Monday 1 December 2008

సహాయ

పిల్లలకు ఇచ్చిన పుస్తకాలు ..

ఎప్పుడూ ఇల్లు, పిల్లలు, వంట, షాపింగు, అప్పుడప్పుడు బ్లాగింగు తప్ప వేరే ఏదైనా మంచి పని చేయాలన్న ప్రమదల ఆలోచన అంకురం తొడిగింది.విజయవంతమైంది. ప్రమదావనం సభ్యులు సేకరించిన సొమ్ముతో అంకురంలో ఉన్న అమ్మాయిల కోసం పుస్తకాలు, పెన్నులు, గట్రా కొనడం జరిగింది. ఇందులో ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరెవరు వెళ్లి కొన్నారు, ఎవరెళ్లి ఇచ్చారు అన్నదానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా తలో పని నెత్తిన వేసుకోవడం జరిగింది.


పిల్లల కోసం కొన్న స్టేషనరీ.

ఈ కార్యక్రమానికి మీ అందరి ప్రోత్సాహం అనూహ్యమైనది. ప్రమదావనం సభ్యులే కాకుండా మరికొందరు బ్లాగర్లు, బ్లాగర్లు కాని వారు కూడా సాయం చేయడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం. ఇది సేవా కార్యక్రమం కాదు. మనకున్న నిధులతో కొందరికైనా సహాయం చేయాలనే ఒక చిన్ని ఆలోచన. ఈసారి ఏదైనా వృద్ధాశ్రమమానికి అవసరమైన మందులు కాని వస్తువులు కాని ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆ తర్వాత చిన్న పిల్లలకోసం.. ఈ విధంగా సేకరించిన సొమ్మంతా ఏ సంస్థకు ఇవ్వకుండా వారికి అవసరమైన వస్తువులు కొని, స్వయంగా వెళ్లి అందజేయాలని మా నిర్ణయం. ఎందుకంటే ఈ డబ్బు దుర్వినియోగం కావొద్దు కదా.. ఎక్కడ ఎక్కువ అవసరం ఉంది అని తెలుసుకోవడానికి. ఈసారి TMAD ప్రశాంతి సహాయం తీసుకోవడం జరుగుతుంది.

అమ్మాయిలకు చాలా అవసరమైన వస్తువులు. ఇవి అందుకున్న చిట్టి తల్లులు ఎంతో మురిసిపోయారని సంస్థ నిర్వాహకురాలు చెప్పారు..


minimum contribution is Rs.500 per person per each programme...



ఈ సహాయ కార్యక్రమానికి చేయూత నివ్వాలనుకున్నవారు నాకు మెయిల్ చేస్తే డబ్బు ఎలా పంపాలో వివరాలు తెలియజేస్తాను.

jyothivalaboju@gmail.com

3 వ్యాఖ్యలు:

సుజ్జి

its really good to know our bloggers have done great job.

Ramani Rao

ష్యూర్ జ్యోతి గారు! ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఎంత పే చెయ్యాలో చెప్తే, "నేను సైతం " అని ఉడతాభక్తి గా అంతో, ఇంతో, కొంతో అన్నట్లుగా , నా వంతు కృషి నేను చెయ్యడానికి రెడీ.

మధురవాణి

జ్యోతి గారూ..
మాక్కూడా ఈ మంచి పనిలో భాగస్వామ్యం కలిపించబోతున్నందుకు ధన్యవాదాలు.
ఆ వివరాలేవో తెలుపగలరు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008