Sunday, September 14, 2008

HAPPY BIRTHDAY JYOTHI

 
ఇదే నా మొదటి లేఖ బ్లాగు గుంపుకు.... 
  ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ, ఇవాళ్టికి బ్లాగులలో రెండవ సంవత్సరం పూర్తి చేసాను. అంటే బ్లాగ్లోకంలో రెండవ పుట్టినరోజు అన్నమాట.. 
జనవరి 2006.

పనంతా పూర్తి చేసుకుని ఊరికే అలా కూర్చున్నాను. అది చూసి మా అబ్బాయి. ఏంటి మమ్మీ! బోర్ కొడుతుందా? అని యాహూ మెసెంజర్ లో ఎలా చాటింగ్ చేయాలో చూపించాడు. కాని నెట్‌లో ఎప్పుడు కూడ మన అసలు వివరాలు ఇవ్వొద్దు అని మొదటి పాఠం చెపాడు. ఏదో సినిమా హీరోయిన్ పేరు పెట్టుకుని మెల్లి మెల్లిగా చాటింగ్ చేయడం తెలుసుకున్నా. అది బోర్ కొట్టాకా అంతర్జాల విహారం మొదలుపెట్టాను. మావారు గూగుల్ సెర్చ్ ఎలా చేయాలో చెప్పారు. ఏదైనా పదం కొట్టు దానికి సంబంధించిన సైట్లు వందలు కనిపిస్తాయి. అవి ఒక్కొక్కటి చూడు అన్నారు. అలా నా శోధన మొదలయింది. మా పిల్లల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్  అప్పుడు కంప్యూటర్‌లో రోజు సీట్ల వివరాలు చూసేదాన్ని. తర్వాత దాని జోలికి వెళ్ళేదాన్ని కాదు. అందుకే నెట్ ఎలా వాడాలో తెలీదు.  ఎంత చాటింగ్ చేసినా, హైదరాబాదు, తెలుగు మీద ఉన్న అభిమానంతో జాలంలో  తిరుగుతుంటే తెలుగు కి సంబంధించిన గుంపులు, హైదరాబాదు మస్తీ గుంపు దొరికాయి. అవి జిమెయిల్ లో ఉన్నాయి. అది ఎలా చేయాలో తెలుసుకుని మొదలెట్టి వాటిల్లో చేరిపోయా. హైదరాబాద్ మస్తీ, తెలుగు బ్లాగు గుంపులో సెటిల్ అయిపోయా. మొట్టమొదటిసారి తెలుగు బ్లాగు గుంపులో అడుగు పెట్టాక అక్కడ అందరూ తెలుగులో మాట్లాడుకుంటుంటే (రాస్తుంటే) తెగ ముచ్చటేసింది. అర్రే ! ఎంత సులువుగా తెలుగులో రాయొచ్చు అని అనుకునేదాన్ని. కాని  అప్పుడు ఇంగ్లీష్, తెలుగు రెండింటిలో సంభాషణలు జరిగేవి.


స్వభావసిద్ధంగానే  నేను బ్లాగు గుంపులో తెగ అల్లరి చేసేదాన్ని. ఎప్పుడూ ఆటలు, పాటలు, సినిమాలు. కాని అందరూ సరదాగా పాల్గొనేవాళ్ళు . ఎంత మంది తిట్టుకున్నారో తెలీదు.  అప్పటికే  లేఖిని  మొదలైంది.  అంత వరకు ఇంగ్లీషులో సంభాషణలు చేసిన నేను లేఖినితో మొదటి మెయిల్ రాసాను. అప్పుడే తెలుగు నేర్చుకున్నట్టుగా ఉండింది. ఆ తర్వాత కూడలి మొదలైంది. నేను ఎప్పుడు గుంపుకు మెయిల్ పంపినా, చావా కిరణ్ నా వెనకాలే ఉండేవాడు. బ్లాగు మొదలెట్టండీ. ఇవన్నీ అందులో పెట్టుకోవచ్చు. కాని నేను వాదించేదాన్ని  హాయిగా ఇక్కడ అందరం మాట్లాడుకుంటున్నాము కదా. ఇంకా విడిగా బ్లాగు ఎందుకు?  అని. కాని ఎవరో గుర్తులేదు కాని ఇలా చెప్పారు - బ్లాగు గుంపు అనేది  బజారులో ఉన్న కొట్టు లాంటిది. అక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటారు. మళ్ళీ తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు. కాని బ్లాగు అనేది మన ఇల్లు లాంటిది. అక్కడికి మనం అందరిని పిలవొచ్చు అని. ఆ తర్వాత ఇక నాకు బ్లాగు మొదలెట్టకపోవడానికి సాకు దొరకలేదు. ధైర్యం చేసి గుంపులో చెప్పినట్టుగా బ్లాగు మొదలెట్టేసాను ఒక ధమాకా తో. కాని దానిని ఎలా అలంకరించాలో  ఏమేం మార్పులు చేయాలో అస్సలు తెలీదు. కాని అడగ్గానే ఎవరో ఒకరు నా సందేహాలు తీర్చేవారు. అలా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాను.  తెలుగులో వంటల బ్లాగు లేదని తెలిసీంది , వెంటనే అదే నెలలో షడ్రుచులు మొదలెట్టాను. మొదట్లో నా బ్లాగులో ఏమి రాయాలో తెలీదు. అంతా అయోమయం. అందుకే ఎక్కువగా నాకు నచ్చిన విషయాలను రాసేదాన్ని. మెల్లి మెల్లిగా నా స్వంత రాతలు మొదలుపెట్టాను.  అలా అలా నాకు ఇష్టమైన అభిరుచులన్నీ బ్లాగులుగా చేసుకున్నాను. ఈ ప్రయాణంలో మిగతా బ్లాగర్లు  తమ కామెంట్లతో ఎంతో ప్రోత్సహించారు. సహాయం చేసారు.

ఇలా నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను.  500, 1000, 1500, ...

బ్లాగు మొదలెట్టిన సంవత్సరంలోగానే కంప్యూటర్ ఎరాలో ఒక సమగ్రమైన వ్యాసం రాయగలిగాను. అదే తెలుగు వెలుగులు. అప్పుడే మొదటి బ్లాగు పుట్టీనరోజు అందరిమధ్య సంతోషంగా , గర్వంగా జరుపుకున్నాను.

వర్డ్‌ప్రెస్‌లో నాకు నచ్చని సాంకేతిక సమస్యలతో బ్లాగ్ వార్తలతో బ్లాగర్‌లోకి మారిపోయా. అలా మెళ్ళిగా నా సాగింది. మధ్య మధ్యలో పత్రికా ప్రచురణలు.

ఈ ప్రయాణంలో కొన్ని దుర్ఘటనలు కూడా జరిగాయి.కాని ఎంతో మంది బ్లాగర్లు నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.


ఈ రెండేళ్ళ ప్రయాణం ఎంతో సాఫీగా,మధ్య మధ్య ఎత్తుపల్లాలను దాటుకుంటూ ఇక్కడికి చేరాను. ఈ క్రమంలో నాకు ఎప్పటికప్పుడు వచ్చే సాంకేతికపరమైన సందేహాలు ఓపికగా చెప్పేవాడు వీవెన్. అతనే నా సాంకేతిక గురువు. రెండేళ్ళ క్రిందవరకు నెలసరుకుల లిస్ట్ తప్ప వేరే రాసే అలవాటు లేని నా రాతలను రచనలు చేయడంలో సహాయం చేసిన గురువుగారు కొత్తపాళీగారు.  తమ కామెంట్లతొ నన్ను ఎంతో ప్రోత్సహించిన వారందరికి శతకోటి నమస్సులు. అలాగే పొద్దువారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు.  నేను ఈ బ్లాగుప్రపంచంలోకి రాకుండా ఉంటే టీవీలో చచ్చు, పుచ్చు  సీరియళ్ళు, బుర్ర పాడుచేసే సినిమాలు చూస్తు, ఇరుగమ్మ పొరుగమ్మలతో సొల్లుకబుర్లేసుకుంటూ ఉండేదాన్ని.

ఇప్పుడు నేను గర్వంగా  చెప్పుకోగలుగుతున్నాను.నేను ఒక తెలుగు బ్లాగర్‌ని, చిన్నపాటి రచయిత్రిని అని. కాని నాకు ఏదో టాలెంట్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ఎప్పుడు సరదాగా ఉండడం అంటే నాకు ఇష్టం. అలాగే ఉంటూ వచ్చాను. ఈ బ్లాగులవల్ల ఏదో ఆశించి కాదు. కాని ఈ బ్లాగుల వల్ల నాకే తెలియని రచనాశైలి బయటికొచ్చింది అని చెప్పగలను. అలాగే ఎంతో మంది ఆత్మీయులను పొందగలిగాను.  ఇన్నేళ్ళు నాకు స్నేహితులు లేరు అని బాధపడేదాన్ని. కాని ఇప్పుడు నన్ను గౌరవించే, నాకంటే  ఎక్కువగా నా గురించి  శ్రద్ధ తీసుకునే , నన్ను ఓదార్చే స్నేహితులు ఉన్నారు అని చెప్పుకోగలను. రక్తసంబంధం కంటే మిన్న ఐన స్నేహబంధం నాకు లభించింది ఈ బ్లాగుల వల్ల.  ఆత్మీయులైన బ్లాగర్లందరికీ నా మనఃపూర్వక  ధన్యవాదాలు. ఏమిచ్చి వీరి ఋణం తీర్చుకోగలను.


నా బ్లాగులన్నింటిని సుందరంగా అలంకరించడంలో నాకు సహాయం చేసిన తెలుగు’వాడి'ని గారికి,  ప్రతాప్ కి పేద్ద థాంక్స్.. నన్ను ఒక మామూలు గృహిణి అని అనుకోకుండా ఎన్నో సాంకేతిక విషయాలు నేర్పిన శ్రీధర్‌కి కూడ థాంక్స్ . తమ్ముడికి థాంక్స్ చెప్పొద్దు కాని సభామర్యాద పాటించాలి కదా. ఇక ఇంట్లో మా గురువు ఎలాగూ ఉన్నాడు. మా అబ్బాయి. బోర్ కొడుతుందని నాకు కంప్యూటర్ నేర్పితే ఇప్పుడు వాడికే కంప్యూటర్ ఖాళీ్గా  దొరకడంలేదు అని మొత్తుకుంటాడు.కాని మళ్ళీ నేర్పిస్తాడు. ఎప్పుడు చూసినా టక్కు టక్కు మంటూ కొట్టడమేనా. కంప్యూటర్ విప్పి కేబుల్స్ అన్నీ తెలుసుకుని మళ్ళీ పెట్టు అని అవి కూడా నేర్పించాడు ఈ మధ్య. మరి ఇంతమంది గురువులున్న విద్యార్థిని  నేర్చుకోకుంటే ఎలా?? మీరే చెప్పండీ?

ఇక నా బ్లాగుల లెక్కలు చూద్దాము.

 jyothi  
టపాలు - 264
వీక్షకులు - 48,606

జ్యోతి
టపాలు - 217
వీక్షకులు - 24,143

షడ్రుచులు
టపాలు - 368
వీక్షకులు - 24,041

annapoorna
టపాలు - 301
వీక్షకులు - 7,369

గీతలహరి
టపాలు - 450
వీక్షకులు - 5,148

నైమిశారణ్యం 
టపాలు -70
వీక్షకులు - 7,751

Health is Wealth
టపాలు - 75
.....................................
మొత్తం:
టపాలు - 1,745
వీక్షకులు - 1,17,058 

ఈ మధ్య నా మీద జరిగిన దాడి కాని, బ్లాగులలో జరుగుతున్న వివాదాలు చూసి బాధ కలిగింది. బ్లాగులు రాయడం ఆపేద్దాం అనుకున్నాను కూడా. కాని ఇంతమంది మిత్రులను వదిలి వెళ్లగలనా?? నామీద ఎన్నో అపోహలు పెట్టుకున్న శ్రేయోభిలాషులకు ఒక సూచన. నేను ఏదో సాధిద్దామని, సంపాదిద్దామని బ్లాగులు రాయడంలేదు. అనవసరంగా మీ మనసులను, ఆలోచనలను పాడు చేసుకోకండి. నేను రాసినవి నచ్చితే చదవండి లేకుంటే మీకు నచ్చిన బ్లాగుకెళ్ళండీ. లేదా మీకు కావలసినట్టుగా బ్లాగు మొదలెట్టుకోండి. ఓకేనా..

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే  నాకే నవ్వొస్తుంది.  బ్లాగు మొదలెట్టడం కూడ తెలీదు, పిక్చర్స్ అప్‌లోడ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, కనీసం గూగుల్ లో పిక్చర్స్ సేవ్ చేసుకోవడం కూడా తెలీదు, ఇప్పుడు ఇన్ని బ్లాగులు రాస్తూ, అందరికి సహాయం చేయగలుగుతున్నాను, అదీ టెక్నికల్‌గా అని..  నా నమ్మకం ఒక్కటే. తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండాలి అని..


ఉంటాను మరి.

సెలవ్

సర్వేజనా సుఖినోభవంతు.

51 వ్యాఖ్యలు:

సుజాత

ఆదివారం పొద్దున్నే ఇంత ఉత్తేజకరమైన, మనసులో ఉత్సాహం నింపే విజయ గాధ చదవడం చాలా బావుంది. చెప్పలేంత సంతోషంగా ఉంది.

జ్యోతి గారు, మీరు కొత్త బ్లాగర్లకు ఇచ్చే ప్రోత్సాహం చెప్పలేనిది. సీనియర్ బ్లాగరైనా నలుగురిలో కలిసిపోయే మీ తత్వమే మిమ్మల్ని బ్లాగ్ప్రపంచానికి పెద్దక్కని చేసాయి. ఎవరెవరో, ఎక్కడుంటారో కూడా తెలియకుండానే ఇంతమందిని మీ కుటుంబ సభ్యుల్లో చేర్చుకున్నారు మీరు!

మీ వయసులో ఎవరైనా కుటుంబ బాధ్యతలే పెద్ద బరువుగా భావిస్తూ, వాటిని నిర్వహిస్తే చాలని సంసారంలో చిక్కి బయటికి రాలేక బాధపడుతుంటారు.

కానీ మీ ఉత్సాహం,నలుగురికీ మీరిచ్చే ప్రోత్సాహం, మిమ్మల్ని నలుగురిలో ఒకరిగా కాక,నలుగురికీ మార్గదర్శిగా నిలబెట్టాయి.

ఇక కువిమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్యాలు, ఇవన్నీ మీరు లైట్ తీసుకుంటె తేలిపోతాయి. అటువంటి వాటిని మీరు లెక్క చేయక్కర్లేదనుకుంటాను.

మీ రిలాగే బోలెడన్ని పుట్టిన రోజులు రెట్టించిన ఉత్సాహంతో ప్రతి యేటా జరుపుకోవాలనీ, కొత్త బ్లాగర్లందరికీ ప్రోత్సాహాన్నివ్వాలని, హాయిగా రాస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. once again, a very happy birthday to JYOTHI."

నల్లమోతు శ్రీధర్

జ్యోతక్క అతి స్వల్పకాలంలోనే మీరు ఇన్ని విషయాలు నేర్చుకుని, చక్కని బ్లాగులు నిర్వహిస్తూ, అలుపెరగకుండా ప్రతీ బ్లాగునూ పోస్టులతోనూ, డిజైన్లతోనూ నవీకరిస్తూ, అదే సమయంలో తోటి బ్లాగర్లకి సహాయం కావాలని కోరిన ప్రతీ ఒక్కరికీ ఎంతో ఓపికగా సహకరిస్తూ వారి ఆనందమే మీ ఆనందంగా భావిస్తూ చేస్తున్న కృషి చూస్తుంటే నిజంగా ఎంతో మందికి మీరు దేవుడిచ్చిన వరం. ఓ పక్క కుటుంబ బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తూ, ఇటు అంతర్జాలంలో మీరు చేసే సేవ చూస్తుంటే నాకూ మీలా సమర్థవంతంగా పనిచేస్తూ నా ప్రొడక్టివిటీని మరింత పెంచుకోవాలని ఎన్నిసార్లు అన్పిస్తుందో! ఈరోజు నేను ఇచ్చి పనులు ఏకకాలంలో చెయ్యగలుగుతున్నాను అంటే ఫ్రాంక్ గా మిమ్మలను మోడల్ గా తీసుకునే! అంతర్జాలానికి ఆణిముత్యాల్లాంటి వారిలో మీదీ కీలకమైన పాత్ర. మీ నుండి ఎందరో నేర్చుకున్నారు, నేర్చుకుంటున్నారు. సాధారణ గృహిణి స్థాయి నుండి ఇలా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ మీరు అంతర్జాలంలో సాగిస్తున్న ప్రయాణం నిరంతరం విజయవంతంగా కొనసాగాలని, మా అందరి మోరల్ సపోర్ట్ (చిన్నవాడిని కాబట్టి ఆశీర్వచనాలు ఇవ్వలేను) మీకు ఉంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను.

- నల్లమోతు శ్రీధర్

Vamsi M Maganti

Wishing you a very very happy birthday.

Maganti Family

Vamsi M Maganti

BTW - koDavaTiganti rOhiNi prasAd gAri B'day kooDa eevELE!.. :)

శివ బండారు

7 బ్లాగులను విజయవంతంతగా నడుపుతున్న మీ శ్రమ బ్లాగర్లందరికీ స్పూర్తిదాయకం . ముందు రోజులన్నీ హేపీడేస్ కావాలని ఆకాంక్షిస్తూ ...
..శివ .

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

జ్యోతి గారికి నమస్కారం..
ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మీ మీద దాడి అని ఏదో అన్నారు..సవివరంగా తెలియచేయండి.
ఇక్కడే చెప్పటం యిబ్బంది అనిపిస్తే ఉత్తరమ్ముక్క రాయండి.
yvs@teacher.com

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

అభినందనలు జ్యోతి గారు,మీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ...
దేవరపల్లి రాజేంద్ర కుమార్,
చందన,
ప్రియదర్శిని,
రాజనందన్

MURALI

పుట్టిన రోజు శుభాకాంక్షలు

Purnima

The secret of success in the 21st century is all about learning things fast and unlearning them even faster. You seem to be the perfect mascot of the technological evolution of this century.

Bravo..My Gal అని ఒక టైట్ హగ్ ఇవ్వాలనిపిస్తుంది. గాళ్ అని ఎందుకు అంటే కొత్త విషయాలు నేర్చుకోవటంలోను మీరు చూపించే ఆసక్తి, enthu, ఆశించిన ఫలితం వచ్చే దాకా వదిలిపెట్టకపోవటం చిన్నపిల్లల్లో ఉంటుందే, అలానే ఉంటుంది. కాస్త వయస్సు పెరిగే కొద్దీ "ఆ.. ఇంకేం చేస్తాం లే" అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, మనం పిలవకుండానే. మీ దగ్గరకి రాలేదది అసలు, ఏం మంత్రం వేశారు? నాకు మాత్రం మీరే మంత్రం ఇప్పటినుండి. :-)

ఇకెప్పుడూ బ్లాగు మూసేస్తా అన్న ఆలోచన కూడా రానివ్వకండి ప్లీజ్. బ్లాగింగ్ వ్యాపకమే కాని వ్యసనం కాదు అని నేను ఎవరికైనా మీ బ్లాగే చూపించాలి. పైగా ఎవరు ఏమైనా అన్నా, మనకి తెలుసు కదా ఏం చెయ్యాలో. ;-)

మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఓ ఏడాది వయస్సు తగ్గినందుకు అభినందనలు. :-))

St. Ann'ites Rock! And you leave no doubt in it. Love you..

Purnima

చదువరి

మీ బ్లాగుజీవన పునరవలోకనం బావుంది. మీ బ్లాగు గణాంకాలు మతి పోగొడుతున్నాయి.

"కాని ఈ బ్లాగుల వల్ల నాకే తెలియని రచనాశైలి బయటికొచ్చింది అని చెప్పగలను." -నా విషయంలో కూడా ఇది నిజం. జాలంలో రాయడం మొదలెట్టాక, నా 'రాత' మారింది. నాకు కలిగిన అతి పెద్ద ఉపయోగమది.

ఇక బ్లాగులకు పునరంకితం ఎలాగూ అవుతారు :).., మరి ఈ మూడో సంవత్సరంలో కొత్తగా ఏం చెయ్యబోతున్నారు?

sujji

Happy brithday jyothi garu...!!
i wish u all success in all modes of ur life.

sat

మీ బ్లాగు నిత్య నూతనంగా వెలుగొందాలని, స్ఫూర్తిదాయకమైన మీ జ్ఞానప్రస్థానం నిర్విఘ్నంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!

నరసింహ

జ్యోతి గారికి మీ రెండవ వుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకోండి.ఇంకా ఇలానే చాలా పుట్టిన రోజులు జరుపుకుంటూ మా బోటి కొత్త బ్లాగరులకి మార్గదర్శకత్వం చేయగలరని ఆశిస్తూ--

Aruna

Congratulations Jyothi Garu.

durgeswara

chaduvulatalli amsam meelO ilaa niramtaram velugulu virajimmutumdaalani aa jaganmaatanu praarhistunnaanu.

cbrao

ఒకప్పుడు తెలుగుబ్లాగు గుంపులో అల్లరి పిల్ల జ్యోతి, నేడు జ్యోతక్క, రేపటి ప్రస్థానం ఎక్కడికో? అక్కా, నీకు జన్మదిన శుభాకాంషలు.

Vamsi Krishna

1700 posts??
Just incredible..

Congrats!!!! antha kanteee 1700 number choosi emi ceppalO teliyaTam lEdu.

--Vamsi

teresa

Happy B'day Jyothi.

ప్రవీణ్ గార్లపాటి

జ్యోతి గారు,
అన్నిట్లోనూ ముందుగా ఉండి, చురుకుగా పాల్గొనే మీరంటే అందరికీ గౌరవమే.
మీరు ఇలాంటి పుట్టినరోజులెన్నో జరుపుకుని బ్లాగు లోకంలో, నిజ లోకంలోనూ వెలుగొందాలి.

జన్మదిన శుభాకాంక్షలు !

సిరిసిరిమువ్వ

అభినందనలు. మీ బ్లాగు ప్రస్థానం మునుముందు కూడా ఇలానే అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటూ.....

చిలమకూరు విజయమోహన్

ఒక బ్లాగును నడపడమే కష్టం అనుకుంటుంటే ఇన్ని బ్లాగులు విజయవంతంగా నడుపుతున్న మీకు అభినందనలు.జన్మదిన శుభాకాంక్షలు.

బొల్లోజు బాబా

వావ్
అభినందనలు
బొల్లోజు బాబా

netizen నెటిజన్

అభినందనలు

Satyavati

జ్యోతి గారూ
అభినందనలు.నేను కూడా మీలాగే మెల్ల మెల్లగా నేర్చుకున్నాను.నా బ్లాగ్ ని సర్వాంగసుందరంగా తీర్చి దిద్దారు.ఇంకా ఎందరికో బ్లాగ్ల నిర్వహణ లొ బోలెడు సహాయం చేసారు.
మీరు చెప్పినట్టు మనం సీరియస్ గా తలుచుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదు.మీతో 100% ఏకీభవిత్సూ మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ .....

విహారి(KBL)

Hats off to u
బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

చిన్నమయ్య

అభినందనలు. చాలా ఇన్స్పైరింగు గా వుంది.

laxmi

Congratulations Jyothi garu.

lalitha

జ్యోతి అక్కకి సుభాకాంక్షలు.
సరిగ్గా రెండు సంవత్సరాలు క్రితం మీరు వున్న స్టేషన్ లొనే ఇప్పుడు నేను వున్నను.
నేను చుసిన మొదటి బ్లాగు మీ షట్రుచులు.
వుత్సాహం అపుకోలేక ఈ మద్యనే నేను సొంత బ్లాగు మొదలు పెట్టాను .
సంకేతిక వివరాలకొసం మీ సహయం అసించవచ్చా .

మురళీ కృష్ణ

శుభాభినందనలు - మరింత చలాకీగా ముందుకు సాగాలని కోరుకుంటూ ... మురళీకృష్ణ కూనపరెడ్డి

|| తమ్మిన అమరవాణి || amaravani.t@gmail.com

జ్యోతి - మొత్తానికి మీ బ్లాగు అఖండ జ్యోతిలా వెలుగుతుండాలి. మీరన్నట్టు మనలో మనకే తెలీని రచనా శైలి బయటకొస్తుంది. ఇది నాలో నేను గమనిస్తున్నాను.

మిమ్మల్ని ఎంతోమంది ప్రోత్సహించారు అని రాశారు. కానీ... కొత్త బ్లాగర్ల విషయంలో అలా జరగడం లేదు. బ్లాగులు ఎక్కువడం వల్లనేమో??? ఇంతకంటే ఏదో చెప్పాలని ఉన్నా... చెప్పదలచుకోవడం లేదు.

ఏదేమైనా రెండు సంవత్సరాల బుల్లి జ్యోతికి బోలెడు ముద్దులతో జన్మదిన శుభాకాంక్షలు.

Sridevi

Jyothigaru,

Belated Happy Birthday to your blog. and lots of love to you.
Srilu

వింజమూరి విజయకుమార్

నా శ్రేయోభిలాషి జ్యోతి గారికి,

నమస్సులు. అచ్చమైన తెలుగింటి ఆడపడచు మీరు. మీ బ్లాగ్లోకంలో ఆరోగ్యకర మీ ఎదుగుదల ఆదర్శప్రాయం. స్పూర్తిదాయకం. ఎవరేమన్నా ఒక వీవెన్ గారు, ఒక చావా కిరణ్ గారు, ఒక నల్లమోతు శ్రీధర్ గారు మీరంతా ఒక సేవాతత్పరత కలిగిన వారే. నా బ్లాగు రూపకర్త కూడా మీరే. ఈ మీ టపా నాకు కంట తడి పెట్టించింది ప్రమాణ పూర్తిగా. మీ ఈ ప్రయాణం మరింత బాగా సాగాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ..

మీ.. వింజమూరి విజయకుమార్

జ్యోతి

అందరికి ధన్యవాదములు..

చదువరిగారు,
ఈ బ్లాగ్లోకంలో నాకు చేయడానికి ఏమీ కనపడటంలేదు.. క్రిందటేడాది వికిలో పని చేద్దామంటే తెలుగువెలుగులు వ్యాసం పని పడింది. అందుకే ఈసారి ఏం చేయాలో నిర్ణయించుకోలేదు. అనుకుంటే బోలెడు ఉన్నాయి. అను, ఫోటోషాప్, ఫ్లాష్ నేర్చుకోవాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను.చూడాలి ఏం జరుగుతుందో??

పూర్ణిమ,,
ఇంతటితో రాయడం ఆపేద్దాము అనుకుంటే మంత్రం అని నాలో కొత్త ఆలోచనలు మొదలెట్టించావు. త్వరలోనే నా సక్సెస్ మంత్రం చెప్తాను.

లలిత,
మీరు నాకు మెయిల్ చేయండి. బ్లాగు గుంఫుల అడగండి. లేదా టెక్నికల్ చాట్‍రూమ్‍లో కూడా మీకు కావలసిన సహాయం దొరుకుతుంది.

వాణి,
అడగందే అమ్మైనా పెట్టదు. తెలుగుబ్లాగు గుంఫులో అడిగావా? నన్ను అడిగితే చెప్పలేదా? మరి నీకు ఏ సహాయం కావాలో ఎలా తెలుస్తుంది?

కత్తి మహేష్ కుమార్

నా హృదయపూర్వక అభినందనలు.

viswakiran

జ్యోతి గారు మీ ఆత్మవిశ్వాసం ఆమోఘమండి, మీకు చెప్పగలిగే అంతటి వాడిని కాను కాని.. ప్రతి పని లొను మనల్ని విమర్శించే వాళ్ళూ ఏప్పుడు వూంటారు, ఆ విమర్శల్ని వీలైనంత వరకు +ve గా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందే..

మీకు నా అభినందనలు

రమణి

జ్యోతి గారు: ఆలస్యంగా చెప్తున్నందుకు తిట్టుకోకండి! నిన్న మా దగ్గర గణేష్ నిమజ్జన సంధర్భంగా నెట్ పని చేయలేదు. మీ బ్లాగు ద్వితీయ జన్మదిన శుభాకాంక్షలు. మీరిలా మహొన్నతిని సాధిస్తూ మాకు మార్గదర్శకత్వం కావాలని మనసారా కోరుకొంటూ - బ్లాగ్రమణులు.

krishna rao jallipalli

అభినందనలు. ఈ సందర్భంలో ఒక మనవి. నేను గమనించి నంత వరకు తెలుగు బ్లాగు ప్రపంచం లో బ్లాగరులు ఎక్కువ.. పాఠకులు చాల తక్కువగా ఉన్నట్లు తోస్తోంది. నిజానికి ఇది రివర్సులో ఉండాలి. కనుక పాఠకులు మరింత పెరిగే దిశగా మీ బ్లాగర్లందరూ కృషి చేయాలి.

sahi

మీ రెండవ వుట్టిన రోజు శుభాకాంక్షలు

రాధిక

మీ రెండవ వుట్టిన రోజు శుభాకాంక్షలు

కొత్త పాళీ

You are an inspiration to a lot of people in the Telugu blog world.
Keep up the good work.

ప్రతాప్

జన్మదిన శుభాకాంక్షలు.
తమ్ముళ్ళకి ఎవరైనా థాంక్స్ చెబుతారా?

చైతన్య

నా హృదయపూర్వక అభినందనలు.

Madhu

belated b'day wishes..

మీ బ్లాగు లెక్కలు చూసి మతిపొయింది నిజంగా.
ఇన్ని బ్లాగులు మైంటైన్ ఎలా చేస్తున్నారు ?

తెలుగు'వాడి'ని

వేనవేల అభినందనలు. శతకోటి శుభాకాంక్షలు. మీ తదుపరి ప్రయత్నాలకు శుభమస్తు. అవిఘ్నమస్తు.

ఆద్యంతమూ టపాను సవివరంగా, లింక్స్ తో చెప్పిన మీ శ్రమ ... అంతర్జాలంలో, తెలుగు బ్లాగ్ప్రపంచంలోని మీ ప్రస్థానానికి సూచన.

లచ్చిమి

jyothi gaaalu
naa pelu lachhimi
ippudippuude blog school lo akshalaalu diddutunnaa
mee andali sahaaya sahakaalalu unte
nenu koola chakkagaa baaagestaa
mee blaaagu lendo puttin loju chesukundata gaaa
abhinandanalu andi

Krupal kasyap

రెండవ వుట్టిన రోజు శుభాకాంక్షలు
Kasyap
kaburlu.wordpress.com

వేణూ శ్రీకాంత్

జ్యోతి గారు మీ టపా ఆలశ్యం గా చూడటం జరిగింది మీ బ్లాగ్ రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్లాగ్ లెక్కలు చూసి నిజం గా మతిపోయింది. చాలా ఉత్తేజభరితమైన టపా వ్రాసారు.

dolphin

రెండవ పుట్టినరోజు శుభాకాంషలు!!
మీ టపాలు బాగున్నాయి,ఇంక చదువుతూ ఉంటాను.

vino

Jyothakka,
Naaku mee blog ante chala istam.
Mee sahayam tho nenu kuda blog vrayalanukuntunnanu,mee antha baga vrayalenu mari yela vrayalo cheputharaaa
Naa e-mail address
vinodini24@yahoo.com

kruthagnathalu
unta mari
vinodini

Praveenkumar

హయ్ జ్యోతక్క భాగున్నారా. నేను మి బ్లాగ్ చదివి నేను కూడ బ్లాగ్ స్టార్ట్ చేసాను. నా గురువు మీరే అక్కయ్య నన్ను ఒక తమ్ముడిగ అనుకోని నా బ్లాగ్ ఒకసారి చూసి సలహలు ఇవ్వగలరు. అక్కయ్య మీరు ఇలాగే మరెన్నో విషయాలు రాయలని కొరుకుంటున్నను. ఇన్ని రొజులు మీ బ్లాగ్ మిస్సయినందుకు చాల కోల్పొయాను. అన్నట్టు నా బ్లాగ్ అడ్రస్స్ http://praveenjillela.blogspot.com
నా బ్లాగ్ చూస్తారని అశీస్తున్నాను......
మరి ఉంటాను అక్కయ్య..............

Praveenkumar

హాయ్ జ్యోతక్క భాగున్నార. నేను మీ బ్లాగ్ చదివి 4 రోజులు అవుతుంది. అప్పటి నుండి నాకు నిద్ర కూడ పట్టడం లేదు. అసలు గూగుల్లో ఫొటొస్ కూడ సేవ్ చేయడం రాని మీరు ఇలా బ్లాగ్ మొదలు పెట్టి ఇంత మందికి పాఠాలు చెప్తున్నారంటె మామూలు విషయం కాదు. నేను కూడ మీ ధైర్యం తో బ్లాగ్ మొదలు పెట్టాను... మీరే నా గురువని చాల గొప్పగా నా బ్లాగ్ లో పెట్టాను..... మీకు వీలైతే ఒకసారి నా బ్లాగ్ చూసి, నన్ను ఒక తమ్ముడు అనుకోని తగిన సలహలు ఇవ్వండి అక్కయ్య..........
నా బ్లాగ్ అడ్రస్స్ http://praveenjillela.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008