ప్రమదావనం ప్రత్యేక సమావేశం
శ్రావణమాసం అంటేనే ఆడవాళ్ళకు ప్రత్యేకమైనది. అందుకే సుజాతగారు మహిళాబ్లాగర్లకు ఆహ్వానం పలికారు.
అంతర్జాలం అంటేనే ఒక మాయాప్రపంచం. కాని ఈ తెలుగు బ్లాగ్లోకంలో అందరు కాకున్నా కొందరైనా ఒక ఆత్మీయబంధం ఏర్పరచుకున్నారు. అలాగే ప్రమదావనం సభ్యులు కూడా. ప్రతి సమావేశంలో ఎవరెక్కడ ఉన్నా అందరిని కలవాలని ఆత్రుత ఉంటుంది. అప్పుడప్పుడు వీలుకాదులెండి. అలా కలుసుకుని ముచ్చట్లేసుకుని స్నేహితులయ్యారు అందరు. ఇక్కడ ఎవరు కూడా వయసు, తమ గొప్పలు చెప్పుకుని కాని దగ్గర కాలేదు. ఎవరికి వారు తమ భాద్యతలలో బిజీగా ఉన్నారు. అందరు కలిసింది ఒక్క బ్లాగు రచనల ద్వారానే. అలా అని ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఎప్పుడూ అనుకోలేదు,అనుకోరు కూడా. ఇలా ఉన్నప్పుడు ఒకరినొకరు కలవాలని ఉంటుంది కదా. ఒకరో ఇద్దరో కలిసే బదులు అందరం ఒకే చోట కలిస్తే బావుంటుంది కదా అన్న చిన్ని కోరికతో నేను సత్యవతిగారు మాట్లాడుకుని మా ఇంట్లో కాని వాళ్ళింట్లో కాని లంచ్‍కి కలుద్దాము అని నిర్ణయించుకున్నాను. ఈ సారికి సత్యవతిగారి ఇంట్లో కలవాలని ఫైనల్ ఐంది. వచ్చేసారి మా ఇంట్లో. ఆదివారం ఆడవాళ్ళకు ఎలాగూ సెలవు దొరికే సమస్యే లేదు. కనీసం ఇలా ఐనా ఓ మూడూ నాలుగు గంటలు భర్తను, పిల్లలను వదిలేసి స్నేహితులతో గడపొచ్చు అనే ఆలోచన. అసలు ఇప్పుడు కామన్ కల్చర్ ఐన కిట్టీ పార్టీలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందులో ముఖ్యంగా గొప్పలు చెప్పుకోవడం, స్టేటస్ గట్రా అనే ఫిట్టింగ్స్ ఉంటాయి. కాని ఇక్కడ మనమందరం కలిసేది ఒక మంచి వాతావరణంలో అదీ తెలుగు బ్లాగులలోని వ్యాసాలతో పరిచయం పెరిగి స్నెహితులమయ్యాము అందుకే ఇలా కలవాలనే ఆలోచన కలిగింది. అమెరికాలో ఉన్న మిత్రులు హై కి వచ్చినప్పుడు తప్పక కలుద్దాం .
జ్ఞానప్రసూనగారు ప్రమదావనంలో గార్లు వండపోతే , వాళ్ళింట్లో బూర్లు వండిపెడతామన్నారు. వచ్చే నెలలో ఆవిడ హైదరాబాదు వస్తున్నారుగా. అప్పుడు వాళ్ళింటి మీద దాడి చేద్దాం. తప్పకుండా బూర్లు చేసి పెడతామన్నారు. తర్వాతి సమావేశం మా ఇంట్లో , ఎప్పుడు అంటే ... త్వరలో..
మొన్నటి ఆదివారం నాటి సమావేశానికి వచ్చిన కొత్త సభ్యురాలు శ్రీమతి నిర్మల కొండేపూడి. రచయిత్రి.. ఆవిడ బ్లాగు ఆకాశంలో సగం..
ఈ స్పెషల్ సమావేశానికి వచ్చే మిత్రులకు నా తరఫున ఆవకాయ, సున్నుండలు తెస్తున్నాను. తినడానికి, ఇంటికి తీసికెళ్ళడానికి కూడా. ...
6 వ్యాఖ్యలు:
మొత్తానికి female bonding శక్తిని చూపించారు. మగాళ్ళం మాత్రం తక్కువకాదండోయ్! చూస్తూ ఉండండి ఎన్నెన్ని సిత్రాలు చేస్తామో!
ఆలోచన బాగుంది జ్యోతిగారు. చూడాలి. 17 న అంటున్నారు కదా. నా ఆలోచనలు కూడా అటో కాలు ఇటో కాలు అంటున్నాయి.
ఎంతమంది వస్తున్నారో ఐడియా ఉందా? (ష్! మనలో మన మాట నాకు వంట రాదు మరి.. నేను వస్తే ఏమి తీసుకు రాను? ఇంకో మాట తినడం వచ్చు ఎవరితో అనకండి మనిద్దరి మధ్య ఉండాలి )
నేను మీ అందరికీ మా తోటలోంచి మంచి గులాబీ మరియు ఇతర ప్రత్యేక పూల మొక్కలు తెద్దామనుకున్నాను. నా బొంద, ఇంకేం తెస్తాను, ఇవాళ మధ్యాహ్నం ఊరెళుతున్నాను. మీ ఇంట్లో సమావేశానికి తప్పక 'ప్రెజెంట్ మేడం ' అంటాను చూడండి!
'కిట్టీ పార్టీలంటే నాకస్సలు ఇష్టం ఉండదు ' మళ్ళీ వోటేస్తున్నా మీకు!
సరే, నా వాటా ఆవకాయ, సున్నుండలు అట్టేపెట్టండి, వచ్చాక మీ ఇంటికొచ్చి కలెక్ట్ చేసుకుంటా!
అన్నట్టు రమణి గారు, మీరు మాత్రం కంది పచ్చడి తెస్తే భోజనమంతా దానితోనే పూర్తవుతుంది ఆ రోజు! గ్యారంటీగా!(అందులో నా వాటా నేను తర్వాత మీ చేత ఫ్రెష్ గా చేయించుకుని మరీ వసూలు చేసుకుంటాను)
అందరూ ఎంజాయ్ చేయండి,
కుళ్ళుకుంటూ
మీ సుజాత
naaku metho kalavalani vundhi kaani nenu bangalore lo vundedhi
maheeswari_uma@yahoo.co.in
మహేష్ గారూ, మీరు కూడానా! మీరు స్త్రీ శక్తిని చూపించారు, మేమూ పురుష శక్తిని చూపిస్తాం, అనడమే కానీ, "మనం కలిసి" అనే మాటే లేదా మీ దగ్గర కూడా!(మీరు సరదాకి రాస్తే ఓకె).ఎందుకంటే ఈ వైరుధ్యాల గురించి,వాదాల బ్లాగుల్లో చదివి చదివి, ఆలోచించి, ఆలోచించి, బుర్ర వేడెక్కి కొన్నాళ్లకి పని చేయడం మానేసేలా ఉంది.
@సుజాత గారూ, సరదాగా అన్నా దానినొక ఇజం ప్రిజంలో చూసేస్తే కష్టమండీ బాబూ!ఈ ఆదివారం నేను హైదరాబాద్ కి వస్తుండటం వల్ల హైదరాబాద్ బ్లాగర్ల సమావేశానికి వెళుతున్నాను అదే కాస్త సస్పెన్స్ గా చెప్పడానికి ప్రయత్నించాను. అంతే!
Post a Comment