Monday, 8 September 2008

స్పెషల్ ప్రమదావనం ముచ్చట్లు

నిన్న జరిగిన ప్రమదావనం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ముగ్గురు ప్రముఖ బ్లాగర్లు అతిథులుగా వచ్చారు. అలాగే ఎందరో సభ్యులను ప్రమదావనం గెంటేసింది. ఇప్పటికే ఇక్కడ పెద్దవారు ఉన్నారు . బరువెక్కువైంది అని ఆఖరుకు నన్ను కూడా "గెట్ లాస్ట్ " అంది. తెరెసా, మాలతిగారు కూడా నిన్నటి బాధితులే. ఇక ఇద్దరు సుజాతలకు కరెంట్ షాక్ కొట్టింది.  ఈసారి అతిథులుగా _ సాలభంజికలు నాగరాజుగారు, చదువరిగారు, నెటిజన్‍గారు వచ్చారు. కాని పూర్ణిమ చాకచక్యంగా వాళ్లందరితో చక్కగా చర్చ జరిపింది. మా లోటు తెలియకుండా. కాని నాగరాజుగారు, చదువరి గారు నిన్న చాలా అదృష్టవంతులు. నక్కను తొక్కి వచ్చారనొచ్చు. నేను, తెరెసా, వరూధిని, రమణి, సుజాతలు లేరు. లేకుంటే ముప్పేట దాడి జరిగేది. ప్చ్..

ఆహ్వానితులు లేకున్నా ఆహుతులు మా ప్రమదావనంలో ఆసక్తిగా పాల్గొన్నారు. వారికి ధన్యవాదాలు. మళ్ళీ మరోసారి మా అతిథులుగా రావాలని కోరుతున్నాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. వాట్ టూ డూ...

ఈ పత్యేక సమావేశ నివేదిక పూర్ణిమ ఊహలన్నీ ఊసులుగా చెప్తుంది . పదండి మరి ..

2 వ్యాఖ్యలు:

Ramani Rachapudi
This comment has been removed by the author.
Ramani Rachapudi

అవునూ ప్రత్యేకమే, ఎవరినీ రానీకుండా నెట్ ఎదురుదాడి చేయడం మరీ ప్రత్యేకం. నివేదిక బాగుంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008