చాలు ఇక ఆపండి ....
అందరికీ నమస్కారం..
చాలు ఇక ఈ గొడవలు.. చిలికి చిలికి గాలివానలు అయ్యాయి. బ్లాగ్ లోకం లో అల్లకల్లోలం సృష్టించాలనుకున్నవారు చాలా వరకు కృతకృత్యులు అయ్యారనుకోవచ్చు. ఐనా చల్లారింది అనుకున్న నిప్పును రావుగారు మళ్లీ ఎగదోస్తున్నారు. రావుగారికి ప్రమదావనం తరఫున, నా తరఫున ఒక అభ్యర్ధన.. ప్లీజ్ ఈ విషయాలు ఇక ప్రస్తావించొద్దు. బ్లాగులు మూసేసినా మళ్లీ తెరిచారు.ప్రమదలు అందరూ బావున్నారు. ఎవరి పని మీద వాళ్లు బిజీగా ఉన్నారు. ఇక్కడ ధూమ్, కాగడా, వారివెనక ఉన్న స్త్రీ మూర్తి ఎవరో కాని వదిలేయండి. ఎవరి పాపాన వారు పోతారు. e తెలుగు సమావేశంలో మీరు చెప్పిన విషయాలు తప్ప వేరే చర్చ జరగలేదా. అవి చెప్పండి .. అనవసరమైన విషయాలు ఎందుకు?? దానివల్ల సాధించేదేమీ లేదు... మహిళా బ్లాగర్ల మీద అంత అభిమానం ఉంటే మీ పాత టపాల్లో మా మీద రాసిన చెత్త కామెంట్లు ఎందుకుంచుకున్నారు. తీసెయలేదేంటి. ఇక నా బ్లాగులో పెట్టిన disclaimer గురించి కూడా పోస్ట్ రాయాల్సిన అవసరమేంటి ? మనం స్నేహితులమా కానే కాదు. కో బ్లాగర్స్ మాత్రమే. నావల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది నాతో డైరెక్టుగా చెప్పండి. నా మీద అపోహలు, సందేహాలు, ఆరోపణలు ఉంటే నిస్సంకోచంగా నాకు మెయిల్ చేయండి. నేను తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ విషయం ధూమ్, కాగడా బ్లాగర్లకు కూడా నా బ్లాగు ముఖంగా చెప్పాను. దయచేసి మహిళా బ్లాగర్లు, ప్రమదావనం సంగతులు వదిలేసి ఎవరి పని వారు చేసుకోండి. ప్రమదావనంలో బలవంతంగా ఎవరిని పట్టుకోలేదు. ఇష్టమున్నవాళ్లు ఉంటారు , లేని వాళ్లు వెళ్లి పోతారు. ప్రమదావనం నుండి వెళ్ళిపోయిన వారు కూడా ఈ చెత్త రాతలవల్ల బాధపడి. ఇప్పటికైనా ఆపండి. ఇంతకుముందులా ఎవరి బ్లాగులు వాళ్లు రాసుకోండి.
ఇదే నా వినతి..
ఇంతే సంగతులు .. చిత్తగించవలెను..
14 వ్యాఖ్యలు:
"ఇష్టమున్నవాళ్లు ఉంటారు , లేని వాళ్లు పోతారు" NiZZam
ఇష్టమున్నవాళ్లు ఉంటారు , లేని వాళ్లు పోతారు .. I agree
కొందరు అదేపనిగా గొడవలు లేవనెత్తితే మిగతావాళ్ళు (మిగతా)పనులు మానుకుని ఎగదోస్తున్నారన్నమాట. మొత్తానికి అన్నింటికీ ఫులుస్టాపు పెట్టాలంటారు. చూద్ధాం ఈ స్టాపుకు ఎన్ని కౌంటర్ స్టాపులు తయారవుతాయో!
JYOTHIGARU,
Good work
మొదటినుండి వద్దాము. ఇన్నాళ్ళు అసలెందుకు కలగజేసుకోడం అని నేను సైలెంట్ గా ఉన్నాను. కాని సైలెంట్ గా ఉన్నా మీరన్నట్లు చల్లబడే టైం కి ప్రతిఒక్కరు ఎక్కడ పేరు పోతుందో (ప్రముఖ) అనే బాధతోటో మరింకోటో తెలీదు కాని పనిగట్టుకొని మరీ ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు మీలాంటి "ప్రముఖులందరూ" ఇక చాలు ఆపండి అంటూ మీరు తెర మీదకి వచ్చారు. కొన్ని ప్రశ్నలు మీకు అడిగే ముందు నాకు చిన్న అనుమానం. అసలు ఈ గొడవ ఎలా మొదలయ్యింది ఎవరిని టార్గెట్ చేస్తూ మొదలయ్యింది మొదలవడం వల్ల ఎవరు బలి అయ్యారు అన్నది ఒకటి గుర్తు చేసుకొండి. మీ,మా, మన గురువు గారు గ్రూప్ లో లెటర్ పెడితే గాని తెలియలేదు ఎవరో మనమీద అసభ్య రాతలు రాస్తున్నారని. ఇలా మొదలయిన ప్రతి పోస్ట్ మీ ఆధిపత్యమీదే కదా. కనీసం అవి చదివి కూడా మీలో ఏమన్నా వీసమెత్తు మార్పు వచ్చిందా? గొడవ జరిగిన వాళ్ళమీద విరుచుకుపడ్తున్న పెద్దలు ఇది మొదలవడానికి కారణమైన మిమ్మల్ని మారమని ఎందుకు అడ్గలేకపోతున్నారు? మీరంటే అంత అభిమానము ఉన్నవాళ్ళు మీ అధిపత్యన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇంత జరిగినా మారను స్పృష్టంగా చెప్పిన మీరు "ప్రమదావనంలో ఉంటే ఉంటారు పోతే పోతారు" అంటు పోతే పొండి అనే ఆ భాషా, ఆ అధిపత్యమే కదా ఇంతవరకు తీసుకొని వచ్చింది. ఒక్కటి జ్యోతి గారు"రారా" అనడానికి "రండి" అనడానికి చాలా తేడా ఉంది. అది గమనించకుండా ఉంటే ఉండండి పోతే పొండి అన్నది వాళ్ళు రాసినవిధంగానే కాలికింద చెప్పు, ఇంట్లో కాపలా కుక్క అని చెప్పినట్లుగా ఉంది. ప్రమదలందరు మీకు సేవకులా అన్న అనుమానం వస్తోంది.. ప్రమదావనంలోంచో, లేక బ్లాగ్ లోంచో ప్రమదలు తప్పుకొంటే మీరు ఏవిధమైన నైతిక బాధ్యత వహించారని వాళ్ళు ఉంటే ఉంటారు పోతే పోతారు అని అంటున్నారు? ఇలా నా మరిన్ని ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పగలరా? ప్రమదావనం మీ ఒక్కరిదా మన అందరిదా?
నిర్మాణాత్మక విమర్శలను మీరు స్వాగతిస్తారా? తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్టు ఇంతకాలం అందరినీ ఎగదోసి ఈ రోజు ఇక చాలు ఆపండి అంటారా? మీరు మాట్లాడే పద్ధతి ఎంతవరకు హుందాగా వుంది? మీ బ్లాగ్ ఒక extra ordinary master piece అని మీతో ఎవరైనా చెప్పారా? మిమ్మల్ని సమర్ధించిన పాపానికి పెద్దాయన కొత్తపాళీ గారిని కూడా ముష్కరులు దుమ్మెత్తిపోశారే, దీనికి మీ సంజాయిషీ ఏమిటి? మీ చుట్టూ అందరూ తిరిగి మిమ్మల్ని ఆహా జ్యోతి గారు, ఓహో జ్యోతి గారు అని పొగడాలా? మీరు మాత్రం ఏకవచన సంబోధన చేస్తారా(నేను వారికన్నా పెద్దదాన్ని అనీ, వారు కూడా అలాగే పిలవమంటారనీ వివరణ ఒకటా?) ఏం సాధించారని మిమ్మల్ని అందరూ భుజాన వేసుకుని తిరగాలి? ప్రమదావనం స్థాపించారు కానీ అది చేసిన కార్యక్రమాలు ప్రమదల సమిష్టి కృషి అని ఎందుకు ఒప్పుకోరు(మీరే అన్నీ చేసినట్టు)?
మీరు ప్రచురించినా, ప్రచురించక పోయినా ఫరవాలేదు కానీ మిమ్మల్ని ప్రశ్నలు అడగదల్చుకొన్నాను అడుగుతున్నాను అంతే. సమాధానం నాకు చెప్పకపోయినా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
జ్యోతిగారు: నమస్కారం చాలారోజుల తరువాత కలిసాము బాగున్నారా? "ఇక చాలు ఆపండి " పోస్ట్ ఇప్పుడే చదివాను. ఇందులో ప్రమదావనాన్ని ఉద్దేశ్యించి రాసిన వాక్యం "ఉంటే ఉంటారు పోతే పోతారు" అన్నది కొంచం అభ్యంతరంగా ఉంది. ప్రమదావనంలో మీ అనుమతి తీసుకొని రాలేదు. స్వఛ్ఛందంగా వచ్చాము, అలాగే మీ అనుమతి తీసుకొని నిష్క్రమించాలని మీరు చెప్పలేదు కాబట్టి స్వఛ్ఛందంగానే విరమించుకొన్నాము. మరి మీరు మరీ మా మనసులకి తగిలేలా "ఉంటే ఉంటారు పోతే పోతారు" అనడం భావ్యమా? మనసు గాయపడ్తోంది. అక్కడ రాతలవల్ల గయపడ్డాము. ఇంకా మీరు పుండుమీద కారం జల్లుతున్నారు జ్యోతిగారు మీ శైలిని మరొక్కసారి తరచి చూసుకొండి.
జ్యోతి గారు,
ప్రమదావనంలోంచి నేను బయటికి రావడానికి కారణం ఇంతకు ముందు వివరించాను. మీ ప్రమేయం లేదని కూడా స్పష్టంగానే చెప్పాను. కానీ మీరు "ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు "పోతారు" అనడం కొంచెం చివుక్కుమనిపించింది. "ఇష్టం లేని వాళ్ళు బయటికెళ్ళిపోతారు, అనో "నిష్క్రమిస్తారు" అనో రాసుంటే నొచ్చుకునే బాగుండేదేమో! ఆ మాత్రం మాట మీకు తట్టలేదని నేననుకోను.
రమణిగారు, సుజాతగారు,
మీ ఇద్దరికి నా క్షమాపణలు. మిమ్మల్ని బాధపెట్టి ప్రమదావనం వదిలేలా చేసారు, అన్న కోపం , బాధతోనే రాసాను కాని అవమానించాలని కాది. నేను ఆ పదం మార్చాను. చూసుకోలేదండి.. సారీ..
ఆరాధనగారు,
అసలు మీరు మహిలా బ్లాగరేనా నా అనుమానం. ఎవరైతె నాకేంటి గాని. నా సమాధానాలు వినండి.. మీ మా మన గురువుగారు అని ఎందుకు అనాల్సి వచ్చింది. ఆ బ్లాగు అప్పటికే కూడలిలో వచ్చింది. చాలా మంది చదివారు కూడా. నా ఆధిపత్యం విషయానికి వస్తే . అది మీకు ఎక్కడ కనిపించింది. ప్రమదావనం గుంపు కాని, చాట్ రూం కాని మహిళా బ్లాగర్ల కోసం తయారు చేసాను కాబట్టి నేను బాధ్యత తీసుకున్నాను అంతే. ఇందులో ఎవరి ఆధిపత్యం లేదు అన్న విషయం సభ్యులకు బాగా తెలుసు. నేను ఏ విషయంలో మారాలి. అది చెప్పండి. ఎవరో తమ బ్లాగులో నా మీద రాతలు రాస్తే నేను పరిగెత్తుకుని వెళ్లి సమాధానం ఇవ్వలా. అంతగా అవసరమైతే నన్నే అడగొచ్చుగా. ఆ ధైర్యం లేదా.. ఆకలేస్తే వంటింట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకోవాలి. లేదా అమ్మనడిగితే పెడుతుంది కాని అన్నం మన నోటి దగ్గరకు రాదు. అలాగే నా మీద ఆరోపణలు ఉంటే నన్నే అడగాలి. అప్పుడు నేను తప్పు చేసానో లేదో తెలుసుకుని మారడానికి ప్రయత్నిస్తాను. పోతారు అంటే వెళ్లిపోతారు అన్న ఉద్ధేశ్యమే నాది మీరు తప్పుగా అర్ధం చేసుకుంటే నాది భాద్యత కాదు. ఐనా ఆ పదం మార్చాను. అందరినీ నేనే ఎగదోసాను అని అంటున్నారు. దానికి రుజువేంటి.. చూపించండి. నేనే ఎగదోశి నా మీద చండాలపు రాయించుకున్నానా?? అంత నీచ స్థితికి ఇంకా దిగజారలేదు. నాకు అవసరం లేదు కూడా. నేను ఎవరిని ఏకవచనంతో సంబోదిస్తానో అది అవతలివారికి నాకు ఉన్న పరిచయం బట్టి, వారి అనుమతితోనే అంటాను. అది అందరికి తెలుసు. మీకు ఈ విషయంలో ఎందుకు అభ్యంతరం. మిమ్మల్ని అల అన్నానా..ఎప్పుడు ?? ఎక్కడ?? ప్రూఫ్ ఇవ్వండి. మీ ఆరోపణలకు.. నన్ను పొగడమని, భుజాన ఎత్తుకు తిరగమని నేను ఎవరితో ఎప్పుడు అన్నానో కాస్త చెప్తారా?? ప్రమదావనం కార్యక్రమాలు నా ఒక్కరి కృషి అని ఎవరు చెప్పారు మీకు.
నేను ఆరోపణలకు సమాధానాలు ఇస్తా అన్నాను. ఇచ్చాను. మీ ఆరోపణలకు రుజువు చూపించగలరా?? నా బ్లాగ్ extra ordinary master peice ఆ . చాల థాంక్స్ , ఇంతవరకు ఎవరూ అనలేదు..
మీలో మీరే దెబ్బలాడుకొని ఈ వేదికలని యుద్ధభూముల్లా చేస్తారా? ఎన్నికల ప్రచారం లో మన రాజకీయ నాయకుల ప్రసంగాలలాగ ఉన్నాయి. ఎవరో ఒకరు ఈ గొడవ కి " సీజ్ ఫైర్" చెప్పండి.
ఇంతకుముందులా ఎవరి బ్లాగులు వాళ్లు రాసుకోండి.... ఈ ముక్క మొన్నామధ్య ధూమ్ బ్లాగులో రాస్తే.. ఒక్కరు కూడా సపోర్ట్ చెయ్యాలా. పైగా ఎంతో మంది పెద్ద పెద్ద బ్లాగరులు పిచ్చి, వెర్రి కామెంట్లు రాసారు కాని.. నా మాట ఆలకించలేదు. అంటీ దీని అర్థం... చాలా ఎక్కువమందికి ... బ్లాగు లోకం లో ఎప్పుడూ గొడవలు, నిందారోపణలు, తిట్టుకోవడాలు, విమర్శలు ఉంటేనే సరదాగున్నట్లుంది. ఇదేమీ సాడిజమో మరి.
ఏమిటో ... కొంత మంది ప్రమదావనాన్ని ఆ సభ్యులని విమర్శిస్తున్నారు.. దీనికి మాత్రం ముందే ఉంటారు... ఆ ప్రమదావనానికి సహాయం చేయడానికి మాత్రం ముందుకి రారు. సిగ్గుండాలి కొంచమైనా.
krishna rao jallipalli garu,
Well said. We oughtta stop the nonsence.
ఇది ఏంటి!
నేను బ్లాగ్ మేదలు పేటానొ లేదొ అప్పుడే ఇక చాలు అపండి అంటున్నారు
నేను ఒప్పుకోను కనిసం నేను ఒక్క 20 టపాలు అన్న పోస్ట్ చేసిన తరువాత అలోచిస్తాను...
nekuda epude vachanu kani naku e godavalu chuste bayamestondi
Post a Comment