మీరేమంటారు?????
క్షమించండి. స్త్రీ మూర్తులను చావబాదే సౌలభ్యం వారి భర్తలకు మాత్రమే పరిమితమై ఉండడంలోని ఒక సామాజిక దౌర్భాగ్యం గురించి ఈ ఆర్ధికమాంధ్యపు రోజుల్లో తప్పనిసరై మాట్లాడవలసి వస్తోంది. ఇళ్లలోనూ, ఆఫీసులలోనూ కూర్చుని 'అందమైన కలలు' కంటున్న స్త్రీలందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, వారందరిని ఇంటర్వ్యూకి పిలిపించి.. విడివిడిగా వెయ్యి కొరడాదెబ్బలు కొట్టి పంపించే అధికారమేదైనా నాలాంటి వాడొకడికి రాజ్యాంగబద్ధంగా సంక్రమిస్తే ఎంత బాగుంటుంది ! స్త్రీలు కలలు కనడంలో తప్పు లేదు. అయితే మార్కెట్‌లో డబ్బు లేనప్పుడు మనిషి ఎలాంటి కలలు కనకూడదో మన స్త్రీలకి తెలిసుండాలి. తెలియజెప్పే వాళ్లుండాలి. భర్త అనేవాడికి భార్యను నాలుగు తన్ని కూర్చోబెట్టే ఓపిక తప్ప, కూర్చోబెట్టి నాలుగుమంచి మాటలు చెప్పే తీరిక ఎప్పుడూ ఉండదు. మనిషినే పట్టించుకోనివాడు ఆవిడ కలల్నేం పట్టించుకుంటాడు? వాడు బయట తిరగాలి. గడ్డి కరిచి గింజలు తేవాలి. ముద్ద వెతుక్కోవడం మాని ముచ్చట పెట్టుకుంటే అయ్యే పని కాదు.
పైగా భార్యకు సమీపంగా రెండు నిమిషాలు కూర్చోవడంలోని ప్రాణహాని ఏమిటో వాడికి తెలుసు. అప్పటికప్పుడు ఆవిడ ఒక కల కంటుంది. అందమైన కల. లేదా, ఎన్నో జన్మలుగా వంటింట్లో ఉండిపోయి, ఉద్యోగంలో పడిపోయి తను కంటూ ఉన్న కలలన్నింటినీ కడుపులోంచి గొంతులోకి తెచ్చుకుని భర్త భుజాలకెక్కిస్తుంది. ఇద్దరం కలిసి అలా వీధి చివరి వరకూ ఏడడుగులు నడిచొద్దాం అంటుంది. "నన్నొక్కసారైనా మీ కౌగిలిలో తలవాల్చుకోనివ్వరా" అని ఆశగా అడుగుతుంది. వేళకు ఇంటికొచ్చి తన ఒడిలో పడుకోమంటుంది. ఇవన్నీ కలలు. అందమైన కలలు..
స్త్రీలకు ప్రత్యేకంగా ఒక 'వైట్ హౌస్ కౌన్సిల్' ను ఏర్పాటు చేస్తూ, గొప్ప విజయాలు సాధించేందుకు అపరిమితంగా కలలు కనండి అని ఒబామా తన దేశ మహిళలకు పిలుపునిచ్చారు. కనడానికి ఒక గొప్ప కలను ఎంపిక చేసుకునే ప్రోత్సాహం ఇలా ప్రతి స్త్రీకి లభించాలి. 'అందమైన కల'లకు బదులుగా ఆమె... అవసరమైన కలలు మాత్రమే కనాలి. ఒక సాధారణ, అందమైన కలను... అవసరమైన కలగా కనే దుస్థితిలో ఏ స్త్రీ ఉన్నా మన తప్పే అవుతుంది.
........... మాధవ్ శింగరాజు.
పై వ్యాసం మూడురోజుల క్రింద ఒక దినపత్రికలో వచ్చింది. చదవగానే చాలా కోపం వచ్చింది. అసలు ఈ రచయిత ఉద్ధేశ్యమేంటి.? ఆడవాళ్లను పొగుడుతున్నట్టా , ఆక్షేపిస్తున్నట్టా??? ఆఫీసుల్లో ఆడాళ్లు పనిపాట చేయక కలలు కంటుంటారా. అసలు ఆడవాళ్లు ఎలాంటి కలలు కనాలో కూడా వాళ్లిష్టమేనా.. అదంతా కాదుగాని, మీరైనా చెప్పండి .. ఈ వ్యాసం చదివి మీరేమనుకుంటున్నారు. నాకైతే తికమకగా ఉంది.. :(
19 వ్యాఖ్యలు:
"'అందమైన కల'లకు బదులుగా ఆమె... అవసరమైన కలలు మాత్రమే కనాలి."
NONSENSE
ఆ వ్యాసం లింక్ ఇవ్వగలరా? లేదు పత్రిక పేరు, వ్యాసకర్త పేరు, ప్రచురణ తేది వగైరా వివరాలివ్వగలరా?
raasindhi maga kabatti aadaVAALLANI AAKSHEPISTHUNNATTE.......JAI HIND
'అందమైన కల'లకు బదులుగా ఆమె... అవసరమైన కలలు మాత్రమే కనాలి."
WAH.......
నిజమే జ్యోతి గారూ నాక్కూడా అసలా రచయిత ఏం చెబుతున్నట్టో అర్ధమవ్వలేదు.సాక్షి పేపర్లో చదివాననుకుంట ఆ వ్యాసం.అర్ధం అవ్వకపోవడం నా తప్పు కాదన్నమాట ఐతే.--సంతోష్ సూరంపూడి
ఆయన ఇంటావిడ మీది అక్కసుని ఇక్కడ కక్కినట్టుగా ఉంది :)
నాకయితే ఆడవాళ్ళని సమర్ధిస్తున్నట్టే ఉంది. కాకపొతె sarcastic గా చెప్తున్నారనుకుంటా!
జ్యోతి గారు నాకైతే స్త్రీ ఇలా ఆలోచించాలి అని చెప్పడం నచ్చలేదు. ఎందుకంటే చాలా సమయాల్లో స్త్రీలు మగవారికంటె బాగా ఆలోచిస్తారు , అర్థం చేసుకుంటారు. కాని కొంతమంది అలా వుండొచ్చు వారికి మాత్రమె అని చెప్పివుండాల్సింది. ఆ రచ ఇత కి పురుషాహంకారం , లేక స్త్రీ అంటే తక్కువ అన్న భావన ఐన ఐ వుండాలి , ఇవన్నీ కాకపోతె చెప్పాలనుకున్నది చెప్పలేక పోఇ వుండవచ్చు. ఐన స్త్రీ పురుష భేదం ఇంకా తగ్గాలి , సమానత చాలావరుకు సాధించినప్పటికి అన్నింటిలొను కనిపిచట్లేదు అది వచ్చిన నాడు news papers లో ఇలాంటి articles తగ్గుముఖం పడతా ఇ.......... త్వరలోనె
AumPrakash
బారక్ ఒబామా అధికారంలోకి రాగానే చేసిన రెండు మంచి పనులు :
ఒకటి : స్టెం సెల్ టెక్నాలజీ మీదున్న బేన్ ను తొలగించడం,
రెండు : లిలీ లెడ్బెటర్ ఫైర్ పే ఆక్ట్ ను ప్రవేశపెట్టడం. ఈ లిలీ లెడ్బెటర్ ఒక టైరు ఫాక్టరీలో ఉద్యోగిని. ఈవిడ సూపర్ వైజరు గా పనిచేసిన 19 ఏళ్ళలోనూ పురుషులకన్నా తక్కువ జీతం పొందుతున్నందుకు ఆందోళన చేపట్టారు. అందుకే ఈ ఏక్ట్ కు ఆవిడ పేరు పెట్టారు. ఈ ఏక్ట్ ప్రకారం, ఇన్నాళ్ళకిన్నాళ్ళకు అమెరికాలో స్త్రీ పురుషులిద్దరికీ చేసిన సమానమయిన పనికి సమాన వేతనం లభిస్తుంది.
ఈ ఫెయిర్ పే ఏక్ట్ ఒబామా సంతకం చేసిన మొట్ట మొదటి ఏక్ట్. దీన్ని తన గ్రాండ్ మదర్ ని, బాంకర్ గా ఆవిడ పడిన కష్టాన్నీ, పొందిన అతితక్కువ వేతనాన్నీ తలుచుకుంటూ సంతకం చేసాడు.
ఇంగ్లండులో బకింగ్ హేం పేలస్ గేట్లను పట్టుకుని వేలాడి పోట్లాడి సమాన వేతనాన్ని సాధించుకున్న ఇంగ్లీషు మహిళల కన్నా పాపం అమెరికన్ మహిళలు వెనుకబడే వున్నారిన్నాళ్ళూ. మొత్తానికి వాళ్ళ పోరాటం ఫలించి, ఇన్నాళ్ళకు ఈ ఏక్ట్ అమల్లోకి వచ్చింది. అసలు ఒబామా గెలిచినదే స్త్రీలకు అనుకూల విధానాలను పాటిస్తానని ఎన్నికలవాగ్దానాలు చేసినందువల్ల.
కాబట్టి, చెప్పొచ్చేదేమిటంటే, అసలు స్త్రీలు కలలు కనడం అంటూ మొదలు పెడితే గా.. ఏదయినా సాధించేదే, సాధించుకోలేకపోయేదీ ! అందుకే కలలు కనండి. అలా అని ఎక్కువ నిద్రపోకూడదు ! భర్త కౌగిలి, పొదరింటి కలలూ, కడుపులో చల్ల కదలని ఉద్యోగాలూ లాంటివి కాకుండా.. ఇంకాస్త మంచి కలలు - లైక్ - కట్నం లేని వివాహాలూ, బాంబులు లేని సమాజమూ, రాకెట్ విజ్ఞానాలూ, సైంటిఫిక్ తుఫాన్లూ - ఇలా.. కలలు కనండి. పెద్ద కలలు ! నేననుకోవడం, ఆ రచయితగారు బహుశా ఇలానే ఏదో చెప్పదలచుకున్నారు కానీ వ్యంగ్యం పాలు మించి, అర్ధం చెడిపోయి ఉంటుంది.
జ్యోతిగారు, ఈ మధ్య మీ పోస్టులు చాలా నాసిరకంగా, కొన్ని చవకబారుగా ఉన్నాయి. సరే, ఒక అసందర్భ ప్రశ్న:
ఒక మధ్యతరగతి గృహిణికి పెళ్ళి వయసు కూతురింది. నాలుగు సంబంధాలు వచ్చాయి. నలుగురు కుర్రాళ్ళూ అన్నింటా సమానమే కుటుంబ సభ్యుల విషయంలో తప్ప.
1) ఒకడికి పెళ్ళి అయిన ముగ్గురు అక్కలున్నారు
2) ఒకడికి పెళ్ళి అయిన ఇద్దరు అక్కలున్నారు
3) ఒకడికి పెళ్ళి అయిన ఒక అక్క ఉంది
4) ఒకడికి అక్కలే లేరు. ఒక్కడే కొడుకు.
ఇప్పుడున్న పరిస్థితిల్లో ఒక సగటు మధ్యతరగతి స్త్రీ వీరిలో ఎవరికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయాలనుకుంటుంది? మీ వ్యక్తిగత అభిప్రాయమేమిటో కాస్త చెప్పగలరా?
నేను ఈ వ్యాసం చదవడం మొదలుపెట్టినప్పుడు ఏంట్రా ఆడాళ్లమీద ఇలా రాసాడు? కాని చివరకు వచ్చేసరికి అతని అభిప్రాయం మంచిదే కదా అనుకున్నాను. అందుకే రచయిత ఎవరి పక్షం? ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు అని సందేహం వచ్చి బ్లాగు మిత్రులతో చర్చిద్దాం అని నా బ్లాగులో రాసాను.
జీడిపప్పుగారు,
మీ అభిమానానికి దన్యవాదాలు. ఒక్కసారి నాకు మెయిల్ చేయగలరా?
ఇక మీరు అడిగిన ప్రశ్న.. నా స్వంత అభిప్రాయం ఐతే ముగ్గురు అక్కలున్న అబ్బాయి.. ఎందుకంటే వారి మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయత ఉంటాయి అని నా నమ్మకం.. సినిమా లెవెల్లో కాకపోయినా. కొంచెమైనా ఉండవా???
జ్యోతి గారూ మీరు ఈ మధ్యన ఇలాంటి టపాలని రాస్తున్నారేమిటండీ. :-)
What the author said's lokkin' funny. Nothing more.
మనం అంత పట్టించుకోనవసరంలేదు.
@జీడిపప్పు:
>> "ఒకడికి అక్కలే లేరు. ఒక్కడే కొడుకు"
మీరు జీడిపప్పులో కాలేశారు (మరో అర్ధం ధ్వనించటంలా?) వీడిని ఏ అమ్మాయి చేసుకుంటుంది?
@జీడిపప్పు:
>> "ఒకడికి అక్కలే లేరు. ఒక్కడే కొడుకు"
మీరు జీడిపప్పులో కాలేశారు. ఎంత అక్కల్లేకుంటే మాత్రం ఆల్రెడీ ఓ కొడుకున్నోణ్ణి ఏ అమ్మాయి చేసుకుంటుంది ;-)
ఈ వ్యాసం చదివి నాకు అర్ధం కాక ఇక్కడ పెట్టాను. ఇక లాభం లేదని ఆ వ్యాసకర్తనే అడిగా .. మీరు ఆడవాళ్లని సపోర్ట్ చేస్తున్నారా , విమర్శిస్తున్నారా? అని ..
దానికి అతని సమాధానం ...
జ్యోతి గారూ...
నా కంప్లయింట్ ఎప్పుడూ మగవాడి మీదే. ఇక నా రాతల మీద ఉన్న ఒక కంప్లయింట్ ఏమిటంటే చదవడానికి బాగుంటాయి కానీ, రాసినదేమిటో అర్థం కాదని. నా కంప్లయింట్ ఎప్పుడూ మగవాడి మీదే అని చెప్పానుకదా. అయితే మగవాడిని అయిఉండి ఆడవాళ్ళ వైపు మాట్లాడడంలో ఒక ప్రమాదం ఉంది. దళిత కవిత్వం దళితులే రాయాలి అనే ఒక అభిప్రాయం ఉన్నట్లే , స్త్రీల గురించి స్త్రీలే రాయాలి, పురుషులు రాస్తే అందులో నిజాయితీ ఉండదు, కంటి తుడుపు తప్ప అనే ఒక భావన ఉంది.
బాధలు పెట్టే జాతి, బాధలు పడే జాతి తరపున మాట్లాడ్డం లోని ( స్త్రీవాదులు ఉంటుందని భావించే ) 'అనౌచిత్యాన్ని ' తప్పించుకోవడం కోసం నేను ఎంచుకున్న ' ప్రో ఉమన్ త్రూ ప్రో మెన్' టెక్నిక్ కారణంగానే పాఠకులలో ఈ ఈ కన్ ఫ్యూజన్.
-------------------------------- మాధవ్
The writer's intent was clear to me and I agree with him too.
@కొత్త పాళీ,
Yeah.
What the writer said is perfectly right.
"అయితే మగవాడిని అయిఉండి ఆడవాళ్ళ వైపు మాట్లాడడంలో ఒక ప్రమాదం ఉంది. దళిత కవిత్వం దళితులే రాయాలి అనే ఒక అభిప్రాయం ఉన్నట్లే , స్త్రీల గురించి స్త్రీలే రాయాలి, పురుషులు రాస్తే అందులో నిజాయితీ ఉండదు, కంటి తుడుపు తప్ప అనే ఒక భావన ఉంది."
ఆ రచయిత తెలుసా?
వివరణ అడిగి మంచి పని చేశారు. అపార్ధాలు తొలగుతాయి. నాకూ అలాంటి సమస్యలే ఎదురయ్యాయి.
నేను పట్టించుకోటం మానేశాక సమస్య తీరింది. ఎందుకంటే మనం పట్టించుకుంటేనే అవతల వాళ్ళు కామెంట్స్ చేసేది.
ఎనీ వే అ గుడ్ పోస్ట్.
అది సాక్షిలోది కదూ?
గీతాచార్య.
గీతాచార్యగారు,
అవునండి ,,, ఇది మొన్న సోమవారం సాక్షిలో వచ్చింది.. రాసింది మాధవ్ శింగరాజు. ఈ పోస్ట్ రాసేముందే అతని అనుమతి తీసుకున్నాను. చర్చించడానికి ఒప్పుకున్నారు. చివర్లో అతని అభిప్రాయం చెప్పారు..ఇంతకుముందు కొన్ని వ్యాసాలు కూడా ఇలాగే నాకు confusion గా ఉన్నాయి. అందుకే అడిగాను.. తప్పులేదనుకుంటా...
Post a Comment