Saturday, 27 September 2008

నాకు నచ్చిన మరో అందమైన పాట ఇది



మైనే పూచా చాంద్ సే
చిత్రం : అబ్దుల్లా
విడుదల: 1980
గానం : మొహమ్మద్ రఫీ
రచన : ఆనంద్ బక్షి
సంగీతం :ఆర్.డి.బర్మన్

ఇందులో ఒక ప్రియుడు తన ప్రియురాలి అందచందాలు మరెవ్వరికి లేవని అంటున్నాడు. దానిని నిర్ధారించుకోవడానికో, తన చెలి కంటే గొప్పవాళ్లు, అందమైనవాళ్లు లోకంలో ఎవ్వరూ లేరు అని నిరూపించడానికో ప్రకృతిలోని అన్ని సుందరమైన వస్తువులను అడుగుతున్నాడు.

మైనే పూచా చాంద్ సే
కె దేఖ హై కహీ
మేరే యార్ సా హసీన్
చాంద్ నే కహా
చాందినీ కి కసం నహి నహి నహీ..

నేను చందమామను అడిగాను, నా చెలి అంత అందమైన వారిని చూసావా అని. అప్పుడా చంద్రుడన్నాడు ఈ వెన్నెల మీద ఒట్టు , ఎవ్వరూ లేరు అని.

మైనే యే హిజాబ్ తేర డూండా
హర్ జగాహ్ షబాబ్ తేర డూండా
కలియోన్ సే మిసాల్ తేరి పూచి
ఫూలోన్ సే జవాబ్ తేర డూండా

నీ మేలిముసుగులో వెదికా, ప్రతి చోటా నీ యవ్వనాన్ని వెదికా, పూమొగ్గను నీ గురించి అడిగా, పువ్వులను కూడా నీ గురించి జవాబులు అడిగాను.

మైనే పూచా బాగ్ సే, ఫలక్ హో యా జమీన్ ఐసా ఫూల్ హై కహీ
బాగ్ నే కహా హర్ కలీ కీ కసం నహి నహి నహీ...

నేను అందమైన తోటను అడిగాను ఈ భూమ్యాకాశాలలో నీలాటి పువ్వు ఉంటుందా అని. కాని ఆ తోట  అంది నా తోటలోని పువ్వులు,మొగ్గల సాక్షిగా లేదు అని..

చాల్ హై కి మౌజ్ కి రవానీ , జుల్ఫ్ హై కి రాత్ కి కహానీ
హోంట్ హై కి ఆయినే కవల్ కే, ఆంఖ్ హై కి మేయ్‌ఖదో కి రానీ

నీ నడక సముద్రపు అలల్లాగా, నీ కేశాలు రాతిరి కథలుగా, ఆ పెదాలు తామరపూవులాంటి అద్దాలుగా, కళ్ళేమో నిశారాణిలా మత్తు కలిగిస్తూ ఉన్నాయి.

మైనే పూచా జామ్ సే  ఫలక్ హో యా జమీన్ ఐసీ మయ్ భీ హై కహీ
జామ్ నే కహా  మయ్‌ఖషీ కి కసం నహి నహి నహీ...

మధిరను అడిగాను నీ అంత మత్తు కలిగించే  మధువు వేరే ఉందా అని. కాని ఆ మధిర అంది పానశాల మీద ఒట్టు, లేదు లేదు ..

ఖూబ్‌సూరతి జో తూనే పాయి  లుట్‌గయీ ఖుదాకి  బస్ ఖుదాయీ
మీర్ కి గజల్ కహూ తుజే మై , యా కహూ ఖయ్యం కి రుబాయీ

నువ్వు చాలా అందాన్ని పొందినావు. ఆ అందానికే ఆ దేవుడి దైవత్వమే లూటీ అయ్యింది. నిన్ను ఆ  ప్రఖ్యాత  కవి మీర్ పాడిన గజల్‌తో పోల్చనా, లేక ఖయ్యాం పద్యాలతో పోల్చనా.

మై జో పూఛు షాయిరోన్ సే ఐసా దిల్‌నషీన్ కోయి షేర్ హై కహీ
షాయర్ కహే షాయరీ కి కసం నహి నహి నహీ..

ఎందరో కవులను అడిగాను నీలాంటి హృదయాన్ని హత్తుకునే కవిత ఉందా అని. కాని ఆ కవులు తమ కవిత్వం మీద ఒట్టు లేదన్నారు.

మైనే పూచా చాంద్ సే...

Get this widget | Track details | eSnips Social DNA


ఈ సినిమా అంతగా నడవలేదు కాని ఈ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో చూస్తే మాత్రం ఆ హీరో , హీరోయిన్ నాకైతే అందంగా కనిపించలేదు. ఇందులో హీరో ఇప్పటి యువహీరో జాయేద్ ఖాన్ తండ్రి, హృతిక్ రోషన్‍కు పిల్లనిచ్చిన మామ. నాకు ఈ పాటలోని పదాలు, రఫీ గాన మాధుర్యం ,సంగీతం ఎంతగానో నచ్చాయి.నిజంగా ప్రియుడు తన ప్రియురాలి ఎంతలా ప్రేమించాడో కదా? ఆ ప్రేమలో తన చెలి అంత అందమైన ఈ ప్రపంచంలో, అంతెందుకు భూమి ఆకాశంలో ఏవీ లేవంటాడు. దానికి సాక్ష్యం కూడా చూపిస్తున్నాడు. ఈ పాటలో కూడా నటీనటులు కనపడరు. ఆ పాటలోని పదాల అమరిక, సంగీతం, గాయకుడి స్వరమాధుర్యం మనల్ని కట్టిపడేస్తుంది. మనసుకు హత్తుకుంటుంది. ప్రతి ప్రేమికుడు ఇలాగే అనుకుంటాడా? ఎంత అందమైన ఊహ కదా!

8 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli

చంపేశారు జ్యోతి గారు,రెండు రకాలుగా చంపారు.మొదటిది నాబ్లాగులో త్వరలో రానున్న పాటను మీరు ఇక్కడ ముందుగా ప్రచురించటం ఒకటి కాగా,
ఇందులో హీరో ఇప్పటి హృతిక్ రోషన్ తండ్రి---అన్నది.వాస్తవంగా అతను సదరు హృతిక్ రోషన్ కు పిల్లనిచ్చిన మామగారు.ఫిరోజ్ ఖాన్ కు తమ్ముడు,అక్బర్ ఖాన్ కు అన్నయ్య,ది స్వోర్డ్ ఆఫ్ టిప్పుసుల్తాన్ సీరియల్ కూడా ఇతనిదే.అలాగే ఏక్ ఫూల్ దో మాలి లాంటి సినిమాల్లో ఇతనే హీరో.

Purnima

ఈ పాట నాకూ ఇష్టమే! కానీ చూసింది లేదు. ఎప్పుడూ రేడియోలో వినటమే. వివిధ్ భారతిలో రాత్రి పూట వేసే పాత పాటల్లో వినటమే ఇలాంటివన్నీ.

మరొక్క సారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!

జ్యోతి

రాజేంద్రగారు,

అలా మీరు అనుకుంటే ఎలాగండీ?? కనీసం రెండురోజులకొక పాట మీ బ్లాగులో పెట్టండి.

మీరు చెప్పిన తప్పు సరిదిద్దాను. థాంక్స్..

Anil Dasari

ఏమండీ, అందులో 'హీరో' కి ఫలానా ఆయన మామ, ఫలానా ఆయన సోదరుడు, ఇంకో ఫలావాడి తండ్రి అనే కాకుండా సొంత ఐడెంటిటీ కూడా ఉంది. అతను అప్పట్లో అందగాడిగా పేరుబడ్డ సంజయ్ ఖాన్. 'దస్ లాఖ్' లాంటి హిట్ సినిమాలున్నాయి ఆయన ఖాతాలో.

kasturimuralikrishna

జ్యొతిగారూ

ఏమీ అనుకోకపోతే చిన్న సవరణ.

మైనె యే హిజాబ్ తేర ఢూంఢా అంటే, నీ మేలి ముసుగులో వెతికా అన్నది సరయిన భావం కాదు. హిజాబ్ అంటే మేలిముసుగే. కానీ, ఆమె మేలిముసుగులో ఆమె వదనమే వుంటుంది. కాబట్టి అక్కడ ఆమె కోసం వెతకటమన్నది అర్ధవిహీనమవుతుంది.

సాధారణంగా నీలాంటివారెవ్వరూ లేరు. నువ్వు అద్వితీయం, అని పొగుడుతారు కదా. అలా నీ హిజాబ్ వెతికానంటే అర్ధం, నీ మేలిముసుగులాంటి మేలి ముసుగుకోసం వెతికానన్న అర్ధం వస్తుంది. అంటే ఆమె కున్న మేలి ముసుగులాంటిదెక్కడాలేదని, అనగా ఆమె అంతటి అందమయిన వదనాన్ని కప్పివుంచే మేలి ముసుగు మరొకటి లేదని, అనగా ఆమె అందంతో సాటీయిన అందగత్తెలెవరూ లేరని భావము.

ప్రేమికులంతా తమ ప్రేయసి గురించి ప్రమ వున్నంత కాలం ఇలాగే భావిస్తారు. అయితే ఇవన్నీ భౌతికాలు. కాబట్టి అవి నషిస్తాయి. ప్రేమ నషిస్తుంది. భౌతిక ప్రేమను ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగించేదే అసలు ప్రేమ. అలాంటి అద్భుతప్రేమను ప్రతిబింబించేపాటలు అరుదు. ప్యాసాలో సాహిర్ రాసిన ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలో ఈ భావనను సూచనప్రాయంగా ప్రదర్శించిన ప్రేమ గీతం.

జ్యోతి

మురళీకృష్ణగారు,
చాలా థాంక్స్. ఉర్దూ నాకు పూర్తిగా రాదండి. అందుకే అక్కడ సరియైన అర్ధం చెప్పలేకపోయాను. మీరు చెప్పేసారుగా.. దానికి తిరుగులేదు.

Rajendra Devarapalli

:)

జ్యోతి

మురళీకృష్ణగారు,

మీకో విషయం చెప్పాలి. కొత్తపాళీగారు ఈ చుట్టుపక్కల లేరు అని నిర్ధారించుకుని ఇంత లేట్‍గా చెప్తున్నాను. ఇంతకుముందు ఒకసారి ఇలాగే రఫీ పాట విషయమై వారికి, నాకు పెద్ద గొడవ జరిగిందిలెండి. అందుకే ఈసారి ఉర్దూ పదాలకు సరియైన అర్ధం తెలుసుకుని రాసాను. కాని చిన్న తప్పులు జరిగాయి. ..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008