Tuesday, March 17, 2009

మసాలా దోసె – మనస్తత్వ విశ్లేషణ
మసాలా దోసె చాలా మందికి ఇష్టం. కాని దానిని ఎన్నో విధాలుగా తింటారు, రకరకాల దోసెలు విన్నాము గాని , తినడంలో రకాలున్నాయా? అని ఆశ్చర్యపోకండి. కొన్ని విధానాలు చెప్తున్నాను. మసాలా దోసెను తినే విధానం ఆ వ్యక్తి మనస్తత్వాన్ని తెలియజేస్తుందంట. అవి నిజమో కాదో మీరే నిర్దారించుకోండి.


1. దోసెను పూర్తిగా విప్పి తినేవాళ్లు: వీళ్లు నిజజీవితంలో కూడా అన్ని విషయాల్లో ఒపెన్ గా ఉంటారు. వారి సన్నిహిత మిత్రులకు వారి గురించి దాదాపుగా అన్ని విషయాలు తెలిసి ఉంటాయంట. ఇలా తినేవాళ్లు అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటారంట. (అమ్మాయిలు గుట్టు దాచడంలో ఘనులు కదా )


2. దోసెలను చివర్లనుండి మొదలుపెట్టి మసాలాను తర్వాత తినేవాళ్లు : వీళ్లు అద్భుతమైన విషయాల కోసం ఎదురు చూస్తారు. కాని ఆ సమయం వచ్చేసరికి ఆ అద్భుతాన్ని మనస్పూర్తిగా అనుభవించలేరు. వీళ్లు జీవితాన్ని కష్టమైనా, సుఖమైనా ఎంజాయ్ చేయలేరు. ఇందులో మళ్లీ రెండు రకాలు ...

1) దోసె మొత్తం తింటారు కాని మసాలా వదిలేస్తారు: ఈ వ్యక్తులు ఎక్కువగా సంతోషాన్ని ఆశించరు, ఎందుకంటే వాళ్ల జీవితంలోని ఒడిదుడుకులు, బాధలు వారిని అరుదుగా లభించే చిన్ని, చిన్ని ఆనందాలు కూడా సంతోషాన్ని ఇవ్వలేవు.
2) దోసె చిన్నదైనా మసాలా మొత్తం ఖాళీ చేస్తారు : ఈ వ్యక్తులు నిజంగా అభినందనీయులు. జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు. ఏదీ మిస్ కారు. సుఖ దుఃఖాలలో తొణకరు, బెణకరు. చీకటైనా, వెలుతురైనా నిబ్బరంగా ఉండే ఈ వ్యక్తులను అర్దం చేసుకోవడం కష్టమే. ఇలాంటివారు ఐతే మన ఆప్త మిత్రుడన్నా అన్నా అవుతారు లేదా బద్ధ శత్రువన్నా అవుతారు.


3. దోసె మధ్యలో నుండి మొదలెట్టి చివర్లకు వెళ్లేవారు: వీళ్లు ఎక్కువగా జీవితంలోని సంతోషాన్నే ముందుగా కావాలనుకుంటారు. ఎప్పుడు కూడా మంచివి, పనికొచ్చే పనులు తొందరగా పూర్తి చేస్తారు. చిక్కులు, ఆపదలు వచ్చేసరికి బెంబేలెత్తిపోతారు. ఇందులో రెండు రకాలు..

1) దోసెను మొత్తం తిననివాళ్లు : వీళ్లు చాలా దురదృష్టవంతులనవచ్చు. ఈ వ్యక్తులు ఎప్పుడు సుఖాన్నే, విజయాలనే కోరుకుంటారు. అనుకున్నవన్నీ సఫలం కావాలనుకుంటారు. కష్టాలు రాగానే ఎదుర్కొనే ధైర్యం లేక చావాలనుకుంటారు. జీవితం మొత్తం సాఫీగా ఎటువంటి సమస్య లేకుండా సాగిపోవాలనుకుంటారు. ఇది అసాధ్యం కదా. ఎంతటి ధనవంతుడికైనా జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయా?
2) దోసెను పూర్తిగా తినేవాళ్లు : వీళ్లు సాధారణ మానవుకు అనొచ్చు. జీవితంలో కష్ట సుఖాలు సమంగా ఉంటాయి, వాటిని అనుభవించక తప్పదు అని నమ్మి వాటికి తయారుగానే ఉంటారు. సంతోషంగా ఉన్నప్పటి ఆనందాన్ని కష్టకాలంలో గుర్తు తెచ్చుకుని సాగిపోతుంటారు. ఈ వ్యక్తులు జీవితం అంటే పూలపాన్పు కాదు, అప్పుడప్పుడు ముళ్లు కూడా తగులుతుంటాయి అని గాఢంగా నమ్ముతారు.


4. మసాలాను దోసె మొత్తానికి వచ్చేలా జాగ్రత్త పడేవారు : ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. వీళ్లు చాలా నిబ్బరంగా, బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. వీరిని సంతోషపరచాలన్నా, బాధపెట్టాలన్నా కష్టమైన పనే. కాని వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. ఎవరిని తమ జీవితంలోకి తొంగి చూడనివ్వరు. స్నేహితులుగా ఉండ తగరు కాని గుంపు చెదిరిపోకుండా మాత్రం చూసే ప్రతిభ వీరికి ఉంది అని చెప్పవచ్చు.

5. తమ దోసెను అపురూపంగా భావించి ఎవరితోను పంచుకోవడానికి ఇష్టపడరు: వీళ్లు తమ జీవితం గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరినీ సన్నిహితులుగా భావించరు. తమ గురించి కూడా చెప్పరు. ఎప్పుడూ తమ లాభం గురించే ఆలోచిస్తారు. ఇలాంటివారు ఏ గుంపులో ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు తమ సంతోషం,. లాభం తప్ప వేరే ఉద్ధేశ్యం ఉండదు.

6. తమ దోసెనుండి మొదటి ముక్క ఇతరులకు ఇచ్చేవారు: ఇలాంటివారు స్నేహానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తారు. ఏదైనా కార్యం కాని గుంపులో కాని ఉంటే అది తమ స్వంతంగా భావిస్తారు. గుంపులోని సభ్యులందరినీ ఒక్కటిగా ఉంచే గం లాంటివారు. చాలా కలుపుగోలుగా ఉంటారు. అందరిని చాలా తొందరగా తమలో కలుపుకుంటారు. ఎప్పుడు కూడా స్నేహితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.


7. దోసెనుండి ముందు కొంచం తిని తర్వాత ఇతరులకు ఇచ్చేవారు : ఇలాంటివారు తమ స్నేహితులను అమితంగా ప్రేమిస్తారు. అసలు స్నేహం చేయడానికి చాలా ఆలోచిస్తారు. స్నేహితులని నిశ్చయించుకున్న తర్వాత మాత్రం ఆ బంధాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. ఎప్పుడు కూడా తొందరపడరు. ఏ పరిస్థితి నైనా ముందుగా దానిని గురించి ఆలోచించి, విశ్లేషించి ఆ తర్వాత రంగంలోకి దూకుతారు.

8. ఎదుటివారు ముందు తమకు ఇవ్వాలని ఎదురుచూసేవాళ్లు : ఇలాంటివారు సర్వసాధారణంగా కనిపిస్తారు. దేనిగురించి కూడా ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉండరు. ఎప్పుడు కూడా అవతలివాడు ముందడుగు వేయాలని చూస్తుంటారు. తమంతట తాము ధైర్యం చేయరు. ఎదుటివారు మిన్నకుంటే వీరు అంతే.


9. తమకు ఎక్కువవుతుందని అనుకున్నప్పుడే ఎదుటివారికి ఇవ్వాలని ఆలోచించేవాళ్లు : ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు మనకు ఎంతో మంది తారసిల్లుతారు. తమ అవసరాలన్నీ తీరాక, ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు దానం చేయడానికి ముందుకొస్తారు. అలా అని వాళ్లు పిసినారులు కారు. దానకర్ణులూ కారు. చాలా మంచివాళ్లు. ముందు తమని తాము సంతృప్తి పరుచుకున్నాకే మిగిలిన వారికి సాయం చేస్తారు. మంచి అనుభవైకవేద్యమైన సలహాలు ఇస్తారు.


10. దోసె మొత్తం ఎదుటివారికి ఇచ్చి తర్వాత అందులోనుండి తీసుకుని తినేవారు : ఇలాంటివారిదో వింత మనస్తత్వం. తమకేమి కావాలో తెలుసు, ఎలా సంపాదించుకోవాలో తెలుసు కాని ఆ సంపాదించినదాన్ని పూర్తిగా ఎలా అనుభవించాలో తెలీదు. తమ అవసరాలు తీరితే చాలు అనుకుంటారు కాని సంపూర్ణంగా అనుభవించడం అనేది అస్సలు తెలీదు.


అర్ధమైంది కదా. ఇక ఎప్పుడైనా మసాలా దోసే తినేవాళ్లు కనిపిస్తే , కాస్త గమనించండి. అతను మీ స్నేహితుడైతే , అతని స్వభావం అంచనా వేసి నిజమేనా చూడండి. ఇంతకీ మీరు పైవాటిలో ఏ విధానంలో మసాలా దోసె తింటారేంటి?

26 వ్యాఖ్యలు:

మాలా కుమార్

baboy indulo intha mathalabulu vunnayya.
ayithe ee sari chudaali.

Anonymous

భలే! భలే!! ఇంక చూసుకోండి ఎవరితో హోటల్ కి వెళ్ళినా అందరికీ మసాలాదోసనే... అయిపోయింది ఇంక మా స్నేహితుల పని.....

Kathi Mahesh Kumar

నేనీవిషయం అస్సలు నమ్మను!

Anonymous

అసలు మసాలా దోస కి ఇంత పెనుముందని ఇప్పుడే తెలిసింది.బాగుంది.

శ్రీనివాస్

నిజం గా మసాలా దోశ తో కూడా ఇలా కనుక్కోవచ్చా ఓ మై మ్యాడ్ ...

నేను ఎలా తింటాను అని ఒక సారి ఆలోచించుకునే లా చేసారు

బహుశా నాకు రెండవ పాయింటు అందులో మళ్లా రెండు ఉన్నాయి కదా వాటిల్లో మళ్ళా రెండు

కొత్త పాళీ

వార్నాయనో మసాలదోసె తినడంలో ఇన్ని మతలబులా?

దోసె టేబిలుమీదికి రాగానే ఆవురావురుమాంటూ తినేస్తే??

asha

హయ్! నేను ఎక్కువగా సంతోషాన్ని ఆశించను. నా జీవితంలో ఒడిదుడుకులు, బాధలు ఎక్కువ.

krishna rao jallipalli

టపా బాగుంది NIJA నిజాలెలా ఉన్నా. ఈ సారి ఇంకో ITEM అదే కోడిగుడ్డు, జీడిపప్పు, జిలేబి మీద.

చిలమకూరు విజయమోహన్

మాకవన్నీ తెలియవండి,మసాలాదోసె రుచిని ఆస్వాదిస్తూ లాగించెయ్యడమే మాపని.

హర్షోల్లాసం

ayya baboi yemiti maatala masaala.

Anonymous

మరి వండి, వడ్డినకు వాడే పాత్రలతోను, వడ్డించే పద్దతిలోను ఆ వ్యక్తి మనస్తత్వాన్ని ఎలా విశ్లేషించాలో తెలియజేస్తే బాగుంటుంది. ఎవరింటి ఇంతి ఎలాంటిదన్నది తెలుస్తుంది కదా?

teresa

@కొత్తపాళీ- ఆవురావురుమంటూ తింటే....యే విశ్లేషణలూ పట్టక, హాయిగా జీవించే రకమన్నమాట!

దోశ తినడాన్ని బట్టో, జంతిక నమలడాన్ని బట్టో Psychoanalysis ఛేసెయ్యగలిగితే ఈ సైకోఅనలిస్టులు,సైకాలజి్స్టులకీ దోశలో కూర దొరకదు :)
Take it with a pinch of salt.

Mahitha

:(

nenu edina mundu taste chesi baguntene andariki istanu.malli masala dose lo mottam masala tinalenu mari chaala ekkuva untundi kada :(

భాస్కర రామిరెడ్డి

మరి పక్కవాడిదికూడా తీసుకుని తినేవాడిది?

చైతన్య

టపా సంగతి ఏమో కానీ... మీరు పోస్ట్ చేసిన ఫోటో మాత్రం నోరూరిస్తుంది... yummyy

Unknown

మషాళా దోసె తినడంలో కూడా యికనుంచీ చాలా ఆలోచించుకుని మరీ తినాలన్నమాట . ఎందుకంటే మనం తినే విధానాన్ని ఎవరైనా శ్రద్ధగా చూచి మనగురించి ఓ ఎస్టిమేషను కొచ్చేసే ప్రమాదముంది మరి.

గీతాచార్య

@నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి),

That's why I don't eat it.

కత్తి మహేష్ కుమార్

నేనీవిషయం అస్సలు నమ్మను!

Me too.

Anil Dasari

మసాలా దోశ ముట్టుకోని వాళ్లకి మనస్తత్వాలే ఉండవనా?

జ్యోతి

:):)

గీతాచార్య

@అబ్రకదబ్ర,

Well said. I could have asked it.

Srujana Ramanujan

దోశలు తినే దాన్ని బట్టే ఇంత మంసతత్వాన్ని విశ్లేషిస్తే... ఇక జనం దోషాలని తినటం మానేస్తారు. ఇక మీరు చెప్పే దోశలని ఎవరూ ట్రై చేయరండీ. ;-)

వర్మ

Really good ............

జ్యోతి

దాదాపు మూడేళ్ల క్రింద నాకు వచ్చిన ఒక ఆంగ్ల ఇ-మెయిల్ ఆధారంగా , సరదాకి అనువదించి రాసిన వ్యాసమిది.

Dheeraj Sayala

Nenu type 4.5, I mean 4+5/2.
Ilanti 4.5 vaallu, vyaktitvalani anchaana veyadam, adee snehituladi, vrudha anukuntaaru..

Anonymous

nenu 2.2 varake chadivaanu...nenu alaane thintaanu....baaga match ayyindhi mee prediction..so inka chadavadam aapesaanu...

Andhraman

This is a translation from IndusLadies.com dated13th September 2007. URL: http://www.indusladies.com/forums/forward-messages-and-jokes/12310-masala-dosa.html

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008