా కూడా అందరూ ఆలస్యం చేస్తున్నారు" :)

తర్వాత నేను అడిగిన ప్రశ్న " భర్త సంపాదించి, బాగా పేరు తెచ్చుకుంటే భార్య చాలా సంతోషిస్తుంది. గర్వపడుతుంది. కాని భర్త అలా ఎప్పటికీ అనుకోడు .. ఎందుకలా??"

అందుకు నిషిగంధ : అది ఒకప్పుడు జరిగేది . కాని ఇప్పుడు చాలామంది తమ భార్యలు బాగా సంపాదించి పేరు తెచ్చుకుంటే సంతోషిస్తున్నారు. ఇంటిపనుల్లో సహాయపడుతున్నారు.మగవాళ్ళలో విశాల తత్వం పెరిగింది.

జ్ఞానప్రసూన: " మగవాళ్ళు తమ అహంబావాన్ని అణచుకోలేరు, ఆడవాళ్ళు అణుచుకుంటారు అంతె తేడా.. అమెరికాలో తప్పదు కాబట్టి ఇంటిపనుల్లో సహాయం చేస్తారు. కాని హైదరాబాదులో ఐతే చాలా తక్కువ మంది అలా చేస్తారేమొ. చాలా మంది గీర్వాణం పోతారు: అని అన్నారు.

మేధ " నేను చూసినంతవరకైతే భర్త భార్యకంటే ఎక్కువ సంపాదించినంతవరకు బానే సపోర్ట్ చేస్తాడు. కాని తనను మించిందంటే మాత్రం సహించలేడు.

ఇంతకు ముందులా కాకుండా ఎంతో మంది భర్తలు తమ భార్యలను ప్రోత్సహిస్తున్నారు. కాని భార్య తనకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటే సహించగలడా అనేది అందరికీ సందేహమే.

అప్పుడే శ్రీవిద్య వచ్చింది.

శ్రీవిద్య : బ్లాగువనం ఓనర్. పుట్టింది తూ.గో. జిల్లా,అసలు సిసలు కోస్తా పిల్ల. తను కూడా మృదులాంత్ర నిపుణురాలు. హై లో పని చేస్తుంది. ఈనాడులో వ్యాసం చదివి బ్లాగు మొదలెట్టింది. బ్లాగులో రాసే టపాలాగే నిజజీవితంలో కూడా సరదాగా ఉంటావా అని అడిగితే అవును నేనో పెద్ద వాగుడుకాయను అని నిజాయితీగా ఒప్పుకుంది.

ఇప్పుడు బ్లాగ్లోకంలో మహిళలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు . ఇంతకు ముందు హాస్య టపాలు అంటే విహారి, రెండు రెళ్ళు ఆరు బ్లాగులే చూసేవాళ్ళు. కాని ఇప్పుడు మహిళలు కూడా తామేమీ తీసిపోమను అని నిరూపిస్తున్నారు అని అందరు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.ముఖ్యంగా క్రాంతి, విద్య, మీనాక్షి, సుజాత(మనసులోమాట).

కొద్ది సేపు టెంప్లేట్ల గురించి ముచ్చటించుకున్నాక " అడగనా!, అడగనా" అంటూ పూర్ణిమ ఒక మంచి సందేహం వెలిబుచ్చింది. అబ్బాయిలు "ఎన్నాళ్ళీ వెయిటింగ్" అని విరహగీతాలు, ప్రేమగీతాలు కుప్పలు తెప్పలుగా రాస్తారు కదా. మరి అమ్మాయిలు ఎందుకు అలా రాయలేరు? అమ్మాయిలు నేను ఆగలేను అంటే వేరే అర్ధం తీస్తారు. అబ్బాయిల లాగే అమ్మాయిలు కూడా ప్రేమ,విరహం అన్నీ అనుభవించినా వాటిని పదాలతో పొందుపరిచి చెప్పలేరు కదా?

జ్ఞానప్రసూన : అమ్మాయిలు ఆరాధిస్తున్నాము అని అంటారు కాని విరహం ప్రకటించలేరు.

శ్రీవిద్య : అవును ఆగలేను , తాళలేను అన్న మాటలు వాడితే అందరూ మనను తేడాగా చూస్తారు. నేను ఇలాగే బ్లాగులో ఒక ప్రేమ కథ రాస్తే నిజంగా మీకు అలా జరిగిందా అని ఎంతోమంది అడిగారు.

నిషిగంధ : అలా అమ్మాయిలు అంటే అబ్బాయిల గుండెలు జారిపోతాయి. అమ్మాయిలు కూడ తాము ఎక్కువ ఆరాధించబడాలి అనుకుంటారు. అమ్మాయిలు అలా అంటే అపార్ధాలకు కూడా దారితీయొచ్చు. ప్రేమలేఖల విషయంలో నన్ను అలాగే అడిగారు.

జ్యోతి : అమ్మాయిలు మనస్పూర్థిగా ఆరాధిస్తారు. అమ్మాయి కూడా విరహాన్ని వ్యక్తపరచగలదు అసలు తను అమ్మాయి అనే విషయం తెలీనివ్వకుండా. సమాజం అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరిని ఒకే విధంగా చూసేవరకు ఇలాగే ఉంటుంది. అమ్మాయిలు తమ భావాలను సంపూర్ణంగా వ్యక్తపరచలేరు.

తెరెస : అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే కాస్త ఎక్కువే విరహవేదన పడతారు , కాని ఆ బాధలోనుండి కవితలు రాసేంతగా తేరుకోలేరు. తేరుకున్నాక అది సిల్లీగా అనిపించి ఊరుకుంటారు. అబ్బాయిలేమో అన్నింటిలాగా తమ ఫీలింగ్స్ కూడా బహిర్గతం చేయాలి. అనుకుంటారు.

సుజాత : అమ్మాయిలు విరహంలో కూడా passive గా ఉండిపోతారు. కాని కొంతమంది aggressive గా కూడా ఆలోచిస్తారు.

చివర్లో ఒక సినిమా క్లైమాక్స్ పాటను, అందునా విరహగీతాన్ని ఒక స్త్రీ, ఒక పురుషుడు.ఇద్దరికీ అవకాశమిస్తే ఎవరు బాగా రాయగలరు అన్న ప్రశ్నకు అందరూ అబ్బాయే అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు పుస్తకాలు, బ్లాగు టపాల గురించి మాట్లాడుకుని అందరూ ఒక్కరొక్కరుగా నిష్క్రమించారు. ఆ తర్వాత చాలా సేపటికి వరూధిని, పద్మ.i, మోహన, స్నేహ వచ్చి వెళ్ళిపోయారు. సారీ ఫ్రెండ్స్. అమెరికావాళ్ళకు మనకు టైం కుదరటంలేదు. ప్చ్..

ఇక ఈసారి ముఖ్య అతిథిగా వస్తానని అన్న వీవెన్ వ్యక్తిగత పనులలో తీరిక లేక ఆలస్యమైందని రాలేకపోయాడు. సో వచ్చే ప్రమదావనానికి వస్తాడని ఆశిద్దాం.

2 వ్యాఖ్యలు:

cbrao

టపా ఆసక్తికరంగా ఉంది.

Anonymous

తర్వాత నేను అడిగిన ప్రశ్న " భర్త సంపాదించి బాగా పేరు తెచ్చుకుంటే ....
Immediately after reading this paragraph(before reading the answer from Nishigandha), I thought that I need to answer this saying that Jyothi is wrong. But Nishigandha told what I thought of telling, Naamatuku naaku.. eappudu vunde kala.. "Adigo athane aame bhartha", Adigo athane aame/athani thandri" elaa anipinchukovaali ani. Bahusaa nammaremo.. Andamina bharya elaa garvapadelaa chestundo, telivaina, churukaina Bharya/koothuru etc also adds that PROUDNESS to a male.Chaala mandi bayata padaleka povochu but manasulo ayinaa chaala mandi murusipothaaru.. so, mahilaa manulu.. mee success la ku, manasulu mursipothaayi.. :-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008