Tuesday 24 March 2009

థాంక్స్ .....

మనం ఎవరి దగ్గరన్నా ఏదైనా వస్తువు తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు థాంక్స్ అని చెప్తాము. క్లాసులో పెన్ను కాని, పుస్తకం కాని తీసుకుని మన అవసరం తీరాక అది ఇచ్చిన వారికి తప్పకుండా థాంక్స్ చెప్తాము. అది చాలా మంది చేస్తారు. ఓకే. అలాగే మనకు చాలా అవసరమైన సమాచారం దొరికితే కూడా అవతలి వ్యక్తికి థాంక్స్ చెప్పుకుంటాము. సన్నిహితంగా ఉండే మిత్రుల మధ్య ఈ పదం ఎక్కువగా వాడబడదనుకుంటా. ఎందుకంటే వాళ్లు తమ స్నేహితులకు అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండడం, అతనికి ఏ సాయమైనా చేయడానికి వెనుకాడకపోవడం, అతని సమస్యను తమదిగా భావించి స్నేహితుడికి సహాయం చేసి అతను సంతోషంగా ఉండాలి, అతని భారం కొంతైనా తగ్గించాలి అనే తపన తప్ప వేరే దురుద్ధేశ్యం కాని, ప్రతిఫలాపేక్ష కాని కనబడదు ఆ మిత్రుల మధ్య. అది ఒక నిష్కల్మషమైన స్నేహానికి గుర్తు. అవసరమైనప్పుడు సాయం చేసి దానిని మర్చిపోతారు కూడా. అలాగే తమకు ఎటువంటి సందేహం కాని, సమస్య కాని వచ్చినప్పుడు ఆ స్నేహితుడిని అడగడానికి సంకోచించరు కూడా..

ఈ థాంక్స్, షుక్రియా, ధన్యవాదాలు, కృతజ్ఞతలు ... కుటుంబ సభ్యుల కంటే అవతలి వారి మధ్యే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? కుటుంబ సభ్యులు చేసే సహాయం లెక్కలోనికి రాదా? పొందిన సహాయానికి థాంక్స్ చెప్పడం అవసరమా.. లేక మనవాళ్లే కదా ఇంతోటి దానికి థాంక్స్ చెప్పాలా అన్న ఫీలింగ్ ఉంటుంది సాధారణంగా ... అమ్మ .. అమ్మ కాబట్టి , కన్నది కాబట్టి ఆమె బాధ్యత భర్తకు, పిల్లలకు కావలసినవి సమకూర్చడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకు వచ్చినట్టుగానే భావించి బాధపడుతుంది. అలాగే తండ్రి .. కుటుంబానికి పెద్ద , సంపాదిస్తున్నాడు. భార్యా పిల్లలను పోషించడం, వాళ్లు కోరిన కోరికలు తీర్చడానికి కష్టపడటాడు .. ఇవి ఒక భాద్యతగా భావించి చేస్తున్నందుకా వీళ్లకు కనీసం ఒక్కసరి కూడా థాంక్స్ చెప్పాలని ఎవ్వరికీ అనిపించదు? వాళ్లకు తాము చేసిన పనులకు థాంక్స్ అనే చిన్న పదం ఇచ్చే ఆనందం, సంతృప్తి కావాలని ఉండదా. అలా అని ఏ తల్లి తండ్రి ఎదురు చూడరు.కాని పిల్లలు ఒక్కసారైనా తమ తల్లితండ్రులకు కాని, భార్యకు కాని, భర్తకు కాని మనసారా థాంక్స్ అని చెప్పాలనిపించిందా?? చెప్పారా?? బయటివాళ్లకు థాంక్స్ చెప్తాం, ఇంట్లోవాళ్లకు ఎందుకు చెప్పాలి అని అనుకుంటే మీ కుటుంబ సభ్యులను taken for granted లా అనుకుంటున్నారన్నమాట. అలాగే తల్లి తండ్రులు కూడా పిల్లలకు సంధర్భానుసారంగా వారు మనకు కలిగించే చిన్ని చిన్ని ఆనందాలకు థాంక్స్ చెప్పడంలో తప్పు లేదు. ఈ చిన్ని పదం అవతలి వ్యక్తి గుండెల్లో సంతోషం వెల్లువలా ఉప్పొంగేలా చేస్తుంది. బాధ్యతగా భావించి తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు అనుకుంటే మాత్రం మనుష్యుల మధ్య అనుబంధం యాంత్రికంగా మారుతుంది . ఉద్యోగం, పిల్లలు, చదువులు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, పనిమనిషి ఇలా.. అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవడం వల్ల ఆత్మీయత అనేది ఎక్కడో ఏ మూలో బిక్కు బిక్కు మంటూ ఒదిగి ఉంటుంది. దాన్ని బయటకు తీసి వ్యక్తపరుచుకోవడం ఎంతో అవసరం ఈ ఆధునిక, బిజీ బిజీ జీవితంలో. సహాయం అందుకున్న ప్రతీసారి థాంక్స్ చెప్పాల్సిన పని లేదు. మనసారా ఒక్కసారైనా నా కోసం చేసిన ఎన్నొ సహాయాలకు థాంక్స్ అని చెప్తే చాలు . మన జీవితం ధన్యమైపోతుంది. అవతలి వ్యక్తి హృదయం ద్రవించి కంట ఒక ఆనంద భాష్పం జాలువారుతుంది. ఆ అనుభూతి జీవితాంతం మరిచిపోలేనిది.. కాదంటారా.. ఒక్కసారి ఆలోచించండి. అమలుపరిచి చూడండి.

మనకు తెలిసినవారు సహాయం చేస్తారు, తెలియనివారివల్ల కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు సహాయం పొందుతాము. ఒక్కోసారి మనను ద్వేషించే వారివల్ల కూడా మనకు మంచే జరుగుతుంది. ఆ ద్వేషాన్ని మనం ఎలా receive చేసుకుంటాం. దాని పర్యవసానం మనమే మనకు లాభించేలా మార్చుకుంటాము అన్నది ముఖ్యం.. అలాగే నా మీద ద్వేషంతో నన్ను నిందిస్తూ, దుమ్మెత్తి పోస్తూ, అసభ్యంగా , అశ్లీలంగా రాతలు రాసిన, రాస్తున్న వారికి ఈ బ్లాగు (సభా) ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అప్పుడు కలిగిన బాధ నాలోని ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంచింది. ఒక మరిచిపోలేని, చాలా అవసరమైనట్టి పాఠాన్ని నేర్పింది. నన్ను నేను ఇంకా మెరుగు పరుచుకునేలా చేసింది. అందుకే వాళ్లకు థాంక్స్...

22 వ్యాఖ్యలు:

చైతన్య

అమ్మ, నాన్న లాంటి బంధాలను థాంక్స్ అనే ఒక్క మాటతో సరిపెట్టలేము.
వాళ్ళు మనవాళ్ళే కదా ఇందులో ఏముందిలే థాంక్స్ చెప్పటానికి అనే నిర్లక్ష్యం కంటే... 'థాంక్స్' అనే పదంతో వాళ్ళని దూరం చేయకూడదనే భావనే ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం.
మన దగ్గరి స్నేహితులకి 'థాంక్స్' చెప్తే... వాళ్ళు చెప్పద్దనే అంటారు... కారణం 'థాంక్స్' అనేది సన్నిహితులతో చెప్పే మాట కాదు. ఎవరైనా బయటి వారి ద్వార సహాయం పొందినపుడు చెప్పేది.
థాంక్స్, సారీ లాంటి పదాలు సన్నిహితుల మధ్యకి వస్తే వాళ్ళ మధ్య దూరం పెరిగినట్టే... అనేది నా అభిప్రాయం.

ప్రియ

అమ్మా నాన్నలకి థాంక్స్ అవసరం లేదు. ఒకసారి అలా మా నాన్నకి థాంక్స్ చెపితే ఒకరోజంతా మాటాడటం మానేశాడు.

teresa

మంచి టాపిక్కు లేవనెత్తారు. కుటుంబ సభ్యులకి థాంక్స్,సారీ చెప్పినంత మాత్రాన వారి మధ్య సాన్నిహిత్యం తగ్గిపోదనది నా స్వానుభవం. I feel one should appreciate/acknowledge another's kindness regardless of their relationship.

Anonymous

అమ్మా నాన్నలు మరియు ఇతర ఆత్మీయులకు ఒక చిన్న థాంక్స్ తో మన ఋణం తీర్చుకోలేం కదా. ఇంత చిన్న పదాల తో కృతజ్ఞతలు వ్యక్త పరచలేని బంధాలు అవి. చెపితే అదో వ్యాపారబంధం లా ఉంటుందేమో అని నా ఫీలింగ్. మనవాళ్ళు మనకు help చేసినప్పుడు మన కళ్ళలో కనపడే మెరుపు (అది మన అనుకున్న వాళ్ళే గుర్తించగలరు), థాంక్స్ అనే పదం కన్నా మనసుకు హత్తుకుంటుందేమో అని నా అభిప్రాయం.

శ్రీనివాస్

తెలుగు లో నాకు నచ్చని పదం ధన్యవాదాలు ఆంగ్లం లో థాంక్స్ ... థాంక్స్ బదులు .. మీరు మరో ముగ్గురి బ్లాగు లో కామెంటు రాయండి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి కామెంట్లు రాయమనండి

అర్ధం కాలేదా ..

నాకే అర్ధం కాలేదు

పోస్టు బాగుంది ... మీకు థాంక్స్ లేదు

కొత్త పాళీ

అసలు థాంక్సు చెప్పడం మన రక్తంలో లేదు. పాత కాలపు సాహిత్యం కానీ .. అందాకా ఎందుకూ, మీ చిన్నప్పుడు, ఏ అమ్మమ్మగారి ఊరికో వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరైనా ఒకరికొకరు, థేంక్సని గానీ కృతజ్ఞతలని గానీ చెప్పుకున్న సందర్భాలు గుర్తున్నాయా? ఇది మనం పూర్తిగా పాశ్చాత్యుల దగ్గర నేర్చుకున్న "మర్యాద".
ఇహ మనల్ని తిట్టే వాళ్ళంటారా! నేర్చుకోగలిగిన సత్తా ఉన్న వాళ్ళకి ఇలాంటీ వాళ్ళతో ఎప్పుడూ మహోపకారం జరుగుతూనే ఉంటుంది.

Niru

@ chaitanya...
I completely agree

teresa

@కొత్తపాళీ- 'అసలు థాంక్స్‌ చెప్పడం మన రక్తంలోనే లే్దు' అన్నారు, ఎందుకు లేదూ.. 'నీ పుణ్యమాఅంటూ'..., నీ అమ్మ కడుపు చల్లగా.. ఇవన్నే థాంక్స్ చెప్పడమేగా!? అవతలి మనిషి చేసిన సాయాన్ని acknowledge చెయ్యకపోవడం అంత గర్వపడాల్సిన విషయమా??

krishna rao jallipalli

అలాగే నా మీద ద్వేషంతో నన్ను నిందిస్తూ, దుమ్మెత్తి పోస్తూ, అసభ్యంగా , అశ్లీలంగా రాతలు రాసిన, రాస్తున్న వారికి ఈ బ్లాగు (సభా) ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా...
అంత అవసరమా?? idi గాంది గారి కాలం కాదు. కాలం వారిని మార్చదు. మరణమొక్కటే...

వైష్ణవి హరివల్లభ

krishna rao jallipalli,

Well said.

మాలా కుమార్

టీచర్ చెప్పిందని పాలు ఇచ్చినా అన్నం పెట్టినా థాంక్స్,కాలు తగిలినా సారి,అడుగు అడుగునా థాంక్స్ లు సారీ లు.మా మనవడి తొ నా కు ఇబ్బంది గానె వుంది.మాని పించ లెను,భరించలెను.

జ్యోతి

చైతన్య గారు,

థాంక్స్ చెప్పినంత మాత్రాన దూరం అయ్యేది అనుబంధం కాదండి. అది చాలా దృఢమైనది.

సురేశ్ గారు,

మనవాళ్లు ఎప్పుడు మన మంచే కోరతారు. కాని ఒక్కోసారి మనకే అనిపిస్తుంది వాళ్లకు ఎలా ధన్యవాదాలు చెప్పాలి అని. చెప్పలేము, చెప్పకుండా ఉండలేము ఒక్కొసారి.

శ్రీనివాస్ గారు,
మీరు చెప్పింది అర్ధమైంది కాని, ఈ టపాకి , కామెంట్లకు సంబంధమేంటో అర్ధం కాలేదు :(

కొత్తపాళీగారు,

చిన్నప్పుడు చెప్పలేదని , పాశ్చాత్య సంస్కృతి అని అనుకుంటే ఎలాగండి. ఇంట్లోవాళ్లకు థాంక్స్ ఎందుకు చెప్పకూడదు అని నా ధర్మ సందేహం..అలా అని ప్రతీసారి చెప్పాల్సిన పని లేదు..

తెరెసా,
నిజమే. భార్యా, భర్తలు, పిల్లలు , తల్లితండ్రుల మధ్య అప్పుడప్పుడు మనలోని కృతజ్ఞతాభావలను, అపరాధ భావనలను వ్యక్తపరచలేము. కాని ఇలా సారీ, థాంక్స్ అనే ఒక చిన్న పదం అన్ని భావాలను అవతలి వ్యక్తికి అందజేస్తుంది. నాకు కూడా స్వానుభవమే. పదేళ్ల క్రింద , మా నాన్నగారికి మొదటిసారి పుట్టినరోజు పండగ చేసాము. అప్పటికి ఆయనకు 60 దగ్గర పడ్డాయి. వాళ్ల చిన్నప్పుడు పుట్టినరోజు చేసుకునే అలవాటు లేదు. కాని పిల్లలకు అందరికి చేసేవారు. సో నేను, మా తమ్ముళ్ల్లు, పిల్లలు అందరు కలిసి ఈ ప్లానింగ్ చేసాము. మా కందరికి ఎన్నో సంతోషాలను ఇచ్చే నాన్నకు (తాతకు) మనం కూడా పుట్టినరోజు చేయాలి అని. దానికి మా అమ్మ కూడా సరే అంది , తను కొత్త బట్టలు కొంది. మేము భొజనాలు, కేకులు అవి ఏర్పాటు చేసాము. రెండడుగుల గ్రీటింగ్ కార్డ్ కొని అందరూ ఎవరి పేరు వారే రాసి Thaanks for everything you have done for us అని సంతకం చేసి ఇచ్చాము. అది చూసి ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇదంతా ఎందుకు అవసరమా అన్నారు కూడా. పిల్లలు ఊరుకుంటారా. ఇలాంటి చిన్ని సంతోషాలను కుటుంబ సభ్యులకు ఇవ్వడంలో తప్పేమి లేదు అని నేననుకుంటాను. అలాగే భార్యా భర్తలు కూడా .. సినిమాల్లొ లాగా గట్టిగా అరిచి చెప్పడంలేదుగా. మనస్పూర్థిగా చెప్పే థాంక్స్ ఎంతో విలువైనది మరిచిపోలేనిది అని నా నమ్మకం..

కృష్ణారావుగారు,
ఎవరు ఎలా పోతే నాకేంటండి. నాకు అలా అనిపించింది . నేను చెప్పాను. మారని మారకపోనీ వాళ్లిష్టం..

మాల గారు,
నిజమే చికాకుగానే ఉంటుంది. కాని ఆ చిన్నారికి మర్యాదలు తెలియడం మంచిదే కదండీ. అలా చెప్పొద్దు అంటే వాళ్లు ఎలా నేర్చుకుంటారు మరి ధన్యవాదాలు, క్షమాపణలు చెప్పడం. నేటి తరానికి తగ్గట్టు మానమూ మారక తప్పదు. ఒక్కోసారి వాళ్ల నుండే మనం కొన్ని తెలియని విషయాలను నేర్చుకుంటాము కూడా.

చైతన్య

@జ్యోతి గారు
అనుబంధం దూరమైపోతుంది అని కాదు నా ఉద్దేశం... వ్యక్తుల మధ్య దూరం ఉన్నట్టు అనిపిస్తుంది... మన వాళ్ళు మనకి చేసేది సాయం అనుకుని చేయరు కదా!
ఇది కేవలం నా అభిప్రాయం...

శ్రీనివాస్

జ్యోతి గారు నేను స్టాలిన్ టైపు లో చెప్పా అన్నమాట

Priya

జ్యోతి గారు, నేను మీరు అన్నది ఒప్పుకుంటాను. మనలో కొన్ని అభిప్రాయాలు వుంటయ్యి. Thanks, sorry లు western influences అని. అవి మంచిది కాదు అని. నాకు ఒకప్పుడు అలాగే వుండేది. మా అత్తగారి ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు Thanks చెప్పుకుంటే నవ్వొచ్చేది.Actual గా వాళ్ళ్ది కొంచం over గానే వుండేది. కాని తరువాత మీలాగే ఎవరో అన్నది చూసి, మా అమ్మకి నాన్నకి థాంక్స్ చెప్పాను. మొదటి సార ఛ ఛ అన్నారు. After couple of times, they started enjoying it as it is recognizing their contribution.

I think we all say, we don't need thanks from friends or family because we think we are being "nice" that way.

But sincerely, how many of us do not feel happy when we receive a Thanks? All of us do. So why refuse that happiness to our "own" people.
If your own family or friends thank you, just enjoy the feeling. Instead of denying it. You will see the difference. And then you can do the same to others.

If the problem is with the English word, "thanks", then as Teresa said, use something else to convey the same feeling.

మాలా కుమార్

వాడు చెప్పటము తొ ఆగడు,వాడు థాంక్స్ అన్నప్పుడల్ల నెను నొ మెన్షన్ అనాలి.సారీ అన్నప్పుడల్ల ఇట్స్ ఒ.కె అనాలి.బయటనుండి రాగానె హగ్ చెయాలి.వాడు ఐ లైక్ యు బామ్మా అన్నప్పుడల్ల ఐ లైక్ యు గౌరవ్ అనాలి.అంటునె వునంటాను.కాని ఇంత అవసరమా ?మనవల్ల కొసం మారకుండా వుంటామా?

Anil Dasari

తెరెసా, బాగా గుర్తు చేశారు. మీ అమ్మ కడుపు చల్లగా. రొంబ ధ్యాంక్స్ :-)

జ్యోతి

మాల గారు,
పెద్ద చిక్కొచ్చి పడిందే.. :)... మీరు వాడిలా ఇంగ్లీష్ నాన్నమ్మ అయిపోండి. వేరే దారి లేదు. చెప్తే వినరు కదా..

జ్యోతి

Priya,

yes ur right,, here the feel of thanks is important than just saying thanks. it can be any other word..

Priya

On the same note, మా అమ్మ పుట్టినరోజుకి flowers, cake, balloons పంపాను online order చేసి. She felt so happy. బయట కూర్చుంటే, ఇద్దరు balloons, flowers పట్టుకుని వస్తంటే అందరూ చూస్తన్నారంట. దగ్గిరకొచ్చినాక తనకి అని తెలిసినాక, చాలా ఆనందం వేసిందంట.
Well, it's one way of saying thanks. There are many. Make a special dish for them or buy something they would enjoy etc etc.
Bottom line: saying thank you in your own way.

మాలా కుమార్

అయిపొయానండి.అందుకె వాడు నా బామ్మ బంగారు తల్లి నా మాట వింటుంది అంటాడు.

satyam

Thanks ane mata chala viluainadhi, sarigga cheppalnate vuppu lantidhi, asalu lekunna baagundadu, yekkuva kakoodadu.
Saraina mothadulo vadalisina padham,
Vijay

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008