Friday, February 6, 2009

నేనింతే ... మారనుగాక మారను....

ముందుగా అందరికీ నా క్షమాపణలు. అనాలోచితంగా నా బ్లాగులు మూసేసినందుకు. వారం రోజులుగా జరుగుతున్న హేయమైన దాడులతో చాల బాధగా ఉండింది. నా మీద కక్షతొ ఇంత నీచానికి దిగుతారని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలాంటివాటిని పట్టించుకోవడం ఎందుకు అని అలా వదిలేసి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. కాని అవి రోజు రోజుకు శృతి మించుతున్నాయి. నా బ్లాగులోని పోస్టులను తీసుకుని వాటిని అశ్లీలకరంగా రాస్తుంటే తట్టుకోలేకపోయాను. బాధతో నా బ్లాగులన్నీ మూసేసాను. కొందరు బ్లాగర్లు నాకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. కాని నేను బ్లాగు మూసేసాను అని తెలిసిన ఇద్దరు ముగ్గురు బ్లాగర్లు నన్ను తిట్టారు.. వా... వా.. అవును ... కాని నాకు భలే ముచ్చటేసింది. నా మీద అంత చనువుతో చొరవ తీసుకుని నా గురించి నాకు తెలియచేసినందుకు. సో...

నా గురించి లక్షలమందికి తెలుసు. నా రాతలు వేలమంది చదువుతారు. వందలమంది నన్ను నా రచనలను మెచ్చుకుంటారు. ప్రోత్సహిస్తారు. అలాంటి నేను ఓ నలుగురైదుగురి చెత్త వాగుడుకు భయపడి బ్లాగులు మూసుకోవాలా? నన్ను అభిమానించే ఏంతో మంది నాకేమీ కారా? ఈ రాతల వల్ల నాకు ఏమైనా నష్టం జరిగిందా?? నా గౌరవం తగ్గిందా? లేదే? మరి ఎందుకు నేను వెనకడుగు వేయాలి?? నాకు ఇష్టమైన పనులు ఎందుకు మానుకోవాలి?? never పేరు చెప్పుకోలేని ధైర్యం కూడా లేని వాళ్ల గురించి నేనేందుకు కలతపడాలి? అందుకే నిన్న రాత్రి నా బ్లాగులన్నీ తెరిచాను. నన్ను మానసికంగా గాయపరచాలని చూసిన వారికి ఒక హెచ్చరిక.. నేను నా బ్లాగు రాయడం ఆపను. ఒకవేల ఆపేసినా, సరియైన కారణం, అద్భుత విజయంతో ఆపేస్తాను.

ఇక నేను బ్లాగుల టెంప్లేట్లు మార్చేపని.. అసలు ఎవరి బ్లాగు, మెయిల్ వారి చేతిలో ఉండగా , ఎప్పుడో ఇచ్చిన పాస్‌వర్డ్ లతో నేనేదో చేస్తాను అని పిచ్చి ఆలోచన చేస్తున్నవారిని చూస్తే నవ్వొస్తుంది. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈ బ్లాగ్ లోకంలోకి ఎలా వచ్చారో, కంప్యూటర్ ఎలా వాడుతున్నారో అర్ధం కాదు. ముందు ఆ పాఠాలు నేర్చుకోండి. ఐనా ఈ పాస్‌వర్డ్‌లు ఏమైనా క్రెడిట్ కార్డులా, స్విస్ బ్యాంక్ ఖాతాలా. వాటితో నేను లూటి చేసినట్టు ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మీ రాతల వల్ల మమ్మల్ని బాధపెట్టాము., గెలిచాము అనుకుంటున్నారేమో, కాని అది మిమ్మల్నే అధః పాతాళానికి తొక్కేస్తుంది అని తెలుసుకోండి. ఆ రాతలు చదివి అందరూ మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. మీ రాతలు మీ సంస్కారాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అవి చదివిన వాళ్లు మీరు ఆడవాళ్లకు ఎంత మర్యాద ఇస్తారో వారిని సమర్ధించినవారికి ఇంకెంత అపురూపంగా చూసుకుంటారో కూడా తెలుస్తుంది. అందరూ మీలాంటి మహానుభావులు ఉండరు అని గుర్తు పెట్టుకోండి.

ఇక ప్రమదావనం లోని మెయిల్స్ విషయం... ఆడాళ్ల వ్యక్తిగత గుంపులోకి కొంగేసుకుని వచ్చి మా వ్యక్తిగత మెయిల్స్ చదివి అదేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్న వాళ్లనేమనాలి.. అంత దొంగతనంగా రావడంలో ఉద్దేశ్యమేంటో? ఇదేనా మీ వ్యక్తిత్వం. మీరు మాకు పాఠాలు, నీతులు చెప్తున్నారా? సరే ప్రమదావనంలోకి రండి. నలుగు పెట్టుకుని, పసుపు రాసుకుని మాతో పాటు అప్పడాలు చేద్దురుగాని. ఇప్పటికైనా మర్యాదగా ఎవరి మెయిల్ దొంగిలించి మా మాటలు చూస్తున్నారో అది మానుకోండి. లేదా నేనే ఆ వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తుంది. గుంపులో కాదు. బ్లాగులోనే.. అది మీకే నష్టం. ఒకవేళ ప్రమదావనం మెయిల్స్ బయటకు చేరవేస్తున్న మహిళ ఉంటే వెంటనే గుంపును వదిలిపోండి.

ఈ దాడి నన్ను కొద్ది సేపు బేలను చేసినా ,, నన్ను మానసికంగా మరింత ధృడంగా చేసింది. నేను మరింత కసిగా రాయాలని నిశ్చయించుకున్నాను.... నేను ఎప్పటిలాగే ఉంటాను. మారను గాక మారను. నేనింతే.... నన్ను ప్రోత్సహించి, ధైర్యపరచి, ముందుకే నడిచేలా చేస్తున్న బ్లాగర్లందరికీ శతకోటి ధన్యవాదాలు..

48 వ్యాఖ్యలు:

మోహన

geart come back!. Hats off Jyoti garu.. okari valla manaki nachchina pani chesedi maanukovatam moorkhatvam. adi avatali vallaki maname chekoorchina vijayam. meeru annadi 100% correct. assalu taggedi ledu. andaru meela nadum biginchaalsinde...

bloggers andaru itara blaagarlu, vAri tapaalake kaaka, tama tama blog la ki tapaa laki, avi chadivE vAriki kooda gouravam ivvandi... delete option ni sakramamga maatrame vaadukovalani.. naa manavi. idi baadhato antunna maatale ani gamanimchagalaru

[comment cheyyalanna hadavudi lo telugulo type cheyyatledu. mannimchamdi]

మురళీ కృష్ణ

ఎందుకింత కిందా మీద పడుతున్నారో నాకర్థం కాని విషయం. ఎవరో ఎదో అన్నారని మన పనులు మానుకుంటామా? నేనైతే కాదు. కుక్క మొరిగిందని ఏనుకు కుక్కవెనక పడితే - చూసేవారికి నవ్వు, కాలక్షేపం తప్ప వేరే ఉపయోగమేమీ ఉండదు. ఇక్కడ ఏనుగు మీరు, కుక్కలు వారు అని కాదు నా ఉద్దేశ్యం -- ఎవరికి వారే ఏనుగులు, ప్రక్కనవారు తక్కిన వారు అని.

పైగా వాళ్ళలా అన్నారు, వీళ్ళలా అన్నారు అని మీరే వారికి లేని ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకూ నేను వాళ్ళవేవీ చదవలేదు. ఇంత హడావిడి అవుతుంటే నాకూ అనిపిస్తోంది - 'అంతిదిగా వాళ్ళేం వ్రాశారా' అని.

మీ బ్లాగ్ప్రపంచానికి మీరే చక్రవర్తులు, మహారాణులు, సర్వంసహా సమ్రాట్టులు. మీ ప్రపంచంలో మీదే చివరిమాట. కాబట్టి మీకిష్టంలేని వారి మాటలకు విలువనివ్వటం మాని, మీకేదిష్టమో అది నిర్భయంగా చేయండి.

దైవానిక

మంచి పని చేసారు

netizen నెటిజన్

కేక, జ్యోతక్క, కేక.
ఎడం కాలి చెప్పుతీసి గూబ గుయ్‌మనే లాగ, లాగి ఫెటేల్మని తగిలే లాగున కొట్టావుగా!
చెవి ఎర్రబడింది. ఎడం కన్ను పైరెప్ప సరిగ్గా తెరవలేక పోతున్నాడు. వాచిందిగా. ఆరే, దవడ కూడ వాచినట్టుంది. కింది పెదవి ఎడం వైపు ఉబ్బింది. పై పన్ను గాటు అనుకుంటా, అదిగో, అది రక్తమే, ఎండి చెక్కు గట్టింది.
హె, హే, హే!!
జ్యోతక్క, కొల్హాపురి చెఫ్ఫా అది! ఎక్కడ దొరుకుంది చెప్పవా, నేను కూడా తెచ్చుకుంటాను!

శ్రీనివాస్ పప్పు

తెలుగు నారి మేల్కొనవే
దీక్షబూని సాగవే
బ్లాగ్లోకపు స్వేఛ్ఛకోరి తిరుగుబాటు చెయ్యవే.
చురకత్తులు(కలం)పదునుపెట్టి తుదిసమరం మొదలుపెట్టి
సిం హాలై గర్జించాలి,
సం హారం సాగించాలి వందేమాతరం వందేమాతరం..
జయోస్థు,దిగ్విజయోస్థు.

పిచ్చోడు

జ్యోతక్కా,, సూపర్.... :-) మీరు ఇలాగే ఉండండి. మొరిగి మొరిగి అవే మూసుకొంటాయి.
కానీ వాళ్ళ ఖర్మ కు వాళ్ళే పోతారు అనుకోకుండా వీళ్ళకి ఏదైనా చేస్తే బావుంటుందనుకొంటా

తెలుగుకళ

గౌరవనీయులైన బ్లాగరు మితృలారా !
అన్ని అనర్థాలకీ మూల కారణం అభిప్రాయ భేదాలని నా అభిప్రాయం.
సహృదయంతో అర్థం చేసుకొంటే అందరూ మన మితృలే.
మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకి దారి చూపించే మంచి మితృలని సంపాదించే దిశగా మన మాటలు సాగితే ప్రపంచమంతా స్నేహ సుగంధాలమయమే.

ఈ సందర్భంగా నా చిన్ని కవితను మీముందు ఉంచ
టానికి సాహసిస్తున్నాను.


అమృతమై
బతికిస్తుంది
విషంగా మారి
చంపేస్తుంది

వినూత్న సృష్టి, విస్ఫోటనం
ఓ మాటతోనే............


అన్ని ఆయుధాలకంటే శక్తివంతమైన ఆయుధం మనిషి మాట.
మన మాటల ద్వారా మనం ప్రపంచానికి చేయవలసిన మహత్కార్యాలు ఎన్నో ఎదురుచూస్తుండగా అనవసరమైన అభిప్రాయ భేదాలతో ఒకరిని ఒకరు నిందించుకుంటూ మన శక్తిని నిర్వీర్యం చేసుకోవటం సరేనంటారా?

ఎవరూ మహనీయులు కాదు, ఎవరూ దుర్మార్గులు కాదు.పరిస్థితులు, అనుమానాలు, భయాలు, నిందలు, ప్రతినిందలు మనలోని మంచిని అణచిపెట్తూ మనల్ని చెడుకి చేరువ చేస్తున్నాయి.

మనకు గౌరవాన్ని,అవమానాలను తెచ్చేవి మన మాటలు, చేతలే అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తేవాలని నేను చేసే ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ మన్నిస్తారని భావిస్తున్నాను.
మీ మనసులని గాయపరిచే దుస్సాహసం చేయలేను కానీ ఈ సందర్భం గా నేను ఇంటర్వ్యూ చేసినప్పడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానం మీముందుంచుతున్నాను.
నా ప్రశ్న:
సంస్కారాల్లో కెల్లా ఉత్తమ సంస్కారం ఏది?


సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానం :

"ఏ పని చేస్తే మన మనసుకు బాధ కలుగుతుందో మనం దానిని ఇతరులకు చెయ్యకుండా ఉండటం సంస్కారాల్లోకెల్లా అత్యుత్తమ సంస్కారం."


జరిగిన విషయాన్ని ఒక కలగా భావించి అందరమొక్కటే అన్న భావనతో కలిసి ముందుకు సాగటానికి పూనుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరినీ సవినయంగా శిరసు వంచి ప్రార్థిస్తున్నాను.

ఆయుర్వేదం

ఇక్కడ ఏమీ ఎక్కువ రాసినా మీ భజన చేసామంటారు :-( ఏదేమైనా మళ్ళీ బ్లాగు మొదలుపెట్టారు.... :-) మీ బాధను అర్ధం చేసుకోగలను... ఇక మిమ్మల్ని బ్లాగు డిజైన్ చెయ్యమన్నవాళ్ళకు సలహా ఇవ్వండి... మీకుగా మీరు చొరవ చూపిస్తే అది ఎక్కడికో దారి తీస్తుంది... లేదా మహీ గ్రాఫిక్స్ గారు బ్లాగ్ ట్యూటోరియల్ మొదలుపెట్టారుగా దాని గురించి చెప్పండి...
నేనింతే అన్నారు కదా అది బ్లాగు రాసే విషయంలోనే ఉండండి... అపాత్రాదానంలా సహాయం చేసిన అది తీసుకునేవాళ్ళు ఎలాంటీవారో మనం చెప్పలేముకదా!!

Anonymous

దాడి గురించి నేను రెండు మూడు బ్లాగులలో చదివాను,. కానీ విషయం ఏమిటో నాకు కొంచెం కూడా అర్థం అవడం లేదు. మీ బ్లాగును బట్టి చూస్తే ఎవరో దొంగతనంగా మైల్స్ చదివుతున్నారని పిస్తోంది. ఐనా మీరు వార్నింగులు లాంటివి మాని, direct గా వారు ఎవరో బ్లాగులో రాసేయండి.

మీకు తెలీనిది కాకపోయినా, వ్యక్తిగత దాడులకు అందునా అశ్లీలంగా రాతలు రాసే వాల్లమీద లీగల్గా కూడా వెల్లవచ్చు కదా. కొంచెం రిస్కున్నమాట వాస్తవమే ఐనా, అలాంటివాటిని చూస్తూ ఎంతకాలం ఊరుకుంటారు?

Bolloju Baba

bravo

సుజాత వేల్పూరి

జ్యోతి,
" ప్రమదావనంలోకి రండి,కొంచెం నలుగు పెట్టుకుని పసుపు రాసుకుని మాతోపాటు కూచుని అప్పడాలు చేద్దురుగానీ" ప్రమదావనం అంటే ఊసుపోక చెప్పుకునే అమ్మలక్కల కబుర్ల గది అనుకునే వారు ఈ మాట వల్ల అది నిజమే అనుకుంటారు. ప్రమదావనం బ్లాగుల వ్యాప్తికోసం చేస్తోన్న కృషి ఏమిటో త్వరలోనే తెలుస్తుంది.

మొత్తానికి బ్లాగు తెరిచినందుకు సంతోషం!

జ్యోతి

సుజాతగారు,
ప్రమదావనం మెయిల్స్ చూస్తున్నామని గర్వంగా చెప్పకునేవారికోసం అలా చెప్పాను. దానివల్ల మనం ఎంత బాధపడ్డామూ వాళ్లకు తెలియాలి.. ఐనా మనం చేసే కార్యక్రమాలు మెప్పు కోసం కాదుగా, చెప్పుకోవాల్సిన పనిలేదు. చేసుకుంటూ పోవడమే..

కళగారు,
మీరు చెప్పింది నిజమే. మాట జారితే అది వెనక్కి తీసుకోవడం కష్టం.దాని వల్ల కలిగే నష్టం కూడా.

నెటిజన్ గారు,
మీరు మరీను...:)

జ్యోతి

ధూమ్ గారికి,

మీకు నామీద చాలా డౌట్లు ఉన్నట్టున్నాయి. జవాబు చెప్పడానికి నేను సిధ్దంగా ఉన్నాను. ఈసారి పిచ్చాపాT అదే అంశం చేసుకుందాం. మెయిల్ చేయండి. ..అనవసరంగా ఈ అపోహలు ఎందుకు? లేదా బ్లాగర్ల మీటింగ్ కి రావొచ్చు. మీ పేరు చెప్పకుండానే మీ సందేహాలు తీర్చుకోవచ్చు .

చింతా రామ కృష్ణా రావు.

అమ్మా! జ్యోతీ!
మీ సుమ పేశల మానసాన్ని గాయ పరచిన దెవరు? ఎవరైననేమి. మీరు అబల కాదని సబల అని మిమ్మల్నన్న వారు ఈపాటికే గ్రహించి వుండాలి.
ఏది ఏమైనా మీరు మాత్రం అందరికీ ఆదర్శ మూర్తులని జగద్విదితం.
శ్రేయాంసి బహు విఘ్నాని. అన్న నానుడి మీకు తెలియనిది కాదు. మన మంచితనమే మనల్ని నడిపిస్తుందని నమ్మండి.
మంచి మార్గంలో నడచే మీరు అలిసిపోకూడదు. ఆ సరస్వతీ మాత మీకెప్పుడూ తోడుగావున్న సంగతి మాకు తెలియందేమీ కాదు. ఆ విషయాన్ని మీరూ మరువకండి. మీ బ్లాగును ద్విగుణీకృత వుత్సాహంతో కొనసాగిసున్నందుకు మాకు చాలా ఆనందంగా వుంది. నమస్తే.

asha

wow. మంచి నిర్ణయం. రమణిగారు కూడా ఆమె బ్లాగును తెరిస్తే బావుంటుంది.

పరిమళం

జ్యోతి గారు,రెండు రోజులుగా నెట్ కనెక్షన్ సరిగా లేక చూడలేదు .మీరు బ్లాగ్ మూసేయడం ఏంటండీ ?బహుశా మానసిక సమస్యలున్న వాళ్లు అలాగే బిహేవ్ చేస్తారనుకుంటా .వాళ్ళని చూసి జాలిపడటం తప్ప ఏం చేయగలం ?
ఏదేమైనా మీరు బ్లాగును కొనసాగిసున్నందుకు ఆనందంగా వుంది.

నేస్తం

శుక్రవారం కదా అని అమ్మవారి పాటలు వింటూ కూడలి చూసాను మీ టపా,అమ్మ పాట రెండు బలే ఉన్నాయి :)

Purnima

:)

వికటకవి

చెప్పటం తేలికైనా, మీ పరిధిలో మీరు చాలా ధైర్యమైన పని చేసారండీ. ఇక వెనక్కి తిరగకుండా ముందుకెళ్ళండి. మిగతాది నెటిజన్ చెప్పనే చెప్పారు.

శ్రీ

మంచి పని చేసావు జ్యోతక్కా!

ఇటువంటి సంఘటనలే మనల్ని మానసికంగా,వ్యక్తిగతంగా బలవంతుల్ని చేస్తాయి. మీ బ్లాగుకి కోటి బ్లాగుల ధైర్యం వచ్చిందని భావిస్తున్నాను.

Sujata M

ఈ మధ్య టచ్ లో లేను. అసలు విషయం ఈ మధ్యనే తెలుసుకున్నాను. మీరేంటి ధైర్యం కోల్పోవడమేమిటి ? ప్రమదావనం - అమ్మలక్కలు చేసేంత సోషల్ వర్క్, శ్రమకోర్చి చేసే టెలివిజన్ కార్యక్రమాలూ, రకరకాల ఏజెన్సీలతో వీళ్ళు చెక్కబెట్టే వ్యవహారాలూ - మాత్రం ప్రస్తావించనేలేదు మీ మితృడు !


అన్నట్టు - హమ్మయ్య ! ఇప్పుడు జ్యోతి గారి లాగా సౌండ్ అవుతున్నారు.

Kathi Mahesh Kumar

Great!!!

durgeswara

akkagaaroo

Emi jariginadi? eemadhya naaku teerika chikkakapovatam valana koodali vaipuku raaledu.mail chesi cheppagalaru.

గీతాచార్య

Good thing you have done is that you reopened the blog.

I donnom about it. You closing the blog. Bot, any way, When I came to net found it.

Now to the point, ప్రమదావనం గురించి చెప్పాలంటే అది పార్వతీ దేవికి చెందినది. అందులో చొరబడిన పురుషులని పుంసత్వం కోల్పోమని అమ్మ శపించింది.

పాపం వాళ్లు ఎప్పుడచ్చారో తెలియదు కానీ మీరు మాత్రం బాగా ఆహ్వానించారు. ఎంతైనా (హాస్యం లో కూడా) మీది పెద్ద మనసే.

ఇంతకుమున్దోకసారి మీకు చెప్పిన మాటలనే మళ్ళీ చెపుతున్నాను. మీరు బేల కావలసిన అవసరం ఉండదు. ఆ క్షణంలో మీరు మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. But what they wanted is that... మీరు ఒక బెలలా మారి బ్లాగ్ మూసివేయటమే.

ఈ ఒక్క మాటకీ మాత్రం "ఆపేసినా, సరియైన కారణం, అద్భుత విజయంతో ఆపేస్తాను." Hats-off. బాగా చెప్పారు. మీరు మరిన్ని టపాలతో తెలుగు బ్లాగ్లోకంలో వెలుగులు విరజిమ్మాలని మనసారా ఆశిస్తూ...

The Inquisistor - సత్యాన్వేషి.

bhagya

GREATTTTTTTTTT,

krishna rao jallipalli

రెండు రోజుల నుండి కూడలి, జల్లెడలో మీ టపాలు కనపడలేదు. పని ఒత్తిడి వలన రాయలేదేమో అని అనుకోన్నానే కాని బ్లాగు మూసేశారని అని తెలియదు. anyway.... మరల తిరిగి వచ్చినందుకు సంతోషం. జరిగిన దాని వలన మీ వన్నె పెరిగిందే కాని తరగ లేదు. అది అందరికి తెలుసు. తెలుగు బ్లాగుల వికాసానికి మీరు చేసిన, చేస్తున్న కృషి అందరకి తెలుసు. మీ కృషే మీకు ఎంతో ప్రచారాన్ని కలిగించింది. మీకు వొచ్చిన ఈ ప్రచారం ఒక రోజులో వచ్చింది కాదు. ఏది ఆశించ కుండా బ్లాగుల సర్వతోముఖభివ్రుద్దికి మీరు పడుతున్న తపన కొంతమందికి తెలియక పోవచ్చు. మీకు వొచ్చిన ఈ పేరు, గుర్తింపు కొంతమందికి రుచించలేదు అని అనుకొంటున్నాను . అందుకే ఈ పిరికి దాడులు (నా బాషలో కొజ్జా దాడులు). వోర్వలేనితనం ఏమైనా చేస్తుంది, ఎన్నైనా చేస్తోంది. కాని ఎప్పుడూ విజయం సాదించ లేదు. రెట్టించిన ఉత్సాహంతో మీరంతా ముందికి సాగిపొండి.

శేఖర్ పెద్దగోపు

జ్యోతి గారు, బ్లాగులోకంలో చీడపురుగులు కూడా వున్నాయని మీ ఆవేదన బట్టి అర్ధమౌతుంది. మళ్లీ బ్లాగును తెరిచి చాలా మంచిపని చేసారు.

Mahitha

హెలో,

నేను కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసాను.నాకు ఇంతకు ముందు ఇంగ్లిష్ బ్లాగ్ ఉండేది.
కాని ఇక్కడ ఇదంతా చూస్తుంటే భయం వేస్తోంది.నేను తెలుగు బ్లాగ్ maintain చెయ్యగలనా అని?ఇక్కడ ఇలా రిప్లయి ఇవ్వ్టానికి కూడా చాలా ఆలోచించాల్సివచ్చింది.

am really worried.
:(

viswa soundaryam

good decision
psmlakshmi

కొత్త పాళీ

మంచి పని చేశారు.

Vensy

జ్యోతిగారూ,
ఏదో వివాదం జరుగుతోందని అర్థమయిందికానీ,చాలామందిలాగే వివరాలు తెలియలేదు. బ్లాగులు మూసేయడం గురించి ఇప్పుడే తెలుస్తోంది. మొన్న పూర్ణిమ గారి బ్లాగ్ చూద్దామంటే ఓపెన్ కాలేదు. మెంబర్స్ కిమాత్రమే అని వస్తే కంప్యూటర్ లో ఏదో పొరపాటేమోననుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం అవుతోంది.
సుజాతగారి బ్లాగులో చదివాక వివాదస్వరూపం కొంత అర్థం అయింది. ఆడవాళ్లపైన దాడులనే ఖండించాలా, మగవాళ్లపైన దాడిని ఖండించక్కర్లేదా అన్న విషయాన్ని మరీ మరీ రొక్కిస్తున్న వ్యాఖ్యలు చదివితే చికాకనిపించింది. ఎవరిమీద దాడినైనా ఖండించాలని అందరూ ఆమోదిస్తారు,కానీ అందులో మహిళలు కూడా ఉన్నారన్నప్పుడు అది మరీ సున్నితంగా చూడాల్సిన విషయం కాదా.
నా మొదటి పోస్టుకు చక్కని వ్యాఖ్య రాస్తూ నన్ను మీ ప్రమదావనానికి ఆహ్వానించారు మీరు. అంటే ఏమిటో ఎక్కడుంటుందో తెలియక, సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం లాంటి బోల్డు కారణాల వల్లనేను మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యలేదు.ఇప్పుడు కొంచెం జ్ఞానం సంపాదించాను లెండి.
అందరూ చెప్పినట్టే...పేరు చెప్పడానికి ధైర్యంలేని వారి గురించి పట్టించుకోకుండా, వారికి ప్రచారం ఇవ్వకుండా ఉండడమే మంచిదని అనిపిస్తోంది.
ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగులోకమనే వృక్షం కొత్త చిగుళ్ళు వేస్తూ నవనవలాడుతూ కనిపిస్తోంది. సహజంగానే చీడపీడలు బాధిస్తాయి. ఆదరణ,ఆప్యాయతల ఎరువులు వేసి దాన్ని తిరిగి చిగిర్చే చెట్టు గా మార్చడానికి తోటమాలులం మేం ఉన్నాం.మీవెనకే వస్తున్నాం...ధైర్యంగా...పదండిముందుకు...

మరువం ఉష

way to go!

teresa

good come-back :)

శరత్ కాలమ్

మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ మధ్య జరిగిందే. నాకు చదువరి వ్యవహార శైలి నచ్చదు (ఈ-తెలుగు గురించి కాదు). ఈమధ్య కొన్ని టపాలలో చదువరి మీద డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో వ్యాఖ్యలు చేసాను. పట్టించుకున్నారా? నాకు తెలిసినంతవరకు లేదు. వారు పట్టించుకొనివుంటే అదొక దుమారం అయి వుండేదేమో. మరి వారిని వారు ఏనుగు, నన్ను కుక్క అనుకున్నారేమో తెలియదు :)) తీరికలేకనో, ఆసక్తిలేకనో, నన్ను వెధవాయి కింద జమకట్టొ మొత్తం మీద నన్ను నా మానాన వదిలేసారు. ఏమయ్యింది విషయం - సమసి పోయింది. ఒకే చేతితో చప్పట్లు ఎంత కాలం కొట్టగలను నేను?

విషయం ఏమిటంటే విమర్శకులతో కలిసి మీరు చప్పట్లు కొడుతున్నారు (మీ బ్లాగుని ఆపివేసి)! విమర్శలలో ఏమాత్రం నిజం వుందనుకున్నా సవరించుకోండి లేకపొతే వాటిని ప్రక్కన పెట్టేయండి. సింపుల్! నాది అయితే ఇదే పద్ధతి.

sunita

ento!ee blog ivvale choosaanu. emi jarigindo teliyaledu

Anonymous

ఒక చిన్న కధ

ఒకదేవాలయం పక్కన చెట్టుమీద వుండే రాబందుకి ఆ దేవాలయంలో మోగే జేగంట అంటే మంట . అబ్బబ్బ నీ శబ్దం భరించలేకపోతున్నాను . కాబట్టి నా రెక్కల్తో నీ అంతు చూస్తాను . నిన్ను వాయించి, వాయించి అరగదీసి ఇక మోగకుండా చేస్తాను అని పంతం పట్టింది. అప్పుడేమైందో తెలివైనవారు ఎవరైనా ఊహించవచ్చు . రెక్కలు విరిగి రాబందు కిందపడింది. గుడిలోని జేగంట మాత్రం ఎప్పటికీ మోగుతూనే వుంది
జ్యోతిగారూ ఇది మీరు సాధించిన మరో విజయం .అభినందనలు

చైతన్య.ఎస్

మంచి పని చేశారు. తెలుగు బ్లాగ్లోకంలో మీ బ్లాగు వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ

జ్యోతి

మహిగారు,

భయంలేదండి.. మీరు ధైర్యంగా రాసుకోండి. అందరూ మీకు సాయం చేస్తారు అవసరమైతే..

సుధగారు,
మీరు నాకు మెయిల్ చేయండి. ప్రమదావనంలో చేర్చుకుంటాను..

శరత్ గారు,
విమర్శలు వికృతరూపం దాల్చి అశ్లీలంగా దాడి రూపం దాల్చటంతో బాధ భరించలేక బ్లాగు మూసేసాను. అది తప్పు అని తెలిసింది. అందుకే ఈ మొండిధైర్యం..

జ్యోతి

పూర్ణిమ, రమణి,వేదగారు..
నేను ఈ టపా రాసింది నా అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు. సమస్య వచ్చనప్పుడు ఎవరైనా ఇలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని..
ఈ టపాలో కామెంట్లు మీకు కూడా వర్తిస్తాయి. నేను రాసింది కూడా మళ్లీ మళ్లీ చదివి మీకు అన్వయించుకోండి. ఎవడేమనుకుంటే నాకేంటి అని మీ బ్లాగులు తెరవండి. మిమ్మల్ని అభిమానించే వారిని వదలి మిమ్మల్ని వెక్కిరించేవారికి ప్రాముఖ్యత ఇవ్వకండి..

ఇక్కడ ఎవరైనా తమ రాతలతోనే పరిచయం. అంతే తప్ప వేరే లేదు. అది ఎందుకు ఆపుతారు??

Purnima

Jyothi,

Thanks for the concern. But you got to leave me out of this! Since only my action (of deleting blog) / reaction can be seen and nothing else is known, I can understand the scope for assumptions. And I thank you all for the genuine concern shown.

That said, I'm very sure of what prompted my decision. I'm completely aware of the action and the consequences resulting out of it, or the result the action is supposed to get for me. Hence, no worries.

Blogging should be a happy diversion, constructive utilization of time and energy and should at the most remain as a hobby, but not become a lifeline or addiction kind of thing! As long as you know "WHY" you blog, the decision to continue / cease it becomes easy. I KNOW why I blog and what I wanna gain out of it.

I'm perfectly fine! :-)

And just FYI: The deletion of my blog has nothing to do with anything that's been happening in the blog-o-sphere for the past few weeks. Agreed my decision was delayed in execution, but I guess, I was ahead of time.

Thanks & Regards,
Purnima

PAVANKALYAN[I.A.S]

JYOTHI MEDAAM GAARU MEE DAIRYANIKI HANDSAFF MEERU STRI JAATHIKI PRAANAMLANTIVAARU MEERU DAIRYAM KOLPOKODADU MEEKU KONNI LAKSHALAMANDHI VEANNU DHANNUGAA VUNNARU NEANU EE ROJE MEE BLOG CHADIVAANU ANDHUKEA RAASTUNNAANU NAA PERU K.PULLARAO NENU OKA BLOG OPEN CHECHAANU KAANI KOODALI SITE KI LINK YALAA CHEYYALO TELIYATAMLEADU MEERU NAAKU SAAYAM CHEYAGALARANI AASISTUNNAANU PLEASE MEADAM NAA ID:pullaraoani2010@gmail.com , naa blog ki htt://pavankalyanias.blogspot.com ani peru pettanu naa phone no 9247889871 ,maadi vijayawada nenu narayana college lo computer operator gaa job chesthunaanu

Naga

టపా పేరు నాకు బాగా నచ్చింది. మన తరువాత వచ్చే వారికి వెలుగును ఇవ్వడం కోసం మన తెలుగు బ్లాగులు జ్యోతుల వలె ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి...

గీతాచార్య

@Purnima:

Kudos.

"I KNOW why I blog and what I wanna gain out of it."

Very well said. I donno why u stopped u deleted ur blog. But, for your saying that you know why u stopped blogging, it's heartening. I hope u did not do it in an emotional state, but u did it consciously.

సుభద్ర

jyothigaru,
mee blog thone nenu blog chadavatam modalu pettanu.jyothi garu meeru yepani chesi adi tappaka manchi pani chestaru ani naa nammakam.
all the best.

మధురవాణి

Jyothi garu,
Nice to see you back..!
Don't mind all these things. Just Go ahead with your work..!

Srujana Ramanujan

What you did first is wrong. why should you care about those second handers?

What u did next is right. Why don't u continue? :-)

Great to see u back. and a nic eresponce frm ur frnds. U should write fr urself, and fr ur frnds. not fr ur foes.

Best wishes...

Srujana Ramanujan

Srujana Ramanujan

@గీతాచార్య

Parvati Devi shaapam katha baagundi. avunu pramadaavanam sangathi vaallaki teleedemo! Meeru baagaa gurthu cheshaaru.

@Mahi

No problem. U can continue in ur own way.

One Stop resource for Bahki

:)
Jai ho..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008