Tuesday, 3 February 2009

దేవా .. దయ చూపుము...




అందరికీ ఒక విజ్ఞప్తి.. నేను ఎప్పుడూ శుభాకాంక్షలే చెప్తుంటాను కదా. కాని ఈసారి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేనందున ప్రార్ధిస్తూ అతను తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

అతని పేరు ప్రసాద్. హైదరాబాదులోనే ఉంటాడు. మంచి ఉద్యోగం. బాగా రాస్తాడు. అంటే మంచి ఆలోచనలు, రచనలు. కాని కొన్ని రోజులుగా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది. అతను నాకు ఏమీ కాడు, నేను అతనికి ఏమీ కాను. కాని అంత మంచి రచయిత, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు ఇప్పుడు ఇలా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి ఈ అభ్యర్థన చేస్తున్నాను. ఎందుకో బాలకృష్ణ రోడ్ షో కి వెళ్లాడంట. ఆ గుంపులో క్రిందపడి తలకు చిన్న దెబ్బ తగిలింది అంతే అప్పటినుంది ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడు చూసిన అందరి మీద కోపం, అక్కసు. ఏమేమో వాగుతుంటాడు. మందులు టైం కి వేసుకోడు. నేను బానే ఉన్నాడంటాడు. అతని ఆలోచనలు రోజురోజుకు కుళ్లిపోతున్నాయి. అది ఆతని శరీరంపై ప్రభావం చూపకుండా ఉండాలని నా కోరిక.

"భగవంతుడా.. నా తమ్ముడులాంటి ప్రసాదును తొందరగా బాగుచేయి స్వామి "

మీరు కూడా అతను తొందరగా కోలుకుని ఆరోగ్యవంతుడవ్వాలని ప్రార్ధించండి...ప్లీజ్...

10 వ్యాఖ్యలు:

muralirkishna

nijam gaaa Prasad anna vykthi ki Aaarogyma Baaga Lekapothe nenu Pradistunna Devudini manchi AyurArogyalu ivvamani...kaani Mee Blog antaa Naaaku Chaaala istam..Kaani Andari laa meeru balayya ni vimarshichaaaru ..ippativaraku Clean gaa vunna Mee Blog ni kalushitam chesukovaddani naa Manavi...Deenni batti meeku Balayya ante Istam ledu ani anukovalsi vastundi...

Mee Blog Adbutam gaa Vundaali ani korukone O abhimaani
Muralikrishna lekkala

జ్యోతి

మురళిగారు,
నాకు బాలకృష్ణ ఇష్టంలేదని చెప్పలేదే. జరిగింది చెప్పాను..

Kathi Mahesh Kumar

గాంధీగిరీ అన్నమాట...నా తరఫునా ఒక పూల బొకే.

Disp Name

ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి. కొన్ని సేకరణలు ఉన్నాయి anna notice ee tapaa ki vartistunda

పిచ్చోడు

నాది కూడా ఒక బొకే..... మీరు గాంధీగిరీ చెస్తే దారికి రాకుండా ఉంటాడా!!! బాగుపడిపోతాడు లెండి :-)

జ్యోతి

వరూధినిగారు
వర్తించదండి. ఈ టపా నా స్వంతం.. నా స్వీయానుభవంతో రాసింది. సేకరణ కాదు అని నా బ్లాగు మీద ఒట్టేసి చెప్తున్నా..

Malakpet Rowdy

ఒక కుర్చీకి కట్టేసి నాలుగు బాలయ్య, నాలుగు చిరు, నాలుగు రజనీకాంత్ సినీమాలు చూపిస్తే సరి! అటో ఇటో తేలిపోతుంది - ఆ తర్వాత వినబడే సంభాషణలు:

"కత్తితో కాదురా! బ్లాగుతో చంపేస్తా!!"
"నేను ఒక్క బ్లాగు వ్రాస్తే వంద బ్లాగులు వ్రాసినట్టు"
"పర్మిషన్ ఉన్న బ్లాగు ఎక్కడీకీ పోదు - పర్మిషన్ లేని బ్లాగు ఎప్పటికీ ఒపెన్ అవ్వదు"
"ఏది ఒకసారి ఆ స్క్రీను టర్నింగ్ ఇచ్చుకో"

చిలమకూరు విజయమోహన్

ప్రసాద్ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని కృష్ణభగవానుని ప్రార్థిస్తున్నాను.

Anonymous

ayyo.....paapam entha kastam vacchimdi.

naa tarapuna oka pulabutta. maa vurlo bokelu dorakavu mari.

ప్రియ

Soooooooooooooooooooooooooooooooooo Cuuuuuuute.

Accept 5 flower bocquets. He could have recovered by now. or... God saves him.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008