పుణుకులు
1. చీమ , ఏనుగు గాడంగా ప్రేమించుకున్నాయి. ఏనుగు తలిదండ్రులు వాళ్ల పెళ్ళికి ఒప్పుకున్నారు. ఎందుకంటే చీమ చాలా కష్టజీవి, దుబారా ఖర్చు పెట్టదు, కష్టకాలానికి దాచి పెడుతుంది అని. చీమ తలిదండ్రులు మాత్రం మేము అమ్మాయిని అంటే ఏనుగుని చూడాలి అన్నారు. సరే అని పెళ్లి చూపులు ఏర్పాటు చేయబడ్డాయి. కాని ఇంటికెళ్ళాక వాళ్లు పెళ్ళికి ఒప్పుకోలేదు. అమ్మాయి నచ్చలేదు అన్నారు. ఎందుకంటే ...
"అమ్మాయికి ఎత్తు పళ్ళు ఉన్నాయి. బాలేదు !!!"
2 . ప్రేమికులైన రెండు బొద్దింకలు పార్కులో కూర్చున్నాయి. అంతలో ఒక బొద్దింక వీరావేశంలో ఒక పాట పాడింది. "తేరా తేరా తేరా సురూర్ " అని హిందీ హిట్ సాంగ్ పాడింది . అంతే పక్కనున్న బొద్దింకతో పాటు చుట్టూ పక్కల ఉన్నా బొద్దింకలన్నీ డమాలని చచ్చిపోయాయి. ఎందుకు???
మీరు ఎన్నో రకాల దోశలు చూసి ఉంటారు. కొన్ని తిని ఉంటారు. ఉల్లి దోశ , ఎమ్మెల్యే దోశ, పన్నీర్ దోశ , ఖీమ దోశ, మొదలైనవి. అన్నిదోశలు రుచిగా ఉంటాయి. కాని ఉప్పు లేకుంటే బాగుండవు కదా.
అలా ఉప్పు లేని దోశ లను ఏమంటారు ???
10 వ్యాఖ్యలు:
2. i dont know hindi much
3.sweet dosa [maa intlo cestaaru]
రాధిక,,
నేను ఎప్పుడు గాని పుణుకులు కాస్త డిఫరెంట్‍గా ఇస్తాను. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు.
jyothakkagaru..
boddinkaladi inka tattaledu ee matti burraki...kaani, vuppuleni dosalani...BP dosa antaremo?..
మీ పుణుకుల్లో కాలు కాదు, వేళు కూడా పెట్టనని వొట్టేసుకున్నాను గానీ .. చెప్పకుండా ఉండలేక పోతున్నా .. ఆడ ఏనుగులకి బయటికి పొడుచుకొచ్చే దంతాలు ఉండవు. హి హి హి
ఉప్పులేని దోశ అంటారు.
అయ్యో రామా! కాస్త డిఫరెంటుగా ఆలోచించండి..
కొత్తపాళీగారు, హహహహ.. అలాగే ప్రశ్నకు జవాబు చెప్పండి. రెండు ఉన్నాయి.
ఆడ ఏనుగులకి బయటికి పొడుచుకొచ్చే దంతాలు ఉండవు.
yes exactly. i just refered my textbook.
bollojubaba
1. 'హిట్' తగిలి చచ్చుంటాయ్.
2. ఊతప్పమా?
ఇప్ప్పుడే స్లిప్పు దొరికింది:
2. చప్పట్లు.
పుల్లట్లోయ్ పుల్లట్లు..
పుల్లమ్మ పుల్లట్లు, గోదావరి లాంచి స్పెషల్ కాదేంటి..
మొత్తానికి బొద్దింకల ని చంపే పని లో పడ్డారన్నమాట.. కానివ్వండి..కాని నాది ఒక విన్నపము , చివరి గా ఆ బొద్దింకలు అన్ని ఎలా చచ్హి పోయాయో , ఆ తావీదు మహిమ ఏమిటో మాకు చెపితే , ఇక్కడ మా ఇంట్లో వున్న కాకీలన్నింటి ని ఒక్క వేటు నా వేసేస్తా..హహహ.. లేకపోతే చంపేస్తున్నాయండి బాబు..
Post a Comment