నిదురించు జహాపనా...
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా .. నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా .. నిదురించు జహాపనా...
పండువెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మాహల్ ధవళకాంతుల్లో
పండువెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళకాంతుల్లో
నిదురించు జహాపనా.. నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా ... నిదురించు జహపనా.
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా .. నిదురించు జహాపనా.
మనసు అల్లకల్లోలంగా , అయోమయంగా ఉన్నప్పుడు ఈ పాట వింటుంటే,, పండు వెన్నెలలో ఊయలలో పడుకుని ఊగుతున్నట్టుగా , ప్రశాంతంగా ఉంటుంది.
అడిగినంతనే ఈ పాట సాహిత్యం, ఇచ్చిన పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. ఎంతైనా పాత పాటల ఖజానా ఉంది కదా వారి దగ్గర.
tajmahal.mp3 |
ఈ పాట ఎం.ఎస్.రామారావు గారు 1948 లో పాడింది. అందుకే ఆడియో అంత స్పష్టంగా లేదు కాని పాత బంగారం కదా.
10 వ్యాఖ్యలు:
ఈ పాట గురించి ఓ సారి చదువరి గారు రాసినట్టు గుర్తు ఓ లింకు కూడా ఇచ్చారు, ఓ మంచి అధ్బుతమైన పాట ఇది. పరచూరి శ్రీనివాస్ గారికి నా అభినందనలూ , జ్యొతీగారూ మీక్కూడా
ఏమండి జ్యోతి గారు,నేనొక బ్లాగును అచ్చం ఈ వీడియోల కోసమే నడుపుతుంటే మీరు మాకు పోటీకొస్తే ఎలాగా?అసలే యం.యస్.రామారావు గారు మాకు స్కూల్లో సీనియరు! :)
http://movingwonder.blogspot.com/
జ్యోతి గారూ చాలా హాయి గొలిపే పాటను వినిపించారు.నెనరులు.
జ్యోతి గారూ
దీనికన్నా నిన్న శ్రీనివాస్ గారు పంపించిన 1948 లోని పాట చాలా బావుంటుంది..అది original కాబట్టి జనాలకు కూడా తెలుస్తుంది, అసలు పాటలో ఎంత మాధుర్యం ఉందనేది...వీలుంటే అదీ ఇదీ రెండూ పెట్టి, జనాలను ఓట్లు అడగండి..ఏ పాటకు ఎక్కువ ఓట్లు వస్తాయో చూద్దాం...:)....నా ఓటు ఎలాగూ 1948 దానికే...:)...
వంశీ
అవునండి వంశీగారు, అది అంత పాత పాట అని తెలీదు.ఆడియో సరిగా లేదని నిన్న పెట్టలేదు. కాని కొత్త , పాత రెండు పాటలు వింటే బావుంటుంది అని పెట్టాను..
ఇదే పాట నీరాజనం సినిమా ఆల్బం లో ఉంటుందనుకుంటా. నిజమెనా?
ఏది ఏమైనా చాలా మంచి మెలడీ.
బొల్లోజు బాబా
చాలా బాగుంది. ధన్యవాదాలు మీకూ, శ్రీనివాస్ గార్లకు
పాత పాట లింక్ కూడా ఇచ్చినందుకు థాంక్స్ అండీ, చాలా మంచి పాట గుర్తు చేసారు.
ఒక సారి ఈ పాట రడియోలో విన్నాను, ఎంత నచ్చేసిందో చెప్పలేను , ఆ రోజంతా మైమరచిపొయాను. తిరిగి వెతికి పట్టుకుందామంటే సినిమానో తెలీదు. మళ్ళీ ఇన్నాళ్ళకి మీ దయ వల్ల ఈ భాగ్యం...అందుకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
Jyothi garu Suseela gari vyasam chala bagundi.
Kalasagar
editor,www.64kalalu.com
Post a Comment