Monday, 22 December 2008

పుట్టినరోజు శుభాకాంక్షలు జో!!!




"హ్యాపీ బర్త్ డే ఫ్రెండ్"
"థాంక్ యూ! కాని నాకు పుట్టినరోజు చేసుకోవడం అలవాటు లేదు. అంతా ఇష్టం లేదు"
"ఎందుకలాగ?"
"చిన్నపిల్లలు ఏదో సంబరానికి చేసుకుంటారు. మనం తాడిచెట్ట్లలా పెరిగాం. సిల్లీగా పుట్టినరోజు జరుపుకోవడమేంటి?
"ఇది మరీ బావుంది. పుట్టినరోజు మనది. దానికి చిన్న, పెద్ద తేడా ఏంటి? మనను అభిమానించేవారితో మన పుట్టినరోజు షేర్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇన్ని ఆలోచనలేంటి?"
"ఏమో జ్యోతి! నాకు నచ్చదు. మనం ఏదైనా సాధించి అందరి అభినందనలు అందుకోవడం అంటే ఓకే. కాని పుట్టి మనమేదో ఉద్ధరించినట్టు ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి. ఐ డోంట్ లైక్ ఇట్"

...................................................................................................................

పుట్టడం, గిట్టడం మన చేతిలో లేదు.మనం కోరుకోలేదు. అమ్మా నాన్న అనురాగానికి గుర్తుగా పుట్టిన మనం వారిని ఆనందింపజేస్తాం. చిన్నప్పుడు అమ్మ ప్రతి పుట్టినరోజుకు మర్చిపోకుండా కొత్త బట్టలు , వాటికి మ్యాచింగ్ గాజులు, చెప్పులు, రిబ్బన్లు, స్కూలులో పంచడానికి చాక్లేట్లు ఇప్పిస్తుంది. కాలేజికొచ్చాక అంతలా కాకపోయినా కొత్త బట్టలు వేసుకుని, దగ్గరి స్నేహితులకు స్వీట్లు ఇవ్వడం పరిపాటి. పెళ్లి అయ్యాక జీవిత భాగస్వామి మన పుట్టినరోజు గుర్తుపెట్టుకుని ఏదైనా కొనిస్తే సంతోషం. అలా సంసార సాగరంలో పడ్డాక ఆ మనమేం చిన్నపిల్లలమా , ప్రతిసంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం అంత అవసరమా? అని అనుకుంటారు చాలా మంది.

కాని........

దసరా, దీపావళి, ఉగాది, శివరాత్రి, ఇలా సంవత్సరం పొడుగునా ఏదో ఒక పండగ తప్పనిసరిగా చేసుకుంటాం. కొత్త సంవత్సరం వేడుకలు సరే సరి. ఇవన్నీ తనకు చేయమని ఆ దేవుడు అడిగాడా. కొంతమంది దేశనాయకుల పుట్టినరోజులు ఘనంగా జరుపుతాం. మన కుటుంబ సభ్యులు, కొలీగ్స్, స్నేహితులకు పుట్టినరోజు విషెస్ చెప్తాం. ఇవన్నీ చేయాలని గుర్తుంటుంది . కాని మన పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలని ఎందుకనుకుంటారు?

ఎప్పుడూ భార్య, భర్త, పిల్లలు, బాసు, స్నేహితులు ఇలా అందరిని సంతోషపరచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటాము. మనను మనం సంతోషపెట్టే హక్కు , అధికారం మనకు లేదా? ఎవరో మనను సంతోషపెట్టడమేంటి? మనకు ఏం కావాలి? ఏది సంతోషాన్నిస్తుంది? ఏం చేస్తున్నాం? ఏం చేయగలం? ..ఇవన్నీ మనకే తెలుసు. ముందు మనని మనం సంతోషపరుచుకుంటే గాని పక్కవారిని సంతోషపెట్టలేము. మన గురించి మనం ఆలొచించాలి. అందులో పుట్టినరోజు ఒకటి. ఈ రోజు మనకే ప్రత్యేకమైనది. దానిని మనకు నచ్చినట్టుగా చేసుకోవాలి. పుట్టినరోజు అంటే పార్టీలు, కేకులు బహుమతులు కాదు. ఈ ఒక్కరోజైనా మనకిష్టమైన పనులు చేయాలి. ఎవరూ మనకు అభినందనలు చెప్పలేదు, బహుమతులు ఇవ్వలేదు అని ఫీల్ అవ్వొద్దు. ఐనా ఎవరేంటి మనను సంతృప్తి పరిచేది. మనకు తెలీదా?

ఈ సోదంతా ఎందుకు అంటారా? అదేం లేదండి. కొన్ని రోజుల క్రింద ఒక అబ్బాయితో పైన చెప్పినట్టు వాదన జరిగింది. దాని ప్రతిఫలమే ఈ టపా. ఇవాళే ఎందుకు చెప్పానంటే ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి. మామూలుగా నేను పుట్టినరోజు అస్సలు జరుపుకోను. కాని బ్లాగ్లోకంలోకొచ్చాక జరుపుకున్న మూడవ పుట్టినరోజు మరి ఇది. మొదటిసారి షడ్రుచులులో వందవ టపాతో , రెండవసారి కంప్యూటర్ ఎరా ఆర్టికల్ తో ఎంతో గర్వంగా , సంతోషంగా బ్లాగ్ మిత్రుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నాను. మరిచిపోలేని బహుమతులు అందుకున్నాను. ఇప్పుడు మరింత ఉత్సాహంతో మూడవ పుట్టినరోజు పండగ చేసుకుంటున్నాను. నేను ఏం సాధించానో అది నాకే తెలుసు. ఎంతోమంది ఆప్యాయత, ప్రేమ, గౌరవం దక్కింది. ఇది గర్వకారణం కాదా. సాధ్యమైనంతవరకు నాకు తెలిసింది ఇతరులకు చెప్పడం అలవాటైంది. అంటే కాని ఏదో సాధిద్ధాము, గొప్ప చెప్పుకుందాము అనే దురుద్ధేశ్యం ఏనాటికీ లేదు.

నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

ఎల్లపుడూ నన్ను కాపాడుతూ, అడుగడుగునా నన్ను ఓదార్చి, ఉత్సాహపరిచేందుకు ఆత్మీయులను పంపుతున్న ఆ జగజ్జననికి ఈ జీవితం అంకితం.

43 వ్యాఖ్యలు:

Crochet Fun Hub

The picture is very beautiful!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

puttinaroju subhakankshalu!!

Dr.Pen

జ్యోతక్కో! హ్యాపీ హ్యాపీ బర్త్ డే!! జన్మదిన శుభాకాంక్షలు!!! ఇప్పుడైనా నా శుభాకాంక్షలు స్వీకరిస్తారా? Enjoy the Day! మా బావతో వంటలు చేయించండి ఈ రోజైనా:-)

Pradeep

Many Happy Returns of the day ...
[I cannot type in Telugu so please receive in English]

ప్రతాప్

పుట్టినరోజు శుభాకాంక్షలు అక్కా.

లక్ష్మి

Wish you a very very happy birthday Jyoti garu. Have great time ahead

asha

Many Many happy returns of the day jyoti garu.

చిలమకూరు విజయమోహన్

జన్మదిన శుభాకాంక్షలు మీకు.

Anonymous

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యొతిగారూ

Unknown

జ్యోతక్కా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఓ మామూలు గృహిణి స్థాయి నుండి మీరు ఈ మూడేళ్లలో బ్లాగ్లోకంలో ఎంత గొప్ప స్థానానికి చేరారో ఇంతకాలం మీ ద్వారా సాయం పొందిన వారికి, మీ మంచితనం తెలిసిన వారికి తెలుస్తుంది. మీలో కష్టించి పనిచేసే స్వభావం మాలాంటి బ్లాగర్లకు ఆదర్శం. మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

visalakshi

many more happy returns of the day jyoti gaaru .

Shiva Bandaru

జన్మదిన శుభాకాంక్షలు జ్యొతిగారూ

vrdarla

జ్యోతి గారూ!
నిజమేనండీ... పుట్టిన రోజు గురించి చాలా చాలా అభిప్రాయాలు వ్య్క్తమవుతుంటాయి.
అవన్నీ పక్కకు పెట్టేసి, నేనో యూనివర్సిటీ ఉద్యోగిననీ పక్కన పెట్టేసి, ఒక మంచి రచనా శైలితో రాసే బ్లాగరు గా మిమ్మల్ని భావిస్తూ మీకు నా హృదయపూర్వక జన్మ దిన శుభాకాంక్షలు తెలుగుపుతున్నాను.. ఇదే బ్లాగు దగ్గర నల్లమోతు శ్రీధర్ గారు రాసిన అభిప్రాయాలు నూరు శాతం నిజమని మీ బ్లాగులు చూసినప్పుడల్లా అనిపిస్తుంది. అవునండోయ్.... నల్ల మోతు వారు మంచి టంప్లేట్ తో ఈ మధ్య జరిగిన ఈ తెలుగు గురించి అందరికీ కనిపించే లైవ్‌ టెలీ కాస్ట్‌ లా టపాలు రాశారు. ఆయనకీ న అభినందనలు
మీ
దార్ల

ఏకాంతపు దిలీప్

పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా... ఇలానే ఉత్సాహంగ, చాలా మందికి స్పూర్తిని ఇస్తూ మరిన్ని పుట్టినరోజులు మాతో జరుపుకోవాలని ఆశిస్తున్నాను...

9thhouse.org

పుట్టినరోజు సందర్భంగా మీకు మా అందరి హృదయపూర్వక శుభాకాంక్షలు.

Unknown

mirilanty puttina rojulu marenno jarpukuntu, blogers pages lo jyotulu veliginchalani aa yakundendu trushara hara dravalani korukuntu....

వర్మ

బ్లాగు లోకంలో నాచే అఆలు దిద్దించిన జ్యోతి గారికి జన్మదిన శుభాకాంక్షలు ....

Anonymous

Many Many Happy Returns of the Day

Ur's - DeepU

తెలుగుకళ

వెలిగే దీపం మరిన్ని దీపాల్ని వెలిగిస్తుందన్న మాటకు నిదర్శనం జ్యోతిగారు.
ఉత్సాహం
చురుకుదనం
ప్రోత్సాహం
అణకువ
మర్యాద
విఙ్ఞానం
దూరదృష్టి
సమయసద్వినియోగం
ఇలాంటి పదాలు చూడాలనుకున్నవారు ఒక్క సారి జ్యోతిగారితో మాట్లాడితే చాలని నాకు అనిపిస్తుంది.
నాకు మంచిదనిపించినమాట నిర్మొహమాటంగా చెప్తాను.
అతిశయోక్తి అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ లోపం.

నాకిష్టమైన మొదటిరోజు నాపుట్టిన రోజు.
ఏ శుభవేళ ఈ భూమి పై పడ్డామో , ఆ రోజు లేకుండా మనంలేము.
మన జీవితంలో ఏ మధుర ఘడియాలేదు.
ఆ రోజు వచ్చే శుభాకాంక్షల ముందు ఎంత గొప్ప వేడుకలైనా బలాదూర్.
రోజంతా నచ్చినట్లు హాయిగా రోజువారీ విసుగులకి దూరంగా సంతోషంగా గడపటం గొప్ప అనుభూతి.

నేటి మీ జన్మదినం
కోటి వరాల కానుక కావాలని,
తల్లిదండ్రులు, గురువుల దీవెనలు
మీపై కలకాలం వర్షించాలని,
మిత్రుల అభినందనలతో ,
కుటుంబమనే నందనవనంలో ,
సమాజమనే సుందరలోకంలో
నిత్యకళ్యాణం - పచ్చతోరణం గా
మాజ్యోతిగా కాంతులు నింపాలని
మీ పెదాలపై చెదరని చిరునవ్వు తాండవమాడాలని....
మనసారా ఆకాంక్షిస్తూ,మీ మంచితనానికి శిరసు వంచి నమస్కరిస్తూ......
తెలుగుకళ - పద్మకళ.

Unknown

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యొతిగారూ

వేణూశ్రీకాంత్

హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు జ్యోతి గారు.

Purnima

Many Many Happy Returns of the Day

మధురవాణి

Happy birthday to you..!!

సుజ్జి

Many Many happy returns of the day Jyothi garu

నేస్తం

Many Many happy returns of the day jyoti garu.

Kolluri Soma Sankar

జ్యోతి గారూ,
జన్మదిన శుభాకాంక్షలు!!!

Anonymous

జ్యోతిగారు,
పుట్టినరోజు శుభాకాంక్షలు...

రాఘవ

జ్యోతిగారికొఱకు జన్మదిన శుభాకాఙ్క్షలు :)

saipothuri

HAPPY BIRTHDAY TO U AKKA

krishna

Many happy returns of the day Jyothi gaaru.

నిషిగంధ

జ్యోతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని, ఎప్పుడూ పదహారేళ్ళ పడుచులా ఉత్సాహంగా అల్లరల్లరి చేశేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను :-)

Sujata M

Many Many Happy returns of the day Jo garu.. :D

One Stop resource for Bahki

జ్యోతి గారూ,
జన్మదిన శుభాకాంక్షలు!!!

Siri

పుట్టిన రోజు శుభాకాంక్షలు అండి. మా పాప కూడా సంవత్సరం కిందట ఇదే రోజు పుట్టింది.

snehamolakatalla.wordpress.com

krishna rao jallipalli

హృదయపూర్వక శుభాకాంక్షలు. నా లెక్క ప్రకారం జ్యోతి గారంటే బ్లాగులు... బ్లాగులంటే జ్యోతి గారు.

జ్యోతి

ఒహ్ గాడ్ !!!!!!.. మీ అభినందనలతో కళ్లు చెమర్చాయి.. వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

షుక్రియా ఇస్మైల్ భాయ్!! ఆకలి కాకముందే అన్నం తినమంటే ఎలా?? ఇక బావగారిని వంటింట్లోకి వచ్చేలా చేయాలంటే నా వంట చెడగొడితే సరి.

స్నేహగారు , వావ్! మీ పాపకు నా తరఫున దీవెనలు అందజేయండి.నాకు తోడుగా ఒక చిన్నారి దొరికింది.. భలే .. భలే...

Srujana Ramanujan

మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతి గారు. మీకో విషయం తెలుసా? ఈ రోజు శ్రీనివాస రామానుజన్ పుట్టిన రొజు కూడా.

Unknown

జ్యోతి గారు,
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సరదా, సంతోష పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను.

శ్రీనివాస

Belated Birthday wishes :-)

పరిమళం

జ్యోతి గారూ !నిన్న బ్లాగ్ చూడక పోవడం వల్ల ఒక రోజు ఆలస్యంగా చెబుతున్నా.హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!బ్లాగ్లోకంలో ఇంకా గొప్ప స్థానానికి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

చైతన్య.ఎస్

జ్యోతక్కా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Naga

పుట్టినరోజు శుభాకాంక్షలు.

కొత్త పాళీ

అభినందనలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008